BJP victory
-
మోదీ హామీలపైనే ప్రజలకు భరోసా
న్యూఢిల్లీ: తప్పుడు హామీలతో విపక్షాలు సాధించేదేమీ ఉండదని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. కానీ ఈ వాస్తవాన్ని అవి ఇప్పటికీ అర్థం చేసుకోవడం లేదన్నారు. బీజేపీ ఇచి్చన, ఇస్తున్న ‘మోదీ హామీలు’ దేశవ్యాప్తంగా ప్రజల్లో మార్మోగుతున్నాయని చెప్పారు. ‘‘వాటిని వాళ్లు పూర్తిగా విశ్వసిస్తున్నారు. ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలే ఇందుకు చక్కని రుజువు’’ అని ప్రధాని వివరించారు. కేంద్ర పథకాలు ప్రజలందరికీ చేరేలా చూసేందుకు చేపట్టిన వికసిత్ సంకల్ప్ యాత్ర లబి్ధదారులతో శనివారం ఆయన ముచ్చటించారు. ఎన్నికల్లో నెగ్గడానికి ముందు ప్రజల హృదయాలను గెలుచుకోవడం చాలా అవసమని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఏ పారీ్టకైనా ప్రజల విజ్ఞతను తక్కువగా అంచనా వేయడం తెలివైన పని కాదని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని, భావోద్వేగపూరిత బంధాన్ని ఏర్పాటు చేయగలిగాం. ప్రజలు తమదిగా భావిస్తున్న ప్రభుత్వం మాది. మోదీ ప్రతి ఒక్కరికీ సేవకుడు. పేదలను పూజిస్తాడు. వారి క్షేమం కోసం తపిస్తాడు. ప్రతి పేదా, తల్లి, చెల్లి, రైతు, యువతి, యువకుడు నాకు వీఐపీయే’’ వ్యాఖ్యానించారు. ‘‘విపక్షాలను ప్రజలు నమ్మకపోవడానికి అవి ఇస్తున్న తప్పుడు హామీలు, ప్రకటనలే కారణం. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న వాళ్లు ప్రజా క్షేమాన్ని పట్టించుకుని ఉంటే వారికి నేడు ఇంతటి నిరాదరణ ఉండేదే కాదు. ఎన్నికల్లో గెలిచేది ప్రజాక్షేత్రంలోనే తప్ప సోషల్ మీడియాలో కాదు’ అని విపక్షాలకు చురకలు అంటించారు. పక్కా ఇల్లు, తాగునీటి నల్లా, మరుగుదొడ్డి, ఉచిత వైద్యం, రేషన్, గ్యాస్, విద్యుత్, బ్యాంకు ఖాతాల వంటి సదుపాయాలు దేశ ప్రజలందరికీ అందుతున్నాయంటూ హర్షం వెలిబుచ్చారు. పీటీఐ ప్రధాన కార్యాలయం సందర్శన ఢిల్లీలో ఉన్న ప్రముఖ వార్తాసంస్థ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా(పీటీఐ) ప్రధాన కార్యాలయాన్ని ప్రధాని మోదీ శనివారం సందర్శించారు. కొత్తగా ప్రారంభించిన వీడియో సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు. 2014లో ప్రధానిగా పగ్గాలు చేపట్టాక ఒక వార్తసంస్థ కార్యాలయానికి మోదీ రావడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా అక్కడి సీనియర్ ఎడిటోరియల్, ఎగ్జిక్యూటివ్ విభాగాల సిబ్బందితో మాట్లాడారు. మీడియాకు ఎదురయ్యే సవాళ్లు, మీడియాలో అవకాశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
‘అభివృద్థికి పట్టం కట్టారు’
సాక్షి,లక్నో: యూపీ స్ధానిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం ప్రజలకు తమపై ఉన్న విశ్వాసానికి సంకేతమని సీఎం యోగి ఆదిత్యానాథ అన్నారు. బీజేపీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారనేందుకు ఈ ఫలితాలు నిదర్శనమని చెప్పారు.బీజేపీకి అనుకూలంగా ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారన్నారు.అమేథి, బరేలీ వంటి కాంగ్రెస్ కంచుకోటల్లో బీజేపీ అభ్యర్థుల విజయంతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రాష్ట్రంలోని 16 మేయర్ స్థానాలకు గాను బీజేపీ 12 మేయర్ స్థానాలను కైవసం చేసుకుంది. బీఎస్పీ రెండు మేయర్ స్థానాలను గెలుచుకుంది. మరోవైపు అమేథి సహా పలు నగరపంచాయితీల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘనవిజయం సాధించారు. -
ఇది ప్రజల విజయం: శివరాజ్ సింగ్
తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం వల్లే మరోసారి శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. మధ్యప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో బీజేపీకి మరోసారి అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సాధించిన విజయంగా ఆయన అభివర్ణించారు. శాసనసభలో బీజేపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడంతో చౌహాన్ మధ్యప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్, బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్‌తో కలసి ఆదివారం బోపాల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినందుకు ఆయన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు వాజపాయి, ఎల్ కే. అద్వానీ, రాజనాథ్ సింగ్ తదితర నేతలకు కృతజ్ఞతులు తెలిపారు. బీజేపీ పార్టీ పెద్దల సహాయ సహకారాలతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకువెళ్తామని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. అందుకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు అందించాలని ఆయన మధ్యప్రదేశ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలో ఒక పార్టీకి చెందిన ప్రభుత్వం ఉండడం వల్ల ప్రజలకు మరింత ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. చౌహాన్‌పై నమ్మకం ఉంచి మరోసారి గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు బీజేపీ సీనియర్ నేత అనంతకుమార్ కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్దికి అసలుసిసలు చిరునామా చౌహాన్ అని అనంతకుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా చౌహాన్ చేపట్టిన విధానాలే ఆయన్ని మరోసారి సీఎం పీఠాన్ని కూర్చోబెట్టనున్నాయని ఆయన కితాబు ఇచ్చారు. దేశంలో మధ్యప్రదేశ్‌ను అగ్రస్థానంలో ఉంచేందుకు చౌహాన్ విశేష కృషి చేస్తున్నారంటూ కొనియాడారు. సుపరిపాలనకు చౌహాన్ చిరునామా అని అభివర్ణించారు.