Kadapa
-
తక్కువ కాలుష్య నగరం కడప
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అతి తక్కువ కాలుష్యం ఉన్న నగరంగా కడప మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2023–24లో కడపలో వాతావరణ కాలుష్యం (గాలిలో ధూళి కణాలు పది మైక్రోమీటర్లు.. అంతకంటే తక్కువ వ్యాసం) పీఎం 10 సగటున 42 యూజీ/ఎం3 (ఎం క్యూబ్డ్)గా నమోదైంది. రాష్ట్రం మొత్తం మీద 15 ప్రధాన నగరాల వాతావరణ కాలుష్య గణాంకాలను కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం కాలుష్య తక్కువ ఉన్న నగరాల్లో 52 పాయింట్లతో నెల్లూరు రెండో స్థానంలో, 56 పాయింట్లతో కర్నూలు, ఒంగోలు మూడో స్థానంలో నిలిచాయి. రాష్ట్రం మొత్తంమీద అత్యధిక కాలుష్యమున్న నగరంగా విశాఖ రికార్డులకు ఎక్కింది. విశాఖలో సగటున వాతావరణ కాలుష్యం 120 పాయింట్లుగా ఉంది. విశాఖ తర్వాత 76 పాయింట్లతో రాజమండ్రి రెండో స్థానంలో, 73 పాయింట్లతో విజయనగరం మూడో స్థానంలో నిలిచాయి. రాజధాని నిర్మాణం పూర్తి కాకుండానే, ఇంకా ఎటువంటి వాణిజ్య కార్యకలాపాలు మొదలు కాని అమరావతిలో కాలుష్యం సగటున 71 పాయింట్లు నమోదు కావడం గమనార్హం. దేశంలో అత్యంత కాలుష్య నగరంగా పేరొందిన ఢిల్లీలో సగటున 208 పాయింట్లు నమోదైంది. ఢిల్లీ తర్వాత నోయిడా 182 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.సత్ఫలితాలు ఇస్తున్న చర్యలునేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్‌క్యాప్) కింద దేశ వ్యాప్తంగా 130 నగరాలు, పట్టణాల్లో వాతావరణ కాలుష్యం తగ్గించడానికి తీసుకుంటున్న చర్యలు కొన్ని పట్టణాల్లో సత్ఫలితాలిస్తున్నాయి. మన రాష్ట్రంలో విజయవాడలో కాలుష్యం బాగా తగ్గినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 2022–23లో 90 పాయింట్లుగా ఉన్న కాలుష్య స్థాయి 2023–24 నాటికి 61 పాయింట్లకు తగ్గింది. కడపలో 57 నుంచి 42 పాయింట్లకు, కర్నూలులో 64 నుంచి 56, నెల్లూరులో 56 నుంచి 52, శ్రీకాకుళంలో 71 నుంచి 68, విజయనగరంలో 75 నుంచి 73 పాయింట్లకు తగ్గింది.మిగిలిన పట్టణాల్లో కాలుష్య స్థాయి పెరిగింది. వాతావరణ కాలుష్యం తగ్గించడానికి బీఎస్6 ప్రమాణాలను అమలు చేయడం, పాత వాహనాలను తుక్కు చేసిన వారికి ప్రోత్సాహకాలు అందించడం, చెత్తను సమర్థవంతంగా నిర్వహించడం, థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో కనీసం 5 శాతం వ్యవసాయ వ్యర్థాలను వినియోగించేలా నిబంధనలు తీసుకురావడం వంటి అనేక చర్యలను కేంద్రం అమలు చేస్తోంది. -
చంద్రబాబు బుద్ధి మారాలని ప్రార్దించా..
-
వైఎస్ఆర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఏకగ్రీవం
-
కుట్రలతో ఎన్నికను ఆపాలని చూశారు.. చిత్తూగా ఓడిపోయారు
-
నేడు వైఎస్సార్ జిల్లా జడ్పీ ఛైర్మన్ ఎన్నిక
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. గురువారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ నేతృత్వంలో ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఉదయం 10గంటలకు నామినేషన్ స్వీకరణ, 12గంటలకు నామినేషన్లు పరిశీలన పూర్తి, అనంతరం తుది జాబితా విడుదల చేయనున్నారు. 1 గంటలకు నామినేషన్ ఉపసంహరణ చేపట్టనున్నారు. ఆపై పోటీలో ఉన్న అభ్యర్థుల మధ్య చైర్మన్ ఎన్నిక ప్రక్రియ కొనసాగించనున్నారు.జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులుండగా వారిలో పులివెందుల జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి ఓ ప్రమాదంలో చనిపోయారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఆకేపాటి అమర్నాథరెడ్డి జెడ్పీ చైర్మన్‌గా కొనసాగుతూ రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జెడ్పీకి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ప్రస్తుతం జిల్లా పరిషత్‌లో 48 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారు. వారిలో గోపవరం మండల జెడ్పీటీసీ జయరామిరెడ్డి మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారు. మిగతా అందరూ వైఎస్సార్సీపీ నుంచి ఎన్నికైన జెడ్పీటీసీ సభ్యులే కావడం విశేషం. వైఎస్సార్సీపీ సభ్యులకు విప్ జారీ... జిల్లా పరిషత్‌లో 47మంది జెడ్పీటీసీలకు వైఎస్సార్సీపీ విప్ జారీ చేసింది. జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి సూచన మేరకు వేముల జెడ్పీటీసీ బయపురెడ్డి ద్వారా సభ్యులకు విప్ జారీ చేశారు. విప్ జారీ చేసిన రిసిప్ట్ కాపీలు ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. విప్ అందుకున్న సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. విప్ ధిక్కరిస్తే ఆయా సభ్యులు సభ్యుత్వం కోల్పోవాల్సి వస్తుంది. ప్రస్తుతం సభ్యులంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ముక్తకంఠంతో వెల్లడిస్తున్నారని సమాచారం. దాంతో వైఎస్సార్సీపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. చైర్మన్‌గిరిని పార్టీ ఖాతాలో జమ చేసుకునేందుకు సన్నద్ధంగా ఉంది.రామగోవిందురెడ్డిని వరించనున్న చైర్మన్ పీఠంబ్రహ్మంగారిమఠం మండల జెడ్పీటీసీ సభ్యుడు ముత్యాల రామగోవిందురెడ్డికి జెడ్పీ చైర్మన్ పీఠం దక్కనుంది. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యరి్థగా ఆపార్టీ ప్రకటించింది. రెండు పర్యాయాలుగా బి.మఠం జెడ్పీటీసీగా ఆయన ప్రాతిని«థ్యం వహిస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రామగోవిందురెడ్డి అభ్యరి్థత్వాన్ని ఎంపిక చేశారు. అధినేత సూచనలు మేరకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు చైర్మన్ ఎన్నిక కోసం కంకణబద్ధులై ఉన్నారు. కలిసికట్టుగా ఎన్నిక ప్రక్రియ వ్యవహారం నడిపించేందుకు సన్నాహాలు చేస్తుండడం విశేషం. తెలుగుదేశం పార్టీ ద్వంద్వనీతిజిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికలో టీడీపీ ద్వంద్వనీతి ప్రదర్శించింది. సంఖ్యాబలం లేని కారణంగా ప్రజాతీర్పుకు గౌరవించి చైర్మన్ ఎన్నికలో పోటీలో లేమంటూ టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులరెడ్డి ప్రకటించారు. వాస్తవాలు పరిశీలిస్తే అందుకు విరుద్ధమైన సంకేతాలు తెరపైకి వచ్చాయి. జిల్లా అధ్యక్షుడు పోటీలో లేమంటూనే మరోవైపు టీడీపీ జెడ్పీటీసీ జయరామిరెడ్డి ద్వారా ఎన్నికలను నిలుపుదల చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు.బరిలో నిలిచే శక్తి లేకపోవడంతో చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు కుట్రలు పన్నారు. టీడీపీ జెడ్పీటీసీతోపాటు మరో 7మంది తెలుగుదేశం పార్టీ వర్గీయులు హైకోర్టును ఆశ్రయించారు. చైర్మన్ ఎన్నిక అడ్డుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. స్టేటస్ కో తీసుకొచ్చేందుకు విశ్వప్రయత్నం చేశారు. చైర్మన్ ఎన్నిక నిలుపుదల చేసేందుకు, స్టేటస్కో ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడం విశేషం. సమయం లభిస్తే జెడ్పీటీసీ సభ్యులను వశపర్చుకోవాలనే దుర్భుద్ధితోనే హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. కాగా చైర్మన్ ఎన్నికకు ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించుకోవాలని హైకోర్టు ఆదేశిస్తూనే తుది ఫలితం హైకోర్టు ఉత్తర్వులకు లోబడి ఉండాలని ప్రకటించింది. -
కడపలో సందడి చేసిన సినీనటి కీర్తి సురేష్ (ఫొటోలు)
-
ఇంత క్రూరత్వమా..?.. పోసాని పట్ల ప్రభుత్వ దాష్టీకం
సాక్షి కడప : రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని ప్రయోగించి 67 ఏళ్ల వయస్సులో ఉన్న ప్రముఖ సినీనటుడు, రచయిత, నిర్మాత పోసాని కృష్ణమురళిని అక్రమ కేసులో ఇరికించి, అరెస్టు చేయడమే కాకుండా, ఆయన ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం కుట్రపూరితంగానే వ్యవహరించింది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన పోసాని మురళిని గురువారం రాత్రి కోర్టులో హాజరుపరిచి, శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకెళ్లారు. అక్కడ విరేచనాలు అయినట్లు కుటుంబ సభ్యులకు పోసాని తెలిపారు. శనివారం గుండెల్లో, కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో ముందుగా అక్కడి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమికంగా పరీక్షలు చేయించి, వైద్యుల సూచన మేరకు కడపలోని రిమ్స్‌కు తరలించారు. ఇక్కడ కూడా ఆయన పట్ల ప్రభుత్వం, పోలీసులు అత్యంత క్రూరంగా వ్యవహరించారు. గుండెల్లో, కడుపు నొప్పితో బాధపడుతున్నా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తీసుకెళ్లడం క్రూరత్వమే. పైగా, ఆయనది అనారోగ్యం కాదని, నటన అంటూ రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు రిమ్స్ ఆవరణలోనే మీడియాతో మాట్లాడుతూ చెప్పడం అందరినీ విస్మయపరిచింది. 67 ఏళ్ల వయస్సులో ఉన్న ఓ ప్రముఖుడు, సీనియర్ సిటిజన్ పట్ల ఓ సీఐ ఇంత దారుణంగా మాట్లాడటం ప్రభుత్వ కర్కశత్వానికి నిదర్శనమని పలువురు మండిపడుతున్నారు. ఇదే తరుణంలో పోసోని మురళీకృష్ణకు ఏదైనా జరగరానిది జరిగితే బా«ద్యత ఎవరిదంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇలాగేనా ఆస్పత్రికి తీసుకెళ్లేది? పోసానికి ఇప్పటికే ఓసారి గుండె ఆపరేషన్ అయింది. మరికొన్ని ఆరోగ్య సమస్యలూ ఉన్నాయి. ఓబులవారి పల్లె పోలీసు స్టేషన్లో స్థానిక పీహెచ్సీ వైద్యులు పరీక్షించినప్పుడు ఆయనకు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నట్లు వెల్లడించారు. గుండెకు సంబంధించే కాకుండా ఇతర అరోగ్య సమస్యలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు కూడా పేర్కొంటున్నారు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో అరెస్టు చేసిన ఆయన్ని పోలీసు వాహనంలో తిప్పీ తిప్పీ గురువారం మధ్యాహ్నం ఓబులవారిపల్లె పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ 9 గంటలు విచారణ జరిపి, ఆ తర్వాత రైల్వేకోడూరు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రాత్రంతా వాదనలు జరిగాయి. శుక్రవారం రాజంపేట సబ్‌జైలుకు తీసుకొచ్చేవరకు.. అంటే రెండు రాత్రులు, రెండు పగళ్లు ఆయనకు విశ్రాంతి, నిద్ర లేవు. ఆయన బాగా అలసిపోయారు. జైలుకు తీసుకొచ్చేప్పటికే బాగా నీరసించిపోయారు. సబ్‌జైలుకు తరలించిన తర్వాత విరేచనాలు అయినట్లు, ఇతర సమస్యలు ఎదుర్కొన్నట్లు ఆయన ములాఖత్‌లో సన్నిహితులకు తెలిపారు. శనివారం గుండెల్లో, కడుపులో నొప్పితో బాధపడ్డారు. ఇలాంటి తరుణంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన జైలు, పోలీసు అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు స్పష్టంగా కనిపించింది. ఇలాంటి సమస్యలతో ఉన్న వారిని ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా ఆక్సిజన్, ఇతర అత్యవసర వైద్య సౌకర్యాలు ఉన్న అంబులెన్సులోనే తీసుకెళ్లాలి. వైద్యులు వెంట ఉండాలి. రాజంపేట పీహెచ్సీలో ఈసీజీ, ఇతర ప్రాథమిక వైద్య పరీక్షల అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం కడపలోని రిమ్స్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించడం ఒకింత తీవ్రతకు నిదర్శనమే. అయినా పోలీసులు ఆయన్ని రాజంపేట పీహెచ్సీ నుంచి కడప రిమ్స్‌కు అంబులెన్స్‌లో కాకుండా పోలీసు వాహనంలో తీసుకెళ్లారు. అదీ.. సరిగా గాలి కూడా ఆడకుండా ఇద్దరు పోలీసుల మధ్య కూర్చోబెట్టి తీసుకెళ్లారు. రిమ్స్‌లో కూడా స్ట్రెచర్ కానీ, వీల్ చెయిర్ కానీ ఏర్పాటు చేయలేదు. వాహనం నుంచి ఆస్పత్రిలోకి నడిపించుకుంటూనే తీసుకెళ్లారు. రిమ్స్ వైద్యులు పరీక్షల అనంతరం పోసాని కిడ్నీలో రాయి ఉన్నట్లు చెప్పారు.ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా కడపులో నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు కూడా అంబులెన్సులో కాకుండా పోలీసు వాహనంలోనే తిరిగి రాజంపేటకు తరలించారు. పోసాని పట్ల ప్రభుత్వం క్రూరత్వానికి ఇదే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కుటుంబ సభ్యులు అభిమానుల్లో ఆందోళన పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై కుటుంబ సభ్యులతోపాటు అభిమానుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అనారోగ్యంతో ఉన్న ఆయన్ని పోలీసు వాహనాల్లో తీసుకెళ్తున్నారని, ఏదైనా అత్యవసరం అయితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. శనివారం ములాఖత్‌లో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆయన్ని సబ్ జైలులో కలిశారు. అనంతరం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న తీరును సబ్‌జైలు అధికారులకు కూడా ఆకేపాటి వివరించారు. పోసాని ఛాతినొప్పి, ఇతర అరోగ్య సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో ఏదైనా జరిగితే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా అధికారులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అధికారులు పోసానిని పీహెచ్‌సీకి తీసుకెళ్లి, అక్కడి నుంచి కడప రిమ్స్‌కు వైద్యం కోసం తరలించారు. -
కడపలో జగనన్న క్రేజ్
-
పెళ్లి వేడుకలో వైఎస్ జగన్
-
వివాహ వేడుకలో వైఎస్ జగన్.. కొత్త జంటకు ఆశీర్వాదం
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నేడు వైఎస్సార్ జిల్లా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహా రిసెప్షన్ హాజరయ్యారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ కడప చేరుకున్నారు. అనంతరం, వైఎస్ జగన్.. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కుమారుడు సుధీర్ వివాహా రిసెప్షన్ వేడుకలో పాల్గొన్నారు. నూతన దంపతులు సుధీర్ కుమార్ రెడ్డి, లక్ష్మి మౌనికలను ఆయన ఆశీర్వదించారు. అక్కడి నుంచి కాసేపట్లో వైఎస్ జగన్ బెంగళూరుకు వెళ్లనున్నారు. -
నేడు కడపలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) ఈనెల 14వ తేదీ(శుక్రవారం) కడప(Kadapa)లో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు.అక్కడ 11 గంటలకు మేడా రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. -
రేపు వైఎస్ జగన్ కడప పర్యటన
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) కడపలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కడప చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు మేడా రఘునాధ్ రెడ్డి కన్వెన్షన్‌లో ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడి నుంచి ఆయన బెంగళూరు బయలుదేరి వెళతారు. -
కడపలో కూటమి నేతల ‘కూల్చివేత’ రాజకీయాలు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడపలో చిరు వ్యాపారులపై మున్సిపల్ అధికారులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. రోడ్డు ఆక్రమణ పేరుతో రెండో గాంధీ బొమ్మ వద్ద షాపులను తొలగించారు. కడపలో కూల్చివేత రాజకీయాలను కూటమి నేతలు కొనసాగిస్తున్నారు.నిన్నటి వరకు వైఎస్సార్సీపీ నేతల వెంచర్లు, వాటర్ ప్లాంట్లపై ప్రతాపం చూపించగా, తాజాగా చిరు వ్యాపారులపై ఉక్కు పాదం మోపారు. ఎటువంటి అడ్డు, ఇబ్బందీ లేకపోయినా ఆక్రమణలు అంటూ తొలగింపు చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రోద్బలంతోనే కూల్చివేత కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. -
మాధవిరెడ్డి రివేంజ్ పాలిటిక్స్..!
సాక్షి,వైఎస్సార్‌జిల్లా:కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి మళ్లీ వాటర్‌ప్లాంట్ రాజకీయాన్ని ప్రారంభించారు. ప్రజలేమైపోయినా పర్లేదని వైఎస్సార్సీపీ నేతల మీద కక్ష సాధించడానికి కడపలోని వాటర్ప్లాంట్లను మూసేయిస్తున్నారు. మొన్న కడప 26వ డివిజన్ కార్పొరేటర్ త్యాగరాజు వాటర్‌ప్లాంట్ కూలదోసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే భంగపడ్డారు. తాజాగా వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య వాటర్‌ప్లాంట్ సీజ్ చేయించారు.అన్ని అనుమతులున్నా ప్లాంట్‌ను పాఠశాల భవనం అంటూ సాకు చూపి అధికారులతో సీజ్ చేయించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నిధులతో వాటర్ప్లాంట్లు నిర్మించారనే అక్కసుతోనే ఎమ్మెల్యే ఈ దుశ్చర్యలకు పాల్పడ్డట్టు చెబుతున్నారు. అంతకుముందు 26వ డివిజన్ వాటర్‌ప్లాంట్ విషయంలో అన్నీ అనుమతులుండటంతో ఎమ్మెల్యే కూల్చివేతకు ఆదేశించినప్పటికీ అధికారులు,పోలీసులు వెనక్కి తగ్గారు.ఎమ్మెల్యేగా ఉండి వేసవిలో ప్రజల దాహర్తిని తీర్చాలి కానీ..ఇలా వాటర్‌ప్లాంట్లపై పగబట్టడం మాధవిరెడ్డికే చెల్లిందంటూ వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్సీపీ నేత ఆదిత్య వాటర్‌ప్లాంట్ సీజ్‌పై చట్టప్రకారం కోర్టులను ఆశ్రయిస్తామని పార్టీ నాయకులు చెబుతున్నారు. -
శ్రీవారికి పుష్ప యాగం (ఫోటోలు)
-
మరోసారి కక్షసాధింపుకు దిగిన కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి
-
వైఎస్సార్సీపీ కార్పొరేటర్లపై మళ్లీ కక్ష సాధింపు చర్యలు
వైఎస్సార్‌జిల్లా: వైఎస్సార్సీపీ కార్పొరేటర్లే లక్ష్యంగా కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవీరెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అన్నీ అనుమతులతో వైఎస్సార్సీపీ కార్పోరేటర్ నడుపుతున్న వాటర్‌ప్లాంట్‌ను కూలగొట్టేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా 26వ డివిజన్ కార్పోరేటర్ త్యాగరాజు వాటర్ ప్లాంట్‌ను కూలగొట్టాలని అధికారల్ని పురమాయించారు ఎమ్మెల్యే మాదవీ రెడ్డి.తాము వాటర్ ప్లాంట్ నడపడానికి అన్ని అనుమతులు ఉన్నాయని చూపినా అధికారులు మాత్రం కూలగొట్టేందుకే యత్నిస్తున్నారు. తమకు ఎమ్మెల్యే, కమిషనర్ ఆదేశాలున్నాయంటూ కూలగొట్టేందుకు యత్నిస్తున్నారు. ఇందుకు మున్సిపల్ ిసిబ్బంది సిద్ధమైన క్రమంలో ఆ డివిజన్లోని ్స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని కక్షసాధింపునకు దిగితే సహించేది లేదని వైఎస్సార్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. అన్నీ అనుమతులు ఉన్న వాటర్ ప్లాంట్‌ను ఎలా కూలగొడతారని కూటమి ప్రభుత్వం చర్యలను ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పోరేటర్ వాటర్ ప్లాంట్ కూలుస్తున్నారన్న సమాచారం అందుకున్న మేయర్ సురేష్ బాబు అక్కడకు చేరుకున్నారు. ఏ అధికారంతో వాటర్ ప్లాంట్, ఇళ్లను కూలుస్తారని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంలో దీనికి అన్ని పట్టాలు మంజూరు అయ్యాయని మేయర్ స్పష్టం చేశారు. ఇది రాజకీయ కక్ష పూరిత చర్య అని. నోటీసులు కూడా లేకుండా తొలగింపునకు ఎలా వచ్చారని అక్కడ ఉన్న అధికారుల్ని ప్రశ్నించారు. దీనికి అధికారులు నీళ్లు నమలగా, ఇక్కడ నుంచి అధికారులు వెళ్లే వరకూ కదిలేది లేదని మేయర్ సురేష్ బాబు తేల్చిచెప్పారు. -
మన నగరాల్లో కాలుష్యం తక్కువే
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం తక్కువగా ఉన్న 50 నగరాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఐదు ఉన్నాయి. అవి కడప–52 ఎంజీ (మిల్లీగ్రాములు/క్యూబిక్ మీటర్), అమరావతి 56 ఎంజీ, తిరుపతి 57 ఎంజీ, విజయవాడ 61 ఎంజీ, రాజమహేంద్రవరం 61 ఎంజీలుగా ఉన్నాయి. 2024 సంవత్సరానికి గాను సీఆర్ఈఏ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్) సంస్థ అధ్యయనంలో ఈ విషయం తేలింది. అలాగే, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మడికేరి నగరం చోటు సంపాదించింది. ఇక్కడ వార్షిక సగటు కాలుష్యం కేవలం 32 ఎంజీ మాత్రమే. తమిళనాడులోని పాలలైపెరూర్, కర్ణాటకలోని కొప్పల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యంత క్లీనెస్ట్ జాబితాలో ఇంఫాల్, షిల్లాంగ్, అరియాలూర్, రామనగర, విజయపుర, రామనాథపురం ఉన్నాయి. ఇక అత్యంత కలుషిత నగరాల జాబితాలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వార్షిక సగటు 236 ఎంజీగా నమోదైంది. 226 ఎంజీతో నోయిడా, 211తో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా 50 అత్యంత కలుషిత నగరాల్లో 15 నగరాలు రాజస్థాన్‌వే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, బిహార్‌లో ఏడు ఉన్నాయి. ఇందులో ఏపీలోని ఏ నగరం కూడా లేనప్పటికీ విశాఖలో మాత్రం 108 ఎంజీగా నమోదైంది. గత ఏడాది గాలి నాణ్యతా ప్రమాణాల లెక్క వేసినప్పుడు విశాఖపట్నంలో 30 రోజుల వ్యవధిలో ఇలా ఆరుసార్లు కనిపించింది. గత ఏడాది సెప్టెంబరులో విజయవాడలో కూడా ఎక్కువగానే నమోదైంది. కానీ, ఆ తర్వాత గాలి నాణ్యత ప్రమాణాల్లో కాస్త మెరుగుపడింది.నిధుల వినియోగంలో ఏపీ వెరీపూర్..ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కాలుష్య కారకాలను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్సీఏపీ (నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) కింద నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను వినియోగించుకోవడంలో ఏపీ చాలా వెనుకబడినట్లు సీఆర్ఈఏ అధ్యయనంలో వెల్లడైంది. కేటాయించిన నిధుల్లో 35 శాతం మాత్రమే వినియోగించారు. అదే మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు 90 శాతం నిధులను వినియోగించాయి. -
వైభవంగా కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం (ఫొటోలు)
-
విద్యుత్ కాంతులతో కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం (ఫొటోలు)
-
కడప అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న 'రాచరికం' సినిమా టీం సభ్యులు...
-
‘సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తే.. ప్రభుత్వానికి నష్టం’
వైఎస్సార్ జిల్లా: కడప ఎమ్మెల్యే ామాధవిరెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు పెద్ద ఎత్తున ీసీఎం రిలీఫ్ పండ్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వ్యాఖ్యానించారు. కడపంలో పరిశుభ్రత లేక ప్రజల్లో కిడ్నీ, శ్వాసకోస వ్యాధుల ెపెరిగిపోతున్నాయని సంచలనవ వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆస్పత్రి ఖర్చులకు రోగులు సీఎం రిలీఫ్ ఫండ్ఆశ్రయించక తప్పడం లేదన్నారు. అయితే ఇలా పెద్ద ఎత్తున సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం వల్ల ప్రభుత్వానికి నష్టం ావాటిల్లుతోందని ఎమ్మెల్యే మాధవిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
కడపలో వైభవంగా శ్రీరాముడి శోభాయాత్ర.. ఆకట్టుకున్న విద్యార్థుల విన్యాసాలు (ఫొటోలు)
-
శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్న అవినాష్ రెడ్డి
-
కడపలో భూచోళ్లు!
కడప నగరంలో భూచోళ్లు పడ్డారు. భూ దాహంతో ‘సైకిల్ చక్రాలు’ కట్టుకుని మరీ ఊరంతా తిరుగుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నోరు తెరుస్తున్నారు. పట్టపగలే ప్రభుత్వ స్థలాలను చదును చేస్తూ కబ్జా చర్యలకు పదును పెడుతున్నారు. అధికారులకు మామూళ్ల మకిలీ అంటగట్టి.. ఆపై ఏంచక్కా నకిలీ డాక్యుమెంట్లతో స్థలాలను హాంఫట్ చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి కడప: కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నేతలు భూ ఆక్రమణలతో చెలరేగిపోతున్నారు. ఖాళీ స్థలాలు కన్పిస్తే కబ్జాకు యత్నిస్తున్నారు. ముఖ్యంగా కడప నగరంలో ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించడం, ఆపై రెవెన్యూ డిపార్టుమెంటును మేనేజ్ చేయడంలో తల మునకలయ్యారు. ఇలా పక్కా స్కెచ్ తో కోట్లాది రూపాయల విలువజేసే స్థలాలను కొట్టేస్తున్నారు. తాజాగా కడప నగరంలోని ద్వారకానగర్‌లో రూ.12 కోట్ల విలువజేసే ప్రభుత్వ భూమిని చదును చేశారు. ఈ ప్రాంతంలో ఇది ప్రభుత్వ భూమి అని హె చ్చరిక బోర్డును సైతం కబ్జాదారులు లెక్కచేయకుండా చదును చేసి ఆక్రమించే ప్రయత్నాలు సాగిస్తున్నారు.కడప నగరం ద్వారకానగర్‌లో రైతు బజార్ సమీపంలో నాగరాజుపల్లె పొలం సర్వే నెంబరు 71/1లో 2.52 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో రైతు బజార్ ఏర్పాటు చేయగా మరో 40 సెంట్లు ప్రభుత్వ భూమి ఖాళీగా ఉండిపోయింది. ఈ స్థలం బుగ్గవంక ప్రొటెక్షన్ వాల్‌కు ఆనుకునే ఉంది. ఆన్లైన్లో రికార్డులల్లో అనుభవదారు పేరు ‘వాగు’అని ఇప్పటికీ వస్తోంది. కాగా ఆ స్థలంపై టీడీపీ నేతల కన్ను పడింది. జిల్లా టీడీపీ ముఖ్యనేత సన్నిహితులు స్వాహాకు ప్రణాళిక రచించారు. ప్రతిరోజు ముఖ్యనేత చుట్టు ఉండే తెలుగుతమ్ముళ్లు ఈకబ్జా వ్యవహారంలో క్రియాశీలక ప్రాత పోషించినట్లు ఆరోపణలున్నాయి.హెచ్చరిక బోర్డును లెక్కచేయని అక్రమార్కులురెవెన్యూ అధికారులు ఈ స్థలం ప్రభుత్వ భూమి...దీనిని ఎవరైనా ఆక్రమిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోబడును అని హెచ్చరిక బోర్డు సైతం ఏర్పాటు చేశారు. ఇవేవి తెలుగుతమ్ముళ్లు లెక్కచేయలేదు. కాగా ఈ స్థలం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉంది. ఈవ్యవహారం వెలుగులోకి రావడంతో సదరు నేతలు తేలుకుట్టిన దొంగలా ఉండిపోయారు. రూ.12కోట్ల విలువజేసే స్థలాన్ని కొట్టేసేందుకు నకిలీ పత్రాలు సృష్టించి ఇది తమదేనని చదును చేసేశారు. విషయం తెలుసుకున్న ద్వారకానగర్æకాలనీ డెవెలప్మెంట్ కమిటీ వారు రెవిన్యూ, కార్పొరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని కోరారు. దాంతో వ్యవహారం బహిర్గతం కావడంతో అధికారులు సైతం కాస్తా అప్రమత్తమయ్యారు. కోట్లు విలువైన భూమి కాజేసేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు సైతం సృష్టించినట్లు సమాచారం. ఆమేరకు ఓ రెవెన్యూ అధికారితో సైతం సంప్రదించి సహాకారం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ కూడా ఓ నేతకు పీఏగా ఉన్న వ్యక్తి తలదూర్చడంతోనే సాధ్యమైందనే ఆరోపణలు లేకపోలేదు.ఇలాంటి చర్యలను ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం భూ కబ్జాలను అరికట్టేడంలో చేతులెత్తేస్తోందనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కేంద్రమైన కడప నగరంలో వార్డు సెక్రటరీ నుంచి కలెక్టర్ వరకు నిత్యం ఇక్కడే ఉంటారు. అలాంటి నగరంలోనే ప్రభుత్వ భూమిని పక్కాగా స్వాహా చేసేందుకు స్కెచ్ వేయడం గమనార్హం. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం మామూళ్ల మత్తు వీడి ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని నగర ప్రజలు కోరుతున్నారు. -
కడపలో భోగి సందడి.. వేకువజామునే ఆట, పాటలతో చిందులు (ఫోటోలు)
-
టీడీపీ కార్యాలయానికి రూ.50 కోట్ల భూమి ధారాదత్తం
సాక్షి, అమరావతి: కడపలో రూ.50 కోట్ల విలువైన రెండెకరాల ఆర్ అండ్ బీ శాఖ భూమిని కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి కేటాయించుకుంది. ఈ భూమి వివాదం కోర్టులో ఉన్నా లెక్క చేయకుండా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు మీద పార్టీ కార్యాలయం కోసం ఇస్తూ మంగళవారం ఉత్తర్వులిచి్చంది. కడప మండలం అక్కయ్యపల్లె గ్రామంలోని సర్వే నెంబర్ 37/4లోని ఈ భూమిపై టీడీపీ 2014లోనే కన్నేసింది. మున్సిపల్ కార్పొరేషన్‌కి తెలియకుండా, స్థానికంగా ఉన్న అభ్యంతరాలు ఖాతరు చేయకుండా 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమిని పార్టీ కార్యాలయానికి 33 సంవత్సరాల లీజుకి కేటాయించింది. అయితే, పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టలేదు. కొందరు టీడీపీ నాయకులు దాన్ని అన్యాక్రాంతం చేసే ఉద్దేశంతోనే నిర్మాణాలు చేపట్టలేదనే అనుమానాలున్నాయి. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆ భూమిపై స్థానికంగా అభ్యంతరాలు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్లు తేలడంతో కేటాయింపు రద్దు చేసింది. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం ఈ భూమికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో కోర్టులో ఉన్న భూమిని మళ్లీ టీడీపీ కార్యాలయానికి కేటాయించింది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే భర్త అయిన శ్రీనివాసరెడ్డి కోరిక మేరకు సీఎం చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా ఈ భూమిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించారు. అధికారంలో ఉన్నప్పుడు పలు ప్రాంతాల్లో విలువైన భూములను చేజిక్కించుకుని పార్టీ కార్యాలయాలు నిరి్మంచడం టీడీపీకి అలవాటేనని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం కూడా నిబంధనలకు విరుద్ధంగా కేటాయించుకుని నిరి్మంచిందే. విశాఖపట్నం కార్యాలయం కూడా అక్రమంగా కేటాయించుకుని కట్టుకున్నదే. ఇప్పుడు ఏకంగా కోర్టు పరిధిలో ఉన్న భూమిని మంత్రివర్గం ఆమోదంతో పార్టీ కార్యాలయం కోసం రెండోసారి కేటాయించుకోవడం వివాదాస్పదంగా మారింది. -
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్
-
కడప ముఖ్యనేతలు, కార్పొరేటర్లతో వైఎస్ జగన్ భేటీ
-
మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే... కడప కార్పొరేటర్లు, ముఖ్యనేతల సమావేశంలో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ
-
కడప కార్పొరేషన్ లో TDP ఎమ్మెల్యే మాధవి రెడ్డి దౌర్జన్యం
-
కుర్చీ కోసమే మాధవీరెడ్డి పంతం: మేయర్ సురేష్‌బాబు
సాక్షి,వైఎస్ఆర్జిల్లా:ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా,నియంతలా వ్యవహరిస్తున్నారని కడప మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం(డిసెంబర్23) కడప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే చేసిన గలాటాపై సురేష్‌బాబు సాక్షి టీవీతో మాట్లాడారు.‘తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే రెండు సార్లు సమావేశాన్ని అడ్డుకున్నారు.దౌర్జన్యానికి దిగి సమావేశ ఎజెండా పేపర్లను చించివేశారు. ఇలా చేస్తున్న ఆమెకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడుంది?మిగిలిన కార్పొరేషన్లలో మీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఎక్కడ కూర్చుంటున్నారు..?మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారని గౌరవిస్తే మా ఇంటిపైనే చెత్త వేయించింది.కార్పొరేటర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. వందలాది మంది కార్యకర్తలతో కార్పొరేషన్పైకి దండెత్తారు. ఇదెక్కడి సభ్యత?ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా..?ఎమ్మెల్యే,పిరాయింపు సభ్యులను సస్పెండ్ చేసినా బయటకు వెళ్ళలేదు.ఎజెండా పేపర్లను చింపి సభను అడ్డుకున్నారు.వాళ్ళని బయటకు పంపడంలో అధికారులు వైఫల్యం చెందారు.పార్టీలకు అతీతంగా మేము గౌరవం ఇచ్చినా ఆమె నిలబెట్టుకోలేదు.ప్రజాసమస్యలు చర్చించడానికి యుద్ధానికి వచ్చినట్లు వస్తారా?ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును ఎవరూ హర్షించడం లేదు.ఫిరాయింపు సభ్యులు మా పార్టీ సభ్యులపై దాడికి దిగారు.ఇది ప్రజాస్వామ్యంలో సరైన చర్య అని ఎవరైనా అంటారా? మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఆమె తన హక్కులు ఏంటో ముందు తెలుసుకోవాలి.ఆమె ప్రజాసమస్యల కంటే తన పంతం ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.15 అర్థికసంఘం పనులు ఆమోదించి పంపాలి..కానీ ఆమె సమావేశం జరగనివ్వడం లేదు.బాధ్యతాయుతమైన ఒక ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరిస్తే ఎలా’అని సురేష్‌బాబు ప్రశ్నించారు. ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ సమావేశపు ఎజెండాను కడప కార్పొరేషన్ ఏకపక్షంగా ఆమోదించింది. ఎజెండా మొత్తాన్ని ముక్తకంఠంతో ఆమోదిస్తున్నట్లు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చేతులెత్తారు. ఇదే సమయంలో పలు అభివృద్ధి పనులకు కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. సస్పెండ్ చేసినా అజెండా ఆమోదాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రయత్నించారు. అయితే, మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎజెండాలోని అంశాలకు ఆమోదం దక్కింది. ఇదీ చదవండి: కుర్చీ కోసం ఎమ్మెల్యే దౌర్జన్యం -
కుర్చీ కోసం కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి దౌర్జన్యం
సాక్షి,వైఎస్ఆర్జిల్లా: కడపలో ఎమ్మెల్యే మాధవీరెడ్డి మళ్లీ దౌర్జన్యానికి దిగారు. సోమవారం(డిసెంబర్23) జరుగుతున్న కడప మునిసిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో అనుచరులతో కలిసి వీరంగం సృష్టించారు. మేయర్‌తో పాటు తనకూ కుర్చీ వేయాలని మళ్లీ హంగామా చేశారు. దీంతో ఎమ్మెల్యే,మేయర్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది.టీడీపీ నేతలతో కలిసి ఎమ్మెల్యే మాధవీరెడ్డి సమావేశ మందిరంలో గొడవకు దిగారు. ఇందుకు ప్రతిగా మేయర్‌కు మద్దతుగా వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఆయన సీటు ముందే బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ, టీడీపీ కార్పొరేటర్లకు మధ్య తోపులాట జరిగింది. దీంతో సమావేశానికి ఆటంకం కలిగిస్తున్నారంటూ మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఏడుగురు కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేశారు. సమావేశానికి సభ్యులు మినహా ఎవరికీ అనుమతి లేదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎమ్మెల్యే ఖాతరు చేయలేదు. డబ్బులిచ్చి మరీ మహిళలను నగరపాలక సంస్థ సమావేశానికి తీసుకువచ్చి కవ్వింపు చర్యలకు దిగారు. కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు.గతంలోనూ నగరపాలక సంస్థ సమావేశంలో మాధవీరెడ్డి కుర్చీ కోసం హంగామా చేశారు.ప్రజా సమస్యలపై చర్చించండన్నా వినకుండా గొడవ చేశారు. దీంతో ప్రస్తుతం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద సమావేశానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.కార్యాలయం సమీప ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఎవరూ గుమికూడవద్దని,ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ఇదీ చదవండి: గుంటూరులో టీడీపీ నేత దాష్టీకం -
YS అవినాష్ రెడ్డి హౌస్ అరెస్ట్
-
సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ మూక దాడి
సాక్షి, వైఎస్సార్ జిల్లా : నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి బృందంపై శుక్రవారం టీడీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. వేముల తాశీల్డార్ కార్యాలయం వద్ద నీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై 50 మంది టీడీపీ మూకలు విచక్షణా రహితంగా రాళ్ళు, కర్రలతో దాడి చేశాయి. దాడిలో సాక్షి రిపోర్టర్లు శ్రీనివాస్, రాజారెడ్డి, కెమెరామెన్ రాములకు గాయాలయ్యాయి. కెమెరా ధ్వంసమైంది. జర్నలిస్టులపై దాడి దుర్మార్గంపులివెందుల నియోజకవర్గం, వేముల మండల కేంద్రం లో నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులు, వీడియో జర్నలిస్తుల పై దాడి చేయడం దుర్మార్గమని, దాడికి పాల్పడిన వారిపై హత్యా యత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ డైమండ్ చేశారు.కవరేజీకి వెళ్లిన సాక్షి టివి కరస్పాండెంట్ శ్రీనివాసులు, కెమెరామెన్ రాము , సాక్షి పత్రిక రిపోర్టర్ రాజారెడ్డిలపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గం అన్నారు. అంతేకాక కెమెరాలను, సెల్ ఫోన్లను కూడా పగులగొట్టారన్నారు. అనంతరం జర్నలిస్టులను పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడిచేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని, అలాగే వారిని సురక్షితంగా ఇంటికి పంపాలని పోలీసులను కోరారు.కూటమి ఆగడాలపై ఫిర్యాదుఇప్పటికే జిల్లాలో నీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి కూటమి ఆగడాలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరగకుండా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. నీటి సంఘాల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి గురువారం సాయంత్రం ఆయన ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ, డీఎస్పీ వెంకటేశ్వరరావును కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నోడ్యూస్ సర్టిఫికెట్ వీఆర్ఓలు ఇవ్వకుండా అధికార పార్టీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారన్నారు.పెద్దముడియం, మైలవరం, జమ్మలమడుగు మండలాలకు సంబంధించి వీఆర్ఓలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారన్నారు. కొంతమంది వీఆర్ఓలను సస్పెండ్ చేయిస్తామంటూ బెదిరించారన్నారు. ప్రస్తుతం చాలామంది అభ్యర్థులు ఉన్నారని వారికి నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇప్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కోరారు. దీనిపై ఆర్డీఓ మాట్లాడుతూ శుక్రవారం అధికారులు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు.సాగునీటి సంఘాల ఎన్నికలపై హైకోర్టు కాలువలకు సాగు నీరు ఎప్పుడు కావాలి? ఎంత కావాలి అనేది రైతులకు పూర్తి అవగాహన ఉంటుంది. నీటి సంఘాల్లో వీరిని భాగస్వామ్యుల్ని చేసేలా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4న రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ఏకగ్రీవ ఎన్నిక జరగని సందర్భాల్లో చేతులెత్తి ఎన్నుకునే విధానాన్ని అనుసరిస్తే ఓటర్లు ఎవరికి ఓటు వేశారో అభ్యర్థులకు తెలిసిపోతుంది. అందువల్ల వారిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్ (ఎన్నికల నిర్వహణ) రూల్స్, 118 ప్రకారం చేతులెత్తే పద్ధతి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తుంది. అందువల్ల ఏకాభిప్రాయం కుదరని చోట రహస్య బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకుంటామనే రైతులను.. అందుకు అనుమతించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు దిగివచ్చిన కూటమి ప్రభుత్వం బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది.👉చదవండి : ప్రశాంతంగా నీటి సంఘాల ఎన్నికలు -
వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులకు చుక్కెదురు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: వర్రా రవీంద్రారెడ్డి కేసులో పోలీసులపై కడప కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 10 రోజులు కస్టడీ కోరితే రెండు రోజులు మాత్రమే కోర్టు సమయం ఇచ్చింది. దీంతో రెండు రోజులు చాలవంటూ, తీర్పు మార్చాలంటూ పోలీసులు పిటిషన్ వేశారు. పోలీసులపై సీరియస్ అయిన జడ్జి.. తీర్పు మార్చేది లేదన్నారు. కావాలంటే హైకోర్టుకు వెళ్లండంటూ సీరియస్ అయ్యారు. కాగా.. రేపు, ఎల్లుండి మాత్రమే పోలీసులకు సమయం ఉంది. వర్రాను విశాఖ జైలు నుంచి తీసుకువచ్చి, తిరిగి దింపేందుకే రెండు రోజులు పట్టే అవకాశం ఉంది.సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారంటూ అభియోగాలు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపుల పర్వం కొనసాగిస్తోంది. కూటమి ప్రభుత్వం. వైఎస్సార్సీపీ మద్దతుదారు వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేసి.. ఆయన కుటుంబాన్ని సైతం నడిరోడ్డుకు లాగింది. అదుపులోకి తీసుకోవడం దగ్గరి నుంచి జడ్జి ముందు హాజరపర్చడం దాకా అంతా గోప్యత, హైడ్రామాను నడిపించారు పోలీసులు. గత నెలలో అర్ధరాత్రి దాటాక వర్రా రవీంద్రారెడ్డిని కడప 2వ ఏడీజేఏం ఎదుట హాజరుపరిచిన సంగతి తెలిసిందే. విచారణ సందర్భంగా తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని వర్రా పేర్కొన్నారు. -
కడపలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధిపై రౌండ్ టేబుల్ సమావేశం
-
కడపలో సందడి చేసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి (ఫోటోలు)
-
కడప : పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ (ఫొటోలు)
-
కడపలో ఘనంగా పోలీస్ స్పోర్ట్స్ గేమ్స్ మీట్ ప్రారంభం (ఫొటోలు)
-
కడప : ఘనంగా అయ్యప్ప స్వామి గ్రామోఉత్సవం (ఫొటోలు)
-
కడప నగరం లో ఘనంగా అయ్యప్ప స్వామి పడి పూజా (ఫొటోలు)
-
కడప దర్గాను సందర్శించిన రామ్‌చరణ్
ప్రముఖ హీరో రామ్‌చరణ్ కడప అమీన్‌పీర్ దర్గాను సందర్శించాడు. ఉరుసు ఉత్సవాల్లో భాగంగా ఆయన సోమవారం నాడు పెద్ద దర్గాను దర్శించి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నాడు. అలాగే ముషాయిరా (కవి సమ్మేళనం) కార్యక్రమంలోనూ ముఖ్య అతిథిగా పాల్గొననున్నాడు.ఇకపోతే కడప పెద్ద దర్గా ఉత్సవాలకు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ క్రమం తప్పకుండా వెళ్తుంటారు. ఈ ఏడాది జరిగే 80వ ముషాయిరా గజల్ ఈవెంట్లో ఏఆర్ రెహమాన్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారట! దీనికి చరణ్‌ను ఆహ్వానించగా తప్పకుండా హాజరవుతానని మాట ఇచ్చినట్లు సమాచారం. ఈ మాట నిలబెట్టుకోవడానికే చరణ్ నేడు కడపకు వెళ్లినట్లు తెలుస్తోంది.చరణ్ సినిమాల విషయానికి వస్తే ఈయన చివరగా ఆచార్యలో కీలక పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కియారా అద్వాణీ కథానాయికగా నటిస్తోంది.చదవండి: బంగారపు టూత్‌బ్రష్‌తో గేమ్ ఛేంజర్ హీరోయిన్ -
కడప అమీన్ పీర్ దర్గా..వైభవంగా ఉరుసు ఉత్సవాలు (ఫొటోలు)
-
ఘనంగా ఉరుసు ఉత్సవాలు.. కడప పెద్ద దర్గాలో ఏఆర్ రెహమాన్ (ఫొటోలు)
-
పబ్లిక్ లో ఎమ్మెల్యే ఏం చేసిందో చూడండి
-
ఎమ్మెల్యే మాధవీరెడ్డి వీరంగం
వైఎస్సార్ జిల్లా, సాక్షి: కడప కార్పొరేషన్ వద్ద ఎమ్మెల్యే మాధవీరెడ్డి వీరంగం సృష్టించారు. కౌన్సిల్ సమావేశంలోకి ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఎమ్మెల్యేకి మాత్రమే అనుమతి ఉంది. కానీ నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్యే మాధవి తన అనుచరులతో కౌన్సిల్ సమావేశంలోకి వెళ్లారు. ఎజెండాను విడిచి రాజకీయ ప్రసంగం చేశారు. దీనిపై మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ కాదని ఎజెండా ప్రకారం సమావేశం జరగాలని పాలకవర్గం డిమాండ్ చేశారు. -
అపురూపమైన పుస్తక నిధి.. బ్రౌన్ గ్రంథాలయం
సాక్షి ప్రతినిధి కడప: ఆంగ్లేయుడైనప్పటికీ తెలుగు భాషపై ఉన్న అభిమానంతో తన ఇంటినే గ్రంథాలయంగా మార్చిన మహనీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. తెలుగు భాషాభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారు. అటువంటి మహనీయుడి పేరుమీద స్థాపించిన గ్రంథాలయం సాహితీవేత్తల కృషితో అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. దాతల సహకారంతో విలువైన పుస్తకాలు వచ్చి చేరాయి. ప్రస్తుతం రికార్డుల ప్రకారం దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. సాధారణ కథల పుస్తకాలు, కవితా సంకలనాల నుంచి మహా పండితులు రాసిన కావ్యాలు, గ్రంథాలు, అత్యంత విలువైన పరిశోధక గ్రంథాలు ఈ గ్రంథాలయంలో ఉన్నాయి. ఆంగ్ల సాహిత్యానికి సంబంధించిన ప్రముఖ గ్రంథాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కడప నడి»ొడ్డున ఉన్న ఈ గ్రంథాలయం తెలుగు సాహితీ అభిమానులకు సందర్శనీయ స్థలంగా మారింది. కడప నగరంలో నిర్వహించిన జిల్లా రచయితల సంఘం ఉత్సవాలకు అతిథులుగా ప్రముఖ సాహితీవేత్తలు ఆరుద్ర, జీఎన్‌రెడ్డి, బంగోరె తదితరులు విచ్చేశారు. ఈ సందర్భంగా కడపలో బ్రౌన్ నివసించిన శిథిల భవనాన్ని చూడాలని స్థానిక సాహితీవేత్త జానమద్ది హనుమచ్ఛాస్త్రిని కోరారు. దాన్ని చూసిన సాహితీవేత్తలు.. దీన్ని ఇలాగే వదిలేయొద్దని, నిరంతర సాహితీయజ్ఞం సాగిన ఈ పవిత్ర స్థలం భవిష్యత్తులో కూడా విరాజిల్లాలని బ్రౌన్ మహాశయుని పేరిట గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని హనుమచ్చాస్తికి సూచించారు. అందరూ నాటి కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డిని కలిసి విషయం వివరించారు. ఆయన సహకారంతో బ్రౌన్ గ్రంథాలయాన్ని నిరి్మంచాలని నిర్ణయించారు. కలెక్టర్ సహకారంతో స్థానిక సాహితీవేత్తలు, పెద్దలు బ్రౌన్ నివసించిన శిథిల భవనం స్థలాన్ని నాటి సీనియర్ ఆడిటర్ సీకే సంపత్‌కుమార్ నుంచి కానుకగా తీసుకున్నారు. జానమద్ది హనుమచ్ఛా్రస్తితోపాటు స్థానిక సాహితీవేత్తల సహకారంతో కమిటీ ఏర్పడింది. బ్రౌన్ పేరిట గ్రంథాలయ భవన నిర్మాణం ప్రారంభమైంది. పుస్తక సాగరం పలువురు పుస్తక దాతలు, సాహితీవేత్తలు తమ వద్దనున్న విలువైన పుస్తకాలను గ్రంథాలయానికి అందజేశారు. వల్లూరుకు చెందిన పోలేపల్లె గంగన్న శ్రేష్టి అలియాస్ రాజాశెట్టి అనే దాత ఇచ్చిన కొన్ని పుస్తకాలతో బ్రౌన్ గ్రంథాలయం ప్రారంభమైంది. ప్రస్తుతం రికార్డుల ప్రకారం ఇక్కడ దాదాపు లక్ష వరకు పుస్తకాలున్నాయి. రికార్డులకు ఎక్కాల్సిన పుస్తకాలు మరో 10వేల దాకా ఉన్నాయి. రెండో అంతస్తులో తాళపత్ర గ్రంథాల విభాగం ఉంది. పూర్వం కాగితాలు అందుబాటులో లేనికాలంలో మన పెద్దలు సమాచారాన్ని తాటాకులపై రాసి భద్రపరచేవారు. వీటినే తాళపత్ర గ్రంథాలు అంటారు. అలాంటి ఎన్నో గ్రంథాలు, ముఖ్యంగా 200 సంవత్సరాలకు పూర్వం నాటి తాళపత్ర గ్రంథాలెన్నో ఇక్కడ ఉన్నాయి. పట్టుకుంటే పొడి, పొడిగా రాలిపోయే స్థితిలో ఉన్న పురాతన కాలం నాటి హ్యాండ్‌మేడ్ పేపర్, ఇతర రకాల కాగితాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నిపుణులైన ఉద్యోగులు వీటిని మరో వందేళ్ల పాటు భద్రంగా ఉంచేందుకు కెమికల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. డిజిటలైజేషన్ కూడా చేసి భావితరాల కోసం వాటిని జాగ్రత్తపరుస్తున్నారు. ఈ గ్రంథాలయంలో రాగి రేకులు కూడా ఉన్నాయి.తాళపత్ర గ్రంథాల కంటే ఎక్కువ రోజులు నిలిచి ఉండేందుకు అప్పట్లో రాగి రేకులపై రాయించేవారు. ఈ గ్రంథాలయాన్ని సందర్శించేవారు తప్పక ఈ తాళపత్ర గ్రంథాల విభాగాన్ని సందర్శిస్తారు. ఇప్పటికే పలువురు రాజకీయ ప్రముఖులు, అధికారులు, సాహితీవేత్తలు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చే సాహితీవేత్తలు, అధికారులు కూడా ఈ గ్రంథాలయాన్ని సందర్శిస్తుంటారు. తెలుగునాట ఈ గ్రంథాలయం వైఎస్సార్ జిల్లా కీర్తిని నలుదిశలా చాటుతోంది. యేటా దాదాపు 100కు పైగా సాహితీ కార్యక్రమాల నిర్వహణతో బంగోరె, ఆరుద్రల ఆశయం నెరవేరినట్లయింది. ఈ లైబ్రరీలో ఎవరైనా సభ్యత్వం తీసుకోవచ్చు. రూ.500 నగదుతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ఆధారం కోసం ఏదైనా సర్టిఫికెట్ తీసుకుని వచ్చి సభ్యత్వం పొందవచ్చు. వివరాలకు గ్రంథాలయంలో నేరుగా సంప్రదించవచ్చు. అలాగే ఈ గ్రంథాలయాన్ని ఆదివారంతో పాటు, ఇతర సెలవు దినాల్లోనూ సందర్శించవచ్చు. ప్రస్తుతం ఈ గ్రంథాలయానికి యోగి వేమన విశ్వవిద్యాలయం నుంచి ఓ సంచాలకులు ప్రధాన బా«ధ్యులుగా ఉన్నారు. ఇద్దరు సహాయ పరిశోధకులు, మరో ఇద్దరు గ్రంథాలయ సహాయకులు, అటెండర్లు, వాచ్మెన్లు మరో ఐదుగురు సేవలందిస్తున్నారు. విస్తరణ దిశగా... బ్రౌన్ గ్రంథాలయాన్ని విస్తరించాలని పాలకమండలి, అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 20 సెంట్లలో ఉన్న గ్రంథాలయంతో పాటు వెనుక ఉన్న స్థలంలో 25 సెంట్లు కొనుగోలు చేశారు. స్థల దాతలు సీకే సంపత్‌కుమార్ మనవరాలు మరోమారు తమ వంతు విరాళంగా మరో ఐదు సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రంథాలయాన్ని సందర్శించి విస్తరణ కోసం రూ. 6.50 కోట్ల వరకు నిధులు మంజూరు చేశారు. కొత్త భవనం పూర్తయితే తెలుగు వారికి మరింత అపురూపమైన గ్రంథనిధి అందినట్లవుతుంది. నాటి నుంచి నేటి దాకా... 1987 జనవరి, 22న బ్రౌన్ పేరిట గ్రంథాలయానికి పునాది పడింది. ఆ భవన నిర్మాణాన్ని యజ్ఞంలా భావించారు జానమద్ది. నిధుల సేకరణకు ఒక దశలో ఆయన జోలె పట్టారు. 1996లో మొదటి అంతస్తు పూర్తి కాగా, ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ సి.నారాయణరెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చిన నిధుల నుంచి రూ. 5లక్షలతో 2003 అక్టోబర్, 9న రెండో అంతస్తు పూర్తయింది. 1995 నవంబరు, 29న నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు.. సాహితీవేత్త, సమాజ సేవకులు వావిలాల గోపాలకృష్ణయ్య గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు. కాలక్రమంలో గ్రంథాలయ నిర్వహణ ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు కూడా కష్టతరమైంది. నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2005 జనవరి, 27న బ్రౌన్ గ్రంథాలయాన్ని సందర్శించి అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని వాగ్దానం చేయడమే కాక, శాశ్వత నిర్వహణ కోసం యోగివేమన విశ్వ విద్యాలయానికి అప్పగించారు. -
పెట్టుబడి ఖర్చులూ రాకపాయె..ఇలాగైతే బతికేదెట్టా సారూ..?
సాక్షి ప్రతినిధి, కడప: సార్...! మీరేమని దిగిపోయారో...! రైతుల పరిస్థితి దిక్కుతోచకుండా ఉంది. ఈసారి ఉల్లి దిగుబడి బ్రహ్మాండంగా ఉంది. కానీ వచ్చే డబ్బులు పంట కోత ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. వీరపునాయునిపల్లె మండలం ఈర్లపల్లెకు చెందిన రైతు బైరెడ్డి ఉత్తమారెడ్డి ఇటీవల తాడేపల్లెగూడెం మార్కెట్లో 22 టన్నులు విక్రయించగా రూ.42 వేలు వచ్చాయి. అందులో రూ.36 వేలు రవాణా ఖర్చే అయింది. దారి ఖర్చులకు మిగిలిన మొత్తం అయిపోయింది. చేసేది లేక ఉత్తమారెడ్డి కన్నీళ్లతో ఇల్లు చేరుకున్నాడు. మా అందరి పరిస్థితి ఇలాగే ఉంది.సరిగ్గా ఏడాది క్రితం అదే 22 టన్నులు విక్రయిస్తే ఉల్లి రైతుకు రూ.4.5 లక్షలు లభించేవి. ఇప్పుడు ఇటు మాకు, అటు వినియోగదారులకు కూడా ఉల్లి కన్నీళ్లు తెప్పిస్తున్నా జోక్యం చేసుకుని ఆదుకోవాలన్న స్పృహ కూటమి సర్కారులో కానరావడం లేదు... అంటూ బుధవారం పులివెందులలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఎదుట వీరపునాయునిపల్లె మండలానికి చెందిన ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.వారి దుస్థితి చూసి చలించిపోయిన వైఎస్ జగన్, ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదని, రైతులను ఆదుకోవాలన్న స్పృహ అంతకంటే లేదని మండిపడ్డారు. మన ప్రభుత్వ హయాంలో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి ఆదుకున్నామని, అవస్థలు ఎదుర్కొన్న టమోటా రైతులకు కూడా భరోసా కల్పించామని గుర్తు చేశారు. ధైర్యంగా ఉండాలని, మళ్లీ మంచి రోజులు రానున్నాయని రైతులను ఊరడించారు.పట్టించుకునేవారు లేరుఉల్లి రైతుల గోడు పట్టించుకునేవారే లేరు. ఒకపక్క ధరలు లేవు. మరోపక్క నిల్వ చేసుకునే అవకాశం లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని జిల్లా పరిషత్ మీటింగ్‌లో అభ్యర్థించినా ఎలాంటి స్పందన లేదు. రైతులకు లారీ బాడుగ ఖర్చు కూడా రావడం లేదు. – కె రఘునాథరెడ్డి, జెడ్పీటీసీరైతులు కుంగిపోతున్నారునాలుగు నెలల పాటు శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. దళారీ వ్యవస్థ మార్కెట్‌ను శాసిస్తోంది. క్వింటా రూ.వెయ్యికి మాత్రమే కొనుగోలు చేస్తామంటున్నారు. దళారీల చర్యలతో రైతులు కుంగిపోతున్నారు. ప్రభుత్వమే ఉల్లిగడ్డలు సేకరించి వినియోగదారుడికి సరఫరా చేయాలి. రైతులను తక్షణమే ఆదుకోవాలి. – ప్రతాప్‌రెడ్డి, మిట్లపల్లెపెట్టుబడి రాయితీ ప్రకటించాలి ఇటీవల వర్షాల వల్ల ఉల్లిగడ్డలకు కుళ్లు సోకుతుందని రైతులంతా పంట నూర్పిడి చేశారు. మార్కెట్లో ధరలు దారుణంగా తగ్గిపోయాయి. నెల క్రితం వరకూ బాగానే ఉన్నా ప్రస్తుతం అమాంతం పడిపోయాయి. పెట్టుబడులు అటుంచితే నూర్పిడి ఖర్చులు కూడా రాలేదు. రైతుల శ్రమ వృధాగా మారింది. ప్రభుత్వం పెట్టుబడి రాయితీ ప్రకటించి ఆదుకోవాలి. – వీరయ్య, ఓబుళరెడ్డిపల్లె -
పులివెందుల ప్రజాదర్బార్‌లో వైఎస్ జగన్‌తో ప్రజలు, అభిమానులు (ఫొటోలు)
-
కడప అన్నా క్యాంటీన్ లో భారీ పేలుడు
-
అన్నా క్యాంటీన్లో భారీ పేలుడు..
సాక్షి, వైఎస్సార్: అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు ఘటన సంభవించింది. పేలుడు థాటికి వంటశాల షెడ్ పూర్తిగా ధ్వంసమైంది. భారీ పేలుడుతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. అయితే, పేలుడు ఘటన బయటకు రాకుండా పచ్చ మీడియా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోంది.వివరాల ప్రకారం.. కడపలో అన్నా క్యాంటీన్ తయారీ వంటశాలలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. మార్కెట్ యార్డు సమీపంలోని అన్నా క్యాంటీన్ వంటశాలలో బుధవారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో పేలుడు సంభవించింది. వంట గదిలో గ్యాస్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పేలుడు థాటికి వంటశాల షెడ్ ధ్వంసమైంది. 200 అడుగుల మేరా ఎగిరిపడ్డ బాయిలర్, వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.పేలుడు రాత్రి సమయంలో సంభవించడంతో ప్రాణ నష్టం తప్పింది. వంటలు వండకపోవడం.. సిబ్బంది బాయిలర్ వద్ద లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, భారీ పేలుడుతో కార్మికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. పేలుడు ఘటనను ఎవరి కంట పడకుండా పచ్చ నేతలు కప్పి ఫుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. -
ఎందుకు చంద్రబాబు అంత భయం.. నేను వస్తే కానీ సాయం అందలేదు..
-
బద్వేల్: బాలిక కుటుంబానికి వైఎస్ జగన్ ఓదార్పు (ఫొటోలు)
-
రేపు గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ నెల 23న (బుధవారం) గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అఘాయిత్యానికి, హత్యాచారానికి గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించనున్నారు. టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్ దుర్మార్గం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిన తెనాలికి చెందిన యువతిని బుధవారం ఉదయం వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఆ యువతిని, ఆమె కుటుంబాన్ని కలుసుకోనున్నారు. ఆ తర్వాత బద్వేలులో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని అదే రోజు మధ్యాహ్నం పరామర్శించనున్నారు. అనంతరం నేరుగా పులివెందులకు వెళ్లనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది. -
ఈనెల 23న గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వైఎస్ జగన్ పర్యటన
సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్టోబర్ 23న (బుధవారం) గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. అఘాయిత్యాలకు గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించనున్నారు.టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్ దుర్మార్గం కారణంగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన తెనాలికి చెందిన యువతిని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న యువతిని, ఆమె కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించనున్నారు.ఆ తర్వాత బద్వేలులో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని అదే రోజు మధ్యాహ్నం పరామర్శించనున్నారు వైఎస్ జగన్. అనంతరం వైఎస్ జగన్ నేరుగా పులివెందులకు వెళ్లనున్నారు. -
ఇదేమి రాజ్యం బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పంటించి ప్రాణాలు తీసిన ఘటనపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ కరువైందని, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా జగన్ కూటమి ప్రభుత్వాన్ని ఆదివారం కడిగిపారేశారు.ఈ దుర్యోధన దుశ్శాసన.. దుర్వినీతి లోకంలోరాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌ను కాపాడలేకపోతున్నారు. మహిళలు, బాలికలకు రక్షణ కూడా ఇవ్వలేకపోతున్నారు. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? రోజూ ఏదోచోట హత్యాచారాలు, హత్యలు, వేధింపులు సర్వసాధారణమైపోయాయి. బద్వేలులో కాలేజీ విద్యార్థినిపై పెట్రోలు పోసి నిప్పు అంటించి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత హేయం, దుర్మార్గం. బాధిత కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నా. ఈ ఘటన వెనుక రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థల వైఫల్యం కూడా ఉంది. ఒక పాలకుడు ఉన్నాడంటే ప్రజలు ధైర్యంగా ఉండాల్సిందిపోయి నిరంతరం భయపడే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్లారు. వైఎస్సార్సీపీ మీద కక్షకొద్దీ మా పథకాలను, కార్యక్రమాలను ఎత్తివేస్తూ రాష్ట్రం, ప్రజలమీద చంద్రబాబు కక్ష సాధిస్తున్నారు.ఇది అన్యాయం కాదా? వైఎస్సార్సీపీ హయాంలో మహిళలు, బాలికల భద్రతకు పూర్తి భరోసానిస్తూ తీసుకొచ్చిన విప్లవాత్మక ‘దిశ’ కార్యక్రమాన్ని ఉద్దేశపూర్వకంగా నీరుగార్చడం దీనికి నిదర్శనం కాదా? తద్వారా మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేసిన మాట వాస్తవం కాదా? ‘దిశ’ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కినా, చేతిలో ఉన్న ఫోన్‌ను ఐదుసార్లు అటూ ఇటూ ఊపినా వెంటనే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు, అక్కడ నుంచి దగ్గర్లో ఉన్న పోలీసులకు సమాచారం వెళ్తుంది. వెంటనే పోలీసులు వారికి ఫోన్ చేస్తారు.ఫోన్ ఎత్తకపోయినా లేదా ఆపదలో ఉన్నట్లు ఫోన్లో చెప్పినా ఘటనాస్థలానికి నిమిషాల్లో చేరుకుని రక్షణ కల్పించే పటిష్ట వ్యవస్థను మీరు (చంద్రబాబు) ఉద్దేశపూర్వకంగా నీరుగార్చలేదా? ‘దిశ’ ప్రారంభం నుంచి 31,607 మంది మహిళలు, బాలికలు రక్షణ పొందితే దాన్ని ఎందుకు దెబ్బతీశారు చంద్రబాబూ? 1.56 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని భరోసా పొందుతున్న ‘దిశ’పై రాజకీయ కక్ష ఎందుకు? దిశ కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం. ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. 900 బైక్‌లు, 163 బొలేరో వాహనాలను ‘దిశ’ కార్యక్రమం కోసమే పోలీసులకు అందించి పెట్రోలింగ్‌ను పటిష్ట పరిచాం. 18 ‘దిశ’ పోలీస్స్టేషన్లను నెలకొల్పి 18 క్రైమ్ మేనేజ్మెంట్ వాహనాలను సమకూర్చాం. వీటిని పోలీస్ కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశాం. మా హయాంలో శాంతి భద్రతలపై నేను నిర్వహించిన సమీక్షల్లో ‘దిశ’ కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. దీంతో పోలీసులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండేవారు. వీటన్నింటినీ నిర్వీర్యంచేసి ఏం సాధించాలనుకుంటున్నారు చంద్రబాబూ? ఇవాళ మీరు చేస్తున్నదల్లా మహిళల రక్షణ, సాధికారత కోసం అమలవుతున్న కార్యక్రమాలను, స్కీమ్‌లను ఎత్తివేయడం! ఇసుక, లిక్కర్ లాంటి స్కామ్‌లకు పాల్పడుతూ పేకాట క్లబ్బులు నిర్వహించడం! పోలీసు వ్యవస్థ కూడా అధికారపార్టీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్షంపై తప్పుడు కేసులు బనాయిస్తూ వేధింపులకు దిగడమే పనిగా పెట్టుకుంది. మహిళలు, బాలికలు, చిన్నారుల రక్షణ బాధ్యతలను విస్మరించింది. ఇదేమి రాజ్యం చంద్రబాబూ? -
'దేవర' చూస్తూ ఎన్టీఆర్ అభిమాని మృతి
ఎన్టీఆర్ 'దేవర' సినిమా చేస్తూ అభిమాని మృతి చెందాడు. కడపలో ఈ సంఘటన చోటుచేసుకుంది. మృతుడు సీకే దీన్నె మండలం జమాల్‌పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు. 'దేవర' రిలీజ్ సందర్భంగా కడపలోని అప్సర థియేటర్లో అభిమానుల కోసం స్పెషల్ షో వేశారు. దీనికి వచ్చిన మస్తాన్.. మూవీ చూస్తూ కేకలు వేస్తూ ఎంజాయ్ చేశాడు. ఊహించని విధంగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువకరించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల మధ్య విషాదఛాయలు అలుముకున్నాయి.(ఇదీ చదవండి: ‘దేవర’ మూవీ రివ్యూ)ఇక కడపలోనే పాత బస్టాండ్ దగ్గరున్న రాజా థియేటర్లో అర్ధరాత్రి ఫ్యాన్స్-యాజమాన్యం మధ్య గొడవ జరిగింది. చాలామంది టిక్కెట్లు లేకుండా థియేటర్ లోపలికి ప్రవేశించడంతో పూర్తిగా హాలు పూర్తిగా నిండిపోయింది. ఈ క్రమంలో కొందరు ఫ్యాన్స్, సిబ్బందిని చితకబాదారు. అలానే తెర ముందు కూడా పలవురు యువకులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.పోలీసులు రంగ ప్రవేశం చేసి టికెట్ లేని వారిని బయటికి పంపించడంతో గొడవ సద్దుమణిగింది. ఈ క్రమంలోనే చాలామంది యువకులకు గాయాలయ్యాయి. వీళ్ల వల్ల సినిమా చూడటానికి వచ్చిన మిగిలిన ప్రేక్షకులు బెదిరిపోయారు. యువకుల తీరుతో షో ఆలస్యంగా నడవడమే కాకుండా అర్ధాంతరంగా మధ్యలోనే షోను కాసేపు నిలిపేశారు.(ఇదీ చదవండి: 'దేవర' రెమ్యునరేషన్స్.. ఎవరికి ఎంత ఇచ్చారు?) #NTR fans crushed the theater staffAfter an argument between NTR fans and #RajaTheater staff in #Kadapa during #Devara Movie Screening, some fans crushed the staff.An argument broke out as fans rushed into the theater without tickets, and the organizers stopped the show.… pic.twitter.com/XhqlGC36Qb— BNN Channel (@Bavazir_network) September 27, 2024 -
వినాయకుని పూజలో వైఎస్ అవినాష్ రెడ్డి
-
#YSJagan : అధైర్య పడొద్దు.. భవిష్యత్ మనదే: వైఎస్ జగన్ (ఫొటోలు)
-
కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం.. మళ్లీ మంచిరోజులు వస్తాయి: వైఎస్ జగన్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోవు కాలం మనదే.. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది.. మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది.. భవిష్యత్ మనదేనని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్ జగన్.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.వైఎస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు.. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం. మనం చేసిన మంచి ప్రతీ కుటుంబంలో ఉంది. అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉందని వైఎస్ జగన్ అన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్ జగన్ సూచించారు. -
రేపు పులివెందులకు వైఎస్ జగన్
సాక్షి,గుంటూరు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. రేపటి నుంచి మూడురోజుల పాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్నారు.శనివారం (ఆగస్ట్31)ఉదయం 11 గంటలకి కడప ఎయిర్ పోర్ట్‌కి చేరుకుని అక్కడ పార్టీ కార్యకర్తలు, నాయకులను కలవనున్నారు. పెండ్లిమర్రి మండలం మాచనూరులో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన పార్టీ మండల అధ్యక్షుడిని మాచనూరి చంద్రా రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.అక్కడి నుంచి అదే మండలంలోని గొందిపల్లి చేరుకుని ఇటీవల వివాహం చేసుకున్న కడప మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ చంద్రహాస్ రెడ్డి కుమార్తె అశారెడ్డి, శివారెడ్డి దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం పులివెందులలో తన నివాసానికి చేరుకుని కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ జగన్ అందుబాటులో ఉంటారు. -
క్యాన్సర్ ఆస్పత్రికి YSR పేరు తొలగింపు
-
టీడీపీ పందికొక్కులకు కడప మేయర్ సురేష్ బాబు వార్నింగ్
-
కడపలో విషాదం.. స్కూలు పిల్లలకు కరెంట్ షాక్
సాక్షి,కడపజిల్లా: కడప నగరంలో బుధవారం(ఆగస్టు21) మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. తెగిపడి రోడ్డుపై పడ్డ కరెంటు తీగలు తగిలి ఒక విద్యార్థి మృతి చెందగా మరో విద్యార్థికి గాయాలయ్యాయి.తన్వీర్(11), ఆదాం(10)లు సైకిల్‌పై స్కూల్‌కు వెళ్తుండగా నగరంలోని అగాడీ వీధిలో ఈ ఘోరం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి చిన్నారులిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి విద్యుత్‌శాఖ అధికారుల నిర్లకక్ష్యమే కారణమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. -
కడప దెబ్బ.. ఢిల్లీ అబ్బా.. సీఎం రేవంత్ కు అదిరిపోయే కౌంటర్..
-
పులివెందులలో జననేత.. ఆప్యాయంగా పలకరిస్తూ.. ముందుకు సాగుతూ (ఫొటోలు)
-
కడప ఎయిర్ పోర్ట్ లో వైఎస్ జగన్ కు ఘన స్వాగతం
-
కడప టీడీపీలో ‘పెన్షన్ల’ రగడ.. ఎమ్మెల్యే Vs కార్పొరేటర్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప నగర పాలక సంస్థలో పెన్షన్ల పంపిణిపై టీడీపీ సభ్యుల మధ్య రగడ రచ్చరచ్చగా మారింది. కడప ఎమ్మెల్యే మాధవి, 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి మధ్య మాటల తూటాలు పేలాయి. తన ప్రమేయం లేకుండా పెన్షన్లు పంపిణి చేశారంటూ ఉమాదేవి మండిపడ్డారు. కనీసం సమాచారం ఇవ్వకుండా ఎలా పంపిణి చేశారంటూ కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డిని నిలదీశారు. గతంలో పల్స్ పొలియో కార్యక్రమం కూడా స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించే వారని ఉమాదేవి అన్నారు.సొంత పార్టీ కార్పొరేటర్‌నే కించపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యే మాధవీరెడ్డి.. పెన్షన్ల పంపిణికి ప్రత్యేకంగా ఎవరికి ప్రోటోకాల్ లేదని.. సొంతంగా డివిజన్‌ను ఎవరు రాయించుకొలేదంటూ వ్యాఖ్యానించారు. కిరిటాలు పెట్టి.. డప్పులు కొట్టి ఎవరు మిమ్మల్ని పిలవరని.. సమాచారం తెలిస్తే వచ్చి ఉండాల్సిందంటూ ఎమ్మెల్యే మాధవీ ఉచిత సలహా ఇచ్చారు. సొంత పార్టీ కార్పోరేటర్‌నే ఎమ్మెల్యే మాధవీ కించపరిచేలా మాట్లాడటంపై ఉమాదేవి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
YS జగన్ కు కడప ప్రజల బ్రహ్మరథం
-
ఒక్క ఛాన్స్ ప్లీజ్!
సాక్షి ప్రతినిధి, కడప: రాష్ట్ర మంత్రివర్గంలోకి వెళ్లేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎవరికి వారు విశేష ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సామాజిక సమీకరణలో భాగంగా అవకాశం కల్పించాలని కొందరు యత్నిస్తే, అపార అనుభవం ఉంది, ఒక్క అవకాశం ఇవ్వాలని మరికొందరు యత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రమాణస్వీకారంలో నిమగ్నమైన అధినేత చంద్రబాబు సోమవారం నుంచి మంత్రివర్గ కసరత్తు చేయనున్నారు. ఈ నేపధ్యంలో ఆయా నేతలు గాడ్ఫాదర్లను ఆశ్రయిస్తున్నారు. బీజేపీ కోటాలో ఛాన్సు కోసం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అత్యంత వేగంగా పావులు కదుపుతోన్నారు.👉 ఉమ్మడి జిల్లాలో ఏడు ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం కూటమి వశమయ్యాయి. ఇందులో ఐదు గురు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వారున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పోటీ ఉన్న నేపధ్యంలో తొలిసారి ఎన్నికై న వారిని మంత్రివర్గంలోకి అవకాశం లేకపోతే, జిల్లాలో ఇద్దరికే ఛాన్సు కన్పిస్తోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, వరదరాజులరెడ్డి సీనియర్లుగా మిగలనున్నారు. బీజేపీ కోటాలో మంత్రిగా అవకాశం దక్కించుకునేందుకు ఆదినారాయణరెడ్డి పెద్ద ఎత్తున పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే కేంద్ర పార్టీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారు. కాగా రాయలసీమ కో టా పరంగా చూస్తే ఇక్కడున్న ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల్లో ఆదినారాయణరెడ్డి మాత్రమే సీనియర్. ఆదోని, ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యేలు పార్థసారధి, సత్యకుమార్ ఇద్దరూ తొలిసారిగా ఎన్నికై న వారే కావడం ఆదికి అదనపు బలంగా నిలుస్తోన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు.బీసీ కోటాపై ఆశలు పెట్టుకున్న పుట్టామైదుకూరు నుంచి ఎన్నికై న పుట్టా సుధాకర్‌యాదవ్ బీసీ కోటాలో మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేస్తారనే ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం, గతంలో లభించిన ప్రాధాన్యత దృష్టి పెట్టుకొని అవకాశం కల్పిస్తారనే ఆశాభావంలో ఉన్నారు. మరో వైపు వియ్యంకుడు ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడుకు అవకాశం లేకపోతే, తప్పకుండా తనకు దక్కుతోందనే భావన కూడా ఆయన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.ఇరవై ఏళ్ల చరిత్ర తిరగరాశామంటున్న మాధవీరెడ్డికడప గడ్డపై 2004 నుంచి టీడీపీ ఓటమి పాలవుతోంది. 2024లో చరిత్ర తిరగరాశాం. అవకాశం కల్పిస్తే పార్టీ ఉన్నతికి విశేషంగా కృషి చేస్తామనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే ఆర్.మాధవీరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈమారు మహిళ కోటాకు పెద్దఎత్తున పోటీ ఉండడం విశేషం. రాయలసీమ జిల్లాల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి పాణ్యం, ఆళ్లగడ్డ, పుట్టపర్తి ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, భూమా అఖిలప్రియ, పల్లె సింధూరరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం కోసం ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి కేంద్ర కేబినేట్లో అవకాశం దక్కకపోవడంతో, ఆయన సతీమణీ ప్రశాంతిరెడ్డికి రాష్ట్రంలో ఛాన్సు ఉంటుందనే అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్త పరుస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత సైతం మహిళ కోటాలో అవకాశం కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. ఈనేపధ్యంలో తొలిసారి ఎన్నికై న మాధవీరెడ్డికి అవకాశాలు తక్కవగా ఉన్నట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జిల్లాలో బీజేపీకి కేటాయిస్తే, మహిళా కోటాలో తనకు ఛాన్సు దక్కనున్నట్లు మాధవీరెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.మైనార్టీ కోటా కోసం షాజహాన్ యత్నంఅన్నమయ్య జిల్లాలో ముస్లిం మైనార్టీ కోటా లో అవకాశం కల్పించాలని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్‌కు అవకాశం కల్పిస్తే షాజహాన్‌కు మిస్ అయ్యే అవకాశం లేకపోలేదు. అలా కూర్పు నిర్వహిస్తే పీలేరు ఎమ్మెల్యే ఎన్ కిశోర్‌కుమార్‌రెడ్డికి అవకాశం దక్కనున్న ట్లు విశ్లేషకులు భా విస్తున్నారు. ఇలా ఎవరికి వారు ఎత్తు లు పైఎత్తులు వేస్తూ మంత్రివర్గంలో అవకాశం కోసం ముమ్మ ర ప్రయత్నాలు ఆరంభించడం విశేషం.తెలంగాణ ముఖ్యనేత ద్వారా..తెలంగాణకు చెందిన ముఖ్యనేత ద్వారా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మంత్రివర్గంలో ఛాన్సు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎమ్మెల్యేగా 6సార్లు ఎన్నికై న చరిత్ర వరదకు ఉంది, పైగా ఇప్పటివరకూ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి మంత్రివర్గంలో ప్రాతినిథ్యం దక్కకపోవడం కూడా అదనపు బలంగా నిలుస్తోంది. సుదీర్ఘ అనుభవం ఉన్నా మంత్రి పదవి ఇప్పటికీ దక్కలేదు. అందివచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకునే దిశగా పావులు కదుపుతోన్నారు. అదే విషయాన్ని తెలంగాణ ముఖ్యనేత ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. నిబద్ధతతో పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తామనే ఒక్క అవకాశం కల్పించాలని కోరుతున్నట్లు సమాచారం. సీనియర్లుగా ఎమ్మెల్యేలు ఆది, వరద ఇరువురు వివిధ మార్గాలల్లో మంత్రివర్గంలోకి అవకాశం కల్పించాలని కోరుతు న్నా, తొలిసారి ఎన్నికై న ఎమ్మెల్యేలు కూడా విశేష ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఊహించని పరిణామం..!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజాతీర్పు ఊహించని పరిణామంగా నిలిచింది. ఆయా అభ్యర్థులు గెలుపుపై విశ్వాసం, ధీమా వ్యక్తం చేశారు. కానీ, ఈ స్థాయిలో ఓటమి చవిచూస్తామని లేదా ఆ స్థాయి మెజార్టీ సొంతం చేసుకుంటామని ఎవ్వరు కూడా అంచనాకు రాలేదు. ఎవ్వరికీ కూడా ప్రజానాడి అంతుచిక్కలేదు. తుదకు జిల్లాలోని రాజకీయ విశ్లేషకులు సైతం అనూహ్య పరిణామాన్ని అంచనా వేయలేకపోయారు. అంతెందుకు విజేతలు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. వెరసి ఓటర్ల తీర్పుపై సమీక్ష చేసుకుంటున్నారు.ఉమ్మడి కడప జిల్లా వైఎస్సార్సీపీకి కంచుకోట. 2014, 19 సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ విషయం స్పష్టమైంది. ఏనోట విన్నా మరోమారు జిల్లాలో వైఎస్సార్సీపీ సత్తా చాటుతుందని చెప్పుకొచ్చారు. ప్రధాన రాజకీయ పార్టీలు సైతం అదే అంచనాతో ఉండిపోయాయి. ఫలితాలు వచ్చే కొద్ది ఉమ్మడి జిల్లాలో వైఎస్సార్సీపీ 3 సెగ్మెంట్లకు మాత్రమే పరిమితమైంది. 7 స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మెజార్టీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంటుందనే ధీమా ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు సైతం లేదని పలువురి అభిప్రాయం. ప్రస్తుతం అనూహ్య పరిణామాలపై ప్రజాతీర్పు పట్ల ఎవరికి వారు చర్చించుకుంటున్నారు.ధీమాకు మించిన విజయం... ఎన్నికల హడావుడి ప్రారంభమైనప్పటి నుంచి ఈమారు ఆ మూడు స్థానాల్లో గెలుస్తామనే ధీమాను టీడీపీ వ్యక్త పర్చేది. ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురంలో విజయం సాధిస్తామని ఆశించేవారు. ఎన్నికల గడువు సమీపించే కొద్ది ఆ ధీమా సైతం సడలిపోయింది. మరోమారు ఓటమి చవిచూస్తామనే బెంగ కూడా ఆ పారీ్టలో లేకపోలేదు. పోలింగ్ ముగిశాక అభిమానులు ముందస్తు శుభాకాంక్షలు చెప్పినా, ఉండవయ్యా గెలుపొందాక చూద్దామనేవారు. విజయం సాధిస్తాం, మెజార్టీ 5వేలు పైనా అటు ఇటుగా ఉంటుందని చెప్పేవారు. అలాంటి పరిస్థితి ఉండగా ఫలితాల్లో ఊహించని మెజారీ్టని సొంతం చేసుకున్నారు. ప్రజా వ్యతిరేకత ఈ స్థాయిలో ఉందని వైఎస్సార్సీపీ అభ్యర్థులు అస్సలు పసిగట్టలేదు. భారీగా అనుకూలత ఉందని టీడీపీ అభ్యర్థులు కూడా అంచనాకు రాలేదు. అభ్యర్థుల అంచనాలను తలకిందులు చేస్తూ తీర్పు రావడం విశేష పరిణామం.రాయచోటిలో అనూహ్య తీర్పువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాయచోటి జిల్లా కేంద్రమైంది. విశేష అభివృద్ధి సాధించింది. తాగునీటికి శాశ్వత పరిష్కారం లభించింది. అన్ని రంగాల్లో రాయచోటి దూసుకుపోయింది. మరోవైపు ముస్లిం మైనార్టీ ఓటర్లు అధికంగా ఉన్న ప్రాంతం. తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తులతో పాటు గుర్తింపు పొందిన ఓ స్థాయి నేతలు పార్టీ ఫిరాయించారు. ఇలాంటి అనుకూలతలన్నీ ఉన్నప్పటికీ రాయచోటిలో టీడీపీ విజయాన్ని దక్కించుకుంది. ఇంకా చెప్పాలంటే రాయచోటిలో వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందని 10కి 7 ఇస్తే చాలంటూ పెద్ద ఎత్తున జిల్లాలో పందేలు నడిచాయి. అంటే రాయచోటి మీద జిల్లా వ్యాప్తంగా అంచనా ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పులివెందుల, బద్వేల్, రాయచోటిలో వైఎస్సార్సీపీ ఏకపక్షమే అన్నంత విశ్వాసం ఉండేది. అలాంటి చోట కూడా ఓటమి చవిచూడాల్సి వచ్చిందని పరిశీలకులు చెప్పుకొస్తున్నారు. ఊహించని పరిణామంపై వైఎస్సార్సీపీ క్షేత్రస్థాయిలో çసమీక్షిస్తుండగా, ఆ స్థాయి మెజార్టీ దక్కడానికి కారణాల అన్వేషణలో టీడీపీ విజయసారథులుండడం విశేషం. -
కడప ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యం
-
విజయం మనదే!
సాక్షి ప్రతినిధి, కడప: ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో ఓటర్లు పోటాపోటీగా పాల్గొన్నారు. ప్రజాతీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఫలితం కోసం జూన్ 4వరకు వేచి ఉండక తప్పదు. అయినప్పటికీ ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. మేమే గెలుస్తామంటూ ఎవరికి వారు ఆత్మవిశ్వాసం ప్రదర్శిస్తున్నారు. బూత్‌ల వారీగా ఓట్లు గణన చేస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పది సీట్లు పదిలమని వైఎస్సార్సీపీ విశ్వాసం వ్యక్తం చేస్తుండగా, పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు దక్కుతాయని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ఓటు బదిలీపై ఆశలు పెట్టుకున్న జనసేన, బీజేపీలకు అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా నిరాశే మిగలనుంది. కాగా, కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలో మరోమారు జమ కానున్నాయి.ఎన్నికల పొత్తులో భాగంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు ఏకమై తలపడ్డాయి. ఆ కారణంగానే ముందంజలోకి వచ్చామని టీడీపీ భావిస్తుండగా అదే పొత్తు ప్రతిబంధకంగా మారిందని వైఎస్సార్సీపీ అంచనా వేస్తోంది. పైగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఒంటరిని చేసి ముప్పేట దాడి చేయడం కూడా జిల్లా వాసులకు మింగుడు పడలేదని తెలుస్తోంది. దీంతో జిల్లాలో ఉన్న సంప్రదాయ ఓటర్లు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమకు అండగా నిలిచారని వైఎస్సార్సీపీ సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తోంది. ఈ క్రమంలో అన్ని స్థానాలు పదిలపర్చుకుంటామని మరోమారు 2019 ఫలితాలు పునరావృతం కాగలవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడప, రాజంపేట పార్లమెంటు స్థానాలతో పాటు 10 శాసనసభ స్థానాలు వైఎస్సార్సీపీ ఖాతాలోనే జమ కానున్నట్లు పలువురు వివరిస్తున్నారు.ఖాతా తెరుస్తాం.. పరువునిలుపుకుంటామంటున్న టీడీపీగత ఎన్నికల్లో జిల్లాలో ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కలేదు. అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఖాతా తెరుస్తాం, పరువు నిలుపుకునే స్థాయిలో సీట్లు సాధిస్తామని టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి అసెంబ్లీ స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చామని చెప్పుకొస్తున్నారు. మైదుకూరు టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ వరుసగా ఓడిపోయిన నేపథ్యంలో ఈమారు అనుకూలత ఉందని టీడీపీ భావిస్తోంది. పుట్టా సుధాకర్‌యాదవ్ ఎన్నికల సమయంలో మినహా స్థానికంగా లేకపోవడంతో పాటు రెడ్డి, ముస్లిం, క్రిష్టియన్ మైనార్టీ, ఎస్సీ ఓటర్లు వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని గెలుపు అసాధ్యమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కమలాపురంలో టీడీపీ అభ్యర్థిగా పుత్తా నరసింహారెడ్డి వరుసగా పరాజయం పాలయ్యారు. ఈమారు సానుభూతితో గట్టెక్కగలమని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. తీరా అభ్యర్థిత్వం పుత్తా నరసింహారెడ్డికి కాకుండా ఆయన తనయుడు కృష్ణచైతన్యరెడ్డికి కేటాయించారు. పైగా టీడీపీ విజయం కోసం పనిచేస్తారని భావించిన మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, కాశీభట్ల సాయినాథశర్మ ఇరువురు వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఈక్రమంలో మెజార్టీ తథ్యమని భావించిన కమలాపురం మండలంలో టీడీపీకి భారీగా గండిపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.సన్నగిల్లిన వరద ఆశలు...మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అభ్యర్థిత్వం ఖరారైనప్పటి నుంచి ప్రొద్దుటూరుపై టీడీపీ ఆశలు పెట్టుకుంది. ఈమారు విజయకేతనం ఎగురవేస్తామనే ధీమాను ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎన్నికలు సమీపించే కొద్ది వారి ఆశలకు తూట్లు పడ్డాయి. పోలింగ్‌లో మహిళలు గణనీయంగా పాల్గొనడంతో మరింతగా చచ్చుబడిపోయారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. గతంతో పోలిస్తే దాదాపు 2.6 శాతం ఓటింగ్ పెరిగింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు, కొత్త ఓటర్ల కారణంగా ఓటింగ్ పెరిగిందని దీంతో మరోమారు వైఎస్సార్సీపీ అభ్యర్థి రాచమల్లు ప్రసాదరెడ్డి విజయం సాధిస్తున్నట్లు ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాయచోటిలో ఇలాంటి ఆశలే పెట్టుకున్న టీడీపీకి ముస్లిం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లు ప్రతిబంధకంగా నిలిచినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి గట్టిపోటీకి మాత్రమే పరిమితం అయ్యారని, ఓటు బదిలీ ఆశించిన స్థాయిలో కాలేదని వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి విజయానికి ఢోకా లేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.కడపలో టీడీపీకి నిరాశే..కడప అసెంబ్లీపై తెలుగుదేశం పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలో అనేక వివాదాస్పద వ్యవహారాలు తెరపైకి వచ్చాయి. మత విద్వేషాలను పురిగొల్పారు. సామాజిక సమీకరణల్లో భాగంగా అనేక ఎత్తుగడలను అవలంబించారు. ముస్లిం మైనార్టీల ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మైనార్టీ నాయకున్ని తెరపైకి తెచ్చారు. ఎన్నికల ముందు ఏమేమి చేయాలో అన్ని రకాలుగా చేశారు. అయినప్పటికీ 65.27 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. మొత్తం ఓటర్లలో సుమారు 33శాతం పైగా ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. ముస్లిం మైనార్టీ, క్రిష్టియన్ మైనార్టీ, ఎస్సీ, బీసీ సామాజిక వర్గాలు ఏకపక్షంగా వైఎస్సార్సీపీకి అండగా నిలిచారని ఆ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రెడ్డి సామాజికవర్గంలో, వలస వచ్చిన వారిలో, కాపు సామాజికవర్గంలో టీడీపీకి కాస్త సానుకూలత లభించినట్లు పలువురు వివరిస్తున్నారు. ఎటుచూసినా టీడీపీకి గెలుపు అంత సులువు కాదనే విశ్లేషకులు వెల్లడిస్తున్నారు.పార్లమెంటు అభ్యర్థుల విజయం ఏకపక్షమే.. కడప, రాజంపేట వైఎస్సార్సీపీ పార్లమెంటు ఫలితాలు ఏకపక్షంగా ఉండనున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కడప ఎంపీ పరిధిలో 1989 నుంచి వైఎస్ కుటుంబం ఆధిపత్యమే కొనసాగుతోంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ఎంపీ అయ్యింది మొదలు ఇప్పటి వరకూ ఆ కుటుంబ సభ్యులే ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా 2014లో తొలిసారి పోటీ చేసిన వైఎస్ అవినాష్‌రెడ్డికి 55.95 శాతం ఓట్లు లభించాయి. అప్పట్లో 1,90,323 ఓట్లు మెజార్టీ లభించగా, రెండవసారి 2019లో 63.79 శాతం ఓట్ల శాతంతో 3,80,726 ఓట్ల మెజార్టీ దక్కింది. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా మరోమారు పోటీ చేసిన ఆయన హ్యాట్రిక్ విజయం సొంతం చేసుకోనున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిపాజిట్టు కోల్పోనున్నట్లు పరిశీలకుల అభిప్రాయం. రాజంపేట నుంచి ఇప్పటికే వైఎస్సార్సీపీ అభ్యర్థిగా రెండుసార్లు విజయం సాధించిన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సైతం ఈమారు హ్యాటిక్ర్ విజయం దక్కించుకోనున్నట్లు స్పష్టమవుతోంది. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మిథున్‌రెడ్డికి భారీ మెజార్టీ దక్కనున్నట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ప్రధాన పార్టీలైన వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీలు మాత్రం గెలుపు విషయంలో ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తుండటం విశేషం. -
సంక్షేమం వైపే కడప ఓటరు..
అవసరానికోపార్టీ.. అధికారం కోసం మరో పార్టీ ఇలా విలువల్లేని రాజకీయనేతలకు ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు? ప్రజలు కమిట్మెంట్తో పనిచేసిన నేతలకి కమిట్ అయ్యారా? కండువాలు మార్చిన కూటమితో కలిశారా? కడపజిల్లాలో ఎన్నికల ఫలితం ఎలా ఉండబోతోంది ?తొలి నుంచి వైఎస్ కుటుంబానికి అడ్డాగా ఉన్న ఉమ్మడి కడప జిల్లాలో ఈసారి మెజార్టీ సీట్లను కైవసం చేసుకోవాలని చంద్రబాబు కూటమి భావించింది. అందుకు తగ్గట్టే కుట్రలు, ఎత్తులు వేసింది. అప్పటికప్పుడు కండువాలు మార్చిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో పది స్దానాల్లో కూటమి అభ్యర్థులు బరిలో నిలవగా, అందులో ఒక స్దానంలో జనసేన, రెండు స్దానాల్లో బీజేపీ అభ్యర్దులు, మిగిలిన ఏడు చోట్ల టీడీపీ అభ్యర్దులు పోటీలో నిలిచారు. అయితే జనసేన, బీజేపీకి జిల్లాలో కనీస క్యాడర్ కూడా లేదు. టీడీపీ క్యాడర్‌ను నమ్ముకుని అభ్యర్థులకు కండువాలు మార్చి పోటీలో నిలబెట్టారు. బద్వేలులో మాజీ ఇరిగేషన్ అధికారి రోషన్న ముందుగా టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాటకీయ పరిణామాల వల్ల ఆయన బీజేపీ కండువా కప్పుకొని పోటీ చేశారు. ఆఖరి నిమిషంలో జరిగిన ఈ మార్పులు ఆయనకు శాపంగా మారాయి.ఇటు టీడీపీ అటు బీజేపీ శ్రేణులు ఎవరికి వారు రోషన్నకు సహకరించకపోవడం మైనస్‌గా మారింది. వైఎస్ఆర్సీపీ అభ్యర్ది డాక్టర్ సుధకు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు బీజేపీ అభ్యర్థి రోషన్న. దీంతో బద్వేలులో ఓటమి ఖాయమని కూటమి కూడా డిసైడైపోయింది. ఇక ఫ్యాక్షన్ నియోజకవర్గమైన జమ్మలమడుగులో ఆది నారాయణరెడ్డి ఫ్యామిలీలోని విభేదాలు కూడా కూటమికి చేటు తెచ్చాయన్న టాక్ బలంగా వినిపిస్తోంది. జమ్మలమడుగు టీడీపీ ఇంచార్జ్‌గా ఉన్న భూపేష్ రెడ్డికి అసెంబ్లీ టిక్కెట్ కేటాయించారు చంద్రబాబు. అయితే బీజేపీ తరపున ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తానని ఆదినారాయణరెడ్డి పట్టుబట్టడంతో బాబు కాదనలేకపోయారు. దీంతో కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అబ్బాయి భూపేష్‌కి ఎంపీ టిక్కెట్ ఇచ్చి బుజ్జగించారు. అయితే ఆదినారాయణ రెడ్డికి ఆశించినస్థాయిలో అబ్బాయి నుంచి కానీ టీడీపీ శ్రేణుల నుంచి సహకారం రాకపోవడంతో జమ్మలమడుగులో కూడా కూటమి ఆశలు గల్లంతేనన్న టాక్ వినిపిస్తోంది.ఉమ్మడి కడపజిల్లాలో మరో కీలక నియోజకవర్గం రైల్వే కోడూరు. జనసేన తొలుత ఇక్కడ యనమల భాస్కరరావు పేరుని ప్రకటించింది. అయితే అనూహ్యంగా తెరపైకి అరవ శ్రీధర్ పేరు వచ్చింది. టీడీపీ నుంచి జనసేనలోకి చేరిన అరవ శ్రీధర్‌కు మాత్రమే కాదు అసలు ఇక్కడ జనసేనకు సరైన క్యాడరే లేదు. దీంతో ఈ నియోజకవర్గంలోనూ మరోసారి వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమన్న వార్తలు వినిపిస్తున్నాయి.కేంద్రంలో బీజేపీ మద్దతు, వైఎస్ఆర్సీపీకి మించిన సంక్షేమపథకాలనిస్తామని చేసిన హామీలతో ఈసారి గెలుపు ఖాయమని అటు చంద్రబాబు ఇటు పవన్ కల్యాణ్ ఎగిరెగిరి పడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అంతకుమించి సీఎం వైఎస్ జగన్‌పై తప్పుడు ప్రచారాలతో ఎన్నికల్లో హంగామా చేశారు. ఈ స్టంట్లు చూసి వినోదం అందుకున్న ప్రజలు మాత్రం విజ్ఞానంతో ఆలోచించి మరోసారి సీఎం జగన్‌కే మద్దతుగా నిలిచారని పోలింగ్ సరళిని చూసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారీ ఓటింగ్‌తో సంక్షేమపాలన కొనసాగాలని ప్రజలు కోరుకున్నారని వారు చెబుతున్నారు. -
రాహుల్ గాంధీ కడప పర్యటన దేవులపల్లి స్ట్రాంగ్ రియాక్షన్
-
కడపలో సీఎం జగన్ ఎన్నికల రోడ్ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
-
ఆరోజు నాన్నను అవమానించి..సీఎం జగన్ ఎమోషనల్ స్పీచ్
-
అవినాష్ రెడ్డి జీవితం నాశనం చెయ్యాలని..సీఎం జగన్ పచ్చ బ్యాచ్ కు మాస్ వార్నింగ్
-
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
చంద్రబాబుకు దమ్ముంటే మోడీతో 4% రిజర్వేషన్ రద్దు చేయను అని చెప్పించే దమ్ము ఉందా?
-
స్పీచ్ మధ్యలో ఆపేసిన సీఎం జగన్ ఎందుకో తెలుసా...?
-
మరో 3 రోజులో బ్యాలెట్ బద్దలు కొట్టడానికి సిద్ధమా
-
ఉప్పోగిన ప్రజాభిమానం కిక్కిరిసిన కడప
-
సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప
-
Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కడప (వైఎస్ఆర్ కడప జిల్లా)
-
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
సాక్షి, వైఎస్సార్ జిల్లా: పీసీసీ చీఫ్ షర్మిల, సునీతలకు కడప కోర్టు మరోమారు షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివేకా హత్య కేసు ప్రస్తావించరాదన్న కడప కోర్టు జారీ చేసిన అర్డర్‌ను డిస్మిస్ చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఇటీవల హైకోర్టులో సునీత పిటిషన్ దాఖలు చేయగా, కడప కోర్టులోనే తేల్చుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.హైకోర్టు ఆదేశాల మేరకు కడప కోర్టు విచారణ చేపట్టింది. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. సునీత, షర్మిల దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. తప్పుడు సమాచారంతో పిటిషన్ వేశారంటూ సునీత, షర్మిలకు రూ.10 వేల జరిమానాను ర్టు విధించింది. జరిమానాను జిల్లా లీగల్ సెల్‌కు కట్టాలని కడప కోర్టు పేర్కొంది. -
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
-
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..!
-
మంచి చేయడమే.. మాట తప్పకపోవడమే.. 'మన కల్చర్': సీఎం జగన్
పులివెందుల కల్చర్.. కడప కల్చర్.. రాయలసీమ కల్చర్.. అంటూ మనపై వేలెత్తి చూపించే కార్యక్రమం నిత్యం జరుగుతోంది. యస్.. మన కల్చర్ మంచి చేయటం.. మన కల్చర్ మంచి మనసు..మన కల్చర్ మాట తప్పకపోవటం.. మన కల్చర్ బెదిరింపులకు లొంగకపోవడం.. అని ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టంచేశారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల అసెంబ్లీ స్థానానికి గురువారం వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఆ వివరాలివీ.. నమ్మకం.. ధైర్యం.. అభివృద్ధి.. సక్సెస్ స్టోరీపులివెందుల అంటే నమ్మకం. పులివెందుల అంటే ధైర్యం. పులివెందుల అంటే అభివృద్ధి. పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయగాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి ఎక్కడో కృష్ణానది నీళ్లు ఈరోజు మన పులివెందులలో కనిపిస్తూ అభివృద్ధి బాటలో పరిగెత్తుతోందంటే ఈ అభివృద్ధి, ఆ మార్పులకు మూలం నా తండ్రి, మనందరి ప్రియతమ నాయకుడు దివంగత వైఎస్సార్ అయితే.. ఆయన వేసిన రెండు అడుగులకు తోడు మీ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసింది ఈ 58 నెలల కాలంలోనే అని సవినయంగా తెలియజేస్తున్నా. పులివెందులలో ఏముంది? అని ఒకప్పుడు అడిగిన పరిస్థితుల నుంచి పులివెందులలో ఏం లేదో చెప్పాలని అడిగే స్థాయికి మన పట్టణాన్ని, నియోజకవర్గాన్ని మార్చుకుంటూ అడుగులు వేశాం. రాబోయే రోజుల్లో కూడా వేస్తాం.నమ్మకాన్ని నింపింది పులివెందుల బిడ్డలేఒక్కటి గమనించండి. మనందరి పులివెందుల మనకే కాదు... రాష్ట్రానికి కూడా ఎంతో ఇచ్చింది. టీడీపీ మాఫియా నాలుగు దశాబ్దాల దుర్మార్గాలను ఎదిరించి నిలబడే ధైర్యాన్ని ప్రసాదించింది. మాట ఇస్తే మడమ తిప్పడన్న నమ్మకాన్ని, మోసం చేయడన్న విశ్వాసాన్ని తెలుగు నేలపై అణువణువునా నింపింది ఎవరంటే మీ పులివెందుల బిడ్డలే అని సగర్వంగా, సవినయంగా తెలియజేస్తున్నా.కాబట్టే ఆ చంద్రబాబుకు, ఈనాడుకు, ఆంధ్రజ్యోతికి, టీవీ, ఎల్లో మీడియాకు దశాబ్దాలుగా కోపంతో వచ్చే ఊతపదమేమిటి? పులివెందుల కల్చర్, కడప కల్చర్, రాయలసీమ కల్చర్ అంటూ మనమీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తుంటారు. పులివెందులను తెలుగుసీమ అభిమానించింది. నమ్మింది, కలిసి నడిచింది. పులివెందుల, కడప, రాయలసీమ మంచితనం, మాటపై నిలబడే గుండెధైర్యం రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామానికీ అర్థమైంది కాబట్టే ఓ వైఎస్సార్, ఓ జగన్‌ను మారుమూల ప్రాంతాల్లో కూడా అభిమానించే కోట్ల మంది ఈరోజు కనిపిస్తున్నారు.కొత్తగా వైఎస్సార్ వారసులం అంటూ..వైఎస్సార్, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయటానికి చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, ఓ వదినమ్మ ఎంత దుర్మార్గంగా ప్రయత్నిస్తున్నారో మీరే చూస్తున్నారు. వీరికి తోడు, వారి కుట్రలో భాగంగా ఈ మధ్య కొత్తగా వైఎస్సార్ వారసులం.. అంటూ మీ ముందుకు వస్తున్నారు. నేను ఈరోజు మీ అందరి సమక్షంలో అడుగుతున్నా. ఆ మహానేతకు వారసులు ఎవరో చెప్పాల్సింది ప్రజలు, వైఎస్సార్‌ను ప్రేమించేవారు కాదా? ఒక్క విషయం ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి.ఆ దివంగత మహానేత, నాన్నగారి మీద కక్షపూరితంగా, కుట్రపూరితంగా, ఆయన చనిపోయిన తర్వాత కూడా కేసులు పెట్టింది ఎవరు? ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? ఆయన పేరును చివరకు సీబీఐ చార్జిషీట్లో పెట్టింది ఎవరు? ఒక వైఎస్సార్ లెగసీని లేకుండా చేయాలని చూస్తున్నది ఎవరు? వైఎస్సార్ కుటుంబాన్ని పూర్తిగా అణగదొక్కాలని, వారు లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు? ఇవన్నీ పులివెందుల ప్రజలకు, వైఎస్సార్ జిల్లా ప్రజలకు తెలుసు. తెలుగు నేల మీద ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. వైఎస్సార్ పోరాడిన వారితో కుమ్మక్కు!రాజకీయంగా అణగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించిన వారితోనే కలిసిపోయి.. కాంగ్రెస్, టీడీపీతో చేయి కలిపి, వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్లందరితోనూ కలిసిపోయి, ఆ కుట్రలను అమలు చేస్తున్న శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయిన వీరా... వైఎస్సార్ వారసులు? వైఎస్సార్‌గారు బతికున్నంతకాలం ఎవరితో పోరాటం చేశారు? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. ప్రతి గ్రామంలో వైఎస్సార్‌ను అభిమానించే అభిమానులు, కార్యకర్తలు ఎవరితో యుద్ధం చేశారు? అని ఆలోచన చేయమని కోరుతున్నా. కుట్రలో భాగస్వాములు వారసులా?వైఎస్సార్ మీద కుట్రలు, కుతంత్రాలు చేసిన ఆయన శత్రువుల ఇళ్లకు పసుపు చీర కట్టుకుని వెళ్లి, వారికి మోకరిల్లి, వారి స్క్రిప్టులను మక్కీకి మక్కీ చదివి వినిపిస్తూ, వారి కుట్రల్లో భాగమవుతున్న వీళ్లా వైఎస్సార్ వారసులు? వైఎస్సార్ కీర్తి ప్రతిష్టలను, ఏకంగా ఆయన పేరునే ప్రజల మనసు నుంచి చెరిపివేయాలని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే ఉండకూడదని, వైఎస్సార్ విగ్రహాలు ఏ గ్రామంలోనూ ఉండకూడదని, ఆ విగ్రహాలన్నింటినీ ముక్కలు చెక్కలు చేస్తామని బహిరంగంగానే చెబుతున్న వారితో చేతులు కలిపిన వీరా వైఎస్సార్ వారసులు? ఇలాంటి వారికి ఓటు వేస్తే వైఎస్సార్ లెగసీకి ఓటు వేసినట్లా? లేక వైఎస్సార్ పేరు కనపడకుండా చేసే కుట్రలకు ఓటు వేసినట్టా? రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతున్నా.వారి వెనుక ఎవరున్నారో కనిపిస్తూనే ఉందిఒక చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, దత్తపుత్రుడు, బీజేపీ, కాంగ్రెస్.. వీళ్లందరూ సరిపోరు అన్నట్టుగా నా ఇద్దరి చెల్లెమ్మలతో కూడా కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. మీ బిడ్డ ఒక్కడి మీద ఇంత మంది కలిసి ఏకమవుతున్నారు. రాజకీయాలు ఏ స్థాయికి పతనమైపోయాయో గమనించమని కోరుతున్నా. ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారి వెనుక ఎవరు ఉన్నారో కూడా మీ అందరికి కనిపిస్తూనే ఉంది.ఆశ్చర్యం ఏమిటంటే.. వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి.. ఔను నేనే చంపానని అతి హేయంగా, బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరో మీరే చూస్తున్నారు కదా! నాడు చిన్నాన్నను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితో, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలు, అధికార బలంతో ఓడించిన వారితో ఈరోజు చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నారంటే దానికి అర్థమేమిటి? చిన్నాన్నకు రెండో భార్య ఉన్న మాట వాస్తవమా? కాదా? ఆ రెండో భార్యతో ఆయనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా? కాదా? ఆనాడు ఎవరు ఫోన్ చేస్తే అవినాష్ అక్కడికి వెళ్లాడు? అవినాష్ పలు ఇంటర్వ్యూలు, ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో అడిగిన ప్రశ్నలు సహేతుకమే కదా! ఎవరైనా అవినాష్ వైపు మాట్లాడితే చాలు వెంటనే వారిపై కూడా అడ్డగోలు ఆరోపణలతో కుట్ర రాజకీయాలు చేయడం ధర్మమేనా? చిన్నాన్నను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా?కాంగ్రెస్‌కు ఓటేస్తే బాబు, బీజేపీకి లాభంఅసలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లెన్ని వచ్చాయి? నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీతో, రాష్ట్రాన్ని విడగొట్టిన ఆ కాంగ్రెస్ పార్టీతో, ప్రత్యేక హోదాను విభజన చట్టంలో చేర్చకుండా రాష్ట్రాన్ని దుర్మార్గంగా విడగొట్టి అన్యాయం చేసిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్సార్ గారి పేరును, ఆయన చనిపోయిన తర్వాత కూడా చార్జ్ షీట్లో చేర్చిన ఆ కాంగ్రెస్ పార్టీలో చేరి మొత్తంగా వైఎస్సార్ పేరునే తుడిచి వేయాలని, కనపడకుండా చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఓటు వేయటం అంటే దానివల్ల ఎవరికి లాభమో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా.అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, మన ఓట్లు చీలిస్తే వచ్చే లాభం బాబుకు, బీజేపీ కూటమికి కాదా? ఇదంతా మన ఓట్లను విడగొట్టి వాళ్లను గెలిపించాలనే ప్రయత్నం కాదా? అసలు ఎవరికి వైఎస్సార్ గారి మీద ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ గమనించాలి. పులివెందుల, కడప గడ్డపై ఎవరికి ప్రేమ ఉందో ఆలోచన చేయండి. వైఎస్సార్, పులివెందుల, వైఎస్సార్ జిల్లా పేర్లు చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోవాలని ఆరాటపడుతున్న వారు ఎవరు అన్నది ఆలోచన చేయండి. మరోపక్క ఈ పేర్లే లేకుండా చేయాలని ఆరాటపడుతున్న ఆ రెండు పార్టీలతో జతకట్టి తన సొంత లాభం, రాజకీయ స్వార్థం కోసం ఎవరు కుట్రలు చేస్తున్నారో గమనించమని కోరుతున్నా. పేదలకు మంచి చేసేందుకే అధికారంపులివెందుల ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, మరీ ముఖ్యంగా నామీద ఆరోపణలు చేస్తున్న నా బంధువులకు ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదల్చుకున్నా. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడంటున్న నా బంధువులకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది డబ్బులు సంపాదించుకునేదాని కోసం కాదు. నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు. మరొక్క విషయం కూడా నిండుమనసుతో చెబుతున్నా.వైఎస్ అవినాశ్ ఏ తప్పూ చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టే టికెట్ ఇచ్చా. అవినాశ్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా అవినాశ్‌ను దూషించడం, అతడిని తెరమరుగు చేయాలనుకోవడం ఎంత దారుణమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. మా అందరికన్నా అవినాష్ చాలా చిన్నోడు. అటువంటి పిల్లాడి జీవితం నాశనం చేయాలని ఇంత పెద్ద పెద్ద వాళ్లందరూ కూడా కుట్రల్లో భాగం అవుతున్నారంటే నిజంగా వీళ్లందరూ మనుషులేనా? మన పాలనలో మనసు, మానవత్వం..ఈరోజు పులివెందులలోగానీ, కడపలోగానీ మొత్తం తెలుగు నేలమీద గానీ ఒక జలయజ్ఞం, ఉచిత విద్యుత్, 108, 104 సేవలు, ఆరోగ్యశ్రీ.. వీటన్నింటితోపాటు మీ జగన్ తెచ్చిన అమ్మ ఒడి, ఇంగ్లిష్ మీడియం, నాడు–నేడు, చేయూత, వైఎస్సార్ ఆసరా, 31 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల గృహ నిర్మాణాలు, విస్తరించిన ఆరోగ్యశ్రీ,, ఆరోగ్య ఆసరా, ఆరోగ్య సురక్ష, విలేజ్ క్లినిక్, రైతు భరోసా, ఆర్బీకేలు, సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు, డీబీటీతో బటన్ నొక్కి నేరుగా రూ.2.70 లక్షల కోట్లు అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి జమ చేయడం.. ఇవన్నీ మన మనసు, మానవత్వాన్ని చూపే అంశాలు. ఇది నచ్చని పసుపు మూకలతో మన చెల్లెమ్మలు చేయి కలపడం కంటే దుర్మార్గమైన కార్యక్రమం మరొకటి ఏదైనా ఉంటుందా? నాన్న మరణం తర్వాత పట్టించుకున్నారా?నాన్నగారి మరణం తర్వాత పదేళ్ల పాటు ఏ ప్రభుత్వాలైనా, ఎవరైనా మన పులివెందులను పట్టించుకున్నారా? అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతున్నా. మళ్లీ పులివెందుల దశ మారింది ఎప్పుడంటే? మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే, ఈ 58 నెలల్లోనే కాదా? పులివెందులను, వైఎస్సార్ జిల్లాను ఇంకా అభివృద్ధి చేయాలి. వచ్చే ఐదేళ్లలో మీ అందరి అండతో, ఆ దేవుడి ఆశీస్సులతో మీ బిడ్డ ద్వారా మన ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందుతాయి.పులివెందుల, కడప, రాయలసీమ, వైఎస్సార్, వైఎస్ జగన్.. ఇవన్నీ మనసున్న పేర్లు కాదా? ఈ పేర్లను చెరిపివేయాలనుకునే వారు ఎన్నటికీ మనకు, ఈ రాష్ట్రానికి కూడా వ్యతిరేకులేనని గమనించాలని కోరుతున్నా. ఫ్యాను గుర్తుకు రెండు ఓట్లు వేయడం ద్వారా మరో ఐదేళ్లు మన పులివెందుల అభివృద్ధి ప్రయాణానికి, మీ జగన్ ప్రయాణానికి మద్దతు ఇవ్వాలని కోరుతున్నా. మీ బిడ్డకు చరిత్రలో కనీవినీ ఎరుగని మెజార్టీ ఇచ్చిన ఈ గడ్డను మరోసారి అలాంటి మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నా. అవినాశ్‌ను కూడా అంతే ఆప్యాయతతో, గొప్ప మెజార్టీతో దీవించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నా. ► ఈ కార్యక్రమంలోఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా, కడప మేయర్ సురేష్‌బాబు, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచి చేయడంలో మీ జగన్‌ను కొట్టలేరు!జగన్‌ను పథకాలలో కొట్టలేరు. పాలనలో, పనితీరులో జగన్‌ను కొట్టలేరు. పల్లెకు మంచి చేయడంలో జగన్‌ను కొట్టలేరు. జగన్‌ను పిల్లలకు చేసిన మంచిలో కొట్టలేరు. జగన్‌ను రైతులకు అందించిన రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాల్లో కొట్టలేరు. జగన్‌ను అక్కచెల్లెమ్మలకు చేసిన మంచిలో, మేలులో కొట్టలేరు. జగన్‌ను అవ్వాతాతల పట్ల చూపించిన అనురాగంలో కొట్టలేరు.వారి ఆత్మగౌరవం కాపాడటంలో కూడా జగన్‌ను కొట్టలేరు. జగన్‌ను డీబీటీలో అంటే బటన్లు నొక్కడంలో కొట్టలేరు. ఏ రంగాన్ని తీసుకున్నా జగన్ మంచి చేయలేదు అని వీళ్లు చెప్పలేరు. తమ 14 ఏళ్ల పాలనలో జగన్ కంటే మంచి చేశాం అని వాళ్లు చెప్పలేరు. అందుకే ఆలోచన చేయమని అడుగుతున్నా. మన బ్రాండ్ జగన్, మన బ్రాండ్ వైఎస్సార్, మన బ్రాండ్ కడప, మన బ్రాండ్ పులివెందులను కొట్టాలనుకుంటున్న వీరందరికీ ఓటు ద్వారా గుణపాఠం చెప్పడానికి మీరంతా సిద్ధమేనా? సీఎం జగన్ నామినేషన్ దాఖలుపులివెందుల: ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల అసెంబ్లీ స్థానానికి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం సీఎస్ఐ చర్చి మైదానంలో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం 11.10 గంటలకు అంబకపల్లె రోడ్డు మినీ సెక్రటేరియట్లో ఉన్న ఆర్వో కార్యాలయానికి సీఎం రోడ్డు మార్గాన చేరుకున్నారు. 11.15 గంటలకు ముఖ్యమంత్రి జగన్ తన నామినేషన్ పత్రాలను ఆర్వో వెంకటేశులుకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్ వెంట ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప ఉన్నారు.అనంతరం సీఎం జగన్ భాకరాపురంలోని స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కాసేపు గడిపారు. నామినేషన్ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు. మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి కడప బయలుదేరి వెళ్లారు. హెలిప్యాడ్ వద్ద పులివెందుల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రుక్మిణి, కౌన్సిలర్ శైలజ, పలువురు మహిళలు గుమ్మడికాయతో ముఖ్యమంత్రికి దిష్టి తీశారు. కాగా, సీఎం జగన్ తరఫున పులివెందులలో వైఎస్ మనోహర్‌రెడ్డి గత సోమవారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసిన విషయం విదితమే. నా ప్రాణానికి ప్రాణం.. నా పులివెందుల పులివెందుల.. నా సొంత గడ్డ, నా ప్రాణానికి ప్రాణం.. నన్ను నిరంతరం ప్రేమిస్తూ ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచే పులివెందుల అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, ప్రతి స్నేహితుడికీ మీ బిడ్డ జగన్ చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాడు. పులివెందుల అభివృద్ధికి మూలం వైఎస్సార్.పులివెందులను ఆదర్శంగా తీర్చిదిద్దాంపులివెందుల అభివృద్ధికి గత ఐదేళ్లలో తీసుకున్న చర్యలను క్లుప్తంగా వివరిస్తా. పులివెందుల ప్రజల చిరకాల కోరిక.. ఆ కనిపిస్తున్న మెడికల్ కాలేజీ. నాన్న కలలుగన్న ఆ మెడికల్ కాలేజీ ఆసుపత్రిని ఈమధ్యనే పులివెందుల ప్రజలకు అంకితం చేశాం. ఈ జూలై, ఆగస్టులో మెడికల్ కాలేజీని కూడా అంకితం చేయబోతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నా. పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా పట్టణాన్ని ఎలా తీర్చిదిద్దుతున్నామో మీ అందరికీ కనిపిస్తూనే ఉంది. జీఎన్ఎస్ఎస్, హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానంలో భాగంగా రూ.900 కోట్లతో కాలేటివాగు సామర్థ్యాన్ని 1.02 టీఎంసీలకు పెంచి కరువు పీడిత చక్రాయపేట మండలానికి నీటిని అందించే పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి.చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో గతంలో మూడు, నాలుగు టీఎంసీలకు మించి నీళ్లు నిల్వ చేయలేని పరిస్థితిని మారుస్తూ ఆర్ అండ్ ఆర్ పరిహారం దాదాపు రూ.250 కోట్లు చెల్లించాం. 2020 నుంచి క్రమంతప్పకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీల నీటిని ఏటా నింపుతూ వస్తున్నాం. పైడిపాలెం రిజర్వాయర్‌ను 6 టీఎంసీల పూర్తి కెపాసిటీతో నింపేలా చర్యలు తీసుకున్నాం.యురేనియం బాధిత గ్రామాలతో పాటు లింగాల, వేముల, వేంపల్లె మండలాలకు తాగునీరు, సాగునీరు ఇవ్వడానికి ఏకంగా రూ.1,000 కోట్లతో ఎరబ్రల్లి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు వేగంగా జరగడం మన కళ్లెదుటే కనిపిస్తోంది. వాటర్ గ్రిడ్ ద్వారా రూ.480 కోట్లతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకూ తాగునీటి సరఫరా దాదాపుగా పూర్తయింది. పులివెందులలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ క్యాంపస్‌ను ప్రారంభించాం. ఏపీ కార్ల్‌లో న్యూటెక్ సైన్సెస్ పరిశ్రమతోపాటు వైఎస్సార్ వ్యవసాయ కళాశాల, ఉద్యాన కళాశాలలను నెలకొల్పాం. ఆదిత్య బిర్లా గార్మెంట్స్ పరిశ్రమను పులివెందులకు తెచ్చాం. కేంద్రంతో పలుదఫాలు చర్చించి హైవేలు, గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రాజెక్టులు సాధించాం. ఇవన్నీ మీ బిడ్డ సీఎం కాబట్టే కదా..పులివెందులలో కొత్త బస్టాండ్, క్రికెట్ స్టేడియం, పార్కులు లాంటివి మీరంతా చూస్తున్నారు. మొత్తంగా దాదాపు రూ.5,900 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరగడం కళ్లెదుటే కనిపిస్తోంది. ఇవన్నీ కాకుండా మీ బిడ్డ బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము మరో రూ.2,069 కోట్లు ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నా. మన పులివెందులలో నవరత్నాలు పథకాల ద్వారా 94.4 శాతం గడపలకు లబ్ధి చేకూరింది. చీనీ అమ్మకాలకు అనంతపురం వెళ్లాల్సిన అవసరం లేకుండా పులివెందులలోనే విక్రయించే ఏర్పాట్లు చేశాం. ఇవన్నీ చేశామంటే కారణం మీ బిడ్డ సీఎం అయ్యాడు కాబట్టే కదా అని ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతున్నా. – సాక్షి ప్రతినిధి, కడప -
కడప కోర్టు ఉత్తర్వుల రద్దు కోరుతూ పిటిషన్లు
సాక్షి, అమరావతి: సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దంటూ కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నర్రెడ్డి సునీత, టీడీపీ నేత రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) హైకోర్టును ఆశ్రయించారు. కడప జిల్లా కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ వారు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురించి బీటెక్ రవి తరఫు సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు మంగళవారం న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. అత్యవసర విచారణ అవసరం లేదన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతామంది. ఈ వ్యాజ్యం విచారణ నుంచి తాము తప్పుకుంటామని ధర్మాసనం మౌఖికంగా తెలిపింది. ‘మా వాదన వినలేదు’ కడప జిల్లా కోర్టు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా, తమ వాదన వినకుండా ఏకపక్షంగా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులిచ్చిందని బీటెక్ రవి, సునీత తమ వ్యాజ్యాల్లో పేర్కొన్నారు. బాధితులు సూట్ దాఖలు చేయాల్సి ఉండగా.. పార్టీ తరఫున దాఖలు చేశారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కడప జిల్లా కోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చి ఉండాల్సింది కాదన్నారు. ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావన్నారు. కడప కోర్టు తన పరిధి దాటి వ్యవహరించిందని పేర్కొన్నారు. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా కడప కోర్టు తమ వాక్ స్వాతంత్య్రపు హక్కును నిరోధించిందని, ఇది సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. మధ్యంతర ఉత్తర్వుల పేరుతో జిల్లా కోర్టు తుది అభిప్రాయానికి వచ్చిందన్నారు. ఎన్నికల వేళ ప్రజాబాహుళ్యంలో ఉన్న వాస్తవాలను ప్రజలకు తెలియచేసే హక్కు తమకు ఉందన్నారు. -
కడప YSRCP ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి నామినేషన్
-
వివేకా హత్యపై దుష్ప్రచారం ఆపండి
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిలపైన దుష్ప్రచారం చేయొద్దని కడప జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల, వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి తదితరులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డిల పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని కోర్టు తేల్చిచెప్పింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి మాట్లాడొద్దని సూచించింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి లోబడే మాట్లాడాలని కుండబద్దలు కొట్టింది. ప్రజలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడాలని హెచ్చరించింది. ఇప్పటికే చంద్రబాబు, లోకేశ్, షర్మిల, సునీత తదితరులు తాము చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సోషల్ మీడియా మాధ్యమాల నుంచి తొలగించాలని ఆదేశించింది. వీరు సీఎం వైఎస్ జగన్, వైఎస్ అవినాశ్‌రెడ్డిలపై దుష్ప్రచారం చేశారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని కోర్టు తెలిపింది. రాజకీయంగా మైలేజీ కోసమే దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించింది. రాజకీయ పార్టీలు, మీడియా పబ్లిక్ కోర్టుగా అవతరించి న్యాయపాలనలో జోక్యం చేసుకుంటున్నాయని కడప జిల్లా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. ఈ మేరకు కడప ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి రెండు రోజుల క్రితం తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఆరోపణలు, వక్రీకరణలు ఆపండి.. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ధ్రువీకరణ కాని ఆరోపణలతో, వక్రీకరణలతో వ్యక్తిగత దాడులు, విమర్శలు చేయడం మానాలని కాంగ్రెస్, టీడీపీ, జనసేన నేతలను, వారి పార్టీల క్యాడర్‌ను కడప జిల్లా కోర్టు ఆదేశించింది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉందని కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ఆరోపిస్తూ మీడియా, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని ఆయా పార్టీల అధినేతలను, అనుచరులకు కోర్టు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్‌రెడ్డిని వైఎస్ జగన్ రక్షిస్తున్నారంటూ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూడా ఆపాలని తేల్చిచెప్పింది. వ్యక్తిగత విమర్శలు మాని తమ పార్టీల ఎజెండాలపైన, ఇతర పార్టీల వైఫల్యాలపైన దృష్టి సారించాలని వారికి కోర్టు హితవు పలికింది. వివేకా హత్య కేసులో జగన్ నిందితుడు కాదన్న విషయాన్ని గుర్తెరగాలంది. రాజకీయ మైలేజీ కోసమే జగన్, అవినాశ్‌లపై.. షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు వ్యాఖ్యలు చేశారంది. ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా పరువు నష్టం కలిగించేవేనని తేల్చిచెప్పింది. అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి.. వాదనలు విన్న జిల్లా జడ్జి శ్రీదేవి పిటిషనర్ వాదనలతో ఏకీభవించారు. వాక్ స్వాతంత్య్రం సహేతుక పరిమితులకు లోబడి ఉంటుందన్న సుప్రీంకోర్టు తీర్పును ఉదహరించారు. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఓ వ్యక్తి ప్రతిష్టను, మంచితనాన్ని ఉద్దేశపూర్వకంగా దెబ్బతీయడం ఆ స్వేచ్ఛపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. ‘వైఎస్ వివేకా హత్య కేసు ప్రస్తుతం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు ముందు పెండింగ్‌లో ఉంది. ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా షర్మిల, చంద్రబాబు, లోకేశ్ ప్రజల ముందు వైఎస్సార్సీపీ, దాని అధినేత వైఎస్ జగన్, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి తదితరులపై తప్పుడు, పరువు నష్టం కలిగించేలా మాట్లాడుతున్నారనేందుకు, అసభ్యంగా పరిహాసం చేస్తున్నారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయి. వారి మాటలను, వ్యాఖ్యలను పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాలు పదే పదే ప్రచురించాయి, ప్రసారం చేశాయి. ముఖ్యంగా అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా పేర్కొన్నారు. ఆయనను సీఎం జగన్ రక్షిస్తున్నారని పేర్కొన్నాయి.’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇతరులు సొంత తీర్పులివ్వరాదు.. ‘పౌర హక్కుల దురాక్రమణను నిరోధించడానికి, నిందితుల హక్కులను కాపాడేందుకు, మీడియా ప్రవర్తనకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయవ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించే విషయంలో సరైన నిబంధనలు లేవు. ఓ వ్యక్తి అరెస్ట్ సమయంలో అతడిని దోషిగా నిర్ధారించే ట్రెండే ప్రస్తుతం కొనసాగుతోంది. రాజకీయ నేతలు, రాజకీయ పార్టీలు, మీడియా ఉన్నది ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకే తప్ప, తమ ఇష్టాఇష్టాలకు అనుగుణంగా తీర్పులు ఇచ్చేందుకు ఎంతమాత్రం కాదు. ప్రస్తుత కేసులో ఈ కోర్టు ముందుంచిన డాక్యుమెంట్లు, వీడియోలు, పత్రికా కథనాలను విశ్లేషిస్తే.. బహిరంగంగా వైఎస్ అవినాశ్‌రెడ్డిని హంతకుడిగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆయనను వైఎస్ జగన్ రక్షిస్తున్నట్లు కూడా ప్రచారం చేస్తున్నారు. ఓ కేసు కోర్టు ముందు పెండింగ్‌లో ఉన్నప్పుడు.. ఎవరూ కూడా తమ సొంత తీర్పులు ఇవ్వడానికి వీల్లేదు. ఆ అధికారం ఎవరికీ లేదు. అలాంటి కేసులో ఉన్న వ్యక్తిని తమ ఇష్టానుసారం హంతకుడిగా, దోషిగా ప్రకటించడానికి వీల్లేదు. నిష్పాక్షిక ట్రయల్ నిర్వహించి నిందితుడిని దోషిగా నిర్ధారించేంత వరకు ఆ వ్యక్తి అమాయకుడే అన్నది న్యాయ సూత్రం. ఓ వ్యక్తి నేరాన్ని నిరూపించాల్సిన బాధ్యత ప్రాసిక్యూషన్పైన మాత్రమే ఉంది. పెండింగ్‌లో ఉన్న కేసు గురించి మూడో వ్యక్తి ఎవరూ కూడా తమ తప్పుడు ప్రయోజనాల కోసం బహిరంగంగా మాట్లాడటం, వ్యాఖ్యలు చేయడం, తీర్పులిచ్చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు’ అని జడ్జి శ్రీదేవి తేల్చిచెప్పారు. తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ న్యాయ పోరాటం.. చంద్రబాబు ప్రోద్భలంతో వైఎస్ వివేకా హత్యపై షర్మిల, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, సునీత తదితరుల దుష్ప్రచారంపై విసిగిపోయిన వైఎస్సార్సీపీ న్యాయ పోరాటానికి దిగింది. తమ పార్టీతో పాటు సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి, తదితరులపై పత్రికలు, టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి తప్పుడు ప్రచారం, అనుచిత వ్యాఖ్యలు చేయకుండా షర్మిల, చంద్రబాబు, సునీతలను నిరోధించాలంటూ కడప జిల్లా కోర్టులో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రిన్సిపల్ జిల్లా జడ్జి జి.శ్రీదేవి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున ఎం.నాగిరెడ్డి, కె.ఎస్.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబు, షర్మిల, సునీత తదితరులు చేసిన దుష్ప్రచారానికి సంబంధించిన డాక్యుమెంట్లను, తప్పుడు ఆరోపణల వీడియోలను న్యాయవాదులు కోర్టు ముందుంచారు. కోర్టు ప్రొసీడింగ్స్‌లో మీడియా, రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయి ‘రాజకీయ పార్టీలు మీడియా ద్వారా పబ్లిక్ కోర్టుగా అవతరించాయి. అటు మీడియా, ఇటు రాజకీయ పార్టీలు సొంతంగా దర్యాప్తు చేసేస్తున్నాయి. తద్వారా కోర్టు ప్రొసీడింగ్స్‌లో జోక్యం చేసుకుంటున్నాయి. నిందితుడు, దోషికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని విస్మరించాయి. దోషిగా నిర్ధారణ అయ్యేవరకు నిరపరాధే అనే సూత్రాన్ని కూడా పట్టించుకోవడం లేదు. కోర్టులు కేసును విచారణకు స్వీకరించడానికి ముందే నిందితులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని మలుస్తున్నాయి. ఇది ప్రజలపై, జడ్జీలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తత్ఫలితంగా అమాయకుడైన నిందితుడిని నేరస్తుడిగా చూడాల్సి వస్తోంది. నిందితుల హక్కులు, స్వేచ్ఛను పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. ట్రయల్‌కు ముందు ఓ అనుమానితుడు, నిందితుడు విషయంలో మీడియా సాగించే పరిమితికి మించిన ప్రతికూల ప్రచారం ట్రయల్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది. తద్వారా అతడే నేరం చేశాడని భావించాల్సి వస్తోంది. ఇలా చేయడం న్యాయ పాలనలో జోక్యం చేసుకోవడమే అవుతుంది’ అని జడ్జి తన ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దుష్ప్రచారాన్ని ఆపండి.. ఎన్నికల ప్రచారంలో షర్మిల తదితరులు వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్‌రెడ్డిని సీఎం జగన్ కాపాడుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అవినాశ్‌రెడ్డిని ఏకంగా హంతకుడంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు ప్రకటనలు, వ్యాఖ్యలు చేస్తున్నారని నివేదించారు. చంద్రబాబు కూడా ప్రొద్దుటూరు సభలో వివేకాను హత్య చేసిన వ్యక్తిని ఎంపీగా నిలబెట్టారంటూ దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఇక లోకేశ్ అయితే నేరుగా ముఖ్యమంత్రి జగనే తన బాబాయి వివేకాను హత్య చేశారని ఆరోపించారన్నారు. పురందేశ్వరి, పవన్ కళ్యాణ్ తదితరులు కూడా ఇలాగే దుష్ప్రచారం చేస్తున్నారని వివరించారు. వివేకా హత్య కేసు సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో జగన్, అవినాశ్, వైఎస్సార్సీపీపైన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆయా పార్టీల అధినేతలను, క్యాడర్‌ను నిరోధించాలన్నారు. రాజకీయ మైలేజీ కోసమే సీఎం జగన్, అవినాశ్‌పై వ్యాఖ్యలు.. ‘ప్రస్తుత కేసులో షర్మిల, సునీత, చంద్రబాబు, లోకేశ్, పురందేశ్వరి, పవన్ కళ్యాణ్, బీటెక్ రవి వారి రాజకీయ మైలేజీ కోసం వైఎస్సార్సీపీపై, వైఎస్ జగన్, ఎంపీ అవినాశ్‌రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసులో జగన్ ఎన్నడూ కూడా నిందితుడు కాదు. కాబట్టి వివేకాను జగన్ చంపారంటూ ప్రజలందరి ముందు లోకేశ్ చేసిన ప్రకటన పరువు నష్టం కలిగించేదే. సుప్రీంకోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకుంటూ.. ఈ కోర్టు ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఉత్తర్వుల వల్ల షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులకు ఎలాంటి నష్టం వాటిల్లదు. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకుంటే వైఎస్సార్సీపీ, జగన్, అవినాశ్ రెడ్డిలకు తీరని నష్టం కలుగుతుంది. ఇదే సమయంలో షర్మిల, చంద్రబాబు, లోకేశ్ తదితరులు పదే పదే పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేస్తారు. ఎన్నికల వేళ ఇది వైఎస్సార్సీపీ, ఎన్నికల్లో పోటీ చేసే ఆ పార్టీ అభ్యర్థులకు తీరని నష్టం కలిగిస్తుంది. అందుకే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాక ఈ కేసులో తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించా’ అని జిల్లా జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
వివేకా కేసులో సునీత, దస్తగిరి లాలూచీ పడ్డారు: ఎంపీ అవినాష్
సాక్షి, కడప: వివేకా కూతురు సునీత తనపై కుట్రపూరితంగా బురద జల్లుతోందని కడప వైఎస్సార్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ .. దురుద్దేశపూర్వకంగా వివేకా హత్య కేసును రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ వివేకానందరెడ్డిని చంపానని దస్తగిరి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చినా.. ఆయన్ను అప్రూవర్‌గా మార్చి కేసు నుంచి తప్పించారని, ఇతరులను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఈ కేసులో కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు అవినాష్. ఏపీ ఎన్నికల వేళ.. రాజకీయాలు వేడేక్కిన వేళ.. పోలింగ్ సమీపిస్తోన్న వేళ.. నర్రెడ్డి సునీత పెడుతున్న ప్రెస్మీట్లు, చేస్తోన్న వివాదస్పద అంశాలు, బోడిగుండుకు.. మోకాలికి ముడిపెడుతూ చేస్తోన్న సూత్రీకరణలను అవినాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఒక పకడ్బందీగా పన్నిన కుట్రలో భాగంగా సునీత ప్రెస్మీట్లలో అబద్దాలు, అవాస్తవాలను ప్రచారం చేస్తోందని, షర్మిల ఓ అడుగు ముందుకేసి ఎన్నికల ప్రచారంలో వాడుకుంటోందని, వాటిని చంద్రబాబు.. మరో అడుగు ముందుకేసి హత్యా రాజకీయాలంటూ ప్రకటనలు చేస్తున్నారని అవినాష్ రెడ్డి మండిపడ్డారు. అసలు హత్య కేసులో ఇప్పటివరకు సిబిఐ అనుసరించిన ధోరణి, దర్యాప్తులో డొల్లతనంతో పాటు సునీత వ్యవహార శైలిని కూడా అవినాష్ రెడ్డి పలు ఆధారాలతో మీడియా ముందుంచారు. ఎంపీ అవినాష్ ప్రెస్మీట్లో ముఖ్యాంశాలు: షర్మిల రాజకీయ సభల్లో ఏం మాట్లాడుతుందో అందరు చూస్తున్నారు లేనివి ఉన్నట్లు ఉన్నవి లేనట్లు సునీత పవర్ పాయింట్ ప్రజటేషన్ ఇస్తోంది అసలు ఈ కేసులో మాట్లాడటం ఇష్టం లేదు, కేవలం వివరణ కోసమే మీడియా ముందుకు వచ్చాను దస్తగిరిని అప్రూవర్ చేసిన విధానం అందరు గమనించండి ఈ కేసులో వాచ్ మెన్ రంగన్న ఐ విట్ నెస్ ...నలుగురి పేర్లు చెప్పాడు రంగన్న చెప్పిన వారిని ఏ విచారణ సంస్ద అయిన అరెస్ట్ చేసి కస్టడీ అడిగి సమాచారం రాబట్టాలి నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చెయ్యలేదు దస్తగిరి హత్య చేశానని ఒప్పుకున్నా అరెస్ట్ చేయకుండా ఇంటికి పంపారు అనంతరం దస్తగిరి యాంటిస్పేటరీ బెయిల్ అడిగాడు దస్తగిరి బెయిల్‌కు సునీత అభ్యంతరం చెప్పలేదు పక్కా ప్రణాళికతో దస్తగిరిని అప్రూవర్ చేశారు 306- 4A ప్రకారం అప్రూవర్‌ను ట్రయల్ అయిపోయే వరకు బయటకు పంపకూడదు కానీ చట్టంలో లొసుగులను అధారంగా చేసుకుని.. అడిగినంత డబ్బు ఇస్తామని అప్రూవర్‌గా మార్చారు అప్రూవర్ అనేది అనవాయితీగా మారితే న్యాయం ఎక్కడ జరుగుతుంది? సిబిఐతో సునీత, దస్తగిరి లాలూచీకి అనేక ఉదహరణలు ఉన్నాయి ఇచ్చిన వాంగ్మూలన్నే నా వాంగ్మూలం కాదని సునీత చెబితే సిబిఐ ఎలా అంగీకరిస్తుంది.? హత్య జరిగిన పది రోజులకు సునీత ప్రెస్ మీట్ లో ఏం చెప్పిందో అందరికీ తెలుసు జమ్మలమడుగులో చనిపోయే ముందు రోజు వరకు అవినాష్ రెడ్డికి మద్దతుగా వివేకా ఎన్నికల ప్రచారం చేశారని సునీత చెప్పింది ఇంత స్పష్టంగా చెప్పి ఇప్పుడు ఎంపి టికెట్ కోసమని ఎలా మాట మార్చుతారు? నాకు బెయిల్ వచ్చాకా ఇప్పటివరకు 13 సార్లు వాంగ్మూలం ఇచ్చాను ఎవరో ఫోన్ చేస్తే అవినాష్ వెళ్లి సాక్షాలు చెరిపానని సునీత బురద జల్లుతోంది ఈ కేసులో శివప్రకాష్ రెడ్డి మూడవ వ్యక్తి అని సునీత ఎలా చెబుతుంది? వైఎస్ వివేకానందరెడ్డికి సొంత బావమరిది శివప్రకాష్ రెడ్డి, ఆయన మూడో మనిషి ఎలా అవుతాడు ? శివప్రకాష్ చెబితేనే నేను వివేకా ఇంటికి వెళ్లాను, అ తరువాతే నేను సమాచారం చెప్పాను మూడో వ్యక్తి కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానని ఎలా అంటారు ? ఎవరైనా కాల్ చేస్తారని ముందే ఊహిస్తారా? నేను వెళ్లక ముందే క్రిష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లాడు, సునీత, నర్రెడ్డి రాజశేఖరరెడ్డితో మాట్లాడాడు నేను వెళ్లగానే పోలీసులకు కూడా చెప్పాను వివేకా లెటర్ దాచిపెట్టడం పెద్ద నేరం, తప్పడు ఉద్దేశం ఉంటే అ రోజే చెప్పి ఉండాలి ఎర్రగంగిరెడ్డి 45 నిమిషాలు అలస్యంగా వచ్చాడు ఎర్రగంగిరెడ్డికి శివప్రకాష్ రెడ్డే ఫోన్ చేశాడు సునీత ఏ రకంగా నిందలు వేస్తున్నారో అందరు గమనించాలి ఎర్రగంగిరెడ్డి వివేకాకు ఎంత అప్తుడొ అందరికి తెలుసు వివేకానందరెడ్డి చివరి రెండేళ్లు తీవ్ర దుర్బర పరిస్దితి అనుభవించారు చివరి రోజుల్లో ఎందుకు నిరాదరణకు గురిచేసారో చెప్పాలి ? బెంగుళూరులో సెటిల్ మెంట్ లో డబ్బు వస్తే రెండో కుటుంబానికి ఇవ్వాలని ప్రయత్నించారు. రెండో పెళ్లి చేసుకున్నాడన్న కారణంగా వివేకాను సొంత కుటుంబ సభ్యులే నిరాదరణకు గురిచేశారు ఇక సునీత తరచు చెబుతున్నట్టు గూగుల్ మ్యాప్, గూగుల్ టేక్ అవుట్ ఒకటి కాదు గూగుల్ టేక్ అవుట్‌కు శాస్త్రీయత లేదని గూగులే చెబుతోంది వైఫై వాడితే ఒక రకంగా డేటా అయితే ఒక రకంగా చూపుతుంది 100 మీటర్ల నుంచి కిలోమీటర్ అంత దూరం తేడా కనిపిస్తోంది అది కూడా మూడేళ్ల తరువాత చూశారు? మొదట్లో గూగుల్ టేక్ ఔట్ ఎందుకు తప్పని అనిపించలేదు? గూగుల్ టేక్ ఔట్ అనేది తప్పుగా నమోదు చేశామని సిబిఐ ఎందుకు కోర్టుకు వివరణ ఇచ్చింది? గ్రీన్ విచ్ మీన్ టైం ప్రకారం 5.30గంటలు వెనక చూపించామని లిఖిత పూర్వకంగా ఎందుకు రాసిచ్చింది? ఇది వివాదం అవ్వడంతో దీంతో మళ్లీ సాకులు చెబుతు కౌంటర్ వేశారు వారి కారణాలపైనే వారే అఫిడవిట్ వేశారు, అబద్దాన్ని ఏమి చేసినా నిజం కాదు చంద్రబాబు కుట్రలో సునీత భాగమై ఇలా మాట్లాడుతున్నారు నేను ఏ తప్పు చెయ్యలేదు, ఎవ్వరికీ భయపడిదిలేదు న్యాయవ్యవస్దపై పూర్తి నమ్మకం ఉంది ఈ కేసులో తాము అనుసరిస్తోన్న తీరుకు సిబిఐ లెంపలేసుకుని వెనక్కి వెళ్లాల్సి వస్తుంది నా ఫోన్లో వాట్సప్ యాక్టివ్ ఉన్నందుకు నిందితులతో మాట్లాడానని ఆరోపిస్తున్నారు ఆరోపించే వారికి కనీసం వాట్సాప్ పట్ల అవగాహన అయినా ఉండాలి నా నెంబర్ వాట్సాప్‌లో ఎన్నో గ్రూపులున్నాయి. ఏ గ్రూపులో ఎవరు పోస్ట్ చేసినా.. వాట్సాప్‌లోకి వస్తుంది నేను నిద్ర పోయినప్పుడు వచ్చే మెసెజ్‌లు ఎవరైనా చూస్తారా? మూడేళ్లుగా నన్ను అప్రతిష్టపాలు చేశారు అనేక ఇబ్బందులకు గురిచేశారు 74 యేళ్ల వయస్సులో మా తండ్రి జైలులో మగ్గుతున్నాడు టిడిపి, బిజేపి నాయకులను అడ్డుపెట్టుకుని కేసులు వేశారు హత్యని తెలిసింది ముందుగా వివేకా కుటుంబ సభ్యులకే.! వైఎస్అర్ చనిపోయాక షర్మిలకు ఎంపిగా ఉండాలనే ఆలోచన ఎందుకు రాలేదు? వీరే కదా నన్ను ఎంపీగా ఉండమని పిలిచింది కేవలం ఎంపీ పదవి చూపి విమర్శలు చెయ్యడం సరికాదు -
కూడు నీళ్లు లేవు పిలిచి మోసం చేసారు
-
ఇవేం రాజకీయాలు? ఇదేం తీరు?
వైఎస్ వివేకానందరెడ్డి హత్య 2019లో జరిగింది. ఆ హత్య జరిగిన సమయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. అధికారంలో తెలుగుదేశం ఉంది. ఆనాడు వ్యవస్థలన్నీ చంద్రబాబు చేతిలోనే ఉన్నాయి. అప్పుడు మీనమేషాలు లెక్కించిన వారు ఇప్పుడు 2024లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో.. ముఖ్యంగా షర్మిల చేస్తున్న రాజకీయ ఆరోపణలపై కడపలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల ఎక్కడికి వెళ్లి ప్రచారం చేయాలనుకున్నా.. నేను రాజశేఖరరెడ్డి బిడ్డను అని చెప్పాలనుకున్నా.. ప్రజల మాత్రం జై జగన్ నినాదాలు వినిపిస్తున్నారు. చెప్పుకోడానికి షర్మిలకు ఏం లేదా? ఈ ఎన్నికల్లో షర్మిల కడప ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ షర్మిల చెప్పుకోడానికి ఏమి లేకపోవడంతో మళ్లీ వివేకానంద హత్య కేసుపై పదే పదే ప్రసంగాలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు హయాంలో జరిగిన హత్యను ఇప్పుడు రాజకీయంగా ఉపయోగించుకునేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. మాట మారిందెందుకమ్మ.? : రాచమల్లు వైఎస్ కుటుంబ విషయాలను రాజకీయం కోసం షర్మిల వాడుకోవడం సరికాదని హితవు పలికారు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. షర్మిలమ్మ తన స్థాయికి మించి, సంబంధం లేని మాటలు మాట్లాడుతోందని తప్పుబట్టారు. వైఎస్ఆర్ మరణించాక.. ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ FIRలో చేర్పించిందని, వైఎస్ జగన్‌ను అక్రమంగా 15 నెలలు జైలులో పెట్టిందని, రాష్ట్రాన్ని రెండుగా విభజించిందని.. ఆనాడు షర్మిల అన్నారని రాచమల్లు పేర్కొన్నారు. ఇప్పుడు తన రాజకీయ స్వార్థం కోసం షర్మిల మాట మార్చడం సరికాదని హితవు పలికారు రాచమల్లు. సొంత అన్న అభిమతం తెలుసుకోలేకపోతున్నారు తెలంగాణాలో తరిమేస్తే ఆంధ్రాలో పడినట్లు నాలుగు ఓట్లు సంపాదించుకునేందుకు షర్మిల వైఎస్ పేరును ఉచ్చరించడం సరికాదన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశాయాలకు, ప్రతిబింబాలకు నిజమైన వారసుడు జగన్ మాత్రమేనన్నారు. ఒకే తల్లి కడుపున పుట్టి సొంత అన్న అభిమతం, ఆలోచనలను, మంచి తనాన్ని షర్మిల తెలుసుకోలేపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రక్తంతో తడిచిందంటూ షర్మిల చేస్తున్న ప్రకటనలను తప్పుబట్టారు. వైఎస్సార్సిపి పేదవాడి చెమటతో నడుస్తోన్న పార్టీ అని పార్టీ, పరిపాలన, జగనన్న ఆలోచన అన్నీ పేదవాడి కోసమేనన్నారు. నిన్నటిదాకా తెలంగాణ.. హఠాత్తుగా ఏపీ నిన్నటిదాకా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలని చెప్పుకున్న షర్మిలకు ఇప్పుడు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న సంబంధం ఏంటని ప్రశ్నించారు. క్యాలెండర్లో పేజీ ఎలా మారుతుందో అలా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేసరికి పార్టీ మార్చిందని, మాట్లాడే తీరూ మారిందన్నారు. షర్మిలమ్మ ఈ రాష్ట్ర బిడ్డగా, జిల్లా బిడ్డ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చిన్నాన్న కోరిక మేరకు ఎంపీగా పోటీ చేస్తానని చెప్పారన్నారు. చంద్రబాబుకు మద్దతు..కాంగ్రెస్‌కు జీ హుజూర్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉంటూ టీడీపీకి మద్దతు ఇస్తూ షర్మిల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ఇంటి విషయాలను వీధిలో పెట్టి షర్మిల రాజకీయం చేస్తున్నారన్నారు. చంద్రబాబుకు మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీకి జీ హుజూర్ అని ఎలా అంటున్నారని తెలిపారు. తాను రాజశేఖరరెడ్డి బిడ్డను అంటూ రాజశేఖరరెడ్డిని హీనంగా మాట్లాడిన చంద్రబాబుతో అంతర్గతంగా ఎలా అవగాహన కుదుర్చుకున్నారని ప్రశ్నించారు. షర్మిల నైతికతకు ఇది నిదర్శనమని దుయ్యబట్టారు. -
సీఎం జగన్ యాత్రకు తరలివస్తున్న ప్రజలు
-
Bus Yatra: ఇడుపులపాయ నుంచి ప్రచార భేరి
సాక్షి, అమరావతి: పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావడమే లక్ష్యంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచారభేరి మోగించనున్నారు. బుధవారం ఉదయం 10.56 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి మధ్యాహా్ననికి ఇడుపులపాయ చేరుకుని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద ప్రార్థనలు చేసి నివాళులు అరి్పస్తారు. అనంతరం ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రను ప్రారంభిస్తారు. తొలిరోజు బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గంలో జరగనుంది. ఇడుపులపాయ నుంచి వేంపల్లి, వీరపునాయునిపల్లె, ఎర్రగుంట్ల మీదుగా సాయంత్రం ప్రొద్దుటూరు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుంచి దువ్వూరు, చాగలమర్రి మీదుగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. గురువారం నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. ప్రజాక్షేత్రంలోనే జననేత.. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ 21 రోజులపాటు సీఎం జగన్ బస్సుయాత్రను నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో యాత్ర జరగనుంది. సిద్ధం సభలు జరిగిన నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాలు మినహా మిగతా 21 ఎంపీ స్థానాల పరిధిలో బస్సు యాత్ర నిర్వహిస్తారు. యాత్రలో రోజూ ఉదయం వివిధ వర్గాల ప్రజలు, మేధావులతో సీఎం జగన్ సమావేశమవుతారు. ప్రభుత్వ పనితీరును మరింత మెరుగుపర్చుకోవడానికి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. సాయంత్రం ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. బస్సు యాత్రలో 21 రోజులు ప్రజలతో సీఎం జగన్ మమేకమవుతారు. పూర్తిగా ప్రజాక్షేత్రంలోనే ఉంటారు. విప్లవాత్మక మార్పులను వివరిస్తూ.. నాటి అరాచకాలను ఎండగడుతూ.. వైఎస్సార్సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడం కోసం భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లలో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు ప్రజలు ఒకదానికి మించి మరొకటి పోటీపడుతూ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా చరిత్రలో నిలిచాయి. అదే సమయంలో టీడీపీ–జనసేన పొత్తు లెక్క తేలాక తాడేపల్లిగూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో జతకలిశాక మూడు పారీ్టలు చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యాయి. సిద్ధం సభల ఊపుతో 175 శాసనసభ, 25 లోక్‌సభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించిన సీఎం జగన్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా బస్సు యాత్ర ద్వారా తొలి విడత ప్రచారాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా ప్రతి ఇంటా, ప్రతి గ్రామం, ప్రతి నియోజకవర్గంలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను వివరిస్తూ 2014–19 మధ్య చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ సర్కార్ అరాచకాలను మరోసారి గుర్తు చేయనున్నారు. ఇప్పుడు మళ్లీ అదే కూటమి జట్టు కట్టటాన్ని ఎండగడుతూ బస్సు యాత్రలో ప్రచారం చేయనున్నారు. -
కడపలో చంద్రబాబుకు బిగ్ షాక్.. వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
YSRCP ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా
-
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పై మహిళ నేతల నిరసన
-
కడప టీడీపీలో కుమ్ములాట
-
ఎకానమీ క్లాస్‌లో సూపర్ స్టార్.. వీడియో వైరల్!
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల లాల్ సలామ్ సినిమాలో మెప్పించారు. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో కీ రోల్ పోషించారు. గతనెల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది. ఆయన ప్రస్తుతం వెట్టైయాన్ చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా తలైవా కడప ఎయిర్‌పోర్ట్‌లో మెరిశారు. ఓ సామాన్యుడిలా ఎకానమీ క్లాస్‌లో దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన తలైవా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దటీజ్ సూపర్ స్టార్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఓ ప్రయాణికుడు ట్విటర్లో రాస్తూ.. నేను దేవుడికి అత్యంత సన్నిహితంగా ఉన్నాను అంటూ పోస్ట్ చేశాడు. అదే ఫ్లైట్‌లో ఉన్న నటుడు జీవా కూడా ఉన్నారు. ఆ తర్వాత రజనీకాంత్ బస్సులో ప్రయాణిస్తున్న వీడియోను నటుడు జీవా తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. రజనీకాంత్, జీవా బస్సులో నిలబడి ఉన్న ఫోటోలు, వీడియోలు కూడా వైరలయ్యాయి. సీసీఎల్ కోసం చెన్నై రైనోస్ టీమ్‌తో కలిసి వీరిద్దరు బస్సులో వెళ్లారు. View this post on Instagram A post shared by Jiiva (@actorjiiva) #Thalaivar at flight ❤️❤️❤️❤️#Rajinikanth | #Rajinikanth𓃵 | #SuperstarRajinikanth | #SuperStarRajinikanth𓃵 | #Jailer | #Thalaivar171 | #Jailer2 | #Vettaiyan | #superstar @rajinikanth pic.twitter.com/b443yrgcU0 — Suresh balaji (@surbalutwt) February 29, 2024 -
కడపలో ప్రజా ప్రస్థానం కార్యక్రమం
-
భగ్గుమన్న తెలుగు తమ్ముళ్లు
లక్కిరెడ్డిపల్లె: అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ టికెట్ ను మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి కేటాయించడంపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి రమేష్ కుమార్ రెడ్డి వర్గీయులు భగ్గుమన్నారు. టీడీపీ పదవులకు శనివారం మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు రమేష్ రెడ్డి అనుచర వర్గం ప్రకటించింది. మరో మాజీ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి అనుచరులు కూడా రాంప్రసాద్ రెడ్డికి టికెట్ కేటాయించడంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో టీడీపీ జెండాలను ,కరపత్రాలను లక్కిరెడ్డిపల్లి ముడు రోడ్ల కూడలిలో నిప్పు పెట్టి దగ్ధం చేశారు. చంద్రబాబు నాయుడు పోస్టర్ల పైన చెప్పులతో చితకబాదుతూ టీడీపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డబ్బుకు అమ్ముడుపోయిన చంద్రబాబు డౌన్ డౌన్, లోకేష్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
పార్టీ కోసం ఇంత కష్టపడితే.. మాకిచ్చే గౌరవం ఇదేనా!
సాక్షి ప్రతినిధి, కడప: ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేయడం అసాధ్యమేనా? ముందు వచ్చిన చెవుల కంటే వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్నట్లుగా టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరించడమే ఇందుకు కారణమా? పార్టీ ఆవిర్భావం నుంచి అంటి పెట్టుకుని ఉన్న తెలుగుతమ్ముళ్లను వేదనకు గురిచేస్తున్నారా? అనే ప్రశ్నలకు ఔను అనే విశ్లేషకులు సమాధానం ఇస్తున్నారు. విధేయతతో నిమిత్తం లేకుండా స్థాయిని బట్టి ఆపైనున్న నేతలు అణచివేస్తున్నారని పలువురు చెప్పుకొస్తున్నారు. వెరసి జిల్లాలో టీడీపీ కూసాలు కదులుతున్నాయి. అధినేత వైఖరిపై మండిపడుతూ జిల్లా నేతలు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసిన కార్యకర్తకు అదే జెండా అండగా ఉంటుందన్నది పాత మాట. కార్యకర్తల ఉన్నతి కాంక్షించే ఆ పార్టీలో ఇపుడు ‘పొడుగు చేతుల పందేరం’గా వ్యవహారం నడుస్తోందని సీనియర్ నేతలు వాపోతున్నారు. విధేయులు, అవకాశవాదులను ఓకే గాటన కట్టేస్తున్నారనే ఆవేదనతో రగలిపోతున్నారు. కష్టపడ్డ వారికి గుర్తింపు అటుంచితే ఏకంగా పార్టీ నుంచి వెళ్లగొట్టే చర్యలకు పాల్పడుతున్నారు. ఆవిర్భావం నుంచి టీడీపీని అంటిపెట్టుకున్న నేతలు సైతం పార్టీ మారే యోచనలో ఉన్నట్లు సమాచారం. గరం గరంగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డి పదేళ్ల పాటు రాయచోటి నియోజకవర్గ ఇన్చార్జిగా, ఇరవై ఐదేళ్లు టీడీపీ నేతగా మాజీ ఎమ్మెల్యే రమేష్‌కుమార్‌రెడ్డి ఆ పార్టీలో సేవలందిస్తున్నారు. తాజాగా ఈమారు టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. వ్యక్తిగతంగా అధినేత చంద్రబాబుతో సమావేశపర్చమని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును కోరినా ఫలితం లేకుండా పోయింది. దాంతో తీవ్ర ఆక్రోశానికి గురయ్యారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పార్టీ కోసం ఇంతకాలం సేవలు పొంది ఎన్నికలు సమీపించినపుడు మొండిచేయి చూపుతారా? కనీసం పర్సనల్‌గా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరా? ఇలాంటి పార్టీ కోసం తాను ఇంకా పనిచేయాలా అంటూ రమేష్‌రెడ్డి రగిలిపోతున్నట్లు సమాచారం. ఆ మేరకే మండలాలవారీగా నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. వాస్తవ పరిస్థితులను వివరిస్తూ వారి మద్దతు కోరుతున్నారు. ఆయనకు లక్కిరెడ్డిపల్లె మండల టీడీపీ నాయకులు మూకుమ్మడిగా మద్దతు తెలిపారు. ఇన్చార్జి రమేష్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు చేయాలని అలా చేయని పక్షంలో తమ రాజీనామాలు స్వీకరించాలని ఆల్టిమేటం జారీ చేశారు. రాయచోటి నియోజకవర్గ వ్యాప్తంగా నాయకుల మద్దతు కోరుతున్న రమేష్‌రెడ్డి సైతం ఇక ఉపేక్షించరాదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అవసరమైతే జిల్లాలో టీడీపీ భూస్థాపితానికి శాయశక్తులా కృషి చేయాలనే దిశగా సన్నిహితులతో మంతనాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. లింగారెడ్డిని కనుమరుగు చేసిన అధిష్టానం ప్రొద్దుటూరు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా నాలుగుసార్లు పోటీచేసిన మల్లెల లింగారెడ్డి ఒక్కసారి విజయం సాధించారు. అప్పటి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో తలపడుతూనే జిల్లా అధ్యక్షుడిగా పలుమార్లు సేవలందించారు. 2009లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈమారు ఆశావహుల్లో ఒకరైన నంద్యాల వరదరాజులరెడ్డి అభ్యర్థిత్వంపై ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. పార్టీలో చేరకుండానే టీడీపీ టికెట్ ఎలా అడుగుతారని నిలదీస్తూనే, ఆయనకే టికెట్ ఇస్తే పార్టీని నమ్ముకున్న తమలాంటి వారు సన్యాసం స్వీకరించాల్సి ఉంటుందని పరోక్ష హెచ్చరిక చేశారు. అంతే, ఏకంగా జిల్లా అధ్యక్ష పదవి నుంచి సైతం తప్పించారు. ఆ స్థానంలో పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిని కూర్చోబెట్టారు. కష్టకాలంలో టీడీపీకి సేవలందించిన తనను తప్పించడాన్ని మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి జీర్ణించుకోలేకున్నారు. సరైన సమయంలో స్పందించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పుత్తాకు వీరశివా సెగలు కమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా పుత్తా నరసింహారెడ్డి పదహారేళ్లుగా కొనసాగుతున్నారు. మూడు పర్యాయాలు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. మరోమారు ప్రజాతీర్పు కోరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి పుత్తాకు వీరశివా సెగలు తాకుతున్నాయి. తాజాగా మరోమారు కమలాపురం అభ్యర్థిత్వంపై ఐవీఆర్ ఫోన్ కాల్స్ రూపంలో ఇరువురు పేర్లపై టీడీపీ నుంచి అభిప్రాయ సేకరణ చేపట్టడం విశేషం. ఈ వ్యవహారం వెనుక జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ప్రమేయం ఉన్నట్లు పుత్తా వర్గీయులు విశ్వసిస్తున్నారు. మూడు సార్లు పోటీ చేసి పార్టీ ఉన్నతి కోసం పనిచేస్తున్న తనని కాదని, అవకాశవాదుల్ని తెరపైకి తెస్తారా? అని పుత్తా మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు, కడప, కమలాపురం నియోజకవర్గాల్లో శ్రీనివాసులరెడ్డి ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆవేదనను తెలుగుతమ్ముళ్లు వ్యక్తం చేస్తున్నారు. కడప పార్లమెంటు, అసెంబ్లీ ఎక్కడి నుంచైనా సరే శ్రీనివాసులరెడ్డి కుటుంబం పోటీ చేస్తే, ఓడించాలనే దిశగా స్వంత అన్న రమేష్‌రెడ్డి సైతం మండిపడుతోన్నట్లు పలువురు చెప్పుకొస్తుండటం విశేషం. రెడ్యంకు దక్కని ప్రాధాన్యత మైదుకూరు నియోజకవర్గంలో రాష్ట్ర కార్యనిర్వాహక మాజీ కార్యదర్శి రెడ్యం సోదరుల పరిస్థితి కూడా పై వారికి భిన్నంగా ఏమీ లేదు. ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ పార్టీలో సీనియారిటీ ఉన్న నాయకుల్ని కనుమరుగు చేయాలనే ఎత్తుగడల్లో భాగంగా వారిని పక్కకు తప్పిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేసిన రెడ్యం సోదరులకు పార్టీలో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
UK : లండన్‌లో YSRCP సిద్ధం
లండన్‌లో కేక పుట్టించారు వైఎస్సార్సిపి అభిమానులు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సిద్ధం సభ అత్యంత ఘనంగా జరగడం, జనసంద్రమై సముద్రాన్ని మరిపించడం లండన్‌లోని వైఎస్సార్సిపి అభిమానులను ఎంతో సంతోషపెట్టింది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో వైఎస్సార్సిపి ఘన విజయం సాధిస్తుంది అనడానికి రాప్తాడు సభ ఒక్కటి చాలని అన్నారు ప్రవాసాంధ్రులు. ఇదే సమయంలో రాంగోపాల్ వర్మ తీసిన రెండు సినిమాలు వ్యూహం, అలాగే శపథం సినిమాలు ఘన విజయం సాధించాలంటూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. లండన్‌లోని ఈస్ట్హామ్ ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో YSRCP అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి YSRCP యూకే కన్వీనర్ Dr ప్రదీప్ చింతా వర్చువల్‌గా మాట్లాడారు. 2024 ఏప్రిల్ నెలలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని, యూకేలో, అమెరికాలో ఉంటోన్న ప్రతీ ఏపీ వ్యక్తి, వైఎస్సార్ అభిమాని కొంత సమయం వెచ్చించి నిజాలను తమ వాళ్లకు తెలపాలని ప్రదీప్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి YS జగన్మోహన్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యేవరకు ప్రతీ ఒక్కరు విశ్రమించకుండా.. కష్టపడాలని డాక్టర్ ప్రదీప్ దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంగా ఏపీ రాజకీయాల్లో నిజాలకు అద్దం పట్టేలా రాంగోపాల్‌వర్మ తీసిన వ్యూహం, అలాగే శపథం సినిమాల సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. వ్యూహం సినిమా ఘనవిజయాలు సాధించాలని దర్శకుడు రాంగోపాల్‌వర్మకు శుభాకాంక్షలు తెలియజేశారు. YSRCP UK కమిటీ సభ్యులు కార్తీక్ భూమిరెడ్డి, ప్రతాప్ భీమిరెడ్డి, కిషోర్ మలిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన అమెరికాలోని ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కడప రత్నాకర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. -
కడప రైల్వే స్టేషన్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
-
టీడీపీపై డిప్యూటీ సీఎం ఫైర్
-
YSR: ఆ కంటైనర్లలో అసలు ఏముందంటే..
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కంటైనర్లలో రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని తరలిస్తున్న నేపథ్యంలో భారీ భద్రత ఏర్పాటు చేశామని.. వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. దేశ రక్షణ శాఖకు సంబంధించిన సామాగ్రిని చెన్నైకి తరలిస్తున్న నేపథ్యంలో పోలీసు, ఆర్మీకి చెందిన ఉన్నతాధికారులు, సిబ్బంది ఎస్కార్ట్‌గా విధులు నిర్వర్తిస్తున్న క్రమంలో రూ.వేలకోట్లు నగదు తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం తగదని కడప డీఎస్పీ అన్నారు. దేశ రక్షణకు సంబంధించి సామాగ్రి తరలించే సమయంలో పక్కా ప్రణాళికతో భద్రతా ఏర్పాట్లు ఉంటాయని, సామాగ్రి వెళ్తున్న రూటులో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలన్న జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఆదేశాల మేరకు, రక్షణ శాఖ విజ్ఞప్తి మేరకు ఆర్మీ అధికారుల ఎస్కార్ట్‌తో పాటు పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చామని తెలిపారు. వాస్తవాలు ఇలా ఉంటే సోషల్ మీడియా వేదికగా అసత్యాలు, అభూతకల్పనలు ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. దుష్ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. -
రేవంత్‌తో కలసి సీఎం జగన్ పై కుట్ర ?
-
సూత్రధారి కుటిలనీతి చంద్రబాబు
-
సూత్రధారి కుటిలనీతి చంద్రబాబు
-
కడపలో చంద్రబాబు మరో కుట్ర
-
'కడప గడ్డపై ఓ కపట నాటకం' తెరపైకి సౌభాగ్యమ్మ!
అడుగడుగునా రాక్షసత్వం కనిపించే అత్యంత విస్తృతమైన నాటకమిది. పాత్రలు ఎవరైనా.. ఆడించేది మాత్రం చంద్రబాబు నాయుడు, ఆయన కోసం పనిచేసే మనుషులే!!. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అయినా... ఆయన మనుషులు అన్నిచోట్లా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టులు... ఇలా ఎక్కడ ఉన్నా పనిచేసేది మాత్రం బాబు కోసమే. కాకపోతే ఎంతమంది ఎన్ని చేసినా... జనం మనసుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోవటం ఆయనకు చేత కావటం లేదు. ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కోవటం అసాధ్యమని భావించటంతో.. విషప్రచారమే లక్ష్యంగా జగన్‌పైకి సొంత కుటుంబీకులనే పంపటానికి కుట్రపన్నారు. కడప కేంద్రంగా... కుట్రలన్నిటికీ కేంద్రస్థానం లాంటి భయంకరమైన కూహకానికి తెరతీశారు. (సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) : ఇడుపులపాయలో రెండ్రోజుల కిందట షర్మిల–సునీత కలిశారు. దానికి ఎల్లో మీడియా ఎందుకు అంత ప్రాధాన్యమిచ్చింది? హైదరాబాద్‌లో రెగ్యులర్‌గా కలిసే ఈ అక్కచెల్లెళ్లిద్దరూ ఒకరినొకరు ఇడుపుల పాయలో కలిస్తే అంత ప్రాధాన్యమెందుకు? ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి భార్య సౌభాగ్యమ్మను కడపలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించటమనేది ఇక్కడ దాదాపుగా ఖరారైంది. కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే... బీజేపీకి తప్పుడు సంకేతాలు వెళ్లి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమకు వ్యతిరేకంగా మారవచ్చని సునీత భయం. దీంతో... ఆమె తల్లి సౌభాగ్యమ్మను తెరపైకి తీసుకొచ్చారు. ఎందుకంటే బీజేపీలోని సీఎం రమేశ్, సుజనా చౌదరి లాంటి టీడీపీ నేతలే ఈ కేసులో ఆమెకు ఆర్థికంగా, న్యాయపరంగా సహకరించటంతో పాటు రికమెండేషన్లు, పైరవీల్లోనూ సాయం చేస్తున్నారు. ఇక తెలుగుదేశంలో చేరిపోతే... బాబు నాయుడితో, ఏబీఎన్ రాధాకృష్ణతో, వివేకాను అనైతికంగా ఓడించిన బీటెక్ రవితో తమ సత్సంబంధాలు బాహాటంగా బయటపడిపోతాయని... ఇన్నాళ్లూ కేసును వెనకనుంచి నడిపింది వీరేనన్న సత్యం వెల్లడయిపోతుందని భయం. దీంతో బాబు ప్లాన్ ప్రకారం... సునీత తల్లి సౌభాగ్యమ్మను స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టేటట్లుగా, దానికి కాంగ్రెస్, టీడీపీ నూరు శాతం మద్దతిచ్చేట్లుగా వీరి మధ్య ఒక అవగాహన కుదిరినట్లు తెలిసింది. ఇలా చేస్తే ప్రస్తుతం ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డిపై వీలైనంత బురద జల్లవచ్చని, కుటుంబంలోని వ్యక్తి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారనే ముసుగులో కుటుంబీకుల మద్దతు అడగవచ్చనేది వారి ఆలోచన. పైపెచ్చు కుటుంబంలోని వ్యక్తి ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా... మద్దతివ్వకుండా ఆమెపై అభ్యర్థిని నిలబెట్టారనే కోణంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పైనా దు్రష్పచారం చేయాలనేది వారి కుట్ర. ఇది కుట్ర అని అడుగడుగునా తెలిసిపోతున్నా... పాత్రధారులు మాత్రం బాబు నాయుడి ఉచ్చులో పడి ఆయన చెప్పినట్లు చేసుకుంటూ పోతుండటమే అన్నిటికన్నా విచిత్రం. వివేకా హత్య జరిగిన నాటి నుంచి వరసగా మారుతున్న పరిణామాలు... దీన్లోని లోతైన కుట్ర కోణాన్ని చెప్పకనే చెబుతాయి. మీ నాన్నను చంపింది నేనే! అని చెప్పినా... ఇతను వివేకా మాజీ డ్రైవరు. వివేకాను తానే గొడ్డలితో నరికి నరికి కిరాతకంగా చంపానని స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చి న వ్యక్తి. రూ.500, వెయ్యి అప్పులు తెచ్చుకుని గాలికి తిరిగే ఈ దస్తగిరి ఆర్థిక పరిస్థితి... వివేకా కేసులో అప్రూవర్‌గా మారాక ఒక్కసారిగా టర్న్ అయింది. కార్లలో డ్రై వరును పెట్టుకుని తిరిగే స్థితికి వచ్చేశాడు. వివిధ కోర్టుల్లో ఈయనపై ఉన్న కేసుల కోసం లాయర్లను సునీత, చంద్రబాబు, బీటెక్ రవి పెడుతున్నారంటే ఈ కుట్రను తేలిగ్గానే అర్థం చేసుకోవచ్చు. దస్తగిరి అప్రూవర్‌గా మారకముందే ముందస్తు బెయిలు కోసం కోర్టులో దరఖాస్తు చేశాడు. తన తండ్రిని అత్యంత కిరాతకంగా నరికి చంపానని స్వయంగా చెప్పిన దస్తగిరి బెయిలుకు.. వివేకా కుమార్తెగా సునీత ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. వీళ్ల మధ్య ఉన్న ఎంత గాఢమైన లోపాయికారీ ఒప్పందం ఉందో తెలియటానికి ఇది చాలదూ!!. నాన్నను అనైతికంగా ఓడించినా... క్రికెట్ బెట్టింగుల్లో స్థానికంగా చిరపరిచితుడు. బెట్టింగుల్లో పోలీసులకూ దొరికాడు. 2017లో టీడీపీ తరఫున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కడపలో పోటీ చేసి.. వైఎస్సార్సీపీ తరఫున బరిలో నిలిచిన వైఎస్ వివేకాను అనైతికంగా ఓడించాడు. చాలినంత మంది ఎంపీటీసీ, జెడ్పీటీసీల మద్దతు లేకపోయినా... నాటి సీఎం చంద్రబాబు, మంత్రి ఆదినారాయణరెడ్డి సాయంతో వాళ్లను రకరకాలుగా ప్రలోభపెట్టాడు. కొందరిని బెదిరించి లోబరచుకుని తనకు బలం లేకున్నా వివేకాను ఓడించగలిగాడు. తండ్రిని దుర్మార్గపు పద్ధతుల్లో ఓడించిన ఈ వ్యక్తి... ఇపుడు సునీత దంపతులకు అత్యంత సన్నిహితుడంటే ఏమనుకోవాలి? కేసు గురించి, కేసుద్వారా పొందాల్సిన రాజకీయ ప్రయోజనాల గురించీ వీరు నిత్యం సంప్రతింపులు జరుపుకొనే స్థాయిలో ఉన్నారంటే ఏమనుకోవాలి? ఈ కేసులో అవినాశ్‌పై బురద జల్లాలనుకున్న ప్రతిసారీ... మాట్లాడేది రవి. మాట్లాడించేది సునీత దంపతులు. బీటెక్ రవి తీవ్రమైన విమర్శలు చేయటం... దాన్ని ఎల్లో మీడియా విస్తతంగా ప్రచారం చేయటం... తరవాత చంద్రబాబు సహా టీడీపీ వాళ్లు ఇవే అంశాల్ని మాట్లాడటం వీళ్ల మోడెస్ ఆపరాండీ. బాబు శిష్యుల కలయిక దేనికోసం? కనెక్షన్ అనొచ్చు... రిలేషన్ అనొచ్చు. చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ, సునీత, షర్మిల అందరూ ఇందులో భాగమే. ఆ రాష్ట్రమూ కాదు... ఆ పార్టీ కూడా కాదు. కానీ రేవంత్‌రెడ్డిని బీటెక్ రవి వెళ్లి కలిశాడంటే ఏమిటర్థం? అప్పటిదాకా తెలంగాణలోనే చావో రేవో అన్న షర్మిల... ఆ తరవాత కాంగ్రెస్‌లో చేరి నేరుగా ఏపీకి వచ్చి ఈ రకమైన మంత్రాంగం నడుపుతున్నారంటే ఏమనుకోవాలి? అయినా ఇది చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటన. మూడు నెలల తరవాత మరో ప్రభుత్వం వచ్చింది. పోలీసులూ వారే... దర్యాప్తు మొదలుపెట్టిందీ వారే. ఇంత స్పష్టంగా నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఆదేశాలతో లేఖ, ఫోన్ దాచిపెడితే వారిని ఎందుకు విచారించలేదు? రాజకీయాలకు, విమర్శలకు ఈ సంఘటనను వాడుకుని... అసలు కేసును నీరుగార్చింది నాటి చంద్రబాబు ప్రభుత్వం కాదా? అసలు ఇన్ని కుట్రలు చేసే బదులు బాబు నేరుగా టీడీపీ టికెట్టే ఇవ్వవచ్చు కదా? అపుడు ప్రజల్లో ఎవరి బలం ఎంత ఉందో తెలిసిపోతుందిగా? కుట్రలకు, కుతంత్రాలకు విలువ ఉందో... లేక మంచి చేసిన ప్రభుత్వానికి విలువ ఉందో తేలిపోతుందిగా? ఏమంటావ్ బాబూ!!? మొదట చూశారు... కుమార్తెకు చెప్పారు వివేకా మృతదేహాన్ని మొదట చూసింది ఆయన పీఏ కృష్ణారెడ్డే. అక్కడే రక్తపు మరకలతో ఉన్న లేఖను, వివేకా మొబైల్ ఫోన్‌ను ఈయన తీసుకున్నాడు. అదే విషయాన్ని సునీతకు ఫోన్లో చెప్పాడు. సునీతతో పాటు వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డికి (ఈయన సునీత భర్త రాజశేఖరరెడ్డికి, సౌభాగ్యమ్మకు సొంత సోదరుడు) కూడా చెప్పాడు. ఈ విషయం కాల్ రికార్డ్స్‌లోనూ వెల్లడయింది. వివేకా గురించి సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పగానే... ఆ లేఖను, వివేకా ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని కృష్ణారెడ్డిని ఆయన ఆదేశించారు. దీంతో ఆయన తదుపరి వచ్చి న బంధువులకు గానీ, పోలీసులకు గానీ ఎవ్వరికీ దీన్ని చూపించలేదు. ఆ లేఖను చూపించి ఉంటే...దాన్లోని రక్తాన్ని చూసైనా ఎవ్వరూ మృతదేహాన్ని ముట్టుకునేవారు కాదేమో. కానీ నర్రెడ్డి ఆదేశాలతో ఆయన ఎవ్వరికీ దీన్ని చూపించలేదు... చెప్పలేదు. ఈ విషయాన్ని సునీతే పోలీసుల దగ్గర అంగీకరించారు. అలా ఎందుకు చెప్పారని అడిగితే... కృష్ణా రెడ్డికి ప్రాణభయం ఉంటుందనే ఉద్దేశంతోనే అలా చెప్పామన్నారు. లేఖ రాసింది తన తండ్రేనని, చేతిరాత ఆయనదేనని కూడా సునీత పోలీసు డీజీపీ ఎదుట అంగీకరించారు. నిజానికి రక్తంతో రాసిన ఆ లేఖను ఎవరు చూసినా... అది సహజ మరణం కాదని తేలిగ్గా అర్థమవుతుంది. పోలీసులకో, అక్కడికి వచ్చి న వారికో వెంటనే ఆ లేఖను ఇచ్చి ఉంటే... అక్కడి వ్యవహారం మరోలా ఉండేది. ఇది చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు జరిగిన హత్య. అప్పటి పోలీసులు గానీ, సీబీఐ గానీ ఎందుకు ఈ లేఖ, ఫోన్ చూపించలేదని... ఫోన్లో నుంచి వివేకా– ఆయన రెండో భార్య షమీమ్ సంభాషణల్ని ఎందుకు డిలీట్ చేశారని, సునీతను దూషిస్తూ షమీమ్ లేవనెత్తిన అంశాలను ఎందుకు డిలీట్ చేశారని విచారించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అసలు ఆ కోణాన్నే పట్టించుకోలేదెందుకో..!!. ఈ హత్యలో ఎల్లో మీడియా చేస్తున్న మరో దు్రష్పచారమేంటంటే... ఎంపీ అవినాశ్‌రెడ్డి ముందే అక్కడకు చేరుకున్నారనేది. నిజానికి అవినాశ్ అక్కడకు చేరేసరికే జనం పోగై ఉన్నారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని, సిగరెట్లు ఎక్కువ తాగుతారు కనుకనే ఇలా జరిగిందని తనతో నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి చెప్పినట్లు స్వయంగా నాటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పారు. అదే శివప్రకాశ్ రెడ్డి అవినాశ్కూ ఫోన్ చేసి, ‘‘బావ చనిపోయారు. అర్జెంటుగా అక్కడకు వెళ్లు’’ అన్నారు. దీంతో జమ్మలమడుగులో ఎన్నికల ప్రచారానికని అప్పుడే బయల్దేరిన అవినాశ్‌రెడ్డి.. వెంటనే యూ టర్న్ తీసుకుని అక్కడకు చేరుకున్నారు. ఆయన ఫోన్ చెయ్యకుండా ఉంటే అవినాశ్‌కు విషయం తెలిసేదే కాదు. ఆయన అక్కడకు రాకుండా ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోయి ఉండేవారు. బావ చనిపోయారు.. వెళ్లమని చెప్పిన నర్రెడ్డి శివప్రసాద్... ఎలా చనిపోయారనేది కానీ, లెటర్– ఫోన్ సంగతి కానీ చెప్పలేదు. ఇదంతా ఒక్క స్కెచ్ ప్రకారం జరిగిందనటానికి ఇంతకన్నా ఏం కావాలి? ఆస్తి కోసం సునీతతో విభేదాలు వివేకా మరణించిన నాడు షమీమ్‌కు, వివేకాకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, మెసేజుల్లో చాలా అంశాలున్నాయి. ముఖ్యంగా సునీత గురించి జరిగిన ఎస్ఎంఎస్/సంభాషణలన్నీ ఆ తరవాత డిలీట్ చేసేశారు. ఎందుకు చేశారనేది దర్యాప్తు చేయనేలేదు. వివేకాకు, షమీమ్‌కు ఒక కుమారుడు ఉన్నాడనే అంశాన్ని సైతం రహస్యంగానే దాచిపెట్టారు. షమీమ్ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకాను ఆయన కుమార్తె, అల్లుడు, బావమరిది ఏ రకంగా హింస పెట్టారు... చెక్ పవర్ తీసేసి ఆర్థికంగా ఎలా నిర్వీర్యం చేశారో స్పష్టంగా చెప్పారు. దస్తగిరి తాను వివేకాను చంపటానికి ముందు కొన్ని డాక్యుమెంట్ల కోసం ఇల్లంతా వెతికినట్లు సాక్షులు చెప్పారు. కానీ దర్యాప్తులో ఆ అంశాలకు విలువే ఇవ్వలేదు. అంతేకాదు. తొలుత ఛార్జిషీట్లో వివేకాకు, ఏ1గా పేర్కొన్న ఎర్ర గంగిరెడ్డికి ఆర్థికపరమైన వివాదాలున్నాయని, వివేకాకు ఏ2 సునీల్ యాదవ్ తల్లితోను, ఏ3 ఉమామహేశ్వరరెడ్డి భార్యతోను అక్రమ సంబంధాలున్నాయని స్పష్టంగా ఉన్నప్పటికీ... ఆ కోణాన్ని తరువాతి ఛార్జిషీట్లలో పూర్తిగా తొక్కిపట్టేశారు. దూరం 700 మీటర్లే అవినాశ్, వివేకా ఇళ్ల మధ్య ఉన్న దూరం ఏరియల్ డిస్టెన్స్ అయితే 250 మీటర్లు. రోడ్డు మార్గాన అయితే 700 మీటర్లు. గూగుల్ టేకవుట్ పేరు చెప్పి వివేకా ఇంట్లో ఉన్న ఒక మనిషిని అవినాశ్ ఇంటికి వచ్చినట్లు ఎలా నిర్ధారిస్తారు? ఆ రోజు ఉదయం అవినాశ్ ఎన్నికల ప్రచారం కోసం జమ్మలమడుగుకు బయలుదేరి పులివెందుల రింగ్రోడ్లోకి ప్రవేశించిన వెంటనే నర్రెడ్డి శివప్రసాద్ ఫోన్ చేసి వివేకా మరణం గురించి చెప్పారు. వెంటనే ఆయన యూ–టర్న్ తీసుకుని తనతో ఉన్న 3 వాహనాలతో సహా వివేకా ఇంటికి వెళ్లారు. ఫోన్ వచ్చి న రెండు నిమిషాల్లోనే ఎలా వచ్చారనేది సీబీఐ ప్రశ్న. నిజానికి రింగ్‌రోడ్డు (కృష్ణాలయం) నుంచి వివేకా ఇంటికి రెండు నిమిషాలు చాలు. పైపెచ్చు ఉదయాన్నే రోడ్లు ఖాళీగా ఉంటాయి కదా!. -
‘కడప’టికి సైకిల్‌కు శూన్యమే!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రమయ్యాయి. వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో ఎప్పటి నుంచో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న శ్రేణులు పరేషాన్ అవుతున్నాయి. సీనియారిటీకి విలువ ఇవ్వకపోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వంటివి టీడీపీకి మైనస్ అవుతున్నాయని పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. బద్వేల్, మైదుకూరు, కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో ఇన్చార్జుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి వైఖరి ఇలాగే ఉంటే జిల్లాలో గత ఎన్నికల్లోలాగానే తెలుగుదేశానికి మిగిలేది శూన్యమేననే వాదన ఆ పార్టీలోనే వ్యక్తమవుతోంది. రీతి లేని రితీష్ బద్వేల్లో ఎప్పటి నుంచో టీడీపీకి విధేయతగా ఉన్న దివంగత కర్నాటి శివారెడ్డి (కర్నాటి వెంకటరెడ్డి), బద్వేల్ మాజీ జెడ్పీటీసీ శిరీష కుటుంబాలతోపాటు, కలశపాడు బాలిరెడ్డి వంటి వారు ప్రస్తుత నియోజకవర్గ ఇన్చార్జి కొనిరెడ్డి రితీష్‌కుమార్‌రెడ్డి తీరు తమకు అవమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దివంగత మంత్రి వీరారెడ్డి హయాం నుంచి టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులను చవిచూస్తున్నారు. పుట్టెడుజిత్తుల.. ‘పుట్టా’ మైదుకూరు నియోజకవర్గం ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ ఏకపక్ష వైఖరి వల్ల టీడీపీలో తొలి నుంచి ఉన్న రెడ్యం వెంకటసుబ్బారెడ్డికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతోంది. దువ్వూరు మండల నేత వెంకట కొండారెడ్డిదీ అదే దుస్థితి. డీఎల్ రవీంద్రారెడ్డి మంత్రిగా ఉన్న కాలంలో కూడా రెడ్యం సోదరులు టీడీపీ జెండా కోసం పనిచేశారు. అలాంటి వారినీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆ పార్టీ నుంచి సాగనంపేందుకు సిద్ధమయ్యారని శ్రేణుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సెల్ఫ్ ఫోకస్లో ప్రవీణ్‌రెడ్డి ప్రొద్దుటూరులో టీడీపీ ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా ఒంటెత్తు పోకడలు పోతున్నారు. సీనియర్ నేతలు నంద్యాల వరదరాజులరెడ్డి, మల్లెల లింగారెడ్డిలను విస్మరిస్తూ తను మాత్రమే ఫోకస్ కావాలనే దిశగా అడుగులు వేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఏదేమైనా వైఎస్సార్ జిల్లాలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిల వైఖరికి విస్తుపోతున్న సీనియర్ నేతలు పార్టీలో కొనసాగాలా లేదా? ప్రత్యామ్నాయమార్గం ఏమిటీ? అనే సందిగ్ధంలో ఉన్నారు. మాధవీరెడ్డి దుందుడుకు చర్యలతో విస్తు తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ ఇన్చార్జి మాధవీరెడ్డి దుందుడుకు చర్యలతో తెలుగుతమ్ముళ్లు విస్తుపోతున్నారు. ప్రశాంతతకు కేంద్ర బిందువుగా ఉన్న జిల్లా కేంద్రంలో రెచ్చగొట్టే చర్యలకు ఆమె పాల్పడుతున్నారనే ఆవేదన ఆ పార్టీ సీనియర్ల నుంచి వ్యక్తమవుతోంది. నాయకురాలిగా ఫోకస్ కావాలనే తపన ఉండొచ్చు కానీ, బహిరంగంగా అధికార పార్టీ క్యాడర్‌తో వాదనకు దిగడం విడ్డూరంగా ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషాలాంటి స్థాయి ఉన్న వారినీ ఆమె ఏకవచనంతో సంబోధిస్తున్నారని పలువురు ఎత్తిచూపుతున్నారు. సొంత క్యాడర్‌తో కూడా ఆమె దురుసుగా వ్యవహరిస్తున్నారనే వాదన ఉంది. పార్టీ ఇన్చార్జిగా ఇప్పుడే ఇలా ఉంటే, అధికారిక హోదా దక్కితే ఆమెను నియంత్రించడం సాధ్యం కాదనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. -
కడపలో శ్రీకృష్ణ దేవరాయలు 533వ జయంతి కార్యక్రమం
-
గడప వద్దే లబ్ధిదారులకు పింఛన్లు అందించనున్న వలంటీర్లు
-
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ రెండో రోజు పర్యటన
Updates 2:54PM,. Dec 24. 2023 వైఎస్సార్‌జిల్లాలో సీఎం వైఎస్ జగన్ రెండో రోజు పర్యటన సింహాద్రిపురంలో రోడ్డు వెడల్పు, సుందరీకరణ పనులు వైఎస్సార్ పార్క్, తహశీల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం ప్రారంభోత్సవంతో సీఎం జగన్ ►ఇడుపులపాయ నుంచి సింహాద్రిపురం పర్యటనకు సీఎం జగన్ ►ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరిన సీఎం ►సింహాద్రిపురంలో పోలీసు స్టేషన్, తాహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలతో పాటు సింహాద్రిపురం జంక్షన్, పార్కులను ప్రారంభించనున్న సీఎం ►అనంతరం స్థానిక నాయకులతో సమావేశం కానున్న సీఎం జగన్ ►పులివెందుల మండల నాయకులతో సీఎం జగన్ సమావేశం ►సమావేశానికి హాజరైన ఎంపీ అవినాష్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్ అమర్నాథ్రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్థానిక నాయకులు ఇడుపులపాయలో సీఎం జగన్ ►వైఎస్సార్ ఘాట్‌కు చేరుకున్న సీఎం జగన్ ►మహానేత వైఎస్సార్‌కు నివాళులర్పించిన సీఎం జగన్ ►అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని ప్రార్థనల్లో పాల్గొననున్న సీఎం. ►ముఖ్యమంత్రితో పాటు వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకున్న జిల్లా ఇంఛార్జి మంత్రివర్యులు ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ సురేష్ బాబు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ హేమచంద్రా రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య సలహాదారు రాజోలి వీరారెడ్డి, తదితరులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా నేడు సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్‌కు చేరుకుంటారు. ఘాట్‌లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని 11.30 వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సింహాద్రిపురం జూనియర్ కళాశాల సమీపాన ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.40 గంటల వరకు సింహాద్రిపురం మండల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. అనంతరం సింహాద్రిపురంలోని రోడ్డు వెడల్పు, సుందరీకరణ, వైఎస్సార్ పార్క్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్‌స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్‌లో దిగుతారు. ఎకో పార్క్ మీటింగ్ ప్రదేశానికి చేరుకుంటారు. పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 4.45 గంటలకు గెస్ట్‌హౌస్‌కు చేరుకుని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారు. -
వైఎస్ఆర్ కడపలో రెండో రోజు ఏపీ సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
సీఎం జగన్ కడప టూర్ డే-1
-
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
వైఎస్సార్ జిల్లా: పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం
Updates: ►మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కడప నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►రాత్రికి ఇడుపులపాయలో బస ►రేపు ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం జగన్►అనంతరం ఇడుపులపాయలోని ప్రార్థన మందిరంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ ►కడప కోటిరెడ్డి సర్కిల్లో గాంధీజీ దండి మార్చ్ విగ్రహాలు ఆవిష్కరణ చేసిన సీఎం జగన్ ►కడప కోటిరెడ్డి సర్కిల్ చేరుకున్న సీఎం జగన్ ►అంబేద్కర్ సర్కిల్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ►అంబేద్కర్ చౌరస్తా చేరుకున్న సీఎం జగన్ ►ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ►దివ్యాంగులను ట్రై స్కూటర్లను పంపిణీ చేసిన సీఎం జగన్ ►రిమ్స్‌లో వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్ ►వైఎస్సార్ కేర్ బ్లాక్, వైఎస్సార్ మానసిక వైద్యశాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ►కడపలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్ ►సెంచురీ ప్లై ఇండస్ట్రీస్ ప్రారంభించిన సీఎం జగన్ ►రూ.1000 కోట్లతో యూనిట్ ఏర్పాటు ►2,266 మందికి ప్రత్యక్షంగా లభించనున్న ఉపాధి ►కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►ప్రత్యేక హెలికాఫ్టర్‌లో గోపవరం పయనం ►ఘన స్వాగతం పలికిన జిల్లా నాయకులు, అధికారులు ►మరికాసేపట్లో సెంచూరీ పరిశ్రమ వద్దకు చేరుకోనున్న సీఎం ►వైఎస్సార్ కడప జిల్లాకు బయలేర్దిన సీఎం జగన్ ►మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం ►బద్వేలు, కడప, పులివెందుల, మైదుకూరులలో సీఎం జగన్ పర్యటన సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 23, 24, 25 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన షెడ్యూల్ ఇలా.. ♦ 23వ తేదీ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభించి చైర్మన్, సిబ్బందితో మాట్లాడతారు. ♦ ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దీంతో పాటు డాక్టర్ వైఎస్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్‌ను ప్రారంభిస్తారు. ♦ అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు. ♦ అలాగే, వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లను ప్రారంభిస్తారు. ♦ ఆ తర్వాత ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభిస్తారు. ♦అంతేకాక.. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రాత్రికి బసచేస్తారు. ♦ఇక 24న ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బసచేస్తారు. ♦ 25వ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు, మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. -
జగన్ పాలనతోనే విద్యార్థులకు ‘ఉన్నత’ చదువులు
కడప కార్పొరేషన్: విద్యా రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకువచ్చిన సంస్కరణలు, పథకాలతో విద్యార్థులకు ‘ఉన్నతమైన’ విద్య అందుబాటులోకి వచ్చిందని వైఎస్సార్ స్టూడెంట్స్ యూనియన్(వైఎస్సార్‌ఎస్‌యూ) రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జిల్లా అధ్యక్షుడు పి.సాయిదత్త అన్నారు. నాలుగున్నరేళ్లలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సోమవారం కడపలో వైఎస్సార్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కోటిరెడ్డి సర్కిల్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ.. ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్, సంధ్యా సర్కిల్ మీదుగా తిరిగి కోటిరెడ్డి సర్కిల్‌కు చేరింది. ఈ సందర్భంగా చైతన్య, సాయిదత్త మాట్లాడుతూ.. విద్యారంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారని వివరించారు. ‘నాడు–నేడు’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తీర్చిదిద్దారని చెప్పారు. అమ్మ ఒడి, జగనన్న గోరుముద్ద, విద్యా కానుక, విద్యా దీవెన, ఇంగ్లిష్ మీడియం, డిజిటల్ విద్యా భోధన, టోఫెల్ శిక్షణ తదితర కార్యక్రమాలను ప్రవేశపెట్టి పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను చేరువ చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ఎస్‌యూ నగర అధ్యక్షుడు సందీప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కడపకు కంగువా
కడపకు పయనమవ్వనున్నారట కంగువా. సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువా’. దిశా పటానీ హీరోయిన్గా నటిస్తున్నారు. కేఈ జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణను కడపలో ప్లాన్ చేశారని, ఈ నెల రెండో వారంలో ఈ చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. సినిమాలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ కడపలో జరగనుందట. రెండు భాగాలుగా విడుదల కానున్న ‘కంగువా’ ఫస్ట్ పార్ట్ ఏప్రిల్‌లో విడుదల కానుంది. -
కడప పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్ (ఫొటోలు)
-
పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో సీఎం జగన్
-
Live: కడపలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
ఒకే ఇంట్లో ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ప్రభుత్వ ఉద్యోగాలు
ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే గొప్ప అనుకుంటాం. కానీ ఆ ఇంట్లో ఒకరిద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబంలో, కన్నవాళ్లు పడే తపనను దగ్గరుండి గమనించి అహర్నిశలు కష్టపడి చదివారు. ఫలితంగా ముగ్గురూ విద్యావంతులయ్యారు. ఒకరు డీఎస్పీగా.. మరొకరు ఆర్డీవోగా, మరో సోదరి కూడా ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నత కొలువులు సాధించి తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపారు. తల్లి పేరుకు తగ్గట్లే ‘సరస్వతీ’ పుత్రికలుగా ఖ్యాతి గడించారు. నందలూరు మండలం టంగుటూరుకు చెందిన సోదరీమణుల విజయగాథే ఈ రోజు ప్రత్యేక కథనం. రాజంపేట: నందలూరు మండలంలోని చెయ్యేటి పరీవాహక గ్రామమైన టంగుటూరు గ్రామంలో కంభాలకుంట సుబ్బరాయుడు, కంభాలకుంట సరస్వతి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. తండ్రి సుబ్బరాయుడు ఆర్టీసీలో కండక్టరుగా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. తల్లి సరస్వతి ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. తమ ముగ్గురు బిడ్డలైన లావణ్యలక్ష్మీ, మాధవి, ప్రసన్నకుమారిని బాగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆ దిశగా ముగ్గుర్ని చదివించారు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముగ్గురు కూడా కష్టపడి చదివారు. లావణ్యలక్ష్మీ, ప్రసన్నకుమారి ఏఐటీఎస్‌లో బీటెక్ విద్యను పూర్తి చేసిన అనంతరం సివిల్స్‌లో రాణించాలనే పట్టుదలతో పోటీపరీక్షలకు సిద్ధమయ్యారు. తొలి అడుగులో భాగంగా గ్రూప్స్‌లో విజేతలుగా నిలిచారు. లావణ్యలక్ష్మీ.....డీఎస్పీగా తొలి పోస్టింగ్ టంగుటూరు జెడ్పీ హై స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె పద్మావతి యూని వర్సిటీ పాలి టెక్నిక్ ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్ పూర్తి చేశా రు. 2009లో గ్రూప్–1 విజేత గా నిలిచి మచిలీపట్నంలో డీఎస్పీగా తొలి పోస్టింగ్ చేపట్టారు. విజయవాడలో సెంట్రల్ ఎసీపీగా పనిచేశారు. మార్కాపురం ఓఎస్డీగా పనిచేశారు. 14 యేళ్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్‌లో ఛీప్ విజిలెన్స్ ఆఫీసర్‌గా తిరుపతిలో చేస్తున్నారు. ఈమె భర్త డా.చంద్రశేఖర్ నెల్లూరు ఆరోగ్యశ్రీ జిల్లా కో–ఆర్టినేటర్‌గా పని చేస్తున్నారు. మాధవి.. అక్క లావణ్యలక్ష్మీ బాటలోనే మాధవి కూడా గ్రూప్స్‌లో విజేతగా నిలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేటలోని వైష్ణవీ డిగ్రీ కళాశాలలో ఉన్నత విద్య పూర్తి చేసిన ఈమె ప్రస్తుతం ఏపీటిడ్కోలో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నారు. ఈమె భర్త కిరణకుమార్ కడపలో వ్యాపారిగా కొనసాగుతున్నారు. అక్క చూపిన బాటలో.. అక్కను ఆదర్శంగా తీసుకున్న ప్రసన్నకుమారి గ్రూప్–1లో విజేతగా నిలిచింది. టంగుటూరు జెడ్పీహెచ్ స్కూల్లో పదో తరగతి పూర్తి చేసిన ఈమె , ఇంటర్ తిరుపతిలోని శ్రీ చైతన్యలో, ఆపై ఏఐటీఎస్‌లో బీటెక్ పూర్తి చేశారు. తొలుత టంగుటూరు గ్రామ సమీప ప్రాంతమైన టీవీపురానికి పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ప్రసన్నకుమారి గ్రూప్–1కు ప్రిపేర్ అయ్యారు. ఆర్సీ రెడ్డి ఐఏ ఎస్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నారు. గ్రూప్–1 ఫలితాల్లో రాష్ట్ర స్ధాయిలో మూడవ ర్యాంక్ సాధించారు. ఆర్డీఓగా నియమితులయ్యారు. సివిల్స్‌లో విజేత కావడమే తన లక్ష్యమంటున్నారు. ఈమె భర్త చంద్రాజీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నా కలలను బిడ్డలు నిజం చేశారు.. నేడు ఏడవ తరగతి వరకు చదువుకున్నాను. నా భర్త ఆర్టీసీలో కండక్టరుగా పనిచేశారు. బిడ్డలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా కలను నా ముగ్గురు బిడ్డలు నిజం చేశారు. వారికి ఏనాడూ ఇంటిలో పనిచెప్పలేదు. చదువుకోవాలని పదేపదే చెబుతూవచ్చాను. కుమార్తెలను ఉన్నతంగా చూడాలనుకున్నారు. అదే జరిగింది. వారిని నిరంతరం చదువుకోవాలనే ప్రోత్సహించాం. –తల్లి సరస్వతి -
పెళ్లి సందడికి వేళాయె!
శుభముహుర్తాలకు వేళయ్యింది. శ్రావణమాసం.. వరుస ముహూర్తాలు వస్తుండడంతో పల్లెలు, పట్టణాల్లో మళ్లీ పెళ్లి సందడి ప్రారంభం కానుంది. ఈ నెల 19 నుంచి డిసెంబర్ వరకు సుమారు 50కి పైగాముహూర్తాలు వస్తుండడం విశేషం. ఫలితంగా అన్ని జిల్లాలు పెళ్లిళ్లతో.. పందిళ్లు సందడిగా మారనున్నాయి. వివాహ ముహూర్తాలు ఆగస్టులో 8, సెప్టెంబరులో 6, అక్టోబరులో 10, నవంబరులో 14, డిసెంబరులో 14 వరకు ఉండటంతో ముఖ్యంగా కడప జిల్లా మరింత సందడిగా మారింది. అక్కడ జిల్లా వ్యాప్తంగా కల్యాణ మండపాలు పెద్దవి 800 మీడియం 1200 చిన్నవి వాటిల్లోనే ఏకంగా 1000కి పైగా వివాహాలు జరగడమే గాక మొత్తం ఖర్చు రూ. 25కోట్లు వరకు ఉండొచ్చు. ఏప్రిల్‌లో శుభ కార్యాలకు ముహూర్తాలు లేకపోవడం, జూన్‌లో కొన్ని మాత్రమే ఉండడం, జులైలో ఆషాఢమాసం, అధిక శ్రావణం కారణంగా ముహూర్తాలు లేక ఇన్నాళ్లు శుభ కార్యాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆగస్టు 19 నుంచి ముహూర్తాలు ఉండడంతో తమ పిల్లలకు వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు జోరుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిసెంబరు వరకు వరుసగా ఎక్కువ ముహూర్తాలు ఉండడంతో దాదాపు వెయ్యికి పైగా వివాహాలు జరిగే అవకాశం ఉందని ఆయా వర్గాల ప్రతినిధులు తెలుపుతున్నారు. ఆగస్టు 16న అమావాస్య అనంతరం నిజ శ్రావణమాసం వస్తుండడంతో 19వ తేదీ నుంచి దాదాపు 10 రోజులపాటు వరుసగా వివాహ ముహూర్తాలు ఉన్నాయి. ఇవి డిసెంబరు వరకు కొనసాగనున్నాయి. కడప జిల్లాలో ఈ సంవత్సరాంతం వరకు ఉన్న 50కి పైగా ముహూర్తాల్లో వెయ్యికి పైగా వివాహాలు జరగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 800కు పైగా పెద్ద కల్యాణ మండపాలు, 1200కు పైగా మీడియం మండపాలు, 1000కి పైగా చిన్న మండపాలు ఉన్నాయి. వీటికి రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షలు అద్దె చెల్లించాల్సి ఉంది. వివాహ ముహూర్తాలు ప్రారంభమయ్యే నాటికి దాదాపు అన్ని కల్యాణ మండపాలు, ముహూర్తాలుగల అన్ని రోజుల్లోనూ ముందే రిజర్వు అయి ఉండడం విశేషం. డిసెంబరు వరకు ఉన్న ఈ సీజన్లో వివాహాల కోసం కనీసం రూ. 15–25 కోట్లవరకు ఖర్చవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సీజన్‌కు ముందు వివాహాలు చేయలేకపోయిన తల్లిదండ్రులకు ఇప్పుడు మంచి ముహూర్తాలు ఆహ్వానం పలుకుతున్నా... పెరిగిన ధరలు దడ పుట్టిస్తున్నాయి. విందు భోజనాలు రెండు, మూడు నెలల క్రితం నాటికి విందు భోజనాలు ప్లేటు రూ. 150–180 వరకు ఉండగా, ప్రస్తుతం ఆ ధర రూ. 200–250కి పైగా చేరింది. దీంతో ఘనంగా వివాహాలు నిర్వహించుకోవాలని భావించిన తల్లిదండ్రులకు ధరల దడ పట్టుకుంది. రెండు నెలల క్రితం నాటి ధరలతో పోలిస్తే ఇటీవల కూరగాయల ధరలు రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగాయి. అయినా జీవితంలో ఒక్కసారే నిర్వహించే అపురూపమైన ఘట్టం గనుక వివాహాలను ఘనంగానే నిర్వహించేందుకు పెద్దలు సిద్ధమవుతున్నారు. వస్త్రాల ధర కూడా 20–40 శాతం పెరిగింది. శ్రావణమాసంతో పండుగల సీజన్ ప్రారంభమైంది గనుక డిమాండ్ పెరిగి ఎక్కువ మొత్తాలు చెల్లించాల్సి వస్తోంది. (చదవండి: ఢిల్లీకి.. మా ఊరి బొప్పాయి! ప్యాకింగ్ మరింత స్పెషల్!) -
రూ 650 కోట్లతో కడప స్టీల్ ప్లాంట్ కు మౌలిక వసతులు
-
‘ఈ సంఘర్షణలో పేదల ప్రభుత్వానిదే పై చేయి కావాలి’
కడప: పేదలకు ప్రభుత్వం అందించే పథకాలను అవహేళన చేసినవారే, వాటిని మరింతగా పెంచి పేదలకు అందిస్తామని పోటీ పడడం విడ్డూరంగా వుందని సి. ఆర్. మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు అన్నారు. కడప జిల్లాలో వై.ఎస్. ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం ఆధ్వర్యంలో “సు పరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రూపాంతరం” అంశంపై బుధవారం జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల కోసం పనిచేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేదలు బాసటగా నిలవాలని ఆయన అన్నారు. పేదలకు పెత్తందార్లకు మధ్య జరిగే ఈ సంఘర్షణలో పేదల ప్రభుత్వానిదే పై చేయి కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలకు అవసరమైన సేవలు సత్వరమే వారి ఇంటివద్దనే అందించే వాలంటీర్ల వ్యవస్థను కేరళ వంటి ఎన్నో రాష్ట్రాలు అనుసరించేందుకు అధ్యయనం చేస్తున్నాయని ఆయన అన్నారు. పాఠశాలలు నాడు- నేడు పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. రైతుభరోసా కేంద్రాలను దేశ, విదేశీ సంస్థలు ప్రశంసిస్తున్నాయని ఆయన అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు వరద నియంత్రణలో కూడ పత్రికలు పక్షపాతధోరణిలో వ్వహరిస్తుండడం శోచనీయమన్నారు. వరదల్లో 20 మంది పైనే మరణించిన రాష్ట్రం కంటే మనరాష్ట్రంలో అల్లకల్లోల పరిస్థితులు ఏమున్నాయని ఆయన ప్రశ్నించారు. పత్రికల్లో వచ్చిన వార్తలలోని వాస్తవాలను ఒకటికి రెండుసార్లు చదివి నిర్ధారించుకోవాలని ఆయన సూచించారు. పోలవరం వంటి ప్రాజెక్టులను కట్టేందుకు వై.ఎస్.రాజశేఖర రెడ్డి ప్రాధాన్యం ఇస్తే, చంద్రబాబు చెక్ డాంలు, ఇంకుడు గుంతలు కట్టేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారన్నారు. సమావేశానికి వై.ఎస్.ఆర్ ఇంటలెక్ట్యువల్ ఫోరం రాయలసీమ కన్వీనర్, చిన్నపరెడ్డి అధ్యక్షత వహించారు. ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శాంతమూర్తి, మహిళా విభాగం కన్వీనర్ రత్న కుమారి, యోగి వేమన యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. వై. ఈశ్వర రెడ్డి, అధికార భాషా సంఘం సభ్యులు తవ్వా వెంకటయ్య, గౌతం సుబ్బారెడ్డి, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాఘవ రెడ్డి, డ్వాక్రా సంఘాల రిసోర్స్ పర్సన్లు శ్రీమతి చైతల్య, శ్రీదేవి, వై.ఎస్. ఆర్. వైద్య విభాగం అధ్యక్షులు వెంగళరెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. -
ఏపీ డిప్యూటీ సీఎం చేతుల మీదుగా సినిమా టైటిల్ పోస్టర్ విడుదల
నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా రమాకాంత్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ కె.చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వరరెడ్డి, కాటం రమేష్‌లు కలిసి సంయుక్తంగా ప్రొడక్షన్ నెంబర్ 1గా ‘కలియుగం పట్టణంలో’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. నేడు ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ లోగో పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా చేతుల మీదుగా ఈ మూవీ టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'విద్యార్థిని విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తూ.. ఇప్పుడు మళ్లీ సినిమా రంగంలోకి అడుగుపెడుతున్నందుకు నానికి అభినందనలు తెలుపుతున్నాను. విద్యా రంగంలో అంచెలంచెలుగా ఎలాగైతే ఎదిగారో.. సినిమా రంగంలోనూ అలానే ఎదగాలి. నూతన చిత్రం ‘కలియుగం పట్టణంలో’ టైటిల్ లాంచ్‌కు విచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు. చలనచిత్ర పరిశ్రమ కడప వైపు, రాయలసీమ వైపు చూసేలా చేయాలని' అయన కోరారు. ఈ ఈవెంట్‌కు రాజంపేట్ పార్లమెంట్ ఇంచార్జ్, పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డప్పగిరి శ్రీనివాసుల రెడ్డి, ఏపీ ఇండస్ట్రీస్ అడ్వైజర్ రాజోలి వీర రెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగా రెడ్డి,నాగార్జున స్కూల్ ఛైర్మన్ శివ శంకర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. -
Anchor Lasya: కడప దర్గాను దర్శించుకున్న యాంకర్ లాస్య (ఫొటోలు)
-
రాజీవ్ పార్క్ ను కడప ప్రజలకు అంకితం చేసిన సీఎం వైఎస్ జగన్
-
కడప నగరంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం
-
ఇవాళ కడప నగరంలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
గండికోటలో సీఎం జగన్.. ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన (ఫోటోలు)
-
సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన పూర్తి షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి, వైఎస్సార్ జిల్లా: జూలై 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. జూలై 8న దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు. 8వ తేదీ మధ్యాహ్నం 2.05 గంటలకు వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ, వైఎస్సార్ ఘాట్‌కు చేరుకోనున్న సీఎం.. వైఎస్సార్ జయంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం తిరిగి ఇడుపులపాయలో తన నివాసానికి సీఎం చేరుకోనున్నారు. 9వ తేదీ పర్యటన రెండో రోజు పర్యటనలో భాగంగా 9వ తేదీ ఉదయం 9.20 గంటలకు గండిపేట చేరుకోనున్న సీఎం జగన్.. గండిపేట వద్ద ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేయనున్నారు. అనంతరం వ్యూ పాయింట్‌ను పరిశీలించనున్నారు. ఆ తర్వాత పులివెందుల చేరుకుని నూతనంగా నిర్మించిన మున్సిపల్ ఆఫీసు భవనం ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం పులివెందుల, రాణితోపు చేరుకుని నగరవనం ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి గరండాల రివర్ ఫ్రెంట్ చేరుకుని.. గరండాల కెనాల్ డెవలప్మెంట్ ఫేజ్ –1 పనులను సీఎం ప్రారంభించనున్నారు. తర్వాత పులివెందులలోని నూతనంగా నిర్మించిన (వైఎస్సార్ ఐఎస్‌టిఏ) స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు. ఆ తర్వాత పులివెందులలోని ఏపీ కార్ల్‌లో ఏర్పాటు చేసిన న్యూ టెక్ బయో సైన్సెస్‌ను సీఎం ప్రారంభించున్నారు. తిరిగి మధ్యాహ్నం 2.30 గంటలకు పులివెందులలో వైఎస్సార్ స్పోర్ట్స్ అకాడమీకి ప్రారంభోత్సవం చేయనున్నారు. కార్యక్రమం అనంతరం ఇడుపులపాయ చేరుకోనున్నారు. చదవండి: ఓట్ల ప్రక్షాళనతో దొంగ వేషాలు! బాబు బాగోతం తెలిసి రామోజీ పాత పాట! 10వ తేదీ పర్యటన మూడోరోజూ వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. ఉదయం 9 గంటలకు ఇడుపులపాయ నుంచి బయలుదేరి కడప చేరుకోనున్నారు. కడప పట్టణంలోని రాజీవ్ మార్గ్, రాజీవ్ పార్కుతో పాటు పలు అభివృద్ధి పనులనూ సీఎం ప్రారంభించనున్నారు. అనంతరం కడప నుంచి కొప్పర్తి బయలుదేరి వెళ్లనున్న సీఎం.. కొప్పర్తి పారిశ్రామికవాడలో అల్ డిక్సన్ యూనిట్‌ను ప్రారంభోత్సవం చేయడంతో పాటు పలు పారిశ్రామిక యూనిట్లకు శంకుస్ధాపన చేయనున్నారు. ఆ తర్వాత కొప్పర్తి నుంచి కడప చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు తాడేపల్లికి సీఎం చేరుకోనున్నారు. చదవండి: లోకేష్ ఆరోపణలు.. వేంకటేశ్వరుని సన్నిధిలో మాజీ మంత్రి అనిల్ ప్రమాణం -
చెన్నైకి బీటెక్ రవి పరార్!.. కీలక నేత సాయంతో జంప్!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రైవేట్ వ్యక్తుల రియల్ ఎస్టేట్ వెంచర్‌ను ధ్వంసం చేసి అనంతరం కనిపించకుండా పోయిన టీడీపీ నేత మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పోలీసుల కళ్లుగప్పి చెన్నై చేరుకున్నట్లు సమాచారం. మారెడ్డి రవీంద్రనాథరెడ్డి అలియాస్ బీటెక్ రవి మార్చి 30 ఆదివారం వైఎస్సార్ జిల్లా చక్రాయపేటలో ఈ దౌర్జన్యానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆ ఘటన అనంతరం ఆయన హైదరాబాద్ చేరుకుని తన పొలిటికల్ గాడ్‌ఫాదర్‌ను ఆశ్రయించి గట్టెక్కే మార్గం సూచించాలని కోరారు. దీంతో హైదరాబాద్ నుంచి ఆ గాడ్‌ఫాదర్ స్పెషల్ ఫ్లయిట్లో మంగళవారం చెన్నైకి చేర్చారు. అందుకే బీటెక్ రవి దౌర్జన్యం.. పులివెందుల నియోజకవర్గంలో దౌర్జన్యం చేయగలిగామని చెప్పుకునేందుకు బీటెక్ రవికి ఇప్పుడు రాజకీయ అవసరం ఎంతో ఉంది. అందుకు.. తిరగబడే స్వభావం తక్కువగా ఉన్న చక్రాయపేట ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ప్రైవేటు వ్యక్తుల వెంచర్‌ను ధ్వంసం చేయడానికి అసలు కారణం అదేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక గత ఆదివారం దౌర్జన్యానికి పాల్పడ్డ బీటెక్ రవిని పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆయన హైదరాబాద్‌లో తన పొలిటికల్ గాడ్‌ఫాదర్‌ను ఆశ్రయించారు. దీంతో, బీజేపీలో కొనసాగుతున్న పూర్వపు టీడీపీ నేత సీఎం రమేష్ తెరపైకి వచ్చారు. అనంతరం.. సీఎం రమేష్, ఎం.రవీందర్, పి.శ్రీనివాసరావు అనే వ్యక్తులు ప్రత్యేక విమానంలో వెళ్తున్నట్లు అనుమతులు పొంది చెన్నై చేరుకున్నారు. అయితే, పోలీసులు గుర్తించకుండా ఉండేందుకే బీటెక్ రవి తన పేరును ఎం.రవీందర్‌గా మార్చుకున్నట్లు సమాచారం. మరోవైపు.. చక్రాయపేట ఘటనలో 32మందిని గుర్తించి వారిలో ఎనిమిది మందిని పోలీసులు అరెస్టుచేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. అయితే, వీరందరినీ ముందుండి నడిపించిన బీటెక్ రవి ఘటన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లడం, మరో పేరుతో ఇతర ప్రాంతాలకు పారిపోవడం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘నీతి, నిజాయితీ, దమ్మూ, ధైర్యం ఉంటే సదరు రియల్ ఎస్టేట్ వెంచర్ ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకురా.. నీ నిజాయితీ నిరూపించుకో..’ అంటూ నిజమైన్ వెంచర్ యజమానులు ఆ పోస్టులో సవాల్ విసురుతున్నారు. ఇది కూడా చదవండి: దోషులు ఎవరూ తప్పించుకోలేరు: మంత్రి తానేటి వనిత -
బీజేపీ కంటే చంద్రబాబు భజనే ఎక్కువైంది!
సాక్షి ప్రతినిధి, కడప : పేరుకు కాషాయ కండువా కప్పుకున్నా.. మనసు మాత్రం పచ్చ పార్టీ గురించే ఆలోచిస్తుంది. చంద్రబాబుకు జై కొట్టే అతి కొద్దిమంది బీజేపీ నేతల్లో ముందు వరుసలో మాజీ ఎమ్మెల్యే దేవగుడి ఆదినారాయణరెడ్డి నిలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ విస్తరించాలనే ఉద్దేశం కంటే టీడీపీ బలపడాలనే లక్ష్యం ఆయనలో బలంగా దాగి ఉంది. అందుకు అనుగుణంగానే రాజకీయ సమాలోచనలు ఉంటున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. తాజాగా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పొత్తులపై ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం. ఒకవైపు తాము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నామని, టీడీపీతో కలిసి వెళ్లేది లేదని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారు. బీజేపీలోని చంద్రబాబు వర్గం నేతలు మాత్రం టీడీపీతో కలవడానికి అత్యధికంగా ఇష్టపడుతున్నారు. అడపాదడపా అదే విషయాన్ని తెరపైకి తెస్తూ తెలుగుదేశం పార్టీని రక్షించేందుకు తెరవెనుక సంకల్పం పుచ్చుకున్నారు. అలాంటి వారిలో జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ముందు వరుసలో నిలుస్తున్నారు. నిత్యం బీజేపీ భజన కంటే చంద్రబాబు భజనే పరిపాటిగా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ పటిష్టత ఎలా ఉన్నా, టీడీపీ బలపడాలనే తపన మెండుగా ఉండడమే అందుకు ప్రధాన కారణంగా రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కొరవడిన చిత్తశుద్ధి! 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఘోర పరాజయం పాలైంది. టీడీపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణరెడ్డి సైతం భారీ ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ సైతం అదేబాట పట్టారు. అందుకు ప్రధాన కారణం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడమే. అధికారం లేకపోతే రాజకీయ మనుగడ కష్టసాధ్యమనే భావనే వారిని బీజేపీలో చేరేలా చేసింది. వైఎస్సార్సీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆదినారాయణరెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునే క్రమంలో కుటుంబం యావత్తు ఆ పార్టీలో చేరారు. కాగా బీజేపీలో కేవలం ఆదినారాయణరెడ్డి మాత్రమే చేరి, కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీలో అలాగే కొనసాగేలా జాగ్రత్త పడ్డారు. ఇదే వైఖరిని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా అవలంబించారు. ఎంపీగా బీజేపీ జాతీయ నేతలతో నిత్యం టచ్‌లో ఉంటూనే కుటుంబాన్ని టీడీపీలో కొనసాగిస్తున్నారు. బీజేపీ పట్ల వీరికి ఉన్న చిత్తశుద్ధి ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. రాబోవు రోజుల్లో మరింత వివాదాస్పదం.. భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ పాళ్లు అధికం. అరువు తెచ్చుకున్న నాయకుల కారణంగా ఆ పార్టీలో కూడా క్రమశిక్షణ లోపించింది. ఎన్నికల గడువు సమీపించే కొద్ది బీజేపీ నేతల నుంచి వివాదాస్పద వ్యాఖ్యలు అధికం కానున్నాయి. అదే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు గురించి మాజీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు కూడా అందులో భాగంగానే భావించాల్సి వస్తోంది. ఇప్పటికే జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జిగా మాజీ ఎమ్మెల్యే ఆది సోదరుడి కుమారుడు భూపేష్‌రెడ్డి కొనసాగుతున్నారు. టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. అక్కడ కుటుంబాన్ని అలాగే కొనసాగించి, ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ కేటాయించాలని తెరవెనుక మంత్రాంగాన్ని మాజీ ఎమ్మెల్యే ఆది నడుపుతున్నట్లు సమాచారం. ప్రొద్దుటూరు అసెంబ్లీ నియోజకవర్గం తమ స్వగ్రామం దేవగుడికి సమీపంలోనే ఉండడం, ప్రొద్దుటూరు పట్టణం, రూరల్, రాజుపాళెం మండలాలు మాతమ్రే విస్తరించి ఉండడం, పలువురితో ప్రత్యక్ష సంబంధాల దృష్ట్యా ఆ సీటును ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమేరకే బీజేపీ నాయకత్వంతో నిమిత్తం లేకుండా వివాదాస్పద నిర్ణయాలు, అభిప్రాయాలు తెరపైకి తెస్తున్నారు. రాబోవు రోజుల్లో మరింతగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, కుదిరితే టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తు.. లేదంటే బీజేపీతో తెగదెంపులు చేసుకోవడమే ఆదినారాయణరెడ్డి అసలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
వివేకా కేసులో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..
-
సుప్రీం కోర్టులో అవినాష్ రెడ్డికి ఊరట
-
‘మా కోడలికి టికెట్ కన్ఫామ్ అయింది.. ఆశీర్వదించండి’.. స్పీడుకు బ్రేక్!
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు తీవ్రమయ్యాయి. ఒకరు సమ్మతిస్తే, ఇంకొకరు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యక్ష విరుద్ధభావాలతో వ్యవహరిస్తున్నారు. జోన్–5 టీడీపీ ప్రాంతీయ సదస్సు వేదిక ఏర్పాటు విషయంలో మరోమారు తెలుగుతమ్ముళ్లు మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ముందుగా అధికారులు ఎయిర్‌పోర్టు సమీపంలో అశోక్లైల్యాండ్ షోరూమ్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసేందుకు సమ్మతించారు. హఠాత్తుగా బిల్టప్ పక్కన ఉన్న పుత్తా ఎస్టేట్‌లో నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించారు. ఎలాంటి అనుమతులు లేకపోయినా జిల్లా టీడీపీ నేతల సమ్మతి లేకపోయినా సరే ఇక్కడే ఏర్పాటు చేస్తామంటూ కమలాపురం టీడీపీ ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి భీష్మించుకున్న వైనమిది. ♦ తెలుగుదేశం పార్టీ జోన్–5 ప్రాంతీయ సదస్సు నిర్వహణ ఇదివరకూ మూడు పర్యాయాలు వాయిదా పడింది. ఈనెల 18న నిర్వహించేందుకు అధ్యక్షుడు చంద్రబాబు నిర్ణయించారు. కడప, అనంతపురం, హిందూపురం, నంద్యాల, కర్నూల్ జిల్లాల పరిధిలో 35 అసెంబ్లీ నియోజకవర్గాల ప్రాంతీయ సదస్సును కడపలో నిర్వహించనున్నారు. ఈ సదస్సును ముందుగా ఎయిర్‌పోర్టు సమీపంలో నిర్వహించాలని తలిచారు. ఆమేరకు అధికారులు సైతం సూచన ప్రాయంగా అంగీకరించారు. ఎన్‌హెచ్ రహదారికి 500 మీటర్లు దూరంలో సభ ఏర్పాట్లు చేయాలని సూచించారు. అక్కడ ఏర్పాటుకు అనుమతులు కోరే లోపే బిల్టప్ సమీపంలో సన్నాహాలు చేస్తున్నారు. ఆమేరకు కడప టీడీపీ నేతలు గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్, వికాస్ హరికృష్ణ తదితరులు కొబ్బరి కాయలు కొట్టి ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారు. లక్ష్మిరెడ్డి స్పీడ్‌కు బ్రేకులు వేసేందుకు... కడప టీడీపీ టికెట్ కార్పోరేటర్ ఉమాదేవికి ఖరారయ్యింది. మా కోడల్ని ఆశీర్వదించాలని టీడీపీ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి గత కొంతకాలంగా ప్రచారం మొదలు పెట్టారు. లక్ష్మిరెడ్డి దూకుడు కట్టడి చేయాలని అంతే స్పీడుగా వైరిపక్షం పావులు కదుపుతోంది. ఇదివరకూ నారా లోకేష్ పర్యటన ఆలంఖాన్‌పల్లె మీదుగా కడపకు ఉండగా అనూహ్యంగా అడ్డగించి, రింగ్‌రోడ్డు వెంబడి దేవుని కడపలోకి ప్రవేశించేలా రూట్‌మ్యాప్ మార్చారు. ప్రాంతీయ సదస్సు ఎయిర్‌పోర్టు సమీపంలో ఏర్పాటు చేయాలని టీడీపీ నేతలు తలిచారు. ఆ భూమి ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డిది కావడంతోనే అక్కడ నిర్వహంచరాదనే నిర్ణయానికి కొంతమంది టీడీపీ నేతలు తెరపైకి వచ్చారు. కమలాపురం ఇన్‌ఛార్జి పుత్తా నరసింహారెడ్డి నాయకత్వంలో బిల్టప్ సమీపంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అధికారులు బిల్టప్ కంటే ఎయిర్‌పోర్టు స్థలమే అనువైన ప్రదేశంగా చెబుతున్నా అవేమీ పట్టించుకోలేదు. ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్టప్ సమీపంలో ఏర్పాట్లు ప్రారంభించారు. ఈమొత్తం వ్యవహారం కేవలం లక్ష్మిరెడ్డి స్పీడ్‌కు బ్రేకులు వేసే ఎత్తుగడలేనని పలువురు ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలతో నిమిత్తం లేకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం విశేషం. -
పున్నమి వెలుగుల్లో ఒంటిమిట్ట రాములోరి కల్యాణం (ఫొటోలు)
-
లెటర్ చూస్తే అసలు విషయాలు బయటపడతాయి: వైఎస్ భాస్కర్ రెడ్డి
సాక్షి, కడప: వైఎస్భాస్కర్ రెడ్డి ఆదివారం ఉదయం సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆఫీసులో అధికారులు లేకపోవడంతో భాస్కర్ రెడ్డి వెనుదిరిగారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ వివేకా కేసులో సీబీఐ అధికారులు పిలిస్తే విచారణకు వచ్చాను. నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా విచారణకు హాజరయ్యాను. విచారణ అధికారి లేరు కాబట్టి తిరిగి మళ్లీ నోటీసులు ఇస్తామన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్లీ విచారణకు హాజరవుతాను. లెటర్ చూస్తే అసలు విషయాలు బయటపడతాయి. కేసును పక్కదారి పట్టించొద్దు. ఈ కేసు పరిష్కారం కావాలంటే లేఖను పరిశీలించాలి అని అన్నారు. -
16వ శతాబ్దం నాటి వినాయక విగ్రహం గుర్తింపు
సాక్షి,మైదుకూరు: వైఎస్సార్ జిల్లా మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో 16వ శతాబ్దం నాటి వినాయక విగ్రహాన్ని గుర్తించినట్టు ఔత్సాహిక పరిశోధకుడు బొమ్మిశెట్టి రమేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామానికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి పశువుల దొడ్డిలో ఈ విగ్రహాన్ని కనుగొన్నట్టు పేర్కొన్నారు. విగ్రహం ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో డమరుకం ఉన్నట్టు తెలిపారు. మైసూరు పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి విగ్రహం గురించి తెలియజేయగా, అది 16వ శతాబ్దం నాటిదని ఆయన చెప్పినట్టు రమేష్ తెలిపారు. -
ఈ నెల 10న సీబీఐ విచారణకు హాజరవుతా : ఎంపీ అవినాష్ రెడ్డి