కడప కార్పొరేషన్ పరిధిలోని పాఠశాలలు బాగున్నాయని, అందుకు అనుగుణంగా పిల్లలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాలని కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషా పేర్కొన్నారు. కడప సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. బడుగు, బలీహ న వ ర్గాలకు చెందిన పేద విద్యార్థులను బాగా చదివించేందుకు కృషి చేద్దామన్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేద విద్యార్థుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారని ఆయన కొనియాడారు. కార్పొరేషన్‌లోని కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు అధికంగా ఉన్నా టీచర్ల సమస్య ఉందని, అందువల్ల కొంత మంది విద్యావలంటీర్లను తీసుకుని విద్యనందించేలా కృషి చేద్దామన్నారు.
భావిభారత పౌరులుగా తీర్చిదిద్దుదాం..
Published Wed, Jul 23 2014 1:58 AM | Last Updated on Mon, Aug 27 2018 9:19 PM
Advertisement
Advertisement