
ఆదిలాబాద్: మాజీ మంత్రి సి.రామచంద్రారెడ్డి మర ణం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులకు తీరని లో టని ఎంపీ సోయం బాపూరావు అన్నారు. శనివారం సీఆర్‌ఆర్ నివాసంలో ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.అనంతరం ఎంపీ మాట్లాడుతూ, సీఆర్‌ఆర్ మరణం తనను దిగ్బ్రాంతికి గురిచేందన్నారు. ఆదివాసుల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచి పోయారని తెలిపారు.
రాజకీయాలు శాశ్వతం కాదని, చేసిన అభివృద్ధి పనులు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. బోథ్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, ఆదివాసీల సమస్యల పరిష్కారంలో ఆయన కృషి మరవలేనిదని కొనియాడారు. ఆయన వెంట బీజేపీ నాయకులు రమణ, డీసీసీ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, జెడ్పీటీసీ మల్లెపూల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు నరేష్ జాదవ్, తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment