
భోపాల్: యువకుని ప్రేమ మాయలో పడి కన్నతల్లినే కడతేర్చింది ఓ యువతి. ప్రియుడితో కలిసి ఆమెను దారుణంగా హత్య చేసింది. కత్తిపోట్లతో విరుచుకుపడి క్రూరంగా చంపేసింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లో ఆదివారం జరిగింది. నిందితురాలు మైనర్(17). ఆమె బాయ్‌ఫ్రెండ్ వయసు 25 ఏళ్లు. ఇద్దరినీ పోలీసులు సోమవారం అరేస్టు చేశారు.
అయితే నిందితులిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. అమ్మాయి తల్లి వీరిద్దరి రిలేషన్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. అతన్ని కలవొద్దని చెప్పింది. కానీ రెండు నెలల క్రితం ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది అమ్మాయి. ఆమె మైనర్ అయినందున తల్లిదండ్రులు కేసు పెట్టారు. దీంతో పోలీసులు ప్రియుడ్ని అరెస్టు చేశారు. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలై మళ్లీ అమ్మాయిని తరచూ కలుస్తున్నాడు. దీంతో తల్లి హెచ్చరించింది.
ఈ నేపథ్యంలోనే తన ప్రేమకు తల్లే అడ్డుపడుతోందని భావించిన అమ్మాయి ఆమెపై కక్ష పెంచుకుంది. పథకం పన్ని ప్రియుడితో కలిసి దారుణంగా హత్య చేసింది. చివరకు కటకటాల పాలైంది.
చదవండి: 'సమాజం ఎటుపోతుందో అర్థంకావట్లేదు.. ఆ కిరాతకులను ఉరి తీయాలి'
Comments
Please login to add a commentAdd a comment