ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు తిరుపతి ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన జిల్లాలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తున్నట్లు చెప్పారు.
అలాగే 14 నుంచి 48 గంటలపాటు తిరుపతి, తిరుమల ఇరు ప్రాంతాల్లో సంపూర్ణ బంద్కు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. అలాగే16వ తేదీన జిల్లాలోని ఉపాధ్యాయులతో ఉపాధ్యాయుల గర్జన, 17న మున్సిపల్ ఉద్యోగులతో మహా గర్జనను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వీటితోపాటు18 నుంచి ఆమరణ దీక్షలు చేపట్టనున్నట్లు రాంచంద్రారెడ్డి వివరించారు.