!['Fighting on Drought' is a solid rally in Dharna - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/27/darna.jpg.webp?itok=k93IP1Ja)
ర్యాలీగా వస్తున్న యువజన విభాగం నేతలు దేవిరెడ్డి ఆదిత్య తదితరులు
కడప కార్పొరేషన్: ‘కరువుపై పోరు’ పేరుతో కడప కలెక్టరేట్ వద్ద వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా ధర్నాకు కడప అసెంబ్లీ యూత్ వింగ్ ఇన్‌చార్జి దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున యువకులు ర్యాలీ నిర్వహించారు.
వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లె సర్కిల్, మీదుగా కొత్త కలెక్టరేట్ వద్ద ధర్నా శిబిరానికి చేరింది. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ కమలాపురంలో కరువును పారదోలడానికి ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అపర భగీరథుడిలా కృషి చేస్తున్నారన్నారు.
ఆయన పోరాట ఫలితంగానే సర్వరాయ సాగర్‌కు నీరు విడుదలయ్యాయని, ఇప్పుడు పాపాఘ్నినదికి నీటి విడుదల కోసం చేస్తున్న ధర్నాకు తమ వంతు తోడ్పాటు అందించడం ఆనందంగా ఉందన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ వైద్య విభాగం అధ్యక్షుడు ఆదర్శ్‌రెడ్డి, యువజన నాయకులు శ్రీకాంత్, ప్రశాంత్, రాజా,జావీద్, కన్నా, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment