తిరుపతి: శ్రీవారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టీటీడీ జనవరిలో శ్రీనివాస కల్యాణాలను నిర్వహించనున్నట్టు టీటీడీ పీఆర్వో రవి శనివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రల్లో 12 చోట్ల శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నామని, ఈ ఏర్పాట్లను శ్రీనివాస కల్యాణ ప్రాజెక్టు ఓఎస్‌డీ రామచంద్రారెడ్డి పరిశీలిస్తున్నారని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
జనవరి 3వ తేదీ అనంతపురం జిల్లా బొమ్మనహాల్‌లో సాయంత్రం 6 గంటలకు, 6న పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, 7న జీలుగుమల్లిలో, 8న పోలవరం, 9న గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, 17న విశాఖ జిల్లా గాజువాక, జనవరి 18న అరకులో ఉదయం 11గంటలకు శ్రీనివాస కల్యాణాలు నిర్వహించనున్నారు.
తెలంగాణలో..
జనవరి 23న మెదక్ జిల్లా సంగారెడ్డి మం డలం వైకుంఠపురంలో సాయంత్రం 6గంటలకు శ్రీవారి కల్యాణం జరుగుతుంది.
కర్ణాటకలో..
జనవరి 22న బీదర్ జిల్లా బసవకల్యాణ్ మండలంలో బసవేశ్వర కన్నడ ప్రాథమికోన్నత పాఠశాలలో, 24న దావణ్‌గెరెలో సా యంత్రం 6 గంటలకు శ్రీనివాస కల్యాణాలు జరగనున్నాయి.
మహారాష్ట్రలో..
జనవరి 30న నాందేడ్, 31న నాగపూర్‌లో సాయంత్రం 6 గంటలకు శ్రీవారి కల్యాణాలు నిర్వహించనున్నారు.
జనవరిలో 4 రాష్ట్రాల్లో శ్రీనివాస కల్యాణాలు
Published Sun, Dec 14 2014 2:30 AM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM
Advertisement