పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఏడుగురిని గాయపరిచిన సంఘటన బుధవారం తనకల్లు మండలంలోని ఇందిరానగర్‌లో జరిగింది.
తనకల్లు (అనంతపురం): పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఏడుగురిని గాయపరిచిన సంఘటన బుధవారం తనకల్లు మండలంలోని ఇందిరానగర్‌లో జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన రామాంజులు, రెడ్డిప్రసన్న, నారాయణమ్మ, ప్రకాష్‌లతో పాటు చిన్నారులు పోమేష్, జాయ్, శివలను పిచ్చికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన బాధితులు స్థానిక 30 పడకల ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.