సీఎం ఫొటోను మార్ఫింగ్‌ చేసిన కౌన్సిలర్‌! | Morphed CM Yogi image on Facebook | Sakshi
Sakshi News home page

సీఎం ఫొటోను మార్ఫింగ్‌ చేసిన కౌన్సిలర్‌!

Published Wed, Apr 5 2017 4:03 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

సీఎం ఫొటోను మార్ఫింగ్‌ చేసిన కౌన్సిలర్‌! - Sakshi

సీఎం ఫొటోను మార్ఫింగ్‌ చేసిన కౌన్సిలర్‌!

ఘజియాబాద్‌: ఉత్తరప్రదేశ్‌ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఫొటోను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేసిన ఓ కౌన్సిలర్‌ కటకటాలపాలయ్యాడు. యూపీ ఘజియాబాద్‌లోని లోనీ ప్రాంతానికి చెందిన మున్సిపల్‌ కౌన్సిలర్‌ రామ్‌కుమార్‌ చౌహాన్‌ సీఎం యోగి ముఖాన్ని చెరిపేసి.. మార్ఫింగ్‌ చేసిన ఫొటోను ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.

దీనిపై ఆదిత్యనాథ్‌ స్థాపించిన హిందు యువ వాహినీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో లోనీ బార్డర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్ కష్టడీలో ఉన్నాడు. లోనీ 12వ వార్డు మున్సిపల్‌ కౌన్సిలర్‌ అయిన రాంకుమార్‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన ఈ వివాదాస్పద పోస్టును తొలగించామని, ఆయన పోస్టుకు సంబంధించిన స్ర్కీన్‌ షాట్‌లను భద్రపరిచి.. కేసు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement