కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం.. మళ్లీ మంచిరోజులు వస్తాయి: వైఎస్‌ జగన్‌ | YS Jagan YSR Kadapa District Tour Day 2 Updates And Top News Headlines | Sakshi
Sakshi News home page

కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందాం.. మళ్లీ మంచిరోజులు వస్తాయి: వైఎస్‌ జగన్‌

Published Sun, Sep 1 2024 10:57 AM | Last Updated on Sun, Sep 1 2024 4:20 PM

Ys Jagan Ysr Kadapa District Tour Day 2 Updates

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: ఎవరూ అధైర్యపడొద్దు.. రాబోవు కాలం మనదే.. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఉంది.. మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉంది.. భవిష్యత్‌ మనదేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ జగన్‌.. కార్యకర్తలు, ప్రజలు, నేతలు, అభిమానులతో మమేకమయ్యారు. అందరినీ పేరుపేరునా పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు.

వైఎస్సార్‌సీపీ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, మాజీ నేతలతో కూడా చర్చించారు. కార్యకర్తలు, నాయకులు ఎవరూ అధైర్యపడొద్దు.. పార్టీ అండగా ఉంటుందని, అందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని వివరించారు. రానున్న కాలంలో ప్రతీ కార్యకర్తకు తనతో పాటు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తోడుగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసానిచ్చారు.

మనం చెప్పిన మంచి పనులన్నీ చేశాం. మనం చేసిన మంచి ప్రతీ కుటుంబంలో ఉంది. అందుకే ప్రజలకు మనపైనే విశ్వాసం ఉందని వైఎస్‌ జగన్‌ అన్నారు. నిరంతరం ప్రజాశ్రేయస్సుకు అనుగుణంగా అడుగులు వేయాలని శ్రేణులకు ఆయన దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా పులివెందులలోని క్యాంపు కార్యాలయం కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. కష్టకాలంలో పార్టీ కార్యకర్తలకు నేతలు అండగా నిలబడాలని వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధులకు వైఎస్‌ జగన్‌ సూచించారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement