సాక్షి, హైదరాబాద్: సినిమా పంపిణీదారుడు శివ గణేష్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి దౌర్జన్యం చేసిన కేసులో నిందితుడు రామచంద్రారెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. ఈయన కొండారెడ్డి, శివగణేష్‌ల మధ్యవర్తిగా ఉన్నారు. శివగణేష్‌ను బెదిరించిన కేసులో రామచంద్రారెడ్డి మూడవ నిందితుడిగా ఉన్నాడు. కాగా.. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొండారెడ్డి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాధితుడు శివ గణేష్‌కు కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ బెదిరింపు కాల్స్ వస్తుండటం గమనార్హం.
ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డిపై కేసు నమోదైంది. డిస్ట్రిబ్యూటర్ శివగణేష్‌ను బెదిరించిన కేసులో బంజారాహిల్స్ పీఎస్‌లో కొండారెడ్డిపై కేసునమోదు చేశారు. ప్రొద్దుటూరు నుంచి తండ్రి వరదరాజులరెడ్డి హైదరాబాద్ వచ్చారు. కొండారెడ్డి, అతని అనుచరుల కోసం గాలింపు కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో భాగంగా కొండాపూర్‌లోని రవిరెడ్డి విల్లాలో బంజారాహిల్స్ పోలీసులు తనికీలు నిర్వహించారు. కాగా.. కొండారెడ్డి, రవిరెడ్డి, రామచంద్రారెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడైన కొండారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. (తుపాకులతో టీడీపీ నేత కుమారుడి హల్‌చల్)
Comments
Please login to add a commentAdd a comment