బరువు రెండున్నర కిలోలు..ధర రూ.7 వేలు.. | 2kg pulasa 7000 | Sakshi
Sakshi News home page

బరువు రెండున్నర కిలోలు..ధర రూ.7 వేలు..

Published Sun, Aug 28 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 11:19 AM

బరువు రెండున్నర కిలోలు..ధర రూ.7 వేలు..

బరువు రెండున్నర కిలోలు..ధర రూ.7 వేలు..

రావులపాలెం: గోదావరి నీటితో పెరిగిన చెట్లకు కాసే ఫలాలు రుచా, ఆ నీటిలో లభించే పులస చేపలు రుచా.. అని మాంసాహార ప్రియులను అడిగితే ‘రెండోదే’ అని ఠక్కున చెపుతారు. సీజనల్‌గానే దొరికే గోదావరి పులసల ధర కూడా అందుకు తగ్గట్టే వరద గోదావరంత వడివడిగా పెరిగిపోతుంటుంది. మామూలుగా మత్స్యకారులు ఈ సీజన్‌లో వేటకు వెళ్లే ముందు ‘ఒక్క పులస దొరికితే చాలు.. పంట పండినట్టే’ అనిభావిస్తారు. ప్రస్తుతం కేజీ బరువైన పులస దొరకడమే అరుదుగా మారింది. ఈ తరుణంలో ఓ మత్స్యకారుని వలలో రెండున్నర కేజీల పులస చిక్కుకుని, అతడికి కాసులు కురిపించింది. ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలో ఆదివారం లభించిన ఆ పులసను రావులపాలెం విందు రెస్టారెంట్‌ యజమాని గొలుగూరి సత్యశ్రీనివాసరెడ్డి కొనుగోలు చేశారు. తమ హోటల్‌లో కస్టమర్ల కోసం కొన్న పులసల్లో ఈ భారీ పులస కూడా ఉందని, దీనిని రూ.7 వేలకు కొన్నానని ఆయన తెలిపారు. రెండున్నర కిలోల పులస పులుసుగా మారేలోగా చూసిన వారిని ఆశ్చర్యపరిచింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement