![Pulasa Fish Was Bought For Rs 21,000 At Mamidikuduru - Sakshi](/styles/webp/s3/article_images/2020/09/21/3.jpg.webp?itok=bbV5EiGt)
పులసను దక్కించుకున్న ఏఎంసీ చైర్మన్ కొండలరావు
సాక్షి, మామిడికుదురు: భారతదేశంలో కేవలం గోదావరి జిల్లాల్లో మాత్రమే దొరికే అరుదైన పులస కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు. మాంసాహారులు లొట్టలేసుకుని తినే ఈ పులస స్టేటస్‌కు సింబల్‌గా నిలుస్తోంది. ఎంతో రుచికరమైన పులస చేప ఆదివారం వైనతేయ గోదావరి నదిలో పాశర్లపూడికి చెందిన మత్స్యకారుల వలకు చిక్కింది. భారీ డిమాండు ఉన్న ఈ పులస రెండున్నర కిలోల బరువుంది. దీనిని పాశర్లపూడి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్ముల కొండలరావు రూ.21 వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. (ఈ–పంట తరహాలో ఈ–ఫిష్)
Comments
Please login to add a commentAdd a comment