‘కాపుల కష్టాలను పట్టించుకోనివాళ్లు హీరోలు అయిపోయారు: జక్కంపూడి రాజా | YSRCP Jakkampudi Raja Reacts On AP Election Results 2024 | Sakshi
Sakshi News home page

‘కాపుల కష్టాలను పట్టించుకోనివాళ్లు హీరోలు అయిపోయారు: జక్కంపూడి రాజా

Published Wed, Jun 5 2024 1:02 PM | Last Updated on Wed, Jun 5 2024 1:50 PM

YSRCP Jakkampudi Raja Reacts On AP Election Results 2024

తూర్పుగోదావరి: కన్నతల్లికి బాగోలేదన్నా పట్టించుకోకుండా, నియోజకవర్గం గురించే ఆలోచించానని రాజానగరం మాజీ ఎమ్మెల్యే  జక్కంపూడి రాజా తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.  

‘‘కోరుకొండ సీతానగరం మండలాల్లో రెండు పంటలకు నీరు ఇచ్చాం. వ్యవసాయం చక్కగా చేసుకునేందుకు అనువైన పరిస్థితి ప్రభుత్వం కల్పించింది. విత్తనాలు, ఎరువులు, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పురుగుమందులు, గోడౌన్లు, యంత్ర పరికరాలు అన్నీ అందించాం. 

రూ. 25 కోట్లతో  తొర్రిగడ్డ పంపిణీ స్కీం మోడరనైజ్ చేశాం. ప్రతి చిన్న ఫిర్యాదుకు స్పందించి జవాబుదారీ తనంతో పని చేశాం. నియోజకవర్గంలో లక్ష కుటుంబాలు ఉంటే 80 వేల కుటుంబాలకు వద్దకు నేనే వెళ్ళాను. నా కుటుంబ సభ్యులంతా ఎన్నో రకాల సహాయ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించాం. ఇవాల్టి పరిస్థితి చూస్తే ఇంతవరకు భ్రమలో బతికామా అన్నట్టు అనిపిస్తుంది.

... మీకు మంచి చేసి ఉంటే నాకు ఓటు వేయమని అడిగిన దమ్మున్న నాయకుడు వైఎస్‌ జగన్‌ మాత్రమే. దేశంలో ఏ ముఖ్యమంత్రికైనా ఈ దమ్ముందా?. గెలిచినా ఓడినా రియల్ హీరో జగన్ మాత్రమే. ‌ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. గత ప్రభుత్వంలో పది లక్షలు కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరిగని రాజానగరం మండల కేంద్రంలో రూ. 20 కోట్ల  అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. 

.. ఏదేమైనా ప్రజల కోసం పనిచేస్తాం‌. రాజశేఖర్‌రెడ్డి కుటుంబంతోనే కలిసి నడుస్తాం. కాపు రిజర్వేషన్ కోసం శ్రమించిన ముద్రగడ లాంటి నాయకుడు అనేక మాటలు పడ్డారు. కాపుల కష్టాలను ఏనాడు పట్టించుకోని నాయకులు హీరోలు అయిపోయారు’’ అని అన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement