వివాహమైన కొద్ది గంటల వ్యవధిలోనే నవవరుడు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన వైఎస్సార్ జిల్లా రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామంలోని బీసీ కాలనీలో చోటు చేసుకుంది. కొర్రపాడు గ్రామానికి చెందిన సూరా రామచంద్రారెడ్డి (26)కి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ప్రాంతానికి చెందిన యువతితో ఆదివారం దేవుని కడపలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది.