baby dies
-
USA: చిన్నారిని ఓవెన్‌కు బలి చేసుకుంది...
కాన్సాస్ సిటీ: నిద్ర పుచ్చేందుకు ఉయ్యాలలో ఉంచాల్సిన శిశువును పొరపాటున ఓవెన్లో పెట్టింది ఓ తల్లి. తప్పు గ్రహించేలోగానే ఆ శిశువు తీవ్రంగా కాలిన గాయాలతో తనువు చాలించింది. ఈ విషాద ఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం కాన్సాస్ సిటీలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన మరియా థామస్ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో తన శిశువును ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టి నిద్ర పుచ్చాలనుకుంది. అయితే, చిన్నారిని పొరపాటున ఓవెన్లో ఉంచి, ఆన్ చేసింది. తప్పు తెలుసుకునే సరికే చిన్నారి ఒళ్లు తీవ్రంగా కాలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే శిశువు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
విషాదం: బాత్రూంలోనే ప్రసవం..
సాక్షి, వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువు బలైయ్యింది. వివరాల ప్రకారం..నిండు గర్భిణి ప్రసవం కోసం తాండూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంది. అయితే ఆ సమయంలో ఆసుపత్రిలో వైద్యులు లేరని సిబ్బంది చెప్పారు. తీవ్ర పురిటినొప్పులతో ఆసుపత్రి బాత్రూంలోనే శిశివును ప్రసవించింది. సమయానికి చికిత్స అందకే శిశువు చనిపోయిందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో శిశువు మృతి
నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రంలో బుధవారం నాలుగురోజుల శిశువు మృతిచెందాడు. పసికందు మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. వివరాలు.. రా మన్నపేట మండలం ఎల్లంకి గ్రామానికి చెందిన గిరి భార్య శిరీష ఈ నెల 24న ప్రసవానికి ఆస్పత్రిలో చేరింది. అదే రోజు శిరీష మగబిడ్డను జన్మనిచ్చింది. ఆస్పత్రిలో తల్లిబిడ్డ చికిత్స పొందుతున్నారు. కాగా బుధవారం ఉదయం బాలుడు మృతిచెందినట్లు వైద్యులు తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో కోపోద్రిక్తులైన బంధువులు శిశువు మృతదేహంతో ఎంసీహెచ్ ఎధుట ఆందోళన నిర్వహించారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ బాలుడిని బలితీసుకుందని తల్లిదండ్రులతో పాటు బంధువులు విలపిస్తూ తెలిపారు. పసికందు చనిపోయిన తర్వాతనే ఎన్ఐసీకి తీసుకువచ్చారని డాక్టర్ దామెర యాదయ్య సాక్షికి తెలిపారు. సీసీ పుటేజీలు కూడా ఉన్నాయి. వాటిని పరిశీలించుకోవచ్చన్నారు. బాధ్యులపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు. -
టీకా వికటించి పసికందు మృతి
సాక్షి, సిరిసిల్ల: టీకా వికటించి ఓ పసికందు మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం ఓ తల్లికి తీరని గర్భశోకాన్ని మిగిల్చింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ.. డాక్టర్ సహా ఎనిమిది మందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మారుతీరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.బాధిత కుటుంబానికి సర్కారు రూ.3 లక్షల పరిహారం, ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. అసలు ఏం జరిగింది..? రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రతి బుధవారం చిన్న పిల్లలకు టీకాలు వేస్తారు. ఎప్పటిలాగే కోరుట్లపేటకు చెందిన తాడ మాధవి, బాపురెడ్డి దంపతుల నలభై ఐదు రోజుల (ఇంకాపేరు పెట్టని) పసిపాపకు టీకా వేశారు. అది వికటించి పసికందు మరణించింది. మరో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. వీరిని కరీంనగర్, హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. టీకాను భద్రపరచడంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పాయిజన్‌గా మారి నిండు ప్రాణం తీసినట్లుగా సమాచారం. ఇదే విషయాన్ని వైద్యశాఖ అధికారుల విచారణలో నిర్ధారించారు. కదిలిన యంత్రాంగం ఎల్లారెడ్డిపేట వైద్యశాఖ నిర్లక్ష్యపు ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మారుతీరావు కోరుట్లపేటకు వెళ్లి విచారణ జరిపారు. కలెక్టర్ కృష్ణభాస్కర్, డీఆర్వో జి.వి.శ్యామ్‌ప్రసాద్‌లాల్ బాధిత కుటుంబాలతో మాట్లాడారు. రూ.3 లక్షల పరిహారం అందిస్తామని, ఒకరికి అవుట్ సోర్సింగ్‌లో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా, హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న చిన్నారులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. కరీంనగర్లో చికిత్స పొందుతున్న చిన్నారిని సైతం హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించారు. డాక్టర్ సహా 8 మంది సస్పెన్షన్ పసికందు మృతితో పాటు మరో ముగ్గురు చిన్నారుల విషమ పరిస్థితికి కారణమైన ఎనిమిది మంది వైద్య సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎల్లారెడ్డిపేట మండల వైద్యాధికారిణి మీనాక్షి, పీఎచ్ఎన్ శోభారా ణి, ఎపీఎచ్ఎస్లు అజాం, ప్రేమలత, సీఎచ్ లక్ష్మీ ప్రసాద్, గ్రేడ్2 ఫార్మసిస్ట్ వెంక న్న, ఎంపీఎచ్ఏ శారద, ఏఎన్ఎం పుష్పలతలను విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 8 మందిని ఒకేసారి సస్పెండ్ చేయడంతో వైద్య, ఆరోగ్యశాఖలో కలకలం మొదలైంది. -
షాకింగ్ వీడియో; సెల్ఫీలు దిగుతూ..
గంగా నగర్(రాజస్తాన్): సెల్ఫీ పోజులు ఆ దంపతులకు కోలుకోలేని విషాదాన్ని మిగిల్చాయి. రాజస్తాన్‌లోనే అత్యంత సుందర నగరంగా పేరుపొందిన గంగా నగర్ (శ్రీగంగా నగర్)లో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ అయింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే రాహుల్ వాల్మికి- మీరా దంపతులకు 10 నెలల కూతురుంది. నెలవారీ వైద్యపరీక్షల కోసం మే 10న పాపను ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం ఆస్పత్రి పక్కనే ఉన్న సీజీఆర్ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. సరదాగా సెల్ఫీలు దిగుతూ మాల్ మొత్తం కలియదిరిగారు. మూడో అంతస్తు నుంచి ఎస్కలేటర్‌పైకి వెళ్లే క్రమంలో మరో సెల్ఫీదిగబోయారు. కదులుతున్న ఎస్కలేటర్‌పైకి అడుగుపెట్టిన మరుక్షణమే.. తల్లి చేతుల్లో నుంచి పాప జారిపోయింది. ఎస్కలేటర్‌కు, ర్యాంప్‌కు మధ్యనున్న ఖాళీ భాగం గుండా జారిపడి నేలను ఢీకొట్టిందా చిట్టితల్లి. అంతే, శరీరం ఛిద్రమై విపరీతంగా రక్తస్త్రావం అయింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తూ జరిగింది కావడంతో ఈ ఘటనపై ఫిర్యాదుగానీ, కేసు నమోదుగానీ జరగలేదని పోలీసులు చెప్పారు. కొద్ది రోజుల కిందట ముంబైలోనూ ఇదే తరహాలో ఎస్కలేటర్‌పై నుంచి జారిపడి ఓ చిన్నారి మృతిచెందింది. -
విషాదాన్ని మిగిల్చిన సెల్ఫీలు
-
విమానాన్ని అత్యవసరంగా దించినా..
విమానంలో వెళ్తున్న ఓ చిన్నారి ఆరోగ్యం ఉన్నట్టుండి విషమించింది. దాంతో విమానాన్ని అత్యవసరంగా మధ్యలోనే దించేశారు. అయినా కూడా ఆ చిన్నారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. కోల్‌కతా నుంచి బెంగళూరుకు వెళ్తున్న 6ఇ 202 ఇండిగో విమానాన్ని మధ్యలో రాయ్‌పూర్‌లోనే అత్యవసరంగా దించారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి గుండెజబ్బుతో బాధపడుతోంది. ఆమెను చికిత్స కోసం బెంగళూరు తీసుకెళ్తున్నారు. దారిలోనే ఆమె ఆరోగ్యం విషమించింది. దాంతోవెంటనే చికిత్స అందించేందుకు వీలుగా విమానాన్ని దారి మళ్లించి రాయ్‌పూర్‌లో దించారు. ఇందుకోసం ముందుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో మాట్లాడి ఏర్పాట్లు కూడా చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా.. చిన్నారి ప్రాణాలు మాత్రం నిలబడలేదు. దాంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
చిన్నారిని బలిగొన్న కుక్కలు
-
చిన్నారిని బలిగొన్న కుక్కలు
* పీక్కుతిన్న శునకాలు.. * విశాఖలో దారుణం సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో ఏడాదిన్నర వయసున్న బుడతడ్ని కుక్కలు పీక్కుతిన్నాయి. తల్లికి అంతులేని శోకాన్ని మిగిల్చాయి. ఈ హృద య విదారక సంఘటన విశాఖ బీచ్ రోడ్డులో శుక్రవారం జరిగింది. అలాగే ఉండనిచ్చినా ప్రాణాలు దక్కేవి... శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామానికి చెందిన గీరి పోతయ్య, రమణమ్మ దంపతులు జీవనోపాధి నిమిత్తం ఆరేళ్లక్రితం విశాఖ వచ్చారు. నగరంలోని బీచ్‌రోడ్డుకు సమీపంలో డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి గెస్ట్‌హౌస్‌కు సమీపంలోని ఎర్రదిబ్బల వద్ద స్థలానికి