
కాన్సాస్ సిటీ: నిద్ర పుచ్చేందుకు ఉయ్యాలలో ఉంచాల్సిన శిశువును పొరపాటున ఓవెన్‌లో పెట్టింది ఓ తల్లి. తప్పు గ్రహించేలోగానే ఆ శిశువు తీవ్రంగా కాలిన గాయాలతో తనువు చాలించింది. ఈ విషాద ఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం కాన్సాస్ సిటీలో చోటుచేసుకుంది.
నగరానికి చెందిన మరియా థామస్ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో తన శిశువును ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టి నిద్ర పుచ్చాలనుకుంది. అయితే, చిన్నారిని పొరపాటున ఓవెన్‌లో ఉంచి, ఆన్ చేసింది. తప్పు తెలుసుకునే సరికే చిన్నారి ఒళ్లు తీవ్రంగా కాలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే శిశువు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment