కోదాడటౌన్: కోదాడ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి.. ఓ కౌన్సిలర్‌కు మధ్య అగ్గిరాజుకుంది. ఏమైం దో తెలియదు కానీ.. తనపై కౌన్సిలర్ దాడిచేశాడని డీఈ పోలీసులకు ఫిర్యా దు చేయగా.. కాదు. కాదు డీఈనే తనపై దాడి చేశాడని కౌన్సిలర్ అంటున్నారు.. ఈ సంఘటన జరిగిన సమయంలో మున్సిపల్ కమిషనర్, చైర్‌పర్సన్ ఇద్దరు అందుబాటులో లేకపోవడంతో సమస్య పోలీస్‌స్టేషన్‌కు చేరిం ది. వివరాలు.. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో ఇటీవల రూ.లక్షతో డ్రెయినేజీ నిర్మాణ పనుల ను పూర్తి చేశారు.
వాస్తవానికి కాంట్రాక్టర్ పనులు చేయాల్సి ఉండగా ఆయ న పేరు మీద అదే వార్డు కౌన్సిలర్ పనులు చేసినట్లు సమాచారం. ఈ క్ర మంలో పనులు పరిశీలించి ఎంబీ రికా ర్డు చేసి బిల్లు చెల్లించాలని కౌన్సిలర్ డీఈని కొంత కాలంగా కోరుతున్నట్లు తెలిసింది. కానీ డ్రెయినేజీ లోపభూయిష్టంగా ఉందని, వార్డుకు చెందిన కొందరు తనకు ఫిర్యాదు చేశారని, దీ నిని సరి చేస్తేనే ఎంబీ చేస్తానని డీఈ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో కౌన్సిలర్ తనపై దాడి చేసి చొక్కా చింపివేశాడని, అసభ్య పదజాలంతో దూషిం చాడని డీఈపురుష్తోతం అంటున్నారు.
ఉద్యోగుల విధుల బహిష్కరణ
ప్రభుత్వ ఉద్యోగిపై దాడిచేసిన కౌన్సిలర్ కెఎల్‌ఎన్ ప్రసాద్‌పై చర్య తీసుకోవాలని డిమాం డ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగులు బుధవారం విధులు బహిష్కరించారు. కార్యాలయం నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్లి సదరు కౌన్సిలర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్య త గల ప్రజాప్రతిని ధిగా ఉంటూ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడి చేసిన కౌన్సిలర్‌ను కఠినంగా శిక్షించాలని వారు కోరారు.
విపక్షాల ఖండన
విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ డీఈపై కౌన్సిలర్ కెఎల్‌ఎన్ ప్రసాద్ దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్‌ఎస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. దాడి విషయం తెలుసుకున్న వారు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి డీఈని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బాధ్యత మరచి ప్రవర్తించిన కౌన్సిలర్‌ను ఆ పదవి నుంచి తొలగించడంతో పాటు వెంటనే అరె స్టు చేసి కఠినంగా శిక్షించాలని టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు పారా సీతయ్య, నయీ ం, వీరారెడ్డి, షఫీ టీడీపీ కౌన్సిలర్ దండాల వీరభద్రం, ఎస్‌కె.ఖాజాగౌడ్, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ తుమ్మలపల్లి భాస్కర్ కోరారు.
డీఈనే దాడి చేశాడు: కెఎల్‌ఎన్ ప్రసాద్, కౌన్సిలర్
డ్రెయినేజీ బిల్లు విషయంలో తాను వివరాలను అడిగేందుకు వెళ్లగా డీఈ ఇబ్బంది పెట్టాడని, ఇదేమిటని అడిగితే తనపై దాడి చేశాడని కౌన్సిలర్ కెఎల్‌ఎన్ ప్రసాద్ ఆరోపించారు. తాను డీఈపై దాడిచేయలేదన్నారు.
కొట్టుకున్నారంట..!
Published Fri, May 8 2015 1:30 AM | Last Updated on Tue, Oct 16 2018 6:08 PM
Advertisement
Advertisement