
అమిత్ షాపై చార్జిషీటు నమోదు
ముజఫర్నగర్: గత లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా నైతిక నియమావళిని ఉల్లంఘించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై చార్జిషీటు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ పోలీసులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు.
అమిత్ షా ఎన్నికల్లో మతం, కులం పేరిట ఓట్లను అభ్యర్థించినట్టు అభియోగాలు వచ్చాయి. పోలీసులు పలు సెక్షన్ల కింది షాపై కేసులు నమోదు కేశారు.