
సాక్షి,లక్నో: యూపీ స్ధానిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం ప్రజలకు తమపై ఉన్న విశ్వాసానికి సంకేతమని సీఎం యోగి ఆదిత్యానాథ అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమని చెప్పారు.బీజేపీకి అనుకూలంగా ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు.అమేథి, బరేలీ వంటి కాంగ్రెస్ కంచుకోటల్లో బీజేపీ అభ్యర్థుల విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
రాష్ట్రంలోని 16 మేయర్ స్థానాలకు గాను బీజేపీ 12 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్‌పీ రెండు మేయర్ స్థానాలను గెలుచుకుంది. మరోవైపు అమేథి సహా పలు నగరపంచాయితీల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు.