గోదావరి వైపు చూడని పులసలు
ప్రతికూల పరిస్థితులతో ముఖం చాటేస్తున్న పులసలు
రెండు నెలల్లో చిక్కిన చేప ఒకే ఒక్కటి
ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పరుగులు
హిందూ మహాసముద్రంలో సందడి చేసే పులసలు.. గోదావరి వైపు చూడటం లేదు. సంతానోత్పత్తి కోసం నదిలోకి ఎదురీదే పులసలు ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు తమ రూటు మార్చేశాయి. ఆగస్టు రెండో వారం వచ్చేసినా గోదావరి పాయల వెంట పులస జాడ కనిపించడం లేదు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు గోదావరి తీరంలో ఒక్క పులస మాత్రమే లభ్యమైంది.
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పుస్తెలమ్మి అయినా పులస తినాలనేది గోదావరి జిల్లాల్లో నానుడి. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో పులసలు గోదావరి నదిలోకి వరస కట్టి.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మాంసాహార ప్రియుల జిహ్వచాపల్యాన్ని తీర్చేవి. అంతటి విశిష్టత కలిగిన పులసల రాక దాదాపు పదేళ్లుగా ఏటా తగ్గుతూ వస్తోంది. ఈ సీజన్‌లో ఇంతవరకు కోనసీమలోని రాజోలు దీవిలోని గోదావరి తీరంలో కేవలం ఒకే ఒక పులస మత్స్యకారుల వలకు చిక్కింది.
ఆ చేపను వేలం వేస్తే రూ.24 వేలు పలికింది. అంతటి డిమాండ్ ఉన్న పులసలు గోదావరిలో అడుగుపెట్టకుండా మొహం చాటేస్తున్నాయి. హిందూ మహాసముద్రం నుంచి వేలాది కిలోమీటర్లు ఈదుకుంటూ బంగాళాఖాతంలోకి పులసలు వస్తున్నా.. గోదావరి నది వైపు చూడకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పరుగులు తీస్తున్నాయి. గోదావరి నదీ తీరం వెంబడి నెలకొన్న ఆటంకాలే ఇందుకు కారణమని మత్స్య శాస్త్రవేత్తలు స్పష్ట చేస్తున్నారు.
‘క్వీన్ ఆఫ్ ది ఫిష్’ ఇటు రావట్లేదు
గోదావరిలో వరద ప్రవాహం పోటెత్తి సముద్రం వైపు పరుగులు తీసే రోజుల్లో.. వరదల్లో కొట్టుకొచ్చే బురద మట్టినే ఆహారంగా తీసుకుంటూ పునరుత్పత్తి కోసం ఇలసలు (సముద్ర జలాల్లో ఉన్నప్పుడు ఇలస అని పిలుస్తారు) గుంపులు, గుంపులుగా ఒక ప్రవాహం మాదిరిగా వలస వస్తుంటాయి. కానీ.. గోదావరి ప్రాంతంలోని సముద్ర తీరం కాలుష్యకారకంగా మారడం, విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటతో ‘క్వీన్ ఆఫ్ ది ఫిష్’గా పిలిచే పులస బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు రావడం లేదని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెష్ వాటర్ రీఛార్జ్ ఇనిస్టిట్యూట్ (సిఫ్రీ) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. ఇలసల్లో కొవ్వు అధికంగా ఉంటుంది.
హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా తీర ప్రాంతాల నుంచి సముద్ర జలాల్లో సుమారు 11 వేల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి ఇలసలు పునరుత్పత్తి కోసం గోదావరిలోకి ఎదురీదుతాయి. ఇలా ఎదురీత ప్రయాణం వల్ల వాటిలో ఉండే కొవ్వు కరిగి ఎరుపు, గోధుమ రంగులోకి మారుతుంది. ఈ దశలో పులస శరీరాకృతి పోషక విలువలతో కూడి రుచికరంగా తయారవుతుంది. కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్‌లో చమురు కార్యకలాపాల వెలికితీత కోసం చేపడుతున్న డ్రెడ్జింగ్ వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోయి పులసలు సముద్రం నుంచి గోదావరిలోకి రావడం లేదు.
గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్ (నదీ ముఖద్వారం వద్ద) రిలయన్స్, ఓఎన్‌జీసీ తదితర సంస్థలు డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్నాయి. గోదావరి తీరాన రాజమహేంద్రవరం, అంతర్వేది, కరవాక, యానాం, గాడిమొగ, ఎదుర్లంక సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. సల్ఫర్, అమోనియా, లెడ్, పాదరసం ఇతర కర్భనాలు నదిలో కలుస్తున్నాయి. తీరం వెంబడి విచ్చలవిడిగా వేల ఎకరాల్లో సాగవుతున్న రొయ్యల చెరువుల వ్యర్థాలు నేరుగా సముద్రం, గోదావరిలోనే కలుస్తున్నాయి. గోదావరి నుంచి సముద్రంలో ఈ అవశేషాలు కలుస్తుండటంతో పులస గోదావరి వైపు రావడం లేదు.

అందుకే.. రూటు మార్చేసింది
గోదావరి తీరం కాలుష్యకారకంగా మారిపోవడం.. పునరుత్పత్తికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో సముద్రం నుంచి ప్రవాహం మాదిరిగా వచ్చే విలసలు అటు నుంచి అటే ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇందుకు ఒడిశా, పశ్చిమ బెంగాల్ నదీ జలాల్లో ఉన్న సానుకూల వాతావరణమే ప్రధాన కారణమని మత్స్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నది వైపు పయనమవుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.
ఈ చర్యలు చేపడితే మేలు
అరుదైన పులస జాతిని పరిరక్షించేందుకు, ఆ జాతి వృద్ధి కోసం కోల్‌కతా సిఫ్రీ (సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పులస సీడ్‌ను వృద్ధి చేసి బంగాళాఖాతంలో విడిచిపెట్టే ప్రక్రియను రెండేళ్లుగా చేస్తోంది. ఇలాంటి కృషిని మన రాష్ట్రంలో కూడా చేపట్టాలి.
సముద్రం, గోదావరి సహా నదుల్లో చేపలు పట్టే వలలకు మెష్ నియంత్రణ పాటించాలి. పిల్లలు పెట్టకుండానే తల్లి చేపలను పట్టేస్తున్న పరిస్థితులను కట్టడి చేయాలి. నదుల్లో విషతుల్యమైన వ్యర్థాలను, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించి పులస మనుగడ సాగించేందుకు కృషి జరగాలి. – సీహెచ్ గోపాలకృష్ణ, మత్స్య శాస్త్రవేత్త, కోనసీమ
పరిరక్షించాల్సిన అవసరం ఉంది
అరుదైన జాతి చేప పులస. ఇప్పటికే చాలా చేపలు అంతరించిపోతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. మితిమీరిన చేపలు వేల, జల కాలుష్యం, సరైన సంరక్షణ కొరత కారణంగా పులస చేపల సంఖ్య తగ్గుతోంది. పులసలు అంతరించిపోవడమనేది చాలా బాధాకరమైన విషయం. పులసలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. – డాక్టర్ కేఎన్ మూర్తి, ఫిషరీస్, అగ్రికల్చర్, ఆదిత్య డిగ్రీ కాలేజీ, కాకినాడ
Comments
Please login to add a commentAdd a comment