లక్నో: ఉత్తరప్రదేశ్‌లో జరిగిన స్థానిక ఎన్నికల్లో మరణించిన స్వతంత్ర అభ్యర్థిని ఎన్నుకుని అందరికీ షాకిచ్చారు ఆ ప్రాంత ఓటర్లు. ప్రజల పట్ల అభ్యర్థి ప్రవర్తనే ఆమెను ఎన్నుకునేలా ప్రజలను ప్రేరేపించిందని, అందుకే ఆమెను తిరిగులేని విజయాన్ని అందించారని స్థానికులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో హసన్‌పూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డు మహిళలకు రిజర్వ్ చేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆసియా ఏప్రిల్ 16న 7వ వార్డు అభ్యర్థిగా తన నామినేషన్‌ను దాఖలు చేసింది.
అయితే అనారోగ్యం కారణంగా ఆమె ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఏప్రిల్ 20న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మృతి చెందింది. అయినప్పటికీ ఓటర్లు మాత్రం ఆసియా మృతి చెందినప్పటికీ ఆమెకే పట్టం కట్టారు. ఈ విజయంపై ఆసియా భాగస్వామి ముంతజీబ్ అహ్మద్ మాట్లాడుతూ.. ' ఆమె గత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ప్రజలకు సేవ చేయాలనే కోరికతో ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రవర్తన వల్లనే ప్రజల మనసు గెలుచుకోగలిగింది. ఆమెపై ప్రజల్లో ఉన్న ప్రేమ వల్లే ఎన్నికల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు.
‘ఆసియా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసింది. అయితే నామినేషన్ వేసిన కొన్ని రోజులకే ఆమె మృతి చెందింది. ఎన్నికల ఫలితాల్లో ఆమె గెలుపొందింది. దీంతో మళ్లీ ఆ వార్డులో ఎన్నికలు నిర్వహించాల్సి ఉందని’ హసన్‌పూర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ తెలిపారు.
చదవండి: కాబోయే భర్తను అరెస్ట్ చేసిన లేడీ సింగం గుర్తుందా?.. ఘోర రోడ్డు ప్రమాదంలో కన్నుమూత
Comments
Please login to add a commentAdd a comment