కడపలో అత్యంత విలువైన రెండెకరాల ఆర్ అండ్ బీ భూమి టీడీపీకి కేటాయింపు
2014లోనే టీడీపీకి ఇచ్చిన అప్పటి బాబు సర్కారు
వివాదాస్పద భూమి కావడంతో రద్దు చేసిన గత ప్రభుత్వం
కోర్టులో ఉన్నా ఇప్పుడు మళ్లీ కేటాయించుకున్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: కడపలో రూ.50 కోట్ల విలువైన రెండెకరాల ఆర్ అండ్ బీ శాఖ భూమిని కూటమి ప్రభుత్వం టీడీపీ కార్యాలయానికి కేటాయించుకుంది. ఈ భూమి వివాదం కోర్టులో ఉన్నా లెక్క చేయకుండా కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేరు మీద పార్టీ కార్యాలయం కోసం ఇస్తూ మంగళవారం ఉత్తర్వులిచి్చంది. కడప మండలం అక్కయ్యపల్లె గ్రామంలోని సర్వే నెంబర్ 37/4లోని ఈ భూమిపై టీడీపీ 2014లోనే కన్నేసింది. మున్సిపల్ కార్పొరేషన్‌కి తెలియకుండా, స్థానికంగా ఉన్న అభ్యంతరాలు ఖాతరు చేయకుండా 2014లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఈ భూమిని పార్టీ కార్యాలయానికి 33 సంవత్సరాల లీజుకి కేటాయించింది. అయితే, పార్టీ కార్యాలయం నిర్మాణం చేపట్టలేదు. కొందరు టీడీపీ నాయకులు దాన్ని అన్యాక్రాంతం చేసే ఉద్దేశంతోనే నిర్మాణాలు చేపట్టలేదనే అనుమానాలున్నాయి. 2019లో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచి్చన తర్వాత ఆ భూమిపై స్థానికంగా అభ్యంతరాలు ఉన్నాయని, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు జరిగినట్లు తేలడంతో కేటాయింపు రద్దు చేసింది. దీనిపై అప్పట్లో టీడీపీ నేతలు హైకోర్టుకు వెళ్లారు.
ప్రస్తుతం ఈ భూమికి సంబంధించిన కేసు హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండడంతో కోర్టులో ఉన్న భూమిని మళ్లీ టీడీపీ కార్యాలయానికి కేటాయించింది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు, కడప ఎమ్మెల్యే భర్త అయిన శ్రీనివాసరెడ్డి కోరిక మేరకు సీఎం చంద్రబాబు నిబంధనలకు విరుద్ధంగా ఈ భూమిని పార్టీ కార్యాలయం కోసం కేటాయించారు. అధికారంలో ఉన్నప్పుడు పలు ప్రాంతాల్లో విలువైన భూములను చేజిక్కించుకుని పార్టీ కార్యాలయాలు నిరి్మంచడం టీడీపీకి అలవాటేనని పలువురు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం మంగళగిరిలో ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం కూడా నిబంధనలకు విరుద్ధంగా కేటాయించుకుని నిరి్మంచిందే. విశాఖపట్నం కార్యాలయం కూడా అక్రమంగా కేటాయించుకుని కట్టుకున్నదే. ఇప్పుడు ఏకంగా కోర్టు పరిధిలో ఉన్న భూమిని మంత్రివర్గం ఆమోదంతో పార్టీ కార్యాలయం కోసం రెండోసారి కేటాయించుకోవడం వివాదాస్పదంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment