
సాక్షి, లక్నో: యూపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. అత్యధిక కార్పొరేషన్లు, నగర పంచాయితీల్లో ఆ పార్టీ పాగా వేసింది. రాష్ట్రంలోని 16 మేయర్ స్థానాలకు గాను బీజేపీ 14 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్‌పీ రెండు మేయర్ స్థానాలను గెలుచుకుంది. వారణాసి, గోరఖ్‌పూర్, ఘజియాబాద్, రాయ్‌బరేలి, ఆగ్రా,ఫిరోజాబాద్, అయోధ్య, మధుర, లక్నో, కాన్పూర్, సహరాన్‌పూర్, మొరదాబాద్, ఝాన్సీ, బరేలీల్లో బీజేపీ మేయర్ అభ్యర్థులు విజయం సాధించారు.
అలీఘర్, మీరట్‌లో బీఎస్‌పీ మేయర్ అభ్యర్థులు గెలుపొందారు. మరోవైపు అమేథి సహా పలు నగరపంచాయితీల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. తమ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల కారణంగానే బీజేపీకి ప్రజలు ఘనవిజయం అందించారని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. బీజేపీ పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి ఈ విజయం నిదర్శనమన్నారు. అమేథి, రాయ్‌బరేలి వంటి కాంగ్రెస్ కంచుకోటల్లో బీజేపీ అభ్యర్థుల విజయంపై పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment