సాక్షి,వైఎస్‌ఆర్‌జిల్లా:ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా,నియంతలా వ్యవహరిస్తున్నారని కడప మేయర్ సురేష్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం(డిసెంబర్23) కడప మునిసిపల్ కార్పొరేషన్ సమావేశంలో ఎమ్మెల్యే చేసిన గలాటాపై సురేష్‌బాబు సాక్షి టీవీతో మాట్లాడారు.‘తనకు కుర్చీ వేయలేదని ఎమ్మెల్యే రెండు సార్లు సమావేశాన్ని అడ్డుకున్నారు.
దౌర్జన్యానికి దిగి సమావేశ ఎజెండా పేపర్లను చించివేశారు. ఇలా చేస్తున్న ఆమెకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఎక్కడుంది?మిగిలిన కార్పొరేషన్లలో మీ ఎమ్మెల్యేలు,మంత్రులు ఎక్కడ కూర్చుంటున్నారు..?మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచారని గౌరవిస్తే మా ఇంటిపైనే చెత్త వేయించింది.
కార్పొరేటర్లపై నోటికొచ్చినట్లు మాట్లాడారు. వందలాది మంది కార్యకర్తలతో కార్పొరేషన్‌పైకి దండెత్తారు. ఇదెక్కడి సభ్యత?ఒక ప్రజాప్రతినిధి వ్యవహరించాల్సిన తీరు ఇదేనా..?ఎమ్మెల్యే,పిరాయింపు సభ్యులను సస్పెండ్ చేసినా బయటకు వెళ్ళలేదు.ఎజెండా పేపర్లను చింపి సభను అడ్డుకున్నారు.
వాళ్ళని బయటకు పంపడంలో అధికారులు వైఫల్యం చెందారు.పార్టీలకు అతీతంగా మేము గౌరవం ఇచ్చినా ఆమె నిలబెట్టుకోలేదు.ప్రజాసమస్యలు చర్చించడానికి యుద్ధానికి వచ్చినట్లు వస్తారా?ఎమ్మెల్యే మాధవి రెడ్డి తీరును ఎవరూ హర్షించడం లేదు.ఫిరాయింపు సభ్యులు మా పార్టీ సభ్యులపై దాడికి దిగారు.ఇది ప్రజాస్వామ్యంలో సరైన చర్య అని ఎవరైనా అంటారా? మొదటి సారి ఎమ్మెల్యే అయిన ఆమె తన హక్కులు ఏంటో ముందు తెలుసుకోవాలి.
ఆమె ప్రజాసమస్యల కంటే తన పంతం ముఖ్యం అన్నట్లు వ్యవహరిస్తున్నారు.15 అర్థికసంఘం పనులు ఆమోదించి పంపాలి..కానీ ఆమె సమావేశం జరగనివ్వడం లేదు.బాధ్యతాయుతమైన ఒక ప్రజాప్రతినిధి ఇలా వ్యవహరిస్తే ఎలా’అని సురేష్‌బాబు ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా.. కార్పొరేషన్ సమావేశపు ఎజెండాను కడప కార్పొరేషన్ ఏకపక్షంగా ఆమోదించింది. ఎజెండా మొత్తాన్ని ముక్తకంఠంతో ఆమోదిస్తున్నట్లు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు చేతులెత్తారు. ఇదే సమయంలో పలు అభివృద్ధి పనులకు కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. సస్పెండ్ చేసినా అజెండా ఆమోదాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రయత్నించారు. అయితే, మెజార్టీ సభ్యుల మద్దతుతో ఎజెండాలోని అంశాలకు ఆమోదం దక్కింది.
ఇదీ చదవండి: కుర్చీ కోసం ఎమ్మెల్యే దౌర్జన్యం
Comments
Please login to add a commentAdd a comment