Pulasa
-
పులస ఏమవుతోంది!
ఏయూ క్యాంపస్ (విశాఖ): సముద్రంలో ఇలసగా పిలిచే చేప నీటికి ఎదురీదుకుంటూ నదిలోకి చేరుతుంది. అక్కడ తన రంగు, రుచి, పోషకాలను పూర్తిగా మార్పు చేసుకుంటుంది. అత్యంత ఖరీదైన చేపగా మారుతుంది. ప్రధానంగా వర్షాకాలంలో గోదావరి జిల్లాల్లో పులస చేప వలలో పడిందంటే మత్స్యకారుల సంతోషానికి అవధులు ఉండవు. ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న పులస చేప (Pulasa Fish) ప్రస్థానం, పోషకాల మార్పులపై సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) ప్రత్యేక అధ్యయనం చేసింది. కానీ.. ఇలస నదిలోకి వలస వచ్చాక పులసగా మారి సముద్రంలోకి తిరిగి వెళుతోందా లేక నదిలోనే ఉండిపోతోందా అనే సందేహాలు శాస్తవేత్తలను వెంటాడుతున్నాయి. లోతైన పరిశోధన చేస్తేనే..గుడ్లు పెట్టేందుకు గోదావరి (Godavari) నదిలోకి వచ్చే సమయంలోనే పులసలు మత్స్యకారుల వలలో చిక్కి ఆహారంగా మారిపోతున్నాయా అనే సందేహాన్ని శాస్త్రవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. పులసల్ని వచ్చినవి వచ్చినట్టుగా పట్టేస్తుంటే పులసల పునరుత్పత్తి దెబ్బతిని ఆ చేప జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందంటున్నారు. అదేవిధంగా గోదావరిలో పుట్టిన పులస పిల్లలు సముద్రంలోకి వెళుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెబుతున్నారు. ఇందుకు లోతైన పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. పులసల గమనాన్ని ప్రత్యేకంగా ట్యాగింగ్ చేసి ట్రాకింగ్ చేయాలని సూచిస్తున్నారు. అదేవిధంగా వీటి మైగ్రేషన్ డైనమిక్స్‌ని సైతం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. అప్పుడే పులస చేపలను సంరక్షించడం సాధ్యపడుతుందని పేర్కొంటున్నారు. కనీసం 20 శాతం పులసలు పునరుత్పత్తి చేసే విధంగా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు.భారత్‌లో గంగ, గోదావరి నదులకే రాకబంగాళాఖాతం, అరేబియా సముద్రం, వియత్నాం, ఎర్రసముద్రం, పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో హిల్సా చేపలు లభిస్తాయి. బంగ్లాదేశ్‌లోని పద్మా నది, ఇరాక్‌లో యూప్రటిస్, మయన్మార్‌లోని ఇరావడి, పాకిస్తాన్లో సింధు, భారత్‌లోని గంగా, గోదావరి నదీ ప్రాంతాల్లోకి ఇవి వలస వచ్చి పులసలుగా రూపాంతరం చెందుతాయి. నది నుంచి సముద్రంలోకి ప్రవాహం కలిసే ప్రాంతంలో ఇవి లభిస్తాయి. వీటి లభ్యత ఇటీవల కాలంలో తగ్గిపోతోంది. గోదావరి తీరంలో లభించే పులస మెరుస్తూ ఉంటుంది. వీటిని సాధారణ ప్రజలు గుర్తించడం కష్టమే. నిపుణులు మాత్రమే గుర్తిస్తారు. ఇలస, పులసలో పోషకాల వ్యత్యాసం ఇలా..సముద్రంలోని ఉప్పునీటిలో ఉండే ఇలసలో 12 శాతం శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 100 గ్రాముల ఇలసలో సోడియం 183 మి.గ్రా., పొటాషియం 573 మి.గ్రా., క్యాల్షియం 133 మి.గ్రా., ఫాస్పరస్ 910 మి.గ్రా., ఐరన్ 29 మి.గ్రా. ఉన్నట్టు సీఐఎఫ్టీ పరిశోధనలో వెల్లడైంది. పులస విషయానికి వస్తే.. కొవ్వు శాతం 8నుంచి 11 శాతం మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. పులసలో అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈపీఏ, డీహెచ్ఏ ఒమేగా–3 ఆమ్లాలు అధికంగా ఉన్నాయి. 100 గ్రాముల పులసలో సోడియం 83 మి.గ్రా., పొటాషియం 1,187 మి.గ్రా., క్యాల్షియం 166 మి.గ్రా., పాస్ఫరస్ 1,151 మి.గ్రా., ఐరన్ అధికంగా 32.5 మి.గ్రా. ఉన్నట్టు గుర్తించారు. రివర్ మౌత్ వద్ద లభించే ఇలస చేపల్లో కొవ్వు శాతం అత్యధికంగా 17 శాతం ఉన్నట్టు గుర్తించారు. ఇలస నుంచి పులసగా మారే సమయంలో దీని పోషకాలలో వ్యత్యాసం, మార్పులు స్పష్టంగా తెలుస్తున్నాయి. గుడ్లు పెట్టడానికి, పిల్లలుగా మారడానికి అవసరమైన విధంగా తన శరీరాన్ని, పోషకాలను మార్పు చేసుకోవడం ఈ చేపల విశేషం. ఉప్పు నీటి నుంచి మంచి నీటికి వచ్చే సమయంలో తట్టుకోవడానికి సైతం ఇవి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయి.సీఐఎఫ్టీ అధ్యయనం ఏం చెబుతోందంటే..సముద్రంలో పెరిగే చేపను ఇలస (హిల్సా) అని పిలుస్తారు. అవి వయసుకు వచ్చాక సముద్రంలో నుంచి, మంచినీటి నదిలోనికి ఎదురీదుతూ వెళ్తాయి. నదిలోనే గుడ్లు పెడతాయి. సముద్రపు నీటిలో ఇలసకు, మంచి నీటిలో పులసగా రూపాంతరం చెందిన చేపకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తాము జన్మించిన స్థానానికే వచ్చి పులస మళ్లీ గుడ్లు పెడుతుందని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ (సీఐఎఫ్టీ) (central institute of fisheries technology) అధ్యయనం చెబుతోంది. జూన్, జూలై నెలల్లో రుతుపవనాలు, వర్షాకాలం ప్రారంభం అయ్యే సమయంలో సముద్రంలోని ఇలసలు నదుల వైపు ప్రయాణం మొదలుపెడతాయి. నదుల్లోకి వీటి రాక నవంబర్ వరకు కొనసాగుతుంది. వర్షం కురిసిన సమయంలో నదుల్లోని బురద నీరు సముద్రంలో కలుస్తుంది. దీనిని గుర్తించి ఉప్పునీటి నుంచి మంచినీటి దిశగా ఇలస తన ప్రయాణం ప్రారంభిస్తుంది. వర్షం తగినంత లేకపోతే వీటి వలస ఆగిపోతుంది.పులస జాతిని సంరక్షించాలిపులస జాతిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రధానంగా నదులు కలుషితం కాకుండా చూడాలి. అప్పుడే ఆరోగ్యకరమైన చేపలు లభిస్తాయి. ముఖ్యంగా ఇలస నుంచి పులసగా మారే మార్గంలో వాటి ప్రయాణానికి అవరోధాలు లేకుండా చూడటం ఎంతో అవసరం. వీటిని పట్టుకోవడంలో ఒక నియమం అనేది లేదు. నదిలోకి వచ్చిన వాటిని వచ్చినట్టుగా పట్టేస్తూ ఉంటే పునరుత్పత్తి దెబ్బతింటుంది. అదేవిధంగా పుట్టిన పిల్లలు సముద్రంలోకి వెళుతున్నాయా లేదా అనే విషయం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. గుడ్లు పెట్టిన పులస నదిలోనే ఉండిపోతోందా లేక సముద్రంలోకి తిరిగి వెళుతోందా అనే విషయాలను అధ్యయనం చేయాల్సి ఉంది.– డాక్టర్ బి.మధుసూదనరావు, ప్రిన్సిపల్ సైంటిస్ట్, ఐసీఏఆర్–సీఐఎఫ్టీ, విశాఖపట్నం -
ఎటో వెళ్లిపోతోంది 'పులస'
హిందూ మహాసముద్రంలో సందడి చేసే పులసలు.. గోదావరి వైపు చూడటం లేదు. సంతానోత్పత్తి కోసం నదిలోకి ఎదురీదే పులసలు ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు తమ రూటు మార్చేశాయి. ఆగస్టు రెండో వారం వచ్చేసినా గోదావరి పాయల వెంట పులస జాడ కనిపించడం లేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు గోదావరి తీరంలో ఒక్క పులస మాత్రమే లభ్యమైంది.సాక్షి ప్రతినిధి, కాకినాడ: పుస్తెలమ్మి అయినా పులస తినాలనేది గోదావరి జిల్లాల్లో నానుడి. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో పులసలు గోదావరి నదిలోకి వరస కట్టి.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మాంసాహార ప్రియుల జిహ్వచాపల్యాన్ని తీర్చేవి. అంతటి విశిష్టత కలిగిన పులసల రాక దాదాపు పదేళ్లుగా ఏటా తగ్గుతూ వస్తోంది. ఈ సీజన్లో ఇంతవరకు కోనసీమలోని రాజోలు దీవిలోని గోదావరి తీరంలో కేవలం ఒకే ఒక పులస మత్స్యకారుల వలకు చిక్కింది. ఆ చేపను వేలం వేస్తే రూ.24 వేలు పలికింది. అంతటి డిమాండ్ ఉన్న పులసలు గోదావరిలో అడుగుపెట్టకుండా మొహం చాటేస్తున్నాయి. హిందూ మహాసముద్రం నుంచి వేలాది కిలోమీటర్లు ఈదుకుంటూ బంగాళాఖాతంలోకి పులసలు వస్తున్నా.. గోదావరి నది వైపు చూడకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పరుగులు తీస్తున్నాయి. గోదావరి నదీ తీరం వెంబడి నెలకొన్న ఆటంకాలే ఇందుకు కారణమని మత్స్య శాస్త్రవేత్తలు స్పష్ట చేస్తున్నారు. ‘క్వీన్ ఆఫ్ ది ఫిష్’ ఇటు రావట్లేదుగోదావరిలో వరద ప్రవాహం పోటెత్తి సముద్రం వైపు పరుగులు తీసే రోజుల్లో.. వరదల్లో కొట్టుకొచ్చే బురద మట్టినే ఆహారంగా తీసుకుంటూ పునరుత్పత్తి కోసం ఇలసలు (సముద్ర జలాల్లో ఉన్నప్పుడు ఇలస అని పిలుస్తారు) గుంపులు, గుంపులుగా ఒక ప్రవాహం మాదిరిగా వలస వస్తుంటాయి. కానీ.. గోదావరి ప్రాంతంలోని సముద్ర తీరం కాలుష్యకారకంగా మారడం, విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటతో ‘క్వీన్ ఆఫ్ ది ఫిష్’గా పిలిచే పులస బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు రావడం లేదని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెష్ వాటర్ రీఛార్జ్ ఇనిస్టిట్యూట్ (సిఫ్రీ) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. ఇలసల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా తీర ప్రాంతాల నుంచి సముద్ర జలాల్లో సుమారు 11 వేల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి ఇలసలు పునరుత్పత్తి కోసం గోదావరిలోకి ఎదురీదుతాయి. ఇలా ఎదురీత ప్రయాణం వల్ల వాటిలో ఉండే కొవ్వు కరిగి ఎరుపు, గోధుమ రంగులోకి మారుతుంది. ఈ దశలో పులస శరీరాకృతి పోషక విలువలతో కూడి రుచికరంగా తయారవుతుంది. కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్లో చమురు కార్యకలాపాల వెలికితీత కోసం చేపడుతున్న డ్రెడ్జింగ్ వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోయి పులసలు సముద్రం నుంచి గోదావరిలోకి రావడం లేదు.గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్ (నదీ ముఖద్వారం వద్ద) రిలయన్స్, ఓఎన్జీసీ తదితర సంస్థలు డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్నాయి. గోదావరి తీరాన రాజమహేంద్రవరం, అంతర్వేది, కరవాక, యానాం, గాడిమొగ, ఎదుర్లంక సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. సల్ఫర్, అమోనియా, లెడ్, పాదరసం ఇతర కర్భనాలు నదిలో కలుస్తున్నాయి. తీరం వెంబడి విచ్చలవిడిగా వేల ఎకరాల్లో సాగవుతున్న రొయ్యల చెరువుల వ్యర్థాలు నేరుగా సముద్రం, గోదావరిలోనే కలుస్తున్నాయి. గోదావరి నుంచి సముద్రంలో ఈ అవశేషాలు కలుస్తుండటంతో పులస గోదావరి వైపు రావడం లేదు. గోదావరిలో వరద ప్రవాహం పోటెత్తి సముద్రం వైపు పరుగులు తీసే రోజుల్లో.. వరదల్లో కొట్టుకొచ్చే బురద మట్టినే ఆహారంగా తీసుకుంటూ పునరుత్పత్తి కోసం ఇలసలు (సముద్ర జలాల్లో ఉన్నప్పుడు ఇలస అని పిలుస్తారు) గుంపులు, గుంపులుగా ఒక ప్రవాహం మాదిరిగా వలస వస్తుంటాయి. కానీ.. గోదావరి ప్రాంతంలోని సముద్ర తీరం కాలుష్యకారకంగా మారడం, విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటతో ‘క్వీన్ ఆఫ్ ది ఫిష్’గా పిలిచే పులస బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు రావడం లేదని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెష్ వాటర్ రీఛార్జ్ ఇనిస్టిట్యూట్ (సిఫ్రీ) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. ఇలసల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా తీర ప్రాంతాల నుంచి సముద్ర జలాల్లో సుమారు 11 వేల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి ఇలసలు పునరుత్పత్తి కోసం గోదావరిలోకి ఎదురీదుతాయి. ఇలా ఎదురీత ప్రయాణం వల్ల వాటిలో ఉండే కొవ్వు కరిగి ఎరుపు, గోధుమ రంగులోకి మారుతుంది. ఈ దశలో పులస శరీరాకృతి పోషక విలువలతో కూడి రుచికరంగా తయారవుతుంది. కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్లో చమురు కార్యకలాపాల వెలికితీత కోసం చేపడుతున్న డ్రెడ్జింగ్ వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోయి పులసలు సముద్రం నుంచి గోదావరిలోకి రావడం లేదు.గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్ (నదీ ముఖద్వారం వద్ద) రిలయన్స్, ఓఎన్జీసీ తదితర సంస్థలు డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్నాయి. గోదావరి తీరాన రాజమహేంద్రవరం, అంతర్వేది, కరవాక, యానాం, గాడిమొగ, ఎదుర్లంక సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. సల్ఫర్, అమోనియా, లెడ్, పాదరసం ఇతర కర్భనాలు నదిలో కలుస్తున్నాయి. తీరం వెంబడి విచ్చలవిడిగా వేల ఎకరాల్లో సాగవుతున్న రొయ్యల చెరువుల వ్యర్థాలు నేరుగా సముద్రం, గోదావరిలోనే కలుస్తున్నాయి. గోదావరి నుంచి సముద్రంలో ఈ అవశేషాలు కలుస్తుండటంతో పులస గోదావరి వైపు రావడం లేదు. అందుకే.. రూటు మార్చేసిందిగోదావరి తీరం కాలుష్యకారకంగా మారిపోవడం.. పునరుత్పత్తికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో సముద్రం నుంచి ప్రవాహం మాదిరిగా వచ్చే విలసలు అటు నుంచి అటే ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇందుకు ఒడిశా, పశ్చిమ బెంగాల్ నదీ జలాల్లో ఉన్న సానుకూల వాతావరణమే ప్రధాన కారణమని మత్స్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నది వైపు పయనమవుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.ఈ చర్యలు చేపడితే మేలుఅరుదైన పులస జాతిని పరిరక్షించేందుకు, ఆ జాతి వృద్ధి కోసం కోల్‌కతా సిఫ్రీ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పులస సీడ్‌ను వృద్ధి చేసి బంగాళాఖాతంలో విడిచిపెట్టే ప్రక్రియను రెండేళ్లుగా చేస్తోంది. ఇలాంటి కృషిని మన రాష్ట్రంలో కూడా చేపట్టాలి. సముద్రం, గోదావరి సహా నదుల్లో చేపలు పట్టే వలలకు మెష్ నియంత్రణ పాటించాలి. పిల్లలు పెట్టకుండానే తల్లి చేపలను పట్టేస్తున్న పరిస్థితులను కట్టడి చేయాలి. నదుల్లో విషతుల్యమైన వ్యర్థాలను, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించి పులస మనుగడ సాగించేందుకు కృషి జరగాలి. – సీహెచ్ గోపాలకృష్ణ, మత్స్య శాస్త్రవేత్త, కోనసీమపరిరక్షించాల్సిన అవసరం ఉందిఅరుదైన జాతి చేప పులస. ఇప్పటికే చాలా చేపలు అంతరించిపోతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. మితిమీరిన చేపలు వేల, జల కాలుష్యం, సరైన సంరక్షణ కొరత కారణంగా పులస చేపల సంఖ్య తగ్గుతోంది. పులసలు అంతరించిపోవడమనేది చాలా బాధాకరమైన విషయం. పులసలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. – డాక్టర్ కేఎన్ మూర్తి, ఫిషరీస్, అగ్రికల్చర్, ఆదిత్య డిగ్రీ కాలేజీ, కాకినాడ -
యాండే.. పులసొచ్చిందండీ.. ఓ చూపు చూడండే! (ఫొటోలు)
-
పులస @ రూ.21 వేలు
సాక్షి, మామిడికుదురు: భారతదేశంలో కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే అరుదైన పులస కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. మాంసాహారులు లొట్టలేసుకుని తినే ఈ పులస స్టేటస్‌కు సింబల్‌గా నిలుస్తోంది. ఎంతో రుచికరమైన పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది. భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువుంది. దీనిని పాశర్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండలరావు రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. (ఈ–పంట తరహాలో ఈ–ఫిష్) -
‘పులస’ ముక్క పంటికి తగిలితే..ఆహా..
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: అది అన్ని చేపల్లాంటిదీ కాదు. దాని రాక, పుట్టుక.. రుచి, ధర.. అన్నీ ప్రత్యేకమే. ఏడాదికోసారి మాత్రమే.. అదీ ఈ సీజన్లోనే.. అందునా వరద గోదావరిలోనే.. అది కూడా ధవళేశ్వరం బ్యారేజి నుంచి సాగరసంగమం వరకు ఉన్న పాయల్లోనే దొరికే చేప. పేరు ‘పులస’. ఆ పేరు వింటేనే మాంసాహార ప్రియుల నోట్లో నీరూరుతూంటుంది. వండిన తరువాత ఆ ముక్క పంటికి తగిలితే.. ఆ రుచికి నాలుక వహ్వా అంటుంది. జీవితంలో ఒకసారి పులస రుచి చూస్తే ఏటా లొట్టలేసుకుని తినాలి్సందే.అత్యంత ఖరీదైన డిష్ ఈ పులస చేప. కిలో పులస కావాలంటే ఐదారు వేల రూపాయలు పెట్టాల్సిందే. అయినప్పటికీ ‘పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి్సందే’నని గోదావరి జిల్లాల్లోని మాంసాహార ప్రియులు అంటారు. ‘పులస’ నేపథ్యం ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. పునరుత్పత్తి కోసం.. పసిఫిక్ మహాసముద్రం ప్రాంతంలోని ఆస్ట్రేలి యా, న్యూజిలాండ్ తదితర దేశాల సముద్ర జలా ల్లో జీవించే ఈ పులసను క్యుఫిడే కుటుంబానికి చెం దిన కార్డేటాగా శాస్త్రవేత్తలు వర్గీకరించారు. పులస ప్రజాతి హిల్సా. జాతి ఇల్సా. ఈ ‘ఇల్సా’ కాస్తా సముద్రంలో ఉన్నప్పుడు ‘విలస’గా.. గోదావరిలోకి ప్రవేశించాక ‘పులస’గా మారుతుంది. ఈ చేపలు పునరుత్పత్తి కోసం పసిఫిక్ మహాసముద్రం నుంచి హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం మీదుగా.. సుమారు 11 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించి గోదావరిలోకి వలస వస్తాయి. ఇందుకోసం అవి 30 నుంచి 40 రోజుల పాటు జీవ గడియారం (బయోలాజికల్ క్లాక్) ఆధారంగా ఏకధాటిగా ప్రయాణిస్తాయి. సైబీరియా పక్షులు, ఆలివ్ రిడ్లే తాబేళ్ల మాది రిగానే.. పులసలు కూడా పునరుత్పత్తి కోసం వేల కిలోమీటర్ల దూరాన్ని అలవోకగా అధిగమించి.. ఏటా ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో గోదావరి నదికి ఎర్రనీరు (వరద) వచ్చే సమయానికి గుడ్లు పెట్టడానికి వలస వస్తాయి. ఆడ, మగ పులసలు గోదావరిలో ఇసుక, గులక రాళ్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే సంగమించి గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు ఒకటి రెండు రోజుల్లోనే చేప పిల్లలుగా ఎదుగుతాయి. పులస చేప పిల్లలను ‘జట్కా’ అని పిలుస్తారు. పునరుత్పత్తి పూర్తయ్యాక వచ్చిన సముద్ర మార్గంలోనే సంతానం(జట్కాలు)తో కలిసి తిరిగి వచ్చిన చోటకే వెళ్లిపోతాయి. ఇందుకు మరో నెల రోజులు సమయం పడుతుంది. వీటిల్లో కొన్ని గోదావరిలో వలలకు చిక్కి, మత్స్యకారులకు సిరులు కురిపిస్తాయి. ఇవి ఉభయ గోదావరి జిల్లాల్లోని గౌతమి, వృద్ధ గౌతమి, వైనతేయ, వశిష్ట గోదావరి పాయల్లో మాత్రమే లభిస్తాయి. 100 కి.మీ. వేగంతో.. ఏటికి ఎదురీదుతూ.. గోదావరికి వరదలు వచ్చే జూలై చివరి నుంచి ఆగస్టు నెలాఖరు వరకు పులసలు లభిస్తాయి. కొన్ని సార్లు సెప్టెంబర్‌లో కూడా దొరుకుతాయి.. సముద్రం నుంచి గోదావరిలోకి ప్రవేశించాలంటే అవి ఏటికి ఎదురీదుకుంటూ రావాలి్సందే. మహోగ్ర వడితో పరవళ్లు తొక్కే వరద గోదావరికి ఎదురీదడమంటే మాటలు కాదు. అందుకు తగినట్టుగానే పులసలు 100 కిలోమీటర్ల వేగంతో గోదావరికి ఎదురీదుతాయి. గోదావరి జిల్లాల్లో సముద్ర ముఖద్వారం నుంచి గోదావరి నదిలో సుమారు 100 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. అంత దూరం అంత వేగంతో ఎదురీదడంతో ఈ చేపల్లో కెమికల్ రియాక్షన్ విపరీతంగా జరిగి దీని కండరాల్లో ప్రోటీన్లు ఉత్పత్తి అవుతాయి. పులసలకు స్వేదగ్రంధులు ఉండవు. మామూలుగా చేపల్లో ఒమేగా–3 పేట్రియాసిడ్స్ (ఆమ్లాలు) ఉంటాయి. కానీ ఈ ఆమ్లాలు పులసల్లో మూడు రెట్లు అధికంగా ఉంటాయని, అందువల్లనే వీటికి మంచి రుచి వస్తుందని చెబుతారు. నకిలీల బెడద మాంసాహార ప్రియులు ఎంతగానో ఇష్టపడి తినే ఈ పులసలకు కూడా నకిలీల బెడద తప్పడం లేదు. పులసలపై అవగాహన ఉన్న గోదావరి వాసులు నకిలీ పులసలను సులువుగా గుర్తిస్తున్నారు. గోదావరిలో దొరికే పులస దిగువన చర్మం బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది. అదే ఒడిశా నుంచి వచ్చే నకిలీ పులస చర్మం కొద్దిగా ఎరుపు రంగులో ఉన్నా మెరుపు ఉండదు. కేజీ బేసిన్లో చమురు, సహజవాయువు నిక్షేపాల కోసం జరుగుతున్న డ్రిల్లింగ్ కారణంగా జలకాలుష్యం పెరిగిపోవడం వలన గోదావరిలో పులసల రాక తగ్గుతోందని చెబుతున్నారు. సముద్ర గర్భంలో రిగ్గింగ్, బ్లాస్టింగ్ వంటి కార్యకలాపాల వల్ల ఈ చేపల వలసలు తగ్గాయని మత్స్యకారులు అంటున్నారు. ఆరోగ్యానికి మేలు కేవలం రుచే కాదు.. ఆరోగ్యానికి కూడా పులస ఎంతో మేలు చేస్తుంది. ఒమేగా–3, ఒమేగా–6 ఫ్యా టీ ఆమ్లాలు అధికంగా ఉన్నందువలన పులస ఆరో గ్యానికి ఎంతో మంచిదని చెబుతారు. గర్భిణులకు పులస ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతా రు. ఈ చేప తినడం గుండెకు మంచిదని అంటారు. సముద్ర ముఖద్వారం నుంచి బయలుదేరే పులస.. గోదావరిలో ఎంత దూరం ఎదురీదితే రుచి అంతగా ఉంటుంది. అందుకే సాగర సంగమ ప్రదేశాలైన యానాం, బోడసకుర్రు తదితర ప్రాంతాల్లో కంటే అఖండ గోదావరి (ధవళేశ్వరం బ్యారేజీ) వద్దకు వెళ్లే చేప రుచి, పరిమాణం ఎక్కువగా ఉంటాయి. దీనికి తగినట్టుగానే ధవళేశ్వరం, బొబ్బర్లంక, ఊబలంక తదితర ప్రాంతాల్లో లభించే చేపల ధర కూడా కిలో రూ.5 వేల నుంచి రూ.6 వేలు ఉంటుంది. వరదల సీజన్లో మాత్రమే దొరికే అరుదైన పులసల కోసం ధరతో నిమిత్తం లేకుండా మరీ ఎదురు చూస్తారు. మార్కెట్లోకి వచ్చిందంటే చాలు.. ఈ చేప క్షణాల్లో అమ్ముడైపోతుందంటే దీనికి ఎంత డిమాండ్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గర్భిణులకు ఎంతో మేలు ఆరోగ్యానికి పులస ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా గర్భిణులకు ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా అవసరమవుతాయి. ఇవి మిగిలిన జలచరాల కంటే పులస చేపలో ఎక్కువగా ఉంటాయి. గోదావరికి ఎదురీదటంతో సహజ సిద్ధంగా జనించే ఆమ్లాలు పులసలో రుచికి ప్రత్యేక కారణంగా చెప్పవచ్చు. వరద గోదావరిలో లభించే ప్రత్యేక ఆహారం కోసమే అవి ఇక్కడి వరకూ వస్తాయి. – చిట్టూరి గోపాలకృష్ణ,మత్స్యశాఖ అభివృద్ధి అధికారి, అమలాపురం పులుసు అమోఘం పులసను పులుసుగానే ఎక్కువగా వండుతారు. ఇప్పటి తరం మహిళలు దీనిని వండినా అంత రుచి రాదనే అంటారు. పులస పులుసును ప్రత్యేక తరహాలో తయారు చేయాల్సిందే. పాత తరం అంటే ఇప్పుడు 60, 70 ఏళ్లు వయస్సున్న గ్రామీణ మహిళలు పులస పులుసు పెడితే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. మసాలా దట్టించి మట్టికుండలో చింతపండు పులుసుతో దీనిని వండుతారు. చింతనిప్పులు లేదా కట్టెల పొయ్యి లేదా పిడకల మంటపైనే దీనిని వారు వండుతారు. పొయ్యిపై కూర ఉడికేటప్పుడు బెండకాయలు, వంకాయలు, మిరపకాయలు కోయకుండా ఉన్నవి ఉన్నట్టుగా వేస్తారు. అలాగే ఆవకాయలో తేరిన ఎర్రటి నూనె, కొత్తివీుర వేస్తారు. కుండలో వండితేనే దీనికి అసలైన రుచి వస్తుంది. పులుసు వండడం పూర్తయ్యాక అదే కుండలో ఉంచి 24 గంటల తరువాత తింటే దాని రుచే వేరని పలువురు లొట్టలు వేసుకుని తింటారు. పులస చేపకు ముళ్లు ఎక్కువగా ఉండటంతో చాలా నేర్పుగా తినాల్సి ఉంటుంది. ఇందులో వేసిన బెండకాయ, వంకాయ, పచ్చిమిర్చి కూడా భలే రుచిగా ఉంటాయి. గోదావరి జిల్లాల వాసుల్లో పలువురు హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల్లోని తమవారికి, ప్రజా ప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఘుమఘుమలాడే పులస పులుసు తీసుకువెళుతుంటారు. ఎన్నో ప్రత్యేకతలు పులసకు ఉన్నంత రుచి, వాసన మరో చేపకు ఉండవు. దీంతో దీనిని అంతర్జాతీయంగా క్వీన్ ఆఫ్ ది ఫిష్ (చేపల రారాణి)గా పిలుస్తారు. పులస చేప కిలో నుంచి 3 కిలోల బరువు మాత్రమే ఉంటుంది. 3 కిలోల బరువున్న పులస 60 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. దీని ఆయుష్షు గరిష్టంగా 3 సంవత్సరాలు. వలలో చిక్కిన వెంటనే పులసలు చనిపోతాయి. అయితే రక్తప్రసరణ ఎక్కువగా ఉండడంతో రెండు రోజుల వరకు ఈ చేప పాడైపోకుండా ఉంటుంది.పులస ప్రపంచంలో మూడే మూడు ప్రాంతాల్లో మాత్రమే లభిస్తుంది. బంగ్లాదేశ్‌లోని పద్మా నది, పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నది, మన రాష్ట్రంలోని గోదావరి నది. గోదావరిలో కూడా కేవలం మూడే మూడు ప్రాంతాల్లో లభించే పులస రుచి పసందుగా ఉంటుంది. ఆ ప్రాంతాలు తూర్పు గోదావరి జిల్లాలోని ధవళేశ్వరం, పశ్చిమ గోదావరి జిల్లాలోని సిద్ధాంతం, నర్సాపురం. బంగ్లాదేశ్‌లో పులస జాతీయ చేపగా గుర్తింపు పొందింది. అఖండ గోదావరి ధవళేశ్వరం దిగువన ఏడుపాయలుగా విడిపోతుంది. వీటినే ‘సప్త గోదావరులు’ అని పిలుస్తారు. అవి గౌతమి, వైనతేయ, వశిష్ట, తుల్య భాగ, భరద్వాజ, ఆత్రేయ, కశ్యప. ఈ ఏడు పాయలు చివరకు మూడు పాయలు(గౌతమి, వైనతేయ, వశిష్ట)గా సముద్రంలో కలుస్తాయి. అలా నదీపాయలు సముద్రంలో కలిసే సఖినేటిపల్లి మండలం అంతర్వేది అన్నాచెళ్లెళ్ల గట్టు, బోడసకుర్రు సమీపాన ఓడలరేవు – కరవాక మధ్య, కాట్రేనికోన మండలం బ్రహ్మసమేథ్యం సమీపాన కొత్తపాలెం ప్రాంతాల్లో సముద్ర మొగ(సీ మౌత్)లు ఏర్పడ్డాయి. ఈ మూడుచోట్ల నుంచే పులసలు గోదావరిలోకి ప్రవేశిస్తాయి. -
బరువు రెండున్నర కిలోలు..ధర రూ.7 వేలు..
రావులపాలెం: గోదావరి నీటితో పెరిగిన చెట్లకు కాసే ఫలాలు రుచా, ఆ నీటిలో లభించే పులస చేపలు రుచా.. అని మాంసాహార ప్రియులను అడిగితే ‘రెండోదే’ అని ఠక్కున చెపుతారు. సీజనల్‌గానే దొరికే గోదావరి పులసల ధర కూడా అందుకు తగ్గట్టే వరద గోదావరంత వడివడిగా పెరిగిపోతుంటుంది. మామూలుగా మత్స్యకారులు ఈ సీజన్లో వేటకు వెళ్లే ముందు ‘ఒక్క పులస దొరికితే చాలు.. పంట పండినట్టే’ అనిభావిస్తారు. ప్రస్తుతం కేజీ బరువైన పులస దొరకడమే అరుదుగా మారింది. ఈ తరుణంలో ఓ మత్స్యకారుని వలలో రెండున్నర కేజీల పులస చిక్కుకుని, అతడికి కాసులు కురిపించింది. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలో ఆదివారం లభించిన ఆ పులసను రావులపాలెం విందు రెస్టారెంట్ యజమాని గొలుగూరి సత్యశ్రీనివాసరెడ్డి కొనుగోలు చేశారు. తమ హోటల్లో కస్టమర్ల కోసం కొన్న పులసల్లో ఈ భారీ పులస కూడా ఉందని, దీనిని రూ.7 వేలకు కొన్నానని ఆయన తెలిపారు. రెండున్నర కిలోల పులస పులుసుగా మారేలోగా చూసిన వారిని ఆశ్చర్యపరిచింది. -
పులసా.. పులసా.. ఎప్పుడొస్తావ్!
భీమవరం : పులస.. ఏడాదికి ఒక్కసారి గోదావరికి ఎదురీది మత్స్యకారుల వలకు చిక్కుతుంది. మాంసప్రియులకు పసందైన విందును అందిస్తుంది. అరుదైన, ఖరీదైన జలపుష్పం. కేవలం గోదావరి జిల్లాల్లోని కాటన్ బ్యారేజ్ దిగువ ప్రాంతంలో మాత్రమే లభ్యమయ్యే పులస రుచి చూడాలని ఎందరో పరితపిస్తుంటారు. గోదావరిలో వరద నీరు పోటెత్తినప్పుడు ఇవి దర్శనమిస్తుంటాయి. సాధారణంగా జూలై నుంచి అక్టోబర్ మధ్య కాలంలో ఇవి వలలకు చిక్కుతుంటాయి. వరద నీరు లేకే.. ఆగస్టు రెండోవారం ముగుస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతంలో వీటి జాడ కనిపించలేదు. ఇందుకు గోదావరిలో వరద నీరు లేకపోవడమే కారణం. గత జూన్‌లో భారీగా వరద నీరు వచ్చి ఒక్కసారిగా తగ్గిపోరుుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వరద నీటి జాడ లేదు. వరద నీరు పుష్కలంగా ఉంటే తప్ప సముద్రంలో ఉండే ఇలసలు ఏటికి ఎదురీది పులసలుగా మారవు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ ఎక్కడా పులసలు కనిపించలేదు. 20 రోజులుగా వేట ఒడిశా ప్రాంతం నుంచి వచ్చిన ఇలసలు అక్కడక్కడా పులసలుగా చలామణి అవుతున్నాయి. 20 రోజుల పాటు పుష్కరాలలో గజ ఈతగాళ్లుగా సేవలందించిన మత్స్యకారులు పులసల కోసం రాత్రింబవళ్లు వేటాడుతున్నారు. అయినా వారికి నిరాశే ఎదురవుతోంది. Follow @sakshinews ఎగువన కురుస్తున్నా వర్షాలతోనైనా.. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో అరుునా గోదావరిలోకి వరద నీరు చేరితే పులసలు వలలకు చిక్కే అవకాశం ఉందని మత్స్యకారులు అంటున్నారు. జిల్లాలో విజ్జేశ్వరం, సిద్ధాంతం, దొడ్డిపట్ల, చించినాడ, నరసాపురం తదితర ప్రాంతాల్లో పులసల కోసం మత్స్యకారులు నిత్యం వేటాడుతూనే ఉన్నారు. ఈ ఏడాది ఎప్పటికి పులసలు చిక్కి గంగపుత్రులకు కాసుల వర్షం, మాంస ప్రియులకు విందు భోజనాన్ని అందిస్తాయో వేచిచూడాలి. -
పులస @ రూ. 4 వేలు!
పుస్తెలమ్మై పులస తినాల్సిందే అన్నది నానుడి. వీటికున్న విశిష్టత అటువంటిది. ఎంతైనా వెచ్చించి పులస చేపల్ని కొనేందుకు మాంస ప్రియులు ఎగబడుతుంటారు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌లో వచ్చే వరదల సమయంలో గోదావరిలో పులసలు లభిస్తుంటాయి. ఈసారి కొద్దిగా ఆలస్యంగా చించినాడ సమీపంలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో పులసలు కనిపిస్తున్నాయి. కిలో చేప రూ. 2 వేల నుంచి రూ. 4 వేల వరకు ధర పలుకుతోంది. పులస పేరు వింటేనే జనం పుల కరించిపోతారు. రాష్ట్రంలో కోస్తా తీరంలో మాత్రమే దొరికే పులస చేప ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. ఒక్క కోస్తా నదీ తీరప్రాంతాల్లోనే లభించడంతో దీని కోసం ఈ సీజన్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖ తదితర ప్రాంతాల నుంచి పులసప్రియులు వచ్చి ఎంత ధరయినా కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. ఒకసారి పులస రుచి చూసిన వారు వేల రూపాయలైనా పోటీ పడి కొనుగోలు చేస్తుంటారు. దీంతో పులస చేప ధరలు ఏటేటా ఎగబాకుతున్నాయి. దీని ధరలను చుక్కలను తాకుతుండడంతో సామాన్యులకు అందకుండా పోతోంది.