గుండెపోటుతో వరుడు హఠాన్మరణం | The groom dead of a heart attack | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో వరుడు హఠాన్మరణం

Published Mon, Aug 8 2016 4:01 AM | Last Updated on Mon, Sep 4 2017 8:17 AM

గుండెపోటుతో వరుడు హఠాన్మరణం

గుండెపోటుతో వరుడు హఠాన్మరణం

కొర్రపాడు(రాజుపాళెం): వివాహమైన కొద్ది గంటల వ్యవధిలోనే నవవరుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామంలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది. కొర్రపాడు గ్రామానికి చెందిన సూరా రామచంద్రారెడ్డి (26)కి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన యువతితో ఆదివారం దేవుని కడపలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది.

పెళ్లి తంతు ముగించుకుని పెళ్లి కుమార్తె, పెళ్లి కొడుకు స్వగ్రామమైన కొర్రపాడులోని ఇంటికి చేరుకున్నారు. అంతలోనే పెళ్లి కుమారుడికి ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని పెళ్లి మంటపంలో బంధుమిత్రుల ఆశీస్సులు అందుకున్న వరుడు ఇలా గుండెపోటుతో మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. కాగా, రామచంద్రారెడ్డి తండ్రి కూడా రెండేళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement