Shiva Ganesh
-
కొండా రెడ్డి బెదిరింపుల కేసు: నిందితుడికి బెయిల్
సాక్షి, హైదరాబాద్: సినిమా పంపిణీదారుడు శివ గణేష్‌పై టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి దౌర్జన్యం చేసిన కేసులో నిందితుడు రామచంద్రారెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. ఈయన కొండారెడ్డి, శివగణేష్‌ల మధ్యవర్తిగా ఉన్నారు. శివగణేష్‌ను బెదిరించిన కేసులో రామచంద్రారెడ్డి మూడవ నిందితుడిగా ఉన్నాడు. కాగా.. ఇదే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కొండారెడ్డి ముందస్తు బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాధితుడు శివ గణేష్‌కు కేసు విత్ డ్రా చేసుకోవాలంటూ బెదిరింపు కాల్స్ వస్తుండటం గమనార్హం. ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డిపై కేసు నమోదైంది. డిస్ట్రిబ్యూటర్ శివగణేష్‌ను బెదిరించిన కేసులో బంజారాహిల్స్ పీఎస్‌లో కొండారెడ్డిపై కేసునమోదు చేశారు. ప్రొద్దుటూరు నుంచి తండ్రి వరదరాజులరెడ్డి హైదరాబాద్ వచ్చారు. కొండారెడ్డి, అతని అనుచరుల కోసం గాలింపు కొనసాగుతోంది. గాలింపు చర్యల్లో భాగంగా కొండాపూర్‌లోని రవిరెడ్డి విల్లాలో బంజారాహిల్స్ పోలీసులు తనికీలు నిర్వహించారు. కాగా.. కొండారెడ్డి, రవిరెడ్డి, రామచంద్రారెడ్డి ఢిల్లీ వెళ్లినట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడైన కొండారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది. (తుపాకులతో టీడీపీ నేత కుమారుడి హల్చల్) -
హైదరాబాద్: బంజారాహిల్స్‌లో కిడ్నాప్ కలకలం
-
సినీ ఫక్కీలో డిస్ట్రిబ్యూటర్ కిడ్నాప్
సాక్షి, హైదరాబాద్: సినిమా పంపిణీదారుడు శివ గణేష్‌పై కడప జిల్లా టీడీపీ మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి దౌర్జన్యం చేశాడు. శివ గణేష్‌ని సినీ ఫక్కీలో కిడ్నాప్ చేసి భూ దస్త్రాలపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. తుపాకులు, కత్తులతో తన అనుచరులతో కలిసి హల్చల్ చేశాడు. ఈ ఘటన నగరం నడిబొడ్డున బంజారాహిల్స్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బాధితుని ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కొండారెడ్డి, అతని గ్యాంగ్‌లోని 10 మందిపై కేసు నమోదు చేశారు. తుపాకులు, కత్తులు చూపించి కొండారెడ్డి తన అనుచరులతో కలిసి బెదిరింపులకు పాల్పడ్డాడని శివ గణేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. శామీర్‌పేట, కడప జిల్లాకు చెందిన భూమికి సంబంధించిన పత్రాలపై కొండారెడ్డి గ్యాంగ్ బలవంతంగా సంతకాలు చేయించుకుందని తెలిపాడు. నాలుగు టీమ్‌ల ఏర్పాటు శివ గణేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని బంజారాహిల్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు తెలిపారు. తనను కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారుంటూ కొండారెడ్డితో పాటు మరో పదిమందిపై శివగణేష్ ఫిర్యాదు చేశాడని వెల్లడించారు. తుపాకులతో బెదిరించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నామని ఏసీపీ పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు మొత్తం నాలుగు టీమ్ లను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, బాధితుడు శివగణేష్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేయనున్నారు. -
సౌత్ ఏషియన్ గేమ్స్‌కు ‘కూత’ వేటు దూరంలో...!
కబడ్డీ.. కబడ్డీ అంటూ కూతపెడుతూ గ్రామసీమల్లో సరదాగా ఆడుకునే ఆట నుంచి దేశసరిహద్దులు దాటిఅంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం మూల శివగణేష్‌రెడ్డికి లభించింది. నేపాల్‌లో నిర్వహింనున్న సౌత్ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే ఇండియన్ కబడ్డీ జట్టు ప్రాబబుల్స్‌లో చోటు సంపాదించాడు. ఈనెల 26వ తేదీ వరకు హర్యాణలోని రోహ్తక్లో నిర్వహించే ఇండియన్ కబడ్డీ టీం సన్నాహక క్యాంపునకు ఈయన ఎంపికయ్యాడు. అక్కడ సత్తాచాటితే సౌత్ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే ఇండియన్ టీంకు ప్రాతినిథ్యం వహించే అవకాశాలు ఉన్నాయి. దేశానికి ప్రాతినిత్యం వహించడమే తన లక్ష్యమని చెబుతున్న మూల శివగణేష్రెడ్డిపై ప్రత్యేక కథనం.. కడప స్పోర్ట్స్ : వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన మోటార్‌మెకానిక్ రామసుబ్బారెడ్డి, నాగమల్లమ్మ దంపతుల కుమారుడైన మూల శివగణేష్‌రెడ్డికి అరుదైన అవకాశం లభించింది. కాగా శివగణేష్‌రెడ్డి ఈ యేడాది నిర్వహించిన ప్రొ కబడ్డీ లీగ్ పోటీల్లో తెలుగుటైటాన్స్ జట్టుకు ఎంపికయ్యాడు. రాయలసీమ నుంచి ప్రొకబడ్డీకి ఎంపికైన తొలి క్రీడాకారుడుగా ఈయన చరిత్ర సృష్టించాడు. ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ముగ్గురు క్రీడాకారులు మాత్రమే ప్రొ కబడ్డీలో వివిధ ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహించగా అందులో శివగణేష్‌రెడ్డి ఒకరు కావడం విశేషం. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు నేపాల్‌లో నిర్వహించనున్న సౌత్ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే ఇండియన్ జట్టుకు సన్నాహక క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈ క్యాంపులో పాల్గొనే క్రీడాకారులకు ఈనెల 5 నుంచి 26వ తేదీ వరకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఈ క్యాంపునకు రాష్ట్రం నుంచి మూల శివగణేష్‌రెడ్డికి అవకాశం లభించింది. క్యాంపులో వీరు చూపే ప్రతిభ ఆధారంగా ఇండియన్ టీం తుది జట్టును ప్రకటించనున్నారు. తల్లిదండ్రులతో శివగణేష్‌రెడ్డి మూడు సంవత్సరాల కాలంలోనే అసమాన్య ప్రతిభ.. తన సోదరుడు జనార్ధన్‌రెడ్డి కబడ్డీ క్రీడలో రాణిస్తుండటం చూడటంతో పాటు ఆయన సైతం ప్రోత్సహించడంతో ఇంటర్ పూర్తయిన తర్వాత కబడ్డీ సాధన ప్రారంభించాడు. కబడ్డీ శిక్షకుడు టి. జనార్ధన్ ఆధ్వర్యంలో కబడ్డీలో ఓనమాలు దిద్దుకున్న ఈయన అనతికాలంలోనే పలు అవకాశాలను దక్కించుకున్నాడు. 2018లో నరసాపురంలో నిర్వహించిన జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో ఏపీ జట్టుకు ప్రాతినిథ్యం వహించి రన్నరప్‌గా నిలిచారు. అదే విధంగా ఈ యేడాది ముంబైలోని రోహులో నిర్వహించిన సీనియర్ నేషనల్స్ కబడ్డీ చాంపియన్‌షిప్ పోటీల్లో సైతం ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించాడు. గత సీజన్లో ప్రొ కబడ్డీ ఎంపికలకు వెళ్లిన ఈయన తృటిలో జట్టులో అవకాశం కోల్పోయాడు. వైజాగ్‌లో నిర్వహించిన క్యాంపులో ఈయన ప్రతిభను గుర్తించిన తెలుగుటైటాన్ నిర్వాహకులు తెలుగుటైటాన్స్లో ఆల్‌రౌండర్‌గా అవకాశం కల్పించారు. ప్రొకబడ్డీ లీగ్ ఏడోసీజన్ కోసం నిర్వహించిన వేలంలో శివగణేష్‌రెడ్డిని రూ. 6లక్షలకు టైటాన్స్ జట్టు సొంతం చేసుకుంది. ఈ సీజన్లో తెలుగుటైటాన్స్ నుంచి ఈయన ప్రొ కబడ్డీలో సత్తాచాటారు. కాగా ఈయన ప్రస్తుతం విజయవాడలో ఇండియన్ కబడ్డీ సాయ్ కోచ్ పద్మజబాల పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నాడు. కబడ్డీ సంఘం ప్రతినిధులు హర్షం.. ఇండియన్ కబడ్డీ కోచింగ్ క్యాంపునకు శివగణేష్‌రెడ్డి ఎంపికకావడం పట్ల జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. గోవర్ధన్‌రెడ్డి, కార్యదర్శి చిదానందగౌడ్, కోశాధికారి టి.జనార్ధన్ సంతోషం వ్యక్తం చేశారు. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే లక్ష్యం.. దేశానికి ప్రాతినిథ్యం వహించడమే నా లక్ష్యం. మాది సాధారణ కుటుంబం. అటువంటి కుటుంబం నుంచి వచ్చిన నాకు ఇంత మంచి అవకాశం లభించడం సంతోషంగా ఉంది. భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా.– మూల శివగణేష్‌రెడ్డి, ఇండియన్ కబడ్డీ టీం క్రీడాకారుడు, కడప -
ప్రముఖ గేయ రచయిత మృతి
సాక్షి, హైదరాబాద్: మ్యూజికల్ హిట్స్‌గా నిలిచిన ఎన్నో చిత్రాలకు గేయ రచయితగా పనిచేసిన శివగణేష్ గుండెపోటుతో మరణించారు. గురువారం వనస్థలిపురంలోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తెలుగులో డబ్బింగ్ చిత్రాలుగా రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన ప్రేమికుల రోజు, నర్సింహా, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, ఎంతవారు కాని, 7జీ బృందావన్ కాలనీ లాంటి సినిమాలకు ఆయన సాహిత్యమందించారు. వెయ్యికిపైగా చిత్రాలకు ఆయన పాటలు రాశారు. శివగణేష్‌కు భార్య నాగేంద్రమణి శివగణేష్, కుమారులు సుహాస్, మానస్లు ఉన్నారు. ఆయన మృతికి పలువురు తెలుగు, తమిళ సినిమా రంగ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
శివగణేష్‌కు కన్నీటి వీడ్కోలు
పెందుర్తి: పెందుర్తి మండలం సాధూమఠం వద్ద ఆనందపురం – అనకాపల్లి బైపాస్‌పై ప్రమాదంలో మరణించిన పోలీస్ కానిస్టేబుల్ కాకర శివగణేష్(26) అంత్యక్రియలు మంగళవారం పూర్తి చేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న శివగణేష్ సోమవారం అర్థరాత్రి విధులు ముగించుకుని చోడవరంలోని తన ఇంటికి వెళ్తున్న సమయంలో సాధూమఠం వద్ద ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయాన్నే కేజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకున్నారు. అక్కడ పోస్టుమార్టం పూర్తయిన తర్వాత తోటి పోలీసుల సందర్శనార్థం పెందుర్తి పోలీస్ స్టేషన్ వద్ద శివగణేష్ పార్థివదేహాన్ని కాసేపు ఉంచారు. జాయింట్ సీపీ – 2 రవికుమార్‌మూర్తి, పెందుర్తి సీఐ పి.సూర్యనారాయణ, గాజువాక ట్రాఫిక్ సీఐ జూరెడ్డి మురళి, ఎస్ఐలు మన్మథరావు, స్వామినాయుడు, అప్పలరాజు, రామారావు, జి.డి.బాబు, ఉమామహేశ్వరరావు, ఏఎస్ఐలు, హెచ్‌సీలు, పీసీలు, హోంగార్డులు ఘనంగా అంజలి ఘటించారు. అనంతరం శివగణేష్ మృతదేహాన్ని చోడవరం తరలించి అంత్యక్రియలు జరిపారు. అంబులెన్స్ డ్రైవర్ అరెస్ట్: సోమవారం రాత్రి సాధూమఠం వద్ద శివగణేష్ బైక్‌ను అంబులెన్స్ ఢీకొంది. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులను విచారించి ఆధారాలు సేకరించిన పోలీసులు హైదరాబాద్ నుంచి ఒడిశాకు ఓ మృతదేహాన్ని తరలిస్తున్న అంబులెన్స్ శివగణేష్ బైక్‌ను ఢీకొన్నట్లు నిర్థారించారు. వెంటనే ఆనందపురం – అనకాపల్లి బైపాస్‌తో పాటు, ఎన్‌హెచ్ – 16 మీదుగా ఉన్న అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం అందించి అప్రమత్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల వద్ద అంబులెన్స్‌ను గుర్తించిన అక్కడి పోలీసులు పెందుర్తి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఎస్ఐ మన్మథరావు అంబులెన్స్ డ్రైవర్, హైదరాబాద్ వాసి నరసింహారెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. సీఐ పి.సూర్యనారాయణ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కాయ్ రాజా కాయ్ మూవీ పోస్టర్స్
-
‘మీకో ప్రేమకథ చెప్పాలి’
-
కొత్త ప్రేమకథలో తనీష్, శ్రీ
తనీష్, శ్రీ హీరోలుగా నటిస్తున్న ‘మీకో ప్రేమకథ చెప్పాలి’ చిత్రం హైదరాబాద్‌లో ఆరంభమైంది. శివగణేశ్ దర్శకత్వంలో కూనిరెడ్డి శ్రీనివాస్, శివణేష్ నిర్మిస్తున్నారు. ముహూర్తపు దృశ్యానికి నూకారపు సూర్యప్రకాశరావు కెమెరా స్విచాన్ చేయగా, వీరశంకర్ క్లాప్ ఇచ్చారు. శ్రీనివాసరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం కూనిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ -‘‘ఓ అద్భుతమైన కథతో శివగణేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘33 ప్రేమకథలు’ ఎంత వినూత్నంగా ఉంటుందో, ఈ చిత్రం కూడా అంతే కొత్తగా ఉంటుంది. ఇది చక్కని ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ’’ అని చెప్పారు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గ కథతో ఈ చిత్రం ఉంటుందని, ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ అని దర్శకుడు తెలిపారు. మూడు జంటల ప్రేమకథతో సాగే ఈ చిత్రంలో తనది మాస్ కారెక్టర్ అని శ్రీ చెప్పారు. ఈ చిత్రం తన కెరీర్‌కు మంచి బ్రేక్ అవుతుందనే నమ్మకం ఉందని తనీష్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: బాలిరెడ్డి, ఆర్ట్: భాస్కర్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: జయశంకర్. -
కాయ్ రాజా కాయ్ మూవీ స్టిల్స్
-
'కాయ్ రాజా కాయ్' వర్కింగ్ స్టిల్స్
-
'కాయ్ రాజా కాయ్' ఆడియో ఆవిష్కరణ