kadapa corporation
-
కడప కార్పొరేషన్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే హల్ చల్
-
ఎమ్మెల్యే మాధవీరెడ్డి వీరంగం
వైఎస్సార్ జిల్లా, సాక్షి: కడప కార్పొరేషన్ వద్ద ఎమ్మెల్యే మాధవీరెడ్డి వీరంగం సృష్టించారు. కౌన్సిల్ సమావేశంలోకి ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా ఎమ్మెల్యేకి మాత్రమే అనుమతి ఉంది. కానీ నిబంధనలకు విరుద్దంగా ఎమ్మెల్యే మాధవి తన అనుచరులతో కౌన్సిల్ సమావేశంలోకి వెళ్లారు. ఎజెండాను విడిచి రాజకీయ ప్రసంగం చేశారు. దీనిపై మేయర్ సురేష్ బాబు, కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్ కాదని ఎజెండా ప్రకారం సమావేశం జరగాలని పాలకవర్గం డిమాండ్ చేశారు. -
సుందర నగరంగా కడప
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి కడప నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్‌బాషా, నగర మేయర్ సురేష్‌బాబు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం స్థానిక నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో నగర మేయర్ కె.సురేష్‌బాబు అధ్యక్షతన నగర పాలక సంస్థ సర్వసభ్య సమావేశం జరిగింది. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ఆహ్వానితులుగా హాజరు కాగా, మున్సిపల్ కమిషనర్ జి.సూర్యసాయి ప్రవీణ్‌చంద్ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ నగర అభివృద్ధి, సుందరీకరణలో భాగంగా పారిశుధ్యం, స్వచ్ఛతకు అధిక ప్రాధాన్యత ఇచ్చి కడప నగరాన్ని ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన సుందర నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఏమాత్రం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్ల విస్తరణ చేపడతామన్నారు. పేదవ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. చెత్త పన్ను (క్లాప్ కార్యక్రమం), ట్రేడ్ లైసెన్స్, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి చైతన్యవంతులను చేస్తామని చెప్పారు. కడప నగర మేయర్ కె.సురేష్‌బాబు మాట్లాడుతూ నగరంలో తాగునీరు, పరిశుభ్రత, పారిశుధ్యంతోపాటు నగర సుందరీకరణకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామన్నారు. ఇంటింటి చెత్త సేకరణపై ఆయా డివిజన్ల కార్పొరేటర్లకు ఎదురైన సమస్యలపై నిర్దిష్ట ప్రణాళికతో చర్యలు చేపట్టి సానుకూల వాతావరణాన్ని సమకూరుస్తామన్నారు. కమలాపురం ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసి నగరాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు కౌన్సిల్ సమావేశం అజెండాలో పొందుపరిచిన తొమ్మిది అంశాలతోపాటు ప్రధానంగా నగరంలోని అన్ని బీటీ, సీసీ రోడ్లు పూర్తి చేసి కడప నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు, తాగునీటి వ్యవస్థను శాశ్వత ప్రాతిపదికన మెరుగు పరిచేందుకు ఆమోదం తెలిపారు. సమావేశంలో డిప్యూటీ మేయర్లు నిత్యానందరెడ్డి, ముంతాజ్‌బేగం, డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
Aadhaar Card: పోయినా... పొందవచ్చు
ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ జీవితం కార్డుల చుట్టూ తిరుగుతోంది. ఏటీఎం కార్డులు మొదలుకొని పాన్ కార్డు, ఆధార్, రేషన్ కార్డులు నిత్య జీవితంలో భాగమయ్యాయి. అందుకే వాటిని జాగ్రత్తగా భద్రపరుచుకుంటాం. ఒక్కోసారి వివిధ కారణాల వల్ల ఆ కార్డులు పోయినప్పుడు ఆందోళనకు గురవుతుంటాం. అయితే కొంత సమయం తీసుకున్నా.. వాటిని తక్కువ ఖర్చుతోనే తిరిగి పొందవచ్చు. – కడప కార్పొరేషన్ డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్న వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. వారు అందించే నాన్ ట్రేస్డ్ సర్టిఫికెట్‌తోపాటు డ్రైవింగ్ లైసెన్స్ జిరాక్స్‌ను లాస్ ఆర్ డిస్ట్రడన్ ఆఫ్ లైసెన్స్ అండ్ అప్లికేషన్ ఫర్ డూప్లికేట్ ఫారం(ఎల్ఎల్డీ)తో రోడ్డు రవాణా కార్యాలయంలో అందించాలి. రూ.20 బాండ్ పేపర్‌పై కార్డు పోయిన వివరాలు తెలియజేయాలి. ఎల్ఎల్డీ ఫారంను సంబంధిత శాఖ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రేషన్ కార్డు ప్రభుత్వం అందించే సబ్సిడీ సరుకుల కోసమే కాకుండా ఆదాయం సహా పలు రకాల ధ్రువపత్రాలు పొందేందుకు రేషన్ కార్డు ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ కూడా వర్తిస్తుంది. ఆదాయ పత్రంగా కూడా ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్డు పోయినప్పుడు రేషన్ కార్డు నంబర్‌తో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో సంప్రదించాలి. వారు అదే నంబర్లో నామమాత్రపు రుసుంతో కొత్త కార్డు జారీ చేస్తారు. వెబ్సైట్ ద్వారా జిరాక్స్ కాపీ పొందవచ్చు. పాన్ కార్డు పాన్‌కార్డు(పర్మినెంట్ అకౌంట్ నంబర్) పోతే సంబంధిత ఏజెన్సీలో పాత పాన్‌కార్డ్ జిరాక్స్, రెండు కలర్ ఫొటోలు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి అదనంగా రూ.90 చెల్లించాలి. సుమారు 20 రోజుల్లో మరో కార్డును జారీ చేస్తారు. ఏటీఎం కార్డు బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలంటే ఏటీఎం కార్డు తప్పనిసరి. దీనిని పోగొట్టుకున్నా , ఎవరైనా దొంగిలించినా సంబంధిత బ్యాంకులో ఫిర్యాదు చేయాలి. సంబంధిత బ్యాంకు టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఏటీఎం కార్డును వెంటనే బ్లాక్ చేయించవచ్చు. బ్యాంకు అధికారులు ఈ విషయాన్ని నిర్ధారించుకొని కొత్త కార్డు జారీ చేస్తారు. ఇందుకోసం సర్వీసు చార్జీలు వసూలు చేస్తారు. ఓటరు కార్డు కేవలం ఓటు వేయడానికి కాకుండా కొన్ని సార్లు నివాసం, పుట్టిన తేది ధ్రువీకరణ కోసం ఈ కార్డు ఉపయోగపడుతుంది. ఓటరు కార్డును పోగొట్టుకుంటే పోలింగ్ బూత్ నంబర్, కార్డ్ నంబర్‌తోపాటు రూ.10 చెల్లించి, మీ సేవా కేంద్రంలో గానీ, గ్రామ, వార్డు సచివాలయంలో గానీ మళ్లీ కార్డు పొందవచ్చు. నంబర్ ఆధారంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా అందజేస్తారు. ఆధార్ కార్డు ఈ కార్డు పోతే టోల్‌ఫ్రీ నంబర్ 18001801947కు కాల్ చేసి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలి. ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేకుండానే.. కొత్త కార్డు మళ్లీ పోస్టు ద్వారా పంపిస్తారు. వెబ్సైట్లోగానీ, గ్రామ, వార్డు సచివాలయాల్లో గానీ పూర్తి సమాచారం పొందవచ్చు. పాస్‌పోర్ట్ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ముందుగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు విచారణ జరిపి ఆచూకీ లభించకపోతే.. నాన్ ట్రేస్డ్ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. అనంతరం పాస్‌పోర్ట్ అధికారి పేరిట రూ.1000 డీడీ తీయాలి. ఈ రెండింటినీ జతపరిచి దరఖాస్తు చేయాలి. ఆ శాఖ ప్రాంతీయ అధికారి విచారణ జరిపి డూప్లికేట్ పాస్‌పోర్ట్ జారీ చేస్తారు. దీనికి 3 నెలల కాలం పడుతుంది. తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం నేరుగా జిల్లా ఎస్పీని సంప్రదించాలి. -
‘కరువుపై పోరు’ ధర్నాకు సంఘీభావంగా ర్యాలీ
కడప కార్పొరేషన్: ‘కరువుపై పోరు’ పేరుతో కడప కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాకు కడప అసెంబ్లీ యూత్ వింగ్ ఇన్చార్జి దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు ర్యాలీ నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లె సర్కిల్, మీదుగా కొత్త కలెక్టరేట్ వద్ద ధర్నా శిబిరానికి చేరింది. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ కమలాపురంలో కరువును పారదోలడానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అపర భగీరథుడిలా కృషి చేస్తున్నారన్నారు. ఆయన పోరాట ఫలితంగానే సర్వరాయ సాగర్‌కు నీరు విడుదలయ్యాయని, ఇప్పుడు పాపాఘ్నినదికి నీటి విడుదల కోసం చేస్తున్న ధర్నాకు తమ వంతు తోడ్పాటు అందించడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం అధ్యక్షుడు ఆదర్శ్‌రెడ్డి, యువజన నాయకులు శ్రీకాంత్, ప్రశాంత్, రాజా,జావీద్, కన్నా, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
విలీనమే పరిష్కారం
కడప కార్పొరేషన్: వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ను అత్యంత శక్తివంతంగా తయారు చేయాలని యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు. ఆదివారం కడపలోని అపూర్వ కల్యాణమండపంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ. రాజారెడ్డి అధ్యక్షతన 3వ రాష్ట్ర మహాసభ జరిగింది. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ యాజమాన్యానికి తెలియకుండానే వేలకోట్లు విలువజేసే ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. ఆర్టీసీకి ఐదువేలకోట్ల అప్పు ఉందని, దానికి వడ్డీ చెల్లించలేని స్థితిలో సంస్థ నడుస్తోందని తెలిపారు. నష్టాల పేరుతో రూట్లు రద్దు చేయడం వల్ల ప్రజలు రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. డ్యూటీకి వెళ్లిన కార్మికుడు ఇంటికి వచ్చేలోపు ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో అన్న సందేహం నెలకొందన్నారు. కార్మికుల సంఖ్య పూర్తిగా తగ్గించారని, ఉన్న వారిపై పనిభారం ఎక్కువైందన్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా బస్సులు, బస్టాండ్లు పెరగడం లేదన్నారు.మూడున్నర సంవత్సరాలుగా కండక్టర్లు, డ్రైవర్ల రిక్రూట్మెంట్ చేయలేదన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్లే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. ఆ హామీని నెరవేర్చగల సత్తా ఒక్క వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్‌కు తప్ప మరే యూనియ న్కు లేదని స్పష్టం చేశారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.రాజారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్టీసీకి వెన్నెముకలాంటి కండక్టర్లను ప్రభుత్వం లేకుండా చేస్తోందన్నారు. ప్రయివేటు, హైర్ బస్సులకు ఆర్టీసీని ధారాదత్తం చేస్తున్నారని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయమని ముఖ్యమంత్రిని కోరితే నష్టాల్లో ఉన్న సంస్థను విలీనం చేయాలా...అని ఎద్దేవా చేశారని గుర్తు చేశారు. అంతకుముందు వారు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ మహాసభలో డీసీటీఎం కిషోర్, చిత్తూరు జిల్లా నాయకుడు జయరామిరెడ్డి, రాష్ట్ర నాయకులు శ్రీనివాసులరెడ్డి, రాజుల భాస్కర్‌రెడ్డి, బండి చెన్నయ్య, రీజనల్ ఉపాధ్యక్షులు పులి సునీల్‌కుమార్, బి. నిత్యానందరెడ్డి, వైఎస్ఆర్సీపీ మైనార్టీ నేత షఫీ పాల్గొన్నారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలను మెరుగుపరుస్తాం : ఎమ్మెల్యే రాచమల్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టీసీ కార్మికుల జీవితాలను మెరుగు పరుస్తామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులపై పనిభారం మోపుతూ వారి శ్రమను దోచుకుంటోందని మండిపడ్డారు. బస్సులు కండీషన్లో లేవని, బస్టాండ్లలో సరైన సౌకర్యాలు కరువయ్యాయన్నారు. కార్మికులు చిన్న తప్పు చేసినా పెద్ద శిక్ష వేస్తున్నారని, ఇది న్యాయం కాదని అన్నారు. భవిష్యత్ వైఎస్ఆర్ మజ్దూర్ యూనియన్‌దే : ఎమ్మెల్యే అంజద్‌బాషా భవిష్యత్తు వైఎస్ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్‌దేనని కడప శాసనసభ్యులు ఎస్బి అంజద్‌బాషా అన్నారు. 2004కు ముందు తొమ్మిదిన్నర సంవత్సరాల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా దివాళా తీయించిందని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆర్టీసీకి జవసత్వాలు నింపారని తెలిపారు. నేటి ప్రభుత్వం కార్మికుల సంఖ్యను తగ్గించి, వారితో 16 గంటలు పనిచేయిస్తూ శ్రమ దోపిడీ చేస్తోందని దుయ్యబట్టారు. కార్మికుల సమస్యలను సంఘటితంగా ఎదుర్కొవాలని, అందుకు మీతో కలిసి పోరాటం చేస్తానని తెలిపారు. -
ఇష్టారాజ్యం
► అనుమతి ఒకచోట, పనులు చేసేది మరోచోట ► 14వ ఆర్థిక సంఘం నిధులు పక్కదారి ► నిద్రమత్తులో ఎస్ఈ, ఎంఈలు కడప నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యారా..? నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారా? అక్రమార్జనే ధ్యేయంగా రూల్స్‌ను అతిక్రమిస్తున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఒక చోట మంజూరైన పనులను వేరే చోట చేయడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా అధికారులు సహకరించడమే ఇందుకు సాక్ష్యం. కడప కార్పొరేషన్: కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో విడుదల చేసే 14వ ఆర్థిక సంఘం నిధుల కింద చేపట్టే పనులకు కొన్ని నియమాలు, మార్గదర్శకాలు ఉంటాయి. వాటిని ఇంజినీరింగ్ అధికారులు ఉల్లంఘించడానికి వీల్లేదు. ఏవైనా పనులకు జనరల్ బాడీ ఆమోదంతో పాటు రీజినల్ స్థాయిలో ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో కూడిన కమిటీ కూడా అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారి అనుమతి లభిం చాక ఆ పనిని మరొక చోట చేస్తామంటే కుదరదు. ఆ పని పేరు మార్చి వేరొక చోటికి బదలాయించడం అనేది కేంద్రప్రభుత్వ గ్రాంట్ల విషయంలో చాలా క్లిష్టతరమైన ప్రక్రియ. నిబంధనలు తుంగలో తొక్కిన నగరపాలక ఇంజినీర్లు అలాంటి దాన్ని సులువుగా మార్చి పడేస్తున్నారు. కాలువ నిర్మాణం కోసమంటూ..: అక్కాయపల్లెలో సాయిబాబా స్కూల్ ఎదురుగా ఉన్నదంతా లోతట్టు ప్రాంతం. వర్షమొస్తే ఇక్కడ అనేక ఇళ్లు వాననీటిలో మునిగిపోతాయి. కల్వర్టు కూడా తక్కువ ఎత్తులో ఉండటం వల్ల వర్షపునీరు ప్రవహించేందుకు తీవ్ర ఆటంకం ఏర్పడుతూ ఉండేది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.60లక్షలతో కాలువ నిర్మాణం చేపట్టడానికి అనుమతులు మంజూరయ్యాయి. కానీ నగర పాలక ఇంజినీరింగ్ అధికారులు మంజూ రైన చోట పనులు చేయకుండా వేరొకచోట మొదలుపెట్టారు. కాంట్రాక్టర్ తప్పు చేస్తుంటే సరిదిద్దాల్సిన ఎస్ఈ, ఎంఈ ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా ఆ పనిని వేరొకచోటికి బదలాయించి పనులు పూర్తి చేసేందుకు సహకరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకే..: కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేందుకు కాగితాలపెంట నుంచి నబీకోట సర్కిల్ వరకూ బాగున్న డ్రైన్‌ను పగులగొట్టి ఆ స్థానంలో కొత్త డ్రైన్ కట్టినట్లు తెలుస్తోంది. పని పేరు మార్చకుండా పనులే మొదలుపెట్టడానికి వీల్లేదని నిబంధనలు చెబుతుంటే వీరేమో ఏకంగా ఆ పనులు కూడా పూర్తి చేసి బిల్లులు ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుండడం గమనార్హం. కాగా గతంలో ఇలాంటి పరిస్థితి రాగా అభ్యంతరం వ్యక్తం చేసిన నగరపాలక ఇంజినీర్లు ఇక్కడేమో కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సాయిబాబా స్కూల్ ప్రాంతంలోని ప్రజలు ఈ వ్యవహారంపై మండిపడుతున్నారు. వర్షం వస్తే తమగతేం కావాలని ప్రశ్నిస్తున్నారు. దీనిపై స్థానిక న్యాయవాది ఒకరు ఆర్టీ యాక్టు ప్రకారం సమాచారం కోరితే ఇంజినీరింగ్ అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. నోట్ రాసి అనుమతి తీసుకుంటాం- ఎంఈ: దీనిపై మున్సిపల్ ఇంజినీర్ చెన్నకేశవరెడ్డిని వివరణ కోరగా ఈ డ్రైన్ కూడా ప్రజలకోసమే కదా, ఇందులో నిధులు దుర్వినియోగం ఏముందని ప్రశ్నిం చారు. నేమ్ చేంజ్ చేయకుండానే పనులు చేయవచ్చా అని ప్రశ్నించగా నోట్ రాసి అనుమతి తీసుకుంటామని తాపీగా సమాధానమిచ్చారు. -
కార్పొరేషన్ స్కూళ్లలో కార్పొరేట్ విద్య
- వైఎస్సార్(కడప) కార్పొరేషన్లో సరికొత్త ప్రయోగం - రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మేయర్ సురేష్‌బాబు ప్రయత్నం - 25 స్కూళ్లలో పేదలకు ఆంగ్ల విద్య - వైఎస్సార్ సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ చేయూత హైదరాబాద్: పేదలకు సైతం కార్పొరేట్ విద్య అందించాలనే సంకల్పంతో వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్సార్(కడప) కార్పొరేషన్ మేయర్, వైఎస్సార్ సీపీ నేత కె. సురేష్‌బాబు. కార్పొరేషన్ స్కూళ్లలోనూ కార్పొరేట్ తరహా ఆంగ్ల మాధ్యమ విద్యను అందించాలని ఆయన సంకల్పించారు. ఈ క్రమంలో సురేష్‌బాబు ఆదివారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తమ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 45 స్కూళ్లు ఉన్నాయని, వాటిలో స్లమ్ ఏరియాలోని 25 స్కూళ్లల్లో జూన్ నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులు ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆయా స్కూళ్లలో కార్పొరేట్ తరహా సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ రూ. 2,50,116 చెక్కును వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో తమకు అందజేయడం అభినందనీయమని కొనియాడారు. సురేష్ బాబు ఆలోచనలకు తోడ్పాటు అందించేందుకు తాము సిద్ధమని వైఎస్సార్ సీపీ అమెరికా ఎన్ఆర్ఐ కమిటీ కన్వీనర్ పండుకాయల రత్నాకర్ అన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, కార్యదర్శి చల్లా మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. -
రూ.లక్ష ఇవ్వాల్సిందే
కడప కార్పొరేషన్: ఆయన వామపక్షాలకు చెందిన ఓ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉండేవాడు.. ఏదేదో చేయడంతో ఆ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. కేవలం ఐదేళ్లలోనే యువసేనను ఏర్పాటు చేసుకునే స్థాయికి ఆ నాయకుడు ఎదిగాడు. అనంతర ఆయన చేరనిపార్టీలేదు.. చేయని వివాదం లేదు.. కొన్నాళ్లకు సినీనటుడు స్థాపించిన పార్టీలోకి చేరిపోయాడు. ఆ పార్టీ మరో పార్టీలో విలీనం కావడంతో తాను కూడా అక్కడికి చేరిపోయాడు.. అప్పటి మంత్రి అనుచరులే తన కారును కాల్చివేశారని ఆరోపణలు చేసి పత్రిలకెక్కాడు. ఈ వివాదాలవల్లే ఆ పార్టీలో అధికారప్రతినిధి పదవి సంపాదించాడు. గత ఎన్నికల్లో కార్పోరేటర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓడిపోక తప్పలేదు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరి, నెలతిరక్కుండానే అక్కడా ఇమడలేక ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఆశ్రయించాడు. ఆయన పార్టీలు మారడం ఎవ రికీ అభ్యంతరం లేకపోయినా ఆ కారణంతో చేసిన అక్రమ వసూళ్లు వివాదంగా మారుతున్నాయి. తాను అడిగిన సొమ్మును ఇవ్వలేదని ఓ ఇంజినీర్‌ను ఏకంగా తుపాకీతో బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కడప కార్పొరేషన్లో చర్చనీయాంశమైంది. బెదిరింపులు ఇలా... నేను పార్టీ మారాను.. మా నాయకుడు రేపు కడపకు వస్తున్నారు.. మీ తరుపున లక్ష రూపాయలు ఇవ్వాలి..అంత లేదంటే కనీసం యాభై వేలైనా ఇవ్వాలి.. అంతకు ఏమాత్రం తగ్గినా మీ స్థాయికి బాగుండదు... ఇలాంటి మాటలు చెప్పే కడప నగరపాలక సంస్థలో ఇంజినీర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులనుంచి సుమారు లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఐదువేలో, పదివేలో అంటే ఇవ్వగలంగానీ లక్షరూపాయలంటే ఎక్కడినుంచి తేవాలి.. అంత ఇవ్వలేను అని ఎదురుతిరిగిన ఇంజినీరుపై కార్పొరేషన్లోనే తుపాకీ చూపెట్టి బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా అదే ఇంజినీరుపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి లెటర్‌హెడ్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కడప నగరపాలక సంస్థలో అధికారులనుంచి చేసిన వసూళ్ల పట్ల మేయర్ సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది. ఎవరెవరైతే డబ్బు ఇచ్చారో వారికి సంబంధించిన వర్క్‌లను తానే తనిఖీ చేస్తానని, ఆ తర్వాతే వారికి బిల్లులు చేస్తామని తెగేసి చెప్పినట్లు సమాచారం. * మీ డివిజనల్ స్థాయి అధికారిని ఇక్కడికి నేనే రప్పించాను.. మీకు భవిష్యత్తులో ఏ సాయం కావాలన్నా నాకు చెప్పండి. చేయిస్తా. ప్రస్తుతం నేను ఉంటున్న పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటూ ఉద్యోగుల నుంచి సుమారు రెండున్నర లక్షల వరకూ రాబట్టినట్లు తెలుస్తోంది. * గతంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి కడపకు వచ్చినప్పుడు కూడా అధికారులనుంచి ఇదేరీతిలో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అమర్ హాస్పిటల్ వద్ద ఇళ్లస్థలాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు 40 మంది వద్ద రెండు లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఆయన ఉంటున్న ఇంటిపై కూడా గతంలో వివాదం ఏర్పడింది. తమ ఇళ్లు ఆక్రమించుకుని బాడుగ చెల్లించడం లేదని, గట్టిగా అడిగితే తుపాకీ చూపించి బెదిరించాడని ఆలంఖాన్‌పల్లెకు చెందిన బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించి వాపోయారు. ఇన్ని చేస్తున్నా.. తుపాకీ ై లెసైన్సును దుర్వినియోగం చేస్తున్నా ఈయనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
అండగా ఉంటా
ఎమ్మెల్యే ఇచ్చిన హామీలు... అది జిల్లా కేంద్రమైన కడప నగరంలోని గౌస్‌నగర్ ప్రాంతం. అక్కడ నివసిస్తున్న వారంతా కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. మురికి నీటి మధ్య దుర్భర జీవితాన్ని వెల్లదీస్తున్నారు. దినసరి కూలీలుగా కొందరు, భవన నిర్మాణ కార్మికులుగా మరికొందరు బతుకులు వెళ్లదీస్తున్నారు. శ్రమనే నమ్ముకుని జీవిస్తున్న బడుగుల కాలనీలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాలు అశ్రద్ధ వహిస్తున్నాయి. పేరుకు జిల్లా కేంద్రమైనా కనీస వసతులు సమకూరక అల్లాడిపోతున్నారు. తల్లి గర్భంలో ఉన్నంత వరకూ రక్షణ కవచంలో ఉండే పసిబిడ్డలు ఆ తర్వాత మురుగుతో సహవాసం చేయాల్సిన దుస్థితి పడుతోంది.గౌస్ నగర్‌లోని బడుగు జీవులను పలకరించేందుకు కడప ఎమ్మెల్యే ఎస్బి అంజాద్బాష ‘సాక్షి’ తరపున వీఐపీ రిపోర్టర్‌గా మారారు. వారి ఆవేదనను స్వయంగా తెలుసుకున్నారు. కడప కార్పొరేషన్ పాలకమండలితో చర్చించి ప్రాధాన్యత పరంగా అభివృద్ధి పనులు చేపడతాం. ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు నిధులు దక్కకపోయినా, ఎమ్మెల్యే నిధుల నుంచి కాలనీలను అభివృద్ధి చేస్తాం. గౌస్‌నగర్‌లో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉంది. వర్షం వస్తే మురుగు నీటిలోనే దినచర్య ఉంటోంది. ఇప్పటికీ రోడ్డు సౌకర్యం సక్రమంగా లేకపోవడం విచారకరం. సత్వరమే సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుడుతా. రూ.10లక్షలు వెచ్చించి అభివృద్ధి పనులు చేపడుతా. పింఛన్ల జాబితా నుంచి తొలగించడంతో అర్హులైన వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఉండేందుకు ఇళ్లు లేకపోయినా పొలం ఉందంటూ పింఛన్లు తొలగించారు. మాసాపేటలో కాలువలు, విద్యుత్ స్తంభాల సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటాం, గౌస్‌నగర్‌లో చౌకదుకాణం ఏర్పాటు చేసేందుకు తహసీల్దార్‌తో మాట్లాడి కృషి చేస్తా. బడుగులకు అండగా ఉంటా. పింఛన్ రాలేదని ఓ అవ్వ కన్నీరు.. మురుగు కాలువలో నీరు పోలేదని ఓ వ్యక్తి బేజారు.. సొంత ఇల్లు లేదని ఓ మహిళ ఆవేదన.. రేషన్ తగ్గించేశారంటూ వృద్ధురాలి నివేదన.. ‘సాక్షి’ వీఐపీ రిపోర్టర్‌గా కడప ఎమ్మెల్యే అంజద్ బాషా చేసిన ఇంటర్వ్యూలో పేదల ఆక్రందనలకు అక్షర రూపాలు ఇవి. వీఐపీ రిపోర్టర్‌గా ఆయన పేదల బాధలు అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని.. మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే: నీ పేరేంటవ్వా? వృద్ధురాలు: కనకమ్మ సార్.. ఎమ్మెల్యే: నీ సమస్య ఏంటి? వృద్ధురాలు: నాకు మూడునెలలుగా పింఛన్ రాలేదు సార్, వైఎస్ ఉన్నప్పుడు బాగా వచ్చేది, ఇప్పుడు రావడం లేదు. ఎమ్మెల్యే: ఎందుకు రాలేదని అడగలేదా? వృద్ధురాలు: అడిగాను సార్, నాగోడు వినేదెవ్వరూ.. ఎమ్మెల్యే: అయ్యో! నీకు పింఛన్ వచ్చేలాగున అధికారులతో మాట్లాడుతాలే, ఫించన్ ఎందుకు రాలేదో మీ తరపున అడుగుతాను. ఎమ్మెల్యే: నీ సమస్య ఏంటమ్మా? వెంకటసుబ్బమ్మ: సార్, భర్త చనిపోయి చాలా ఏళ్లైంది, నాకు పింఛన్ ఇవ్వడంలేదు. ఎన్నిసార్లు అప్లికేషన్ పెట్టినా ఇవ్వడంలేదు. ఎమ్మెల్యే: జన్మభూమిలో అడగలేదా? వెంకటసుబ్బమ్మ: అడిగాను సార్, ఇవ్వలా. జన్మభూమిలో మా సమస్యలు అస్సలు విన్లేదు సార్. ఎమ్మెల్యే: ఎందుకు రాలేదో కనుక్కొని న్యాయం చేద్దాంలేమ్మా.. పాడుబడిన బోద కొట్టంలో ఉన్నమహిళ వద్దకు పోయి ఎమ్మెల్యే: ఇది నీ సొంత ఇల్లేనా.. తల్లీ? భాగ్యమ్మ: కాదు సార్, బాడుగ ఇల్లు. ఎమ్మెల్యే: వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇంటి స్థలానికి పెట్టుకోలేదామ్మా.? భాగ్యమ్మ: లేదు సార్, ఆయన పోయినాక ఎన్నిసార్లు పెట్టినా ఇవ్వడం లేదు, వానొచ్చినా, వంగడొచ్చినా ఈ ఇంటిలో ఉండలేకున్నాం సారూ.. ఎమ్మెల్యే: ఈ ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇస్తే నీకు తప్పక ఇప్పించే ఏర్పాటు చేస్తానమ్మా, భయపడకు. (ఒక ముసలావిడ వద్దకు వెళ్లి) ఎమ్మెల్యే: ఏమవ్వా.. బాగున్నావా..? ముసలావిడ: సైగలు చేసింది,(పక్కనున్న మహిళ కల్పించుకుంటూ ఆమెకు చెవుడు సార్, వినపడదు) ఎమ్మెల్యే: అయ్యో, ఆమె సమస్య ఏమి? మహిళ: ఈమెకు ఈ నెల నుంచి 35 కేజీలు బియ్యం ఇవ్వడం లేదు సార్, అదే విషయం ఆమె చెప్తోంది. ఎమ్మెల్యే: అవునా..! ఎందుకు ఇవ్వలేదని డీలర్‌ను అడగలేదా..కారణం ఏంటంటా..? మహిళ: ఆమెను సాకడానికి బిడ్డలు కూడా లేరు, ఎట్టా బతుకుతుంది సార్.. మీరే చెప్పండి ఎమ్మెల్యే: నిజమే, తహశీల్దార్‌తో మాట్లాడి ఆమెకు రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటా.. ఎమ్మెల్యే: నీ పేరేంటమ్మా? ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయి? మహిళ: నాపేరు చంద్రలీల సార్.. ఇక్కడ కాలువలు సరిగా తీయడం లేదు, తాగేనీళ్లు నల్లగా వస్తున్నాయి, ఎమ్మెల్యే: కార్పొరేషన్ వారికి చెప్పలేదా? మహిళ: చెప్పాం సార్, వారానికో రెండు వారాలకో వ చ్చి పైపైన తీసిపోతారంతే... ఎమ్మెల్యే: నేను అధికారులతో మాట్లాడుతాలేమ్మా...కాలువల్లో పూడిక తీయించి, తాగునీటిలో వస్తున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు చ ర్యలు చేపడదాం. మహిళ: కె నరా బ్యాంకు వాళ్లు మా సంఘం పొదుపు లెక్క రూ. 40 వేలు తీసుకున్నారు సార్.. ఎమ్మెల్యే: అన్నిచోట్లా అలాగే ఉందమ్మా..ఈ ప్రభుత్వం అబద్ధపు హామీలతో ముందుకు సాగుతోంది. ఆ హామీల అమలుకు అందరం కలిసి పోరాటం చేద్దాం ఎమ్మెల్యే: ఏమయ్యా, ఏంటి సమస్య? సుబ్బయ్య: (ఇంటిముందున్న కాలువను చూపుతూ) ఈ కాలువలో నీళ్లు పోవు, కసువు ఎత్తరు, వాసన భరించలేకున్నాం, అందరికీ జొరాలు వస్తున్నాయి. ఎమ్మెల్యే: నిజమే, చాలా దుర్భరంగా ఉంది. అధికారులకు చెప్పలేదా.. సుబ్బయ్య: చెప్పాం సార్, నీళ్లు మాత్రం పోవు. ఎమ్మెల్యే: కాలువలు శుభ్రం చేయిస్తానని చెబుతూ (మేస్త్రి శివకు ఫోన్ చేసి వెంటనే కాలువలు శుభ్రం చేయాలని ఆదేశించారు) ఇంటి వద్ద నిలబడి ఉన్న వ్యక్తి దగ్గరకు పోయి ఎమ్మెల్యే: ఏమన్నా, బాగున్నావా..? మురళి: బాగున్నా సార్, ఇక్కడ కాలువ పక్కనే ఉన్న పబ్లిక్ కొళాయి విరిగిపోయింది. నీళ్లు పట్టుకునేందుకు కూడా వీలులేకుండా ఉంది. ఎమ్మెల్యే: అవును కదా ఇలాగుంటే ఎలా పట్టుకొంటారు.. అధికారులకు చెప్పి వెంటనే కొళాయిని బాగుచేయిస్తాలేన్నా. (పూరి గుడిసెలో ఉన్న వృద్దురాలి వద్దకు పోయి) ఎమ్మెల్యే: ఏమవ్వా, బోదకొట్టంలో ఉన్నావే..నీకు ఇళ్లు రాలేదా? లక్షుమ్మ: రాలేదయ్యా.. ఎమ్మెల్యే: అర్జీ పెట్టలేదా? లక్షుమ్మ: పెట్టానయ్యా...రాలేదు, వస్తున్న పింఛన్ కూడా తీసేశారు. ఎమ్మెల్యే: అయ్యో, అలాగా..నీకు పింఛన్ ఇప్పించేందుకు కృషి చేస్తాలే అవ్వా, బాధపడకు. ఎమ్మెల్యే: నీపేరేంటయ్యా? సంపత్: పబ్లిక్ ట్యాప్ విరిగిపోయింది సార్, (పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని చూపుతూ) ఈ స్తంభం ఎప్పుడు పడిపోతుందో తెలియదు, ఒకవైపుకు వంగి ఉంది. స్తంభం, కొళాయి పక్కపక్కనే ఉండటం వల్ల కరెంటు వస్తుందేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఎమ్మెల్యే: విద్యుత్ శాఖ అధికారులకు చెప్పలేదా..? సంపత్: ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు సార్..కరెంటు కూడా అప్ అండ్ డౌన్ వస్తూ ఉంటుంది. దీనివల్ల లైట్లు, ఫ్యాన్లు, టీవీలు కాలిపోతున్నాయి. ఎమ్మెల్యే: అలాగా..విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కషిచేస్తా. (రోడ్డుపై ఎదురుగా వస్తున్న వృద్ధురాలితో) ఎమ్మెల్యే: ఏమవ్వా, నీకు పింఛన్ వస్తోందా? వృద్ధురాలు: రాలేదు సామీ, మూడునెలల నుంచి ఇవ్వడం లేదు ఎమ్మెల్యే: నీ పేరేమి, ఎందుకు ఇవ్వలేదంటా..? వృద్ధురాలు: నా పేరు రసూల్ బీ సార్..ఐదెకరాలు భూమి ఉందని ఇవ్వలేదంట. ఎమ్మెల్యే: నీకు నిజంగా భూమి ఉందా? వృద్ధురాలు: తినడానికి తిండే సరిగా లేదు, భూమి ఎక్కడిది సార్? ఎమ్మెల్యే: చూశారా..ఇలాంటి వారికి కూడా భూమి ఉందని పింఛన్ తొలగించడం అన్యాయం, నీకు తప్పకుండా న్యాయం చేసేలా ప్రయత్నిస్తానమ్మా. అరుగుపై విశ్రాంతి తీసుకొంటున్న వృద్ధురాలి పక్కన కూర్చొని ఎమ్మెల్యే: ఏమవ్వా.. బాగున్నావా? ఖాసింబీ: ఏదో ఇలాగున్నా నాయనా.. ఎమ్మెల్యే: ఏమైంది..? ఖాసీంబీ: మూడు నెలలుగా పింఛన్ రావడం లేదు. బతుకు కష్టంగా ఉంది. ఎమ్మెల్యే: అయ్యో, ఎందుకు తీసేశారవ్వా.. ఖాసింబీ: నాకు యభై ఏడేళ్లేనట, అందుకే పింఛన్ నిలిపేశారు ఎమ్మెల్యే: అధికారులు చేసిన తప్పుకు మీరు శిక్ష అనుభవిస్తున్నారు, ఈ ముసలవ్వకు యాభై ఏడేళ్లంటే ఎవరైన నమ్ముతారా... నేను అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తాలే అవ్వా. మహిళ: సార్....సార్... ఎమ్మెల్యే: ఏమమ్మా...చెప్పు మహిళ: నాపేరు మల్లికాబేగం సార్, మాకు స్టోర్ చాలా దూరంగా ఉంది. మాసాపేటకు పోయి రేషన్ తెచ్చుకోవాలంటే కష్టంగా ఉంది. చాలామందికి రేషన్‌కార్డులు తీసేశారు. ఎమ్మెల్యే: తహశీల్దార్‌తో మాట్లాడి చౌకదుకాణం ఈ ఏరియాలోనే ఏర్పాటు చేయిస్తా, రేషన్‌కార్డులు ఎందుకు తొలగించారో కనుక్కొని న్యాయం చేస్తాలేమ్మా,.. పొంగిపొర్లుతున్న కాలువను చూపిస్తున్న మహిళతో ఎమ్మెల్యే: నీపేరెంటమ్మా మహిళ: నాపేరు భాను సార్.. ఎమ్మెల్యే: ఎందుకు ఈ కాలువ ఇలా ఉంది భాను: ఈ కాలువలో నీరు సరిగా పోదు సార్, వర్షం వస్తే ఈ రోడ్డంతా నీళ్లే ఉంటాయి, నడవాలన్నా సాధ్యం కాదు. పాములు కూడా వస్తున్నాయి. అధికారులకు చాలాసార్లు చెప్పాము సార్, వారు చేయలేదు ఎమ్మెల్యే: నాకు వచ్చే నిధులతో ఈ కాలువ బాగుచేయిస్తాలే తల్లీ.. సార్...సార్ ఇక్కడ చూడండి సార్..అని చెబుతున్న వ్యక్తితో ఎమ్మెల్యే: ఆ..,చెప్పు, నబీరసూల్: వర్షం వస్తే ఇక్కడ మోకాలి లోతు మురికి నీళ్లు నిలుస్తాయి, ఈ నీళ్లలో దిగనిదే ఎక్కడికీ పోలేము, అనేక ఏళ్లుగా ఈ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే: గతంలో ఉన్న మంత్రికి చెప్పారా... నబీరసూల్: చెప్పాం సార్, పట్టించుకోలేదు. ఎమ్మెల్యే: ఇక్కడ ఇంత దారుణంగా ఉంటే నివసించేదెట్టా....నా నిధుల నుంచిగానీ, కార్పొరేషన్ నిధుల నుంచిగానీ ఇక్కడ కల్వర్టు నిర్మించేందుకు కృషి చేస్తా. ఇంటిముందు దిగాలుగా కూర్చొన్న వృద్ధుడి దగ్గరకు పోయి ఎమ్మెల్యే: ఏం తాతా, అలా కూర్చొన్నావు? మహబూబ్ సాహెబ్: నాకు పింఛన్ రావడం లేదయ్యా, ఇల్లు కూడా లేదు, బాడుగ ఇంట్లో ఉంటున్నా.. ఎమ్మెల్యే: అయ్యో..ఇంత ముసలి వయసులో పింఛన్ కూడా రాకపోతే బతకడం ఎలా, నీకు పింఛన్ ఇప్పించేందుకు నావంతు ప్రయత్నం చే స్తానులే, ఆందోళన పడొద్దు. గుడిసెలో ఉన్న మహిళ వద్దకు పోయి మంచం మీద కూర్చొని ఎమ్మెల్యే: మీ ప్రాంతానికి రోడ్డు లేదు, కాలువులు లేవు, ఎలా చేస్తున్నారమ్మా మస్తాన్‌బీ: అవును సార్, అందరినీ అడిగినాం, ఎవరూ పట్టించుకోలేదు. ఎమ్మెల్యే: నీకు ఇళ్లు లేదా.. మస్తాన్ బీ: లేదు సార్, అందుకే ఈ గుడిసెలో ఉంటున్నా, దోమలు, ఈగలతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎమ్మెల్యే: ఈ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తే నీకు తప్పక ఇల్లు వచ్చేలా చేస్తా, ఆలోపు ఈ వీధికి నా నిధుల నుంచి రోడ్డు ఏర్పాటు చేయిస్తా. ఎవరైతే సమస్యలు చెప్పారో వారందరి పేర్లు, పింఛన్ పాసుపుస్తకాల నెంబర్లు నోట్ చేసుకొమ్మని స్థానిక కార్పొరేటర్ సోదరుడు జహీర్‌కు అంజద్‌కు చెప్పారు. వారి సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అందరికీ న్యాయం జరిగేలా పోరాడుతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఏం చెప్పారంటే.... జిల్లా కేంద్రంలో నివాసం ఉండారనే మాట తప్పా, కనీస వసతులు కూడ సమకూరలేదు. నిద్ర లేస్తునే మురుగునీటితోనే సావాసం చేయాల్సిన దుస్థితి ఇక్కడి ప్రజానీకానికి ఏర్పడింది. గత ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పటికీ వెనుకబడ్డ ప్రాంతాన్ని ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేయలేదు. గౌస్‌నగర్, మాసాపేట ప్రజలు అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. పసిబిడ్డలు మురుగుకాలువలల్లో ఆడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ మారుమూల ప్రాంతంలో కూడ ఇంతటి అద్వాన్నమైన పరిస్థితులు లేవు. ప్రచార ఆర్భాటాలకు పోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వసతులు సమకూర్చాల్సిన బాధ్యతల్ని విస్మరిస్తున్నాయి.ఎన్నికల ముందు టీడీపీ ఎన్నో హామీలు ఇచ్చింది. ఆర్నెళ్లు కావొస్తున్నా వాటిలో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. అనేక ఏళ్లుగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తీసుకొంటున్న పింఛన్లను నిష్కారణంగా తొలగించారు. ఆధార్, రేషన్ కార్డుల్లో తప్పులను సాకుగా చూపకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని అధికారులకు చెప్పాం. మీ సమస్యలను చిత్తశుద్ధితో పరిష్కరించేందుకు కృషి చేస్తానని మాట ఇస్తున్నా... -
భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుదాం..
కడప కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలు బాగున్నాయని, అందుకు అనుగుణంగా పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా పేర్కొన్నారు. కడప సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు, బలీహ న వ ర్గాలకు చెందిన పేద విద్యార్థులను బాగా చదివించేందుకు కృషి చేద్దామన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారని ఆయన కొనియాడారు. కార్పొరేషన్‌లోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు అధికంగా ఉన్నా టీచర్ల సమస్య ఉందని, అందువల్ల కొంత మంది విద్యావలంటీర్లను తీసుకుని విద్యనందించేలా కృషి చేద్దామన్నారు. -
ఉత్కంఠ.. ఉద్రిక్తత
న్యూస్‌లైన్ నెట్వర్క్: కడప కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేలు, రాయచోటి, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాలిటీ పాలకమండళ్ల ఎన్నికలు ఉద్రిక్తత, ఉత్కంఠ మధ్య జరిగాయి. కడప నగర మేయర్‌గా సురేష్‌బాబు ఎన్నికయ్యారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చైర్మన్‌గా ఉండేల గురివిరెడ్డి, మైదుకూరు చైర్మన్‌గా రంగసంహ, మైదుకూరు చైర్మన్‌గా పార్థసారధి ఎన్నికయ్యారు. రాయచోటి, ఎర్రగుంట్ల ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. వైఎస్సార్సీపీ, తెలుగుదేశం పార్టీల బలాబలాలు సమానం కావడంతో డిప్ తీశారు. ఈ రెండు చోట్ల విజయం వైఎస్సార్సీపీనే వరించింది. జమ్మలమడుగులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఎన్నికను శుక్రవారానికి వాయిదా వేశారు. కడప నగర మేయర్‌గా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కె. సురేష్‌బాబు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. 42 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్ అఫిషియో మెంబర్లు ఆయనకు మద్దతు పలికారు. అలాగే డిప్యూటీ మేయర్‌గా 25వ డివిజన్ కార్పొరేటర్ బి. అరీఫుల్లా అంతే ఆధిక్యంతో నెగ్గారు. జిల్లా కలెక్టర్ శశిధర్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. సుదీర్ఘ సమయం తర్వాత మళ్లీ ప్రజాప్రతినిధులు కడప కార్పొరేషన్‌కు రావడం సంతోషకరమని జిల్లా కలెక్టర్, ప్రిసైడింగ్ అధికారి కె.శశిధర్ అన్నారు. కడప నగర ప్రజలకు మంచి పాలన అందించేందుకు పాలకవర్గమంతా కష్టపడి పనిచేస్తుందని నూతన మేయర్ కొత్తమద్ది సురేష్‌బాబు అన్నారు. పులివెందుల చైర్‌పర్సన్‌గా ప్రమీలమ్మ : పులివెందుల మున్సిపాలిటీ చైర్ పర్సన్‌గా ప్రమీలమ్మ ఎన్నికయ్యారు. వైఎస్ చైర్మన్‌గా చిన్నప్పను ఎన్నుకున్నారు. ప్రొద్దుటూరు చైర్మన్‌గా గురివిరెడ్డి : ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్‌గా టీడీపీకి చెందిన ఉండేల గురివిరెడ్డి ఎన్నికయ్యారు. టీడీపీ ప్రతిపాదించిన ఉండేల గురివిరెడ్డి పేరును జాయింట్ కలెక్టర్ చదవగా కౌన్సిలర్లు కోనేటి సునంద, గాండ్ల శకుంతల ప్రతి పాదించారు. టీడీపీకి చెందిన 22 మంది కౌన్సిలర్లతో పాటు, ఎమ్మెల్సీ బచ్చలపుల్లయ్య కూడా చేతులు ఎత్తి మద్దతును ప్రకటించారు. దీంతో చైర్మన్‌గా గురివిరెడ్డి ఎన్నికైనట్లు జేసీ ప్రకటించి ప్రమాణ స్వీకారం చేయించారు. వైస్‌చైర్మన్‌గా జబీవుల్లాను ఎన్నుకున్నారు. అందరి సహకారంతో పట్టణ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా చైర్మన్ గురివిరెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణతో పాటు పలువురు చైర్మన్‌ను అభినందించారు. మైదుకూరు చైర్మన్‌గా రంగసింహ : మైదుకూరు మున్సిపాలిటీకి మొట్టమొదటి చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన రంగసింహ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా పెద్దగుర్రప్పను ఎన్నుకున్నారు. అందరి సహకారంతో మైదుకూరు అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా రంగసింహ ప్రకటించారు. టీడీపీ నేత పుట్టా సుధాకరయాదవ్ అభినందనలు తెలిపారు. బద్వేలు చైర్మన్‌గా పార్థసారధి : బద్వేలు మున్సిపల్ చైర్మన్‌గా తెలుగుదేశంకు చెందిన పార్థసారధి ఎన్నికయ్యారు. ఆయనకు ధ్రువీకరణ పత్రం అందజేసి ప్రమాణస్వీకారం చేయించారు. వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రిటర్నింగ్ అధికారి లవన్న కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. రాయచోటిలో వైఎస్సార్సీపీదే విజయం : రాయచోటి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక క్షణ క్షణం ఉత్కంఠ నడుమ సాగింది. వైయస్ఆర్సీపీ, టీడీపీ సభ్యుల బలం సమానం కావడంతో లాటరీ పద్దతిలో మున్సిపల్ ఛైర్మన్‌గా ఖయ్యంఖాని నసీబున్ ఖానం ఎన్నికయ్యారు. మొదట వైయస్ఆర్సీపీ తరుపున నసీబున్ ఖానంను ఛైర్మన్ అభ్యర్థిగా ప్రకటించారు. అలాగే టీడీపీ తరుపున షాబిరున్నీసాను ఛైర్మన్ అభ్యర్థిగా సూచించారు. ఇరువర్గాల బలాలు సమానంగా ఉండటంతో చైర్మన్‌ను లాటరీ పద్దతిలో ఎంపిక చేశారు. చైర్మన్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీకి చెందిన నసీబున్ ఎన్నికకాగా వైస్ చైర్మన్‌గా ఇందాదుల్లా ఎన్నికయ్యారు. ఎర్రగుంట్లలో వైఎస్సార్సీపీ విజయం ఉత్కంఠగా జరిగిన ఎర్రగుంట్ల మున్సిపాలిటీ చైర్మన్, ైవె స్ చైర్మన్లుగా వైఎస్సార్సీపీ అభ్యర్థులే విజయం సాధించారు. లక్కీడిప్‌లో చైర్మన్‌గా ముసలయ్య, వైస్ చైర్మన్‌గా సుభాష్‌రెడ్డి ఎన్నికయ్యారు. శిబిరాలలో ఉన్న కౌన్సిలర్లు ఉదయం 10 గంటలకే మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. వీరందరితో ప్రిసైడింగ్ అధికారి రంగన్న ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా ముసలయ్య, టీడీపీ అభ్యర్థిగా సాదుకూన్ను ప్రకటించారు. ఇరువర్గాల బలాలు సమానం కావడంతో లక్కీడిప్ తీశారు. డిప్లో ముసలయ్యనే విజయం వరించింది. అలాగే వైస్ చైర్మన్‌గా వైఎస్సార్సీపీకే చెందిన సుభాష్‌రెడ్డి విజయం సాధించారు. -
కౌంట్‌డౌన్!
మున్సిపల్ పాలకమండలి ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. గురువారం కొత్త పాలకమండళ్లు కొలువు తీరనున్నాయి. తెలుగుదేశం పార్టీ అనైతిక చర్యల కారణంగా యర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్సీపీ కౌన్సిలర్లకు విప్ నోటీసులు అందజేశారు. జమ్మలమడుగు ఛైర్మన్ ఫలితాన్ని లాటరీ నిర్దేశించనుంది. మిగిలిన మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా జరగనున్నాయి. సాక్షి ప్రతినిధి,కడప: జిల్లాలో కడప కార్పొరేషన్, పులివెందుల, రాయచోటి, యర్రగుంట్ల మున్సిపాలిటీలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేల్ మున్సిపాలిటీలను తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. యర్రగుంట్ల మున్సిపాలిటిలో వైఎస్సార్సీపీ 18మంది కౌన్సిలర్లను దక్కించుకుంది. టీడీపీ కేవలం 2స్థానాలకే పరిమితమైంది. అయితే వైఎస్సార్సీపీకి చెందిన 8మంది కౌన్సిలర్లను టీడీపీ నాయకులు ప్రలోభపెట్టారు. ఆ మేరకు ఆ 8మంది కౌన్సిలర్లు టీడీపీ క్యాంపునకు తరలివెళ్లారు. దాంతో మొత్తం వ్యవహారం రసకందాయంలో పడింది. ఇరుపక్షాలు తమ వైపు 10మంది కౌన్సిలర్లు ఉన్నారనే భ్రమలో ఉన్నారు. అయితే వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు విప్ ధిక్కరించరనే ఆశాభావం ఆ పార్టీ వర్గీయుల్లో వ్యక్తమవుతోంది. యర్రగుంట్ల, జమ్మలమడుగు మినహా మిగిలిన చోట్ల ఛైర్మన్ ఎన్నికలు సజావుగా జరుగుతాయనే ఆశాభావాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. భయాందోళనకు గురిచేస్తున్న ‘దేశం’ నేత యర్రగుంట్ల మున్సిపల్ కౌన్సిలర్ల కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ విప్ నోటీసులు అందజేసింది. ఆ కారణంగా పదవులు కోల్పోతామనే బెంగ కౌన్సిలర్లను వెంటాడుతోంది. దాంతో టీడీపీ క్యాంపులోని వారు తర్జనభర్జన పడుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో వెనక్కి తగ్గితే తమ పరువుకు భంగం ఏర్పడుతుందని టీడీపీకి చెందిన ఓ ఎంపీ సొదరుడు వీరంగం చేస్తున్నట్లు సమాచారం. ఛైర్మన్ ఎన్నిక సమయంలో విప్ కారణంగా వైఎస్సార్సీపీకి ఓటేశారా? తర్వాత ఉంటుంది. ప్రాణాలు దక్కాలంటే తాము ప్రకటించిన అభ్యర్థికే ఓటు వేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం. మీ 8మందిలో ఒకర్ని ఛెర్మైన్‌గా ప్రతిపాదిస్తాం, వారికే ఓటెయ్యండంటూ వివరించినట్లు తెలుస్తోంది. విప్ ధిక్కరిస్తే పదవి పోతుందికదా? మళ్లీ మేం గెలవగలమా? అంటూ కొందరు కౌన్సిలర్లు ప్రశ్నించడంతో ఆ నాయకుడు తీవ్రస్థాయిలో చిందులు తొక్కినట్లు తెలుస్తోంది. అటు ఇటుగా వ్యవహరించారో మీ సంగతి తర్వాత చూసుకుంటానంటూ పరుషపదజాలం ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ విషయం యర్రగుంట్లకు పాకడంతో కౌన్సిలర్ల బంధువులు తీవ్రంగా మథన పడుతున్నారు. ఛెర్మైన్ను నిర్దేశించనున్న లాటరీ జమ్మలమడుగు మున్సిపాలిటిలో 11స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కగా, 9 స్థానాలు మాత్రమే వైఎస్సార్సీపీకి దక్కాయి. కాగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి ఇరువురు ఎక్స్అఫిషియో మెంబర్లుగా జమ్మలమడుగు మున్సిపాలిటిలో నమోదు చేయించుకున్నారు. దాంతో ఇరు పక్షాలకు సమానంగా ఓట్లు లభించాయి. దీంతో లాటరీ పద్ధతిన ఛైర్మన్ ఎన్నిక అనివార్యమైంది. ఛెర్మైన్ అభ్యర్థుల పేర్లు ఒకే సైజు పేపర్లలో, ఒకే కలర్ పేపర్లలో ఐదేసి చొప్పున రాసి ఒక డబ్బాలో వేసి కలియ తిప్పనున్నారు. వాటి నుంచి ప్రిసైడింగ్ అధికారి ఒక పేపర్ తీయనున్నారు. అందులో ఏ పేరుంటే ఆపేరు వ్యక్తి ఛెర్మైన్‌గా ఎన్నిక కానున్నారు. వైస్ ఛెర్మైన్ ఎన్నిక కూడా అదే పద్ధతిలో ఉంటుంది. యర్రగుంట్ల మున్సిపాలిటిలో విప్ ధిక్కరించి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు టీడీపీకి మద్దతుగా నిలిస్తే ఇక్కడ కూడా లాటరీ పద్ధతిలోనే ఛైర్మన్ ఎన్నికను చేపట్టాల్సి ఉంటుంది. కడపపై టీడీపీ దింపుడు కళ్లెం ఆశలు గల్లంతు కడప కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ 42 కార్పొరేటర్ స్థానాలను కైవసం చేసుకోగా, టీడీపీ 8స్థానాలను దక్కించుకుంది. అయితే కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల పునర్విభజన సక్రమంగా నిర్వహించలేదని ఒక మాజీ కార్పొరేటర్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కారణంగా పాలకమండలి ఏర్పాటుకు ప్రతిబంధకం కానుందని తెలుగుదేశం పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. అందులో భాగంగా మంగళవారం హైకోర్టులో ఉన్న కేసు మరోవారం రోజులకు వాయిదా పడటంతో టీడీపీ నేతల ఆశలు నీరుగారాయి. డివిజన్ల పునర్విభజనపై నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు తలెత్తని అభ్యంతరాలు ఆ తర్వాత ఉత్పన్నం కావడం వెనుక రాజకీయ కారణాలు దాగి ఉన్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. -
‘అడ్వాన్సు’గా మెక్కేశారు
కడప కార్పొరేషన్ అధికారులకు మున్సిపల్ ఎన్నికలు వరంగా మారాయి. ఎన్నికల నిర్వహణపేరుతో అందినకాడికి దోచుకుని కార్పొరేషన్ ను ఖాళీ చేశారు. మళ్లీ ఐదేళ్ల తర్వాత ఎవరు ఎక్కడ ఉంటారోననే ఉద్దేశంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే యత్నంలో కొందరు అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు. లక్షలకు లక్షలు మింగేసి నింపాదిగా కూర్చున్నారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ఖర్చు వివరాలపై సమగ్ర దర్యాప్తు జరిపితే అక్రమార్కుల గుట్టు రట్టయ్యే అవకాశం ఉంది. కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలు కొందరు అధికారులకు వరంగా మారాయి. ఇచ్చేవాడుంటే చచ్చేవాడూ లేచి వస్తాడనే సామెత చందాన మున్సిపల్ ఎన్నికల సమయంలో కొందరు అధికారులు విచ్చలవిడిగా అడ్వాన్సులు తీసుకొని కడప నగరపాలక సంస్థను నిలువునా ముంచారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రూ.35 లక్షలు ఖర్చుచేయమంటే కడప కార్పొరేషన్లో మాత్రం దానికి నాలుగింతలు అంటే రూ. 1.35కోట్లు ఖర్చు చేశారు. దీన్ని బట్టే మన అధికారులు ఎన్నికలను ఎంత ‘కాస్ట్లీ’గా నిర్వహించారో తెలుస్తోంది. కడప నగరపాలక సంస్థ పరిధిలోని 246 పోలింగ్ స్టేషన్లలో టేబుళ్లు ఉన్నాయి, అయినా అధికారులు ఇష్టారాజ్యంగా కొత్త టేబుళ్లు, ర్యాక్‌లు కొన్నారు. అన్నికేంద్రాలకు విద్యుదీకరణ ఉంది. మంచినీరు, బారికేడ్లు కట్టడానికి ఇంజనీరింగ్ అధికారులు లక్షలకు లక్షలు అడ్వాన్సులు తీసుకొన్నారు. అందరు ఇంజినీర్లకు సమానంగా పోలింగ్ స్టేషన్లు కేటాయించినందున ఇంచుమించు అందరికీ సమానంగా ఖర్చు కావాలి. కానీ కొందరికి లక్ష, రెండు లక్షలే ఖర్చుకాగా మరికొందరికి మాత్రం ఐదారు లక్షలు ఖర్చు అయ్యింది. ఒక చేయి తిరిగిన ఇంజినీరింగ్ అధికారైతే అత్యధికంగా రూ. 6లక్షలు అడ్వాన్సు తీసుకోవడమే గాక ఆఫీసులో కొత్త ఛాంబర్ల ఏర్పాటు, కార్పొరేషన్ గోడలకు, బారికేడ్లకు పెయింటింగ్‌ల పేరుతో అందినకాడికి వెనకేసుకొన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కార్పొరేషన్లో రెండు జిరాక్స్ మిషిన్లు ఉన్నాయి. అదనంగా ఒక పెద్ద జిరాక్స్ మిషిన్‌ను బాడుగకు తెచ్చారు. ఎన్నికలు జరిగినన్నిరోజులు దీనికి ఇచ్చిన బాడుగతో ఒక కొత్త జిరాక్స్ మిషినే కొనవచ్చు. దీనిప్రకారం కార్పొరేషన్లో మొత్తం మూడు జిరాక్స్ మెషీన్లు ఉండగా కొందరు మాత్రం జిరాక్స్ చేయించినట్లు బిల్లులు పెట్టడం గమనార్హం. ఇంకొందరైతే కంప్యూటర్లకు మరమ్మతులు చేయించామని బిల్లులు చేసుకొన్నట్లు తెలిసింది. ఈవీఎం మిషన్లపై అతికించే సుమారు 500 బ్యాలెట్ పేపర్లను తీసుకురావడానికి కర్నూలుకు వెళ్లేందుకు మిగిలిన కార్పొరేషన్ల అధికారులు రూ. 5 వేల నుంచి 10వేలు తీసుకుపోతే మన కార్పొరేషన్ అధికారులు మాత్రం రూ. 30వేలు తీసుకుపోయినట్లు సమాచారం. ఈ బ్యాలెట్ పేపర్లను ప్రభుత్వమే ఉచితంగా ముద్రించి ఇస్తుంది. ఈ మొత్తమంతా కేవలం ప్రయాణచార్జీలు, బస చేసినందుకే. కోడ్ ఆఫ్ కండక్ట్‌కు సంబంధించి వాల్‌రైటింగ్స్ ఉన్న చోట సున్నం కొట్టే పనిని కార్పొరేషన్ సిబ్బందితో చేయించి బిల్లులు మాత్రం లక్షల్లో చేసుకొన్నట్లు తెలుస్తోంది. నామినేషన్ల సమయంలో నోటిఫికేషన్ వెలువడిన మార్చి 10వ తేదీనుంచి 18వ తేదీ వరకూ 8 నామినేషన్ కేంద్రాలలో ఆర్వోలు, ఏఆర్ఓలు, వారికి సహాయంగా 5 మంది కార్పొరేషన్ సిబ్బందిని నియమించారు. అంటే మొత్తం 40 మంది 8 రోజుల పాటు పనిచేశారు. వీరికి తోడు మరో 60 మంది పనిచేశారనుకొన్నా రోజుకు 100 మంది అవుతారు. వీరికి 8 రోజులకు రూ. 150లతో లెక్కేస్తే రూ. 1.20 లక్షలు. అలాగే పోలింగ్‌కు ముందురోజు, పోలింగ్‌రోజు రెండు రోజుల పాటు సుమారు 2వేల మంది చొప్పున విధులు నిర్వహించారు. ఈ లెక్కన రెండు రోజులకు నాలుగు వేలమందికి రూ. 6.00లక్షలు. మొత్తం 7.20 లక్షలు కావాలి. ఎంత దుబారాగా ఖర్చుపెట్టినా భోజనాల ఖర్చు రూ. 30 లక్షలు దాటదు. అయతే కార్పొరేషన్లో రిఫ్రెష్మెంట్స్ కోసం రూ. 44 లక్షలు ఖర్చు చేసినట్లు సమాచారం. నగరపాలక ఉన్నతాధికారి మంచితనం, ఉదారస్వభావాన్ని ఆధికారులు తమకు అనుకూలంగా మలుచుకొన్నట్లు దీన్నిబట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఈ అవినీతి వ్యవహారంపై చాలామంది సమాచార హక్కు చట్టం ద్వారా కూపీ లాగాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ దుబారా ఖర్చుపై కొత్త పాలకవర్గం కూడా కఠిన చర్యలు తీసుకొనే అవకాశాలు లేకపోలేదు. మున్సిపల్ కమిషనర్ వివరణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన నిధుల దుర్వినియోగంపై కడప కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసును న్యూస్‌లైన్ వివరణ కోరగా అదంతా అవాస్తవమన్నారు. ఖర్చు చేసిన మొత్తానికి సరిపడే బిల్లులు సిబ్బంది తెచ్చిఇచ్చారన్నారు. ఇది తప్పుడు సమాచారమని ఆయన కొట్టి పారేశారు. కాగా, ఉన్నతాధికారులు దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది. 20 రోజుల్లో రూ. 44 లక్షలు తిన్నారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో పనిచేసిన వారికి ఒక రోజుకు రిఫ్రెష్మెంట్స్ కోసం రూ. 150 వరకూ ఖర్చు చేసే సౌలభ్యం ఉంది. అయితే మనవాళ్లు అంతకు రెట్టింపు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఉదయం ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, మధ్యాహ్నం బిర్యానీ, రాత్రి బిర్యానీలు తెప్పించుకొని కార్పొరేషన్‌ను కాల్చుకుతిన్నారు. నామినేషన్ల సమయంలో వేళాపాళా లేకుండా తెచ్చిన భోజనం తిని చాలామందికి విరేచనాలు అయ్యాయి. దీంతో చాలామంది అప్పట్లో ఆ భోజనం తినలేదు. పోలింగ్‌కు ముందురోజు వాటర్ క్యాన్లకు డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందని కనీవినీ ఎరుగని రీతిలో వాటర్ప్యాకెట్లు తెచ్చి పనికానిచ్చారు. -
ప్రజా విజయం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్‌బాబు కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్ : కడప కార్పొరేషన్లో వైఎస్సార్సీపీ గెలుపు ప్రజా విజయంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మేయర్ అభ్యర్థి సురేష్‌బాబు పేర్కొన్నారు. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కడప కార్పొరేషన్లో 42 స్థానాలను కైవసం చేసుకున్న సందర్బంగా మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఉన్న అభిమానంతో తిరుగులేని ఆధిక్యతను అందించారన్నారు. మిగతా ఎనిమిది డివిజన్లలో స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు. మొత్తం మీద 30 వేల పైచిలుకు మెజార్టీ లభించడం సామాన్యమైన విషయం కాదన్నారు. పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడి ఉందని, ఆ ప్రభావమే మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కనిపించిందన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇలా ఉండబోవన్నారు. జిల్లాలో పది అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో కైవసం చేసుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. -
ఫ్యాన్ హవా
కడప కార్పొరేషన్లో తిరుగులేని ఆధిక్యత మున్సిపాలిటీలలో అత్యధిక వార్డులు కైవసం 97 స్థానాలు దక్కించుకున్న వైఎస్సార్సీపీ 87 స్థానాలతోనే సరిపెట్టుకున్న టీడీపీ కాంగ్రెస్‌కు ఒకే ఒక్క స్థానం పుర సమరంలో ఫ్యాన్ గాలి వీచింది. కడప కార్పొరేషన్లో తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో సైతం అదే హవాను కనబరిచింది. 186 మున్సిపల్ వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే 97స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకుంది. 87స్థానాలతోనే తెలుగుదేశం పార్టీ సరిపెట్టుకుంది. 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తే, 42 స్థానాలను వైఎస్సార్సీపీ దక్కించుకోగా, 8స్థానాల్లో టీడీపీ నెగ్గింది. జిల్లాలో మరోమారు వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించగా, టీడీపీ వెనుకబడింది. అయితే పాలకమండలిని కైవసం చేసుకునేందుకు సంఖ్యాపరంగా సరిపడ సీట్లు దక్కించుకోవడంతో నాలుగు మున్సిపాలిటీలు ఆపార్టీ ఖాతలో జమకానున్నాయి. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలకు, కడప కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. హైకోర్టు స్టేటస్కో ఆర్డర్ కారణంగా రాజంపేట మున్సిపల్ ఎన్నికలు రద్దయ్యాయి. మున్సిపాలిటీలను పరిశీలిస్తే పులివెందుల, రాయచోటి, యర్రగుంట్లలో వైఎస్సార్సీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. మైదుకూరు, బద్వేల్ మున్సిపాలిటీలలో టీడీపీ స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించగా, జమ్మలమడుగు, ప్రొద్దుటూరులో చావుతప్పి కన్నులొట్ట అయినట్లుగా స్వల్ప ఆధిక్యతతో గట్టెక్కింది. మొత్తానికి నాలుగు మున్సిపాలిటీలు తెలుగుదేశం పార్టీ వశం కానున్నాయి. సంఖ్యా పరంగా పాలకమండళ్లను కైవసం చేసుకున్నా, జిల్లాను పరిగణలోకి తీసుకుంటే 236 మందికిగాను, 139మంది వైఎస్సార్సీపీ ప్రతినిధులుగా ఎన్నికకాగా, 95 మంది తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్‌గా ఒకరు మాత్రమే జిల్లా నుంచి ఎన్నిక కావడం విశేషం. మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. ఓట్లల్లో సైతం ఆధిక్యతే.. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోలైన ఓట్లను పరిశీలిస్తే వైఎస్సార్సీపీకే పట్టణ ఓటర్లు మొగ్గుచూపారు. జిల్లాలోని కడప కార్పొరేషన్‌తో పాటు, ఏడు మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించారు. ఆయా మున్సిపాలిటీల పరిధిలో 4,54,769 మంది పట్టణ ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో వైఎస్సార్సీపీకి 2,27,480 మంది ఓటేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు 1,86,178 మంది ఓటేశారు. ఈలెక్కన 41,302 ఓట్లు అధికంగా వైఎస్సార్సీపీ దక్కాయి. ఇతర పార్టీల అభ్యర్థులకు 41,111 మంది అనుకూలంగా ఓటు వేశారు. తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్.... జిల్లాలో ఒకప్పుడు తిరుగులేని హవా ప్రదర్శించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన అంశంతో తుడిచిపెట్టుకుపోయింది. 236 స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తే అందులో ఒకే ఒక్క స్థానాన్ని ఆపార్టీ దక్కించుకుంది. బద్వేలులో ఒక కౌన్సిలర్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక స్థానాలలో నామినేషన్లు సైతం వేయలేని దుస్థితి ఆ పార్టీకి ఎదురైంది. సంస్థాగతంగా నిర్మాణం లేకపోయినా.. వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా నిర్మాణం పూర్తి కాకపోయినా మున్సిపోల్స్‌లో సత్తా చాటిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందే మున్సిపల్, స్థానిక సంస్థలకు ఎన్నికల నేపధ్యంలో వైఎస్సార్సీపీకి భారం కానున్నట్లు విశ్లేషకులు ముందే భావించారు. పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోయినా, సంస్థాగ తంగా పూర్తిగా నిలదొక్కకపోయినా మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటుకున్నట్లు పలువురు భావిస్తున్నారు. మాజీ కౌన్సిలర్ల కారణంగానే ప్రొద్దుటూరు, జమ్మలమడుగు మున్సిపాలిటీలలో ఓటమి ఎదురైనట్లు పలువురు విశ్లేషిస్తున్నారు. ప్రొద్దుటూరులో ఏడు మంది కౌన్సిలర్లను ఎన్నికల బరిలో దింపగా ఐదుగురు ఓటమి చెందారు. ఈ అంశాన్ని పలువురు ఉదహరిస్తున్నారు. స్థానికంగా వారిపై ఉన్న వ్యతిరేకత పార్టీపై ప్రభావం చూపిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇక క్యాంపు రాజకీయం
సినిమా హిట్ కావాలంటే క్లైమాక్స్‌లో సత్తా ఉండాలి. అలాగే రాజకీయాల్లో విజయం సాధించాలంటే చివరి ఎపిసోడ్లో అలర్ట్‌గా ఉండాలి. నామినేషన్, ప్రచారం, పోలింగ్, కౌంటింగ్ ముగిసినా... చివరి అంకమైన పాలకవర్గాల ఏర్పాటు ప్రధానపార్టీలకు సవాల్‌గా మారింది. బొటాబొటి మెజార్టీ వస్తే...అటువారిని ఇటు...ఇటు వారిని అటు కొనేసి పాలకవర్గాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. దీంతో తమపార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు పార్టీలు క్యాంపు రాజకీయానికి తెరలేపుతున్నాయి. అభ్యర్థులను పుణ్యక్షేత్రాలతో పాటు గోవా, కేరళ లాంటి పర్యాటక ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. సాక్షి, కడప: జిల్లాలో కడప కార్పొరేషన్, 7 మునిసిపాలిటీలకు మార్చి 30న ఎన్నికలు ముగిశాయి. ఎన్నికల షెడ్యూలు ప్రకారం ఏప్రిల్2నే ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికలపై వీటి ఫలితాలు ప్రభావం చూపుతాయని కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఫలితాలను మే 12న లెక్కించాలని కోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో నేడు మునిసిపాలిటీల ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికైన కౌన్సిలర్లు చైర్మన్లను, కార్పొరేటర్లు మేయర్‌ను వెంటనే ఎన్నుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ఎంపికలో ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు వేసే సౌలభ్యం ఉండటం, జూన్2న కొత్త రాష్ట్రం ఏర్పాటు కానుండటంతో అప్పటిదాకా చైర్మన్, మేయర్ అభ్యర్థులు నిరీక్షించకతప్పదు. సోమవారం కడప కార్పొరేషన్ పరిధిలో 50మంది కార్పొరేటర్లు, 7 మునిసిపాలిటీల పరిధిలో 186మంది కౌన్సిలర్లు ఎన్నిక కానున్నారు. అలాగే జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల కౌంటింగ్ మంగళవారం జరగనుంది. 10 నియోజకవర్గాల పరిధిలో 50మంది జెడ్పీటీసీ, 559మంది ఎంపీటీసీలు ఎన్నిక కానున్నారు. ఎన్నికైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు జిల్లా పరిషత్ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు జూన్ 2 వరకూ నిరీక్షించాల్సిందే. ఈ క్రమంలో ఫలితాల వెల్లడి తర్వాత తమ పార్టీలకు చెందిన అభ్యర్థులను కాపాడుకునే యత్నంలో వైఎస్సార్‌కాంగ్రెస్, టీడీపీలు ఉన్నాయి. మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్ పదవులను ఆశిస్తున్న నేతలు గెలిచిన సభ్యులతో క్యాంపులు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. పుణ్యక్షేత్రాలు..పర్యాటక ప్రదేశాలు జిల్లాలోని కార్పొరేషన్, 7మునిసిపాలిటీలు, 50 మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్మన్ల ఎన్నిక వచ్చే నెల 2 తర్వాత జరిగే అవకాశాలు ఉండటంతో అప్పటి వరకూ గెలిచిన అభ్యర్థులను కాపాడుకునేందుకు పలు పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెరలేపుతున్నాయి. ప్రస్తుతం వేసవి కావడంతో అభ్యర్థులు భార్య, పిల్లలతో సిద్ధమవుతున్నారు. గతంలో క్యాంపు రాజకీయాలు నాలుగైదు రోజులు జరిగేవి. అనివార్య కారణాలతో గెలిచిన సభ్యులను 20రోజుల పాటు కాపాడుకోవాల్సిన పరిస్థితి. పార్టీలు కూడా చైర్మన్ పదవులను ఆశిస్తున్న నేతలను ఈ ఖర్చుకు అవసరమైన నిధులు సమకూర్చుకోవాలని సూచిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికలకు భారీగా ఖర్చు చేశామని 20రోజుల పాటు క్యాంపు నడపాలంటే తడిసిమోపెడవుతుందని చైర్మన్ అభ్యర్థులు చెబుతున్నారు. అయితే ఇంతా కష్టపడి తీరా పదవి దక్కే సమయంలో నిర్లిప్తత ప్రదర్శిస్తే అసలుకే మోసం వస్తుందని ఖర్చుకు వెనుకాడకుండా ‘క్యాంపు’కు రెడీ అవుతున్నారు. కొందరు చైర్మన్ ఆశావహులు పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లేందుకు ప్రత్నిస్తున్నారు. ఇంకొందరు గోవా, కేరళ లాంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీనికోసం కొంతమంది ట్రావెల్ ఏజెన్సీలను కూడా సంప్రదిస్తున్నారు. ఫలితాలు వెలువడగానే సోమవారం సాయంత్రం నుంచే క్యాంపు రాజకీయాలు ఊపందుకోనున్నాయి. -
గెలిచేదెవరో..
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: పురసమరంలో విజేతలెవరో తేలే సమయం ఆసన్నమైంది. కడప కార్పొరేషన్‌తో పాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేల్, మైదుకూరు, పులివెందుల, యర్రగుంట్లలో 236 వార్డులకు పోటీపడిన 1183 మంది అభ్యర్థుల భవితవ్యం ఈ నెల 12వ తేదీ సోమవారం తేటతెల్లం కానుంది. ఆరోజు మున్సిపల్ ఎన్నికల ఓట్లను లెక్కించనున్నారు. జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ను కడప నగరంలోని నాగార్జున మహిళా డి గ్రీ కళాశాలలోనే నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మార్చి 30వ తేదిన కడప కార్పొరేషన్‌తో పాటు జిల్లాలోని 7 మున్సిపాలిటీలలో ఎన్నికలు జరిగాయి. కడప నగర పాలక సంస్థలో 2,71,532 మంది ఓటర్లు ఉండగా 62.67 శాతం అంటే 1,70,169 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2005లో ఇక్కడ 59.69 శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. అలాగే ప్రొద్దుటూరులో 1,23,481 మంది ఓటర్లు ఉండగా 75.82 శాతం, జమ్మలమడుగులో 35,485 మంది ఓటర్లు ఉండగా 80.65 శాతం, రాయచోటిలో 62,054 మంది ఉండగా 68.60 శాతం, పులివెందులలో 55,159 మంది ఓటర్లు ఉండగా 62.43 శాతం, బద్వేలులో 52,401 మంది ఓటర్లు ఉండగా 73.38 శాతం, మైదుకూరులో 33,318 మంది ఓటర్లు ఉండగా 76.03 శాతం, ఎర్రగుంట్లలో 23,368 మంది ఓటర్లు ఉండగా 82.16 శాతం ఓట్లు పోలయ్యాయి. కడప కార్పొరేషన్లో 50 వార్డులకు 311 మంది, బద్వేలులో 26 వార్డులకు 145 మంది, ఎర్రగుంట్లలో 20 వార్డులకు 54 మంది, ప్రొద్దుటూరులో 40 వార్డులకు 244 మంది, జమ్మలమడుగులో 20 వార్డులకు 98 మంది, పులివెందులలో 26 వార్డులకు 87 మంది, మైదుకూరులో 23 వార్డులకు 110 మంది, రాయచోటిలో 31 వార్డులకు 134 మంది కలిపి మొత్తం 236 వార్డులకు 1183 మంది బరిలో ఉన్నారు. ప్రధాన పార్టీలలో వైఎస్సార్సీపీ నుంచి 232 మంది, టీడీపీ నుంచి 225 మంది బరిలో ఉన్నారు. అందరికంటే ఎక్కువగా 629 మంది స్వతంత్రులు పోటీ పడ్డారు. వీరందరి భవితవ్యం సోమవారంతో తేలిపోనుంది.ఎన్నికల కమిషన్ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 2న మున్సిపల్ ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. అయితే పురపాలక ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడుతుందని కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే ఎన్నికల కమిషన్ మే 12న మున్సిపల్ ఎన్నికలు, 13న స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓట్ల లెక్కింపు ఇలా! నగర పాలక ఎన్నికల కౌంటింగ్ కోసం నాలుగు టేబుళ్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిపై నాలుగు డివిజన్ల ఓట్లను లెక్కిస్తారు. నాలుగు డివిజన్ల ఓట్ల లెక్కింపు పూర్తయితే తొలిరౌండ్ ఫలితాలు ప్రకటిస్తారు. కడపలో ఒక్కో రౌండుకు నాలుగు డివిజన్లు చొప్పున 50 డివిజన్ల ఫలితాలను 13 రౌండ్లలో లెక్కిస్తారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌ను కూడా ఇదే పద్ధతిలో నిర్వహించనున్నారు. 12వ తేది ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. టేబుల్ వద్దకు ఒకరికే అనుమతి - కమిషనర్ చల్లా ఓబులేశు కడప కార్పొరేషన్, మున్సిపల్ ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి పోటీ చేసిన అభ్యర్థి, జనరల్ ఏజెంటును మాత్రమే అనుమతిస్తామని నగర పాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేశు తెలిపారు. అయితే ఆ ఇద్దరిలో ఒకరు మాత్రమే కౌంటింగ్ టేబుల్ దగ్గర ఉండాలన్నారు. ఎన్నికల కౌంటింగ్ పాసులకు దరఖాస్తు చేసుకున్న వారికి ఆదివారం పాసులను జారీ చేస్తామన్నారు. 12వ తేది తెల్లవారుజామున 4 గంటలకు కొత్త కలెక్టర్ కార్యాలయంలోని స్ట్రాంగ్‌రూము నుంచి ఈవీఎంలను భారీ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు కేంద్రమైన నాగార్జున మహిళా డిగ్రీ కళాశాలకు తరలించనున్నామని తెలిపారు. ఈవీఎంల తరలింపు ప్రక్రియను పరిశీలించాలనుకుంటే అభ్యర్థులు రావచ్చని కమిషనర్ సూచించారు. ఓట్ల లెక్కింపులో తొలుత డివిజన్ల వారీగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంలోని ఓట్లను లెక్కిస్తామని వివరించారు. -
కడపలో పోలింగ్ ప్రశాంతం
కడప కార్పొరేషన్, న్యూస్‌లైన్: కడప నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడప నగరంలో 2,71,532 మంది ఓటర్లుండగా 1,70,169 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ శాతం 62.67గా నమోదైంది. ఈ సారి కడపలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. అలాగే ఈవీఎంలు మొరాయించడం, ఇతరత్రా సమస్యలు కూడా ఉత్పన్నం కాలేదు. పోలింగ్ సందర్భంగా ఉదయం 7 గంటలకే ఓటర్లు పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం, సాయంత్రం బాగా జరిగిన పోలింగ్ మధ్యాహ్నం మందకొడిగా సాగింది. ఎండ తీవ్రత పెరగడంతో మధ్యాహ్నం పోలింగ్ కేంద్రాల్లో సందడి కనిపించలేదు. గతంలో ఓటు వేస్తున్న చోట కాకుండా వేరే పోలింగ్ కేంద్రాలను కేటాయించడంతో ఓటర్లు ఇబ్బందులు పడ్డారు. అలాగే ఒక కుటుంబంలో ఉన్న భార్యాభర్తలకు కూడా వేర్వేరు పోలింగ్ కేంద్రాలను కేటాయించారు. రెండు ఇళ్లకు ఒకే పోలింగ్ కేంద్రం రాలేదంటే ఎంత గంద రగోళంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓటర్లకు సాధ్యమైనంత వరకూ దగ్గరగా ఉండే పోలింగ్ కేంద్రాలను కేటాయించాలి. కానీ చాలా వార్డులలో పరిస్థితి ఇందుకు భిన్నంగా జరిగింది. 3వ డివిజన్లో ఇలాంటి పరిస్థితి ఎక్కువగా కనిపించింది. స్లిప్పులున్నవారైతే దూరమైనా తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటే శారు. కానీ స్లిప్పులు లేని వారైతే ప్రతి పోలింగ్ కేంద్రం చుట్టూ చక్కర్లు కొట్టారు. 32వ వార్డు పరిధిలోని బెల్లంమండి పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ మిషన్ వద్ద వెలుతురు లేకపోవడంతో గుర్తులు కానరాక వృద్ధులు ఇబ్బంది పడ్డారు. పత్తాలేని బీఎల్ఓలు : స్లిప్పులు అందని వారికి పోలింగ్ కేంద్రం వద్ద బీఎల్ఓలు అందజేస్తారని ఎన్నికల అధికారులు తెలిపినా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద బీఎల్ఓల జాడ కానరాలేదు. ఓటర్లు తమ ఓటరు కార్డు పట్టుకుని స్లిప్పులు లేక, పోలింగ్ ఎక్కడో తెలియక సమస్యలు ఎదుర్కొన్నారు. మొత్తమ్మీద మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో అధికార యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. -
ఓటర్లను తరలిస్తే చర్యలు
కడప అర్బన్, న్యూస్‌లైన్ : కడప కార్పొరేషన్ ఎన్నికల రోజు ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటుహక్కును పోలింగ్ కేంద్రానికి వెళ్లి సద్వినియోగం చేసుకోవాలని, లేనిపక్షంలో ఇంట్లో ఉండాలని బహిరంగ ప్రదేశాలలో గుంపుగుంపులుగా ఉంటే చర్యలు తప్పవని కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి హెచ్చరించారు. ఓటర్లను ఎవరైనా అభ్యర్థులు వాహనాలలో తరలిస్తే చర్యలు తప్పవన్నారు. కడప చిన్నచౌకు పరిధిలోని మానస కల్యాణ మండపంలో 4, 5, 6, 7 డివిజన్ల అభ్యర్థులు, ప్రజలకు ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళిపై గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఆ సమయంలో ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఓటింగ్ సమయంలో పోలింగ్ కేంద్రానికి 200 మీటర్లు మేరకు ఏవైనా ఇళ్లు ఉంటే ఆ ఇంటికి సంబంధించిన కుటుంబ సభ్యులే ఉండాలిగానీ, పరాయి వాళ్లు ఉండకూడదని పేర్కొన్నారు. ఎన్నికల రోజున అభ్యర్థులు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులుగానీ, మద్యంగానీ, అల్పాహారం, భోజనాలు ఏర్పాటు చేస్తే వారిపై ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. అర్బన్ సీఐ బి.శ్రీనివాసులు, వన్‌టౌన్ సీఐ ఎస్.మహబూబ్‌బాష, చిన్నచౌకు సీఐ యుగంధర్‌బాబు, ఎస్ఐ హేమకుమార్, పోలీసు సిబ్బంది, స్థానికులు, అభ్యర్థులు పాల్గొన్నారు. -
కసరత్తు
సాక్షి, కడప: ఎన్నికల జాతర మొదలైంది. రాజకీయ పదవుల కోసం ఉగ్గ పట్టిన ఆశావహుల ‘కల’ నెరవేరే సమయం అసన్నమైంది. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు సంబంధించి సోమవారం నుంచి నామినేషన్లను స్వీకరించనున్నారు. బరిలో నిలవాలని ఉత్సాహం చూపుతున్న అభ్యర్థులు టిక్కెట్లు దక్కించుకునేందుకు తమ గాడ్ ఫాదర్ల చుట్టూ తిరుగుతూ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కడప కార్పొరేషన్‌తో పాటు, కొన్ని మున్సిపాలిటీలలో వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే గడప గడప కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ కావడం ఆ పార్టీకి అదనంగా కలిసొచ్చే అంశం. జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికలకు సమాయత్తం చేసే నాయకుడు కనుచూపు మేరలో కనిపించడం లేదు, ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు కరువయ్యారు. తెలుగుదేశం పార్టీలో సైతం ఆసక్తి చూపే వారు అంతంత మాత్రమే. క్షేత్ర స్థాయిలో ప్రచారం కష్టమే... మున్సిపల్ అభ్యర్థుల ఖరారు పూర్తయ్యాక జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు అభ్యర్థులను వెతకాల్సిన పరిస్థితి. మళ్లీ అసెంబ్లీ, లోక్‌సభ కోసం కసరత్తు చేయాలి. ఈ నేపథ్యంలో పార్టీ పెద్దలు తమ అభ్యర్దుల పక్షాన జనంలోకి వచ్చి ప్రచారం చేసే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. మామూలుగా అయితే నేతలు క్షేత్ర స్థాయి వరకు వెళ్లేవారు. సామాజిక వర్గాల వారీగా చర్చలు జరిపేవారు. పార్టీ అధినాయకులు రోజుల తరబడి గ్రామాల్లో ప్రచారం నిర్వహించేవారు. ఈ దఫా ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకే సమయం సరి పోతుండటంతో పూర్తి స్థాయిలో ప్రచారం చేయలేని పరిస్థితి నెలకొంది. వణికి పోతున్న నేతలు... నిన్న మొన్నటి వరకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూసిన రాజకీయ నేతలు ఇప్పుడు ఆపేరు చెబితేనే వణికి పోతున్నారు. సాధారణ ఎన్నికలకు సిద్దమవుతున్న రాజకీయ పార్టీల నేతలు మధ్యలో మున్సిపల్ ఎన్నికలు రావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో వారి పరిస్థితి మూలిగే నక్కపై తాటి పండు పడినట్లుగా మారింది. తలకు మించిన భారం... ఎమ్మెల్యే అభ్యర్థులకు మున్సిపల్, జెడ్పీటీసీ ఎన్నికలు తలకు మించిన భారంగా మారాయి.. అభ్యర్థులను ఎంపిక చేయడం ఓ ఎతైతే వ్యూహ ప్రతి వ్యూహలను సైతం పన్నేందుకు వారికి సమయం లేకుండా పోతోంది. సాధారణంగా ఈ మూడు ఎన్నికలకు వేర్వేరు వ్యూహలు ఉండాలి. అలా వ్యూహలు పన్నేందుకు నేతలకు సమయం దొరకడంలేదు. మోగనున్న నగారా... జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం ఎన్నికల నగారా మోగనుంది. ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో బ్యాలెట్ పేపరు పద్ధతిలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు అనుగుణంగా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, సిబ్బంది నియామకాలు చేపట్టాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. -
ఆశావహులు
ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. ఇక ప్రతి వార్డులో ఎన్నికల హడావిడి జోరందుకోనుంది. రాజకీయ పార్టీల గుర్తులపైనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించడంతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. ప్రధాన పార్టీలు రానున్న అసెంబ్లీ ఎన్నికలకు మున్సిపోల్స్‌ను రిహార్సల్‌లా తీసుకుంటున్నాయి. అభ్యర్థుల ఎంపిక మొదలు చైర్మన్ ఎన్నిక వరకు ప్రతి ఘట్టం ఆసక్తికరంగా మారనుంది. మునిసిపల్ ఎన్నికల ‘కోడ్’ కూసింది. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఎలాంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయరాదు. జిల్లాలో కడప కార్పొరేషన్‌తో పాటు 8 మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటిలో రాజంపేట మునిసిపాలిటీ ఎన్నికలు మాత్రం వాయిదా పడ్డాయి. రాజంపేట మునిసిపాలిటీలో పంచాయతీల విలీనానికి సంబంధించిన కేసు కోర్టులో నడుస్తుండటంతో ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడింది. ఈ ఏడాది కొత్తగా మునిసిపాలిటీల జాబితాలో చేరిన మైదుకూరుతో పాటు ఎర్రగుంట్ల నగర పంచాయతీకి కూడా ఎన్నికలు జరగనున్నాయి. అన్ని మునిసిపాలిటీలకు ఈ నెల 30న ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 2న ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థుల ఖర్చు రూ. లక్ష- 1.50 లక్షలు: మునిసిపాలిటీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎన్నికల ఖర్చుగా లక్ష రూపాయలు మాత్రమే ఖర్చు చేయాలి. అలాగే కార్పొరేషన్ పరిధిలోని అభ్యర్థులు 1.50లక్షల వరకూ ఎన్నికల వ్యయంగా నిర్ణయించారు. నిబంధనల మేరకు ఈ పరిధిని దాటి ఖర్చు చే సినట్లు ఎన్నికల కమిషన్‌కు ఆధారిత ఫిర్యాదులు అందితే అనర్హులుగా వేటు పడే ప్రమాదముంది. 41 నెలల పాటు ప్రత్యేక పాలనలో: జిల్లాలో బద్వేలు మినహా తక్కిన కడప కార్పొరేషన్, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు, పులివెందుల మునిసిపాలిటీల పాలకవర్గాల పదవీ కాలం 2010 సెప్టెంబరు 29తో ముగిసింది. దీంతో అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనతో మునిసిపాలిటీలు నడుస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని పలుమార్లు కోర్టు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వాయిదా వేస్తూ వచ్చింది. చివరకు 41 నెలల తర్వాత ఈ నెల మార్చి 30న ఎన్నికలు జరగనున్నాయి. కాగా బద్వేలు మున్సిపాలిటీ పదవీకాలం కూడా గత ఏడాది జూన్10తో పూర్తయింది.