
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. నేడు వైఎస్సార్ జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహా రిసెప్షన్ హాజరయ్యారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ కడప చేరుకున్నారు. అనంతరం, వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహా రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. నూతన దంపతులు సుధీర్ కుమార్ రెడ్డి, లక్ష్మి మౌనికలను ఆయన ఆశీర్వదించారు. అక్కడి నుంచి కాసేపట్లో వైఎస్ జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు.