పోతయ్య వాచ్‌మెన్‌గా ఉంటున్నాడు. అక్కడే కుటుంబంతోసహా జీవిస్తున్నాడు. పోతయ్య దంపతులకు ఇద్దరు కుమారులు. శుక్రవారం సాయంత్రం రమణమ్మ తాముండే షెడ్డులో చిన్న కుమారుడు శివకేశవ్(20 నెలల వయసు)ను ఉంచి దుస్తులు శుభ్రపర చడానికి బయటికొచ్చిం ది. కాసేపటికి శివకేశవ్ కూడా వచ్చినా ఆమె వారించి పంపించేసింది. అలా తల్లి తన చిన్నారిని ఇంట్లోకి పంపిన కొద్దిసేపటికే ఘోరం జరిగిపోయింది. వీధికుక్కలు ఇం ట్లోకి వెళ్లి చిన్నారిపై దాడి చేశాయి. బాబును నోటకరుచుకుని ఈడ్చుకుంటూ బయటకు తీసుకొచ్చి పీక్కుతిన్నాయి. కుక్కల అలికిడి విన్న తల్లి వెళ్లేసరికి ఐదు వీధికుక్కలు కొడుకును చీల్చుకుతింటున్న దృశ్యం కనిపించింది. ఆమె కేకలకు స్థానికులు వచ్చి కుక్కల్ని చెదరగొట్టారు. కొనఊపిరితో ఉన్న చిన్నారిని కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. బాలుని శరీరంపై దాదాపు 200 వరకు గాట్లు ఉన్నట్టు డాక్టర్ అరుణ తెలిపారు. -
విశాఖలో కుక్కల దాడి.. బాలుడి మృతి
అతడు అభం శుభం ఎరుగని చిన్నారి. పేరు శివ కేశవ్. వయసు కేవలం రెండేళ్లు. విశాఖపట్నంలోని హార్బర్ పార్కులో ఆడుకోడానికి వచ్చినప్పుడు అక్కడున్న వీధికుక్కలు ఒక్కసారిగా అతడి మీద పడి కరిచాయి. దాంతో అతడిని ఆస్పత్రికి తరలించినా, అప్పటికే మరణించాడు. సాయంత్రం 6.15 గంటలకు ఆ చిన్నారిని ఆస్పత్రికి తీసుకొచ్చారని, కానీ అప్పటికే అతడికి ప్రాణం లేదని కేజీహెచ్ సీఎంఓ అరుణ తెలిపారు. బాలుడి శరీరంపై దాదాపు 200 వరకు కుక్క కాట్లు ఉన్నాయని, పేగులు కూడా బయటకు వచ్చేశాయని ఆమె చెప్పారు. -
నేనురాను బిడ్డో సర్కారు దవాఖానకు!
-
తుపానును జయించింది.. సిలిండర్ కబళించింది!
హుద్‌హుద్ తుపాను విశాఖపట్నాన్ని అతలాకుతలం చేసిన రోజునే పుట్టిందా పసికందు. తుపాను గాలులను, అంతటి ప్రళయాన్ని కూడా తట్టుకుని నిలబడింది. సంపూర్ణ ఆరోగ్యంతో ఈ భూమ్మీదకు వచ్చింది. కానీ.. మంగళవారం నాటి గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనలో ఎంతోమంది తీవ్రంగా గాయపడి ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. కానీ ఆ ఒక్క చిన్నారి మాత్రం ప్రాణాలు వదిలేసింది. దేవీప్రసాద్, భవానీ దంపతులు విశాఖ నగరం రంగిరీజు వీధిలో ఉంటున్నారు. వారికి అక్టోబర్ 12న.. హుద్‌హుద్ తుపాను చెలరేగిన రోజున.. ఆడపిల్ల పుట్టింది. కానీ, వారి ఆనందం అంతే త్వరగా ఆవిరైపోయింది. వారి ఇంటి ఎదుటే కోట సత్యనారాయణ కుటుంబం ఉంది. ఆయన భార్య టీ పెట్టడానికి ప్రయత్నించగా గ్యాస్ పొయ్యి వెలగలేదు. వాళ్లూ వీళ్లు వచ్చి చూశారు. వాళ్లలో ఒకరు పిన్‌తో గ్యాస్ సిలిండర్ పై భాగంలో తుడవడం మొదలుపెట్టారు. అంతే.. ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఆ సమయంలో అక్కడున్న వారంతా రోడ్డుపైకి ఎగిరి పడ్డారు. సత్యనారాయణ ఇల్లంతా మంటల్లో చిక్కుకుంది. ఆ సమయంలో ఎదురింట్లో పాప ఆడుకుంటోంది. తల్లి ఇంట్లో పని చేసుకుంటూ పాపను ఇంట్లో పడుకోబెట్టింది. పేలుడు ధాటికి పాప ముక్కుల్లోంచి, నోట్లోంచి రక్తం బయటకు వచ్చింది. ఇంతలో ఇంటి పై కప్పు నుంచి ఒక పెంకు సరిగ్గా పాప ముఖంపై పడింది. ఆ మరుక్షణమే పాప ప్రాణం పోయింది!!