
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ట్రేడింగ్ పేరుతో యువతకు కుచ్చుటోపి పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. కడపకు చెందిన పాపిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి చేతిలో 35 కుటుంబాలు మోసపోయాయి. అధిక లాభాల పేరుతో సోమశేఖర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు 12 కోట్ల రూపాయలు దండుకున్నారు. ఇచిన డబ్బును తిరిగి అడిగితే బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు లబోదిబో అంటున్నారు.
మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. పెట్టుబడి పెట్టిన వారిలో ఒకరు ఆత్మహత్య చేసుకోగా, మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహ్యతే గతి అంటూ మిగతా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.