![Mla Madhavi Reddy Hulchul In Kadapa Corporation Office](/styles/webp/s3/article_images/2024/11/7/Mla-Madhavi-Reddy.jpg.webp?itok=x61qbWDG)
వైఎస్సార్ జిల్లా, సాక్షి: కడప కార్పొరేషన్ వద్ద ఎమ్మెల్యే మాధవీరెడ్డి వీరంగం సృష్టించారు. కౌన్సిల్ సమావేశంలోకి ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఎమ్మెల్యేకి మాత్రమే అనుమతి ఉంది. కానీ నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్యే మాధవి తన అనుచరులతో కౌన్సిల్ సమావేశంలోకి వెళ్లారు. ఎజెండాను విడిచి రాజకీయ ప్రసంగం చేశారు. దీనిపై మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ కాదని ఎజెండా ప్రకారం సమావేశం జరగాలని పాలకవర్గం డిమాండ్ చేశారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/31_17.png)
Comments
Please login to add a commentAdd a comment