Owen
-
USA: చిన్నారిని ఓవెన్‌కు బలి చేసుకుంది...
కాన్సాస్ సిటీ: నిద్ర పుచ్చేందుకు ఉయ్యాలలో ఉంచాల్సిన శిశువును పొరపాటున ఓవెన్లో పెట్టింది ఓ తల్లి. తప్పు గ్రహించేలోగానే ఆ శిశువు తీవ్రంగా కాలిన గాయాలతో తనువు చాలించింది. ఈ విషాద ఘటన అమెరికాలోని మిస్సోరి రాష్ట్రం కాన్సాస్ సిటీలో చోటుచేసుకుంది. నగరానికి చెందిన మరియా థామస్ శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో తన శిశువును ఉయ్యాల తొట్టిలో పడుకోబెట్టి నిద్ర పుచ్చాలనుకుంది. అయితే, చిన్నారిని పొరపాటున ఓవెన్లో ఉంచి, ఆన్ చేసింది. తప్పు తెలుసుకునే సరికే చిన్నారి ఒళ్లు తీవ్రంగా కాలిపోయింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే శిశువు చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
మాట్లాడే ఓవెన్!
సాక్షి, హైదరాబాద్ : ఈ రోజుల్లో ఓవెన్ అనేది ప్రతి ఇంట్లోనూ కామన్ అయిపోయింది. కానీ, ఓవెన్ ఎంత స్పెషాలిటీ అనేదే ఇక్కడ మ్యాటర్. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్లో సాధారణ ఓవెన్లకు కాలం చెల్లింది. ప్రముఖ కంపెనీలు వినూత్న తరహాలోలో ఓవెన్లను తయారుచేస్తున్నాయి. బజాజ్, శామ్సంగ్, కెన్‌స్టార్, ఎల్జీ వంటి రకరకాల బ్రాండెడ్ కంపెనీలు ఓవెన్లను అందిస్తున్నాయి. వీటి ధరలు రూ.5–40 వేల వరకున్నాయి. ♦ బేసిక్ టైప్, గ్రిల్‌తో కూడిన ఓవెన్, కన్వెన్షన్ వంటి మూడు రకాల ఓవెన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ♦ రీ హీట్ కోసమైతే బేసిక్ ఓవెన్ ఉత్తమం. బేకింగ్, గ్రిల్లింగ్ పదార్థాలను ఎక్కువగా వండుతున్నట్లయితే మైక్రోవేవ్ విత్ గ్రిల్ కొనడం మంచిది. ♦ మెకానికల్ కంట్రోల్‌గా పనిచేసేవైతే సాధారణ గృహిణులు వాడేందుకు వీలుగా ఉంటాయి. ఎక్కువగా వాడినా.. రఫ్‌గా వినియోగించినా ఇబ్బంది ఉండదు. ♦ సింగిల్ టచ్ రోటరీ ప్యానల్ కూడా మెకానికల్ కంట్రోల్స్‌ని పోలి ఉంటుంది. కాకపోతే వాడుతున్నప్పుడు ఇది కాస్త సున్నితంగా అనిపిస్తుంది. ♦ ఎలక్ట్రానిక్ ప్యానల్ ఉన్న ఓవెన్లో విద్యుత్ స్థాయిలను కూడా సూచిస్తుంటుంది. ♦ అంధులు, కంటి చూపు సమస్య ఉన్నవారూ టాక్టైల్ కంట్రోల్ ఓవెన్లు ఎంతో సహాయపడతాయి. ♦ చిన్నపిల్లలున్న ఇంట్లో చైల్డ్ సేఫ్టీ లాక్, ఎలక్ట్రానిక్ లాక్ ఉన్న ఓవెన్లను తీసుకోవడం ఉత్తమం. -
క్లీన్ ఒవెన్
ఇంటిప్స్ ఒవెన్లోని జిడ్డు, మరకలు పోవాలంటే ఒవెన్ చల్లబడిన తరువాత మరకలపై ఉప్పు నీటిని చల్లి తుడవాలి ∙ఒవెన్‌లో మాడిన పదార్థాలు పోవాలంటే... ఉప్పునీటిలో ముంచిన స్పాంజ్‌తో తుడవాలి ∙ఒవెన్‌ని శుభ్రపరిచే స్పాంజ్ దుర్వాసన వస్తూ వుంటే స్పాంజ్‌ని శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఎండలో పెట్టాలి లేదా ఒవెన్‌లో పెట్టి కొద్దిగా వేడయ్యాక తీయాలి. ఇలా చేస్తే స్పాంజ్లో వుండే బాక్టీరియా చనిపోయి స్పాంజ్ శుభ్రపడుతుంది. -
ఇంటిప్స్
►బ్రెడ్ టోస్ట్ చేసేటప్పుడు వచ్చిన పొడిని, మిగిలి పోయిన బ్రెడ్‌ను పొడి చేసుకుని ఫ్రిజ్‌లో ఉంచుకుని కూర పలుచగా ఉన్నప్పుడు కలుపుకుంటే చిక్కబడుతుంది. ►మెంతికూర, పాలకూర వంటి వాటిని రెండు నిమిషాల పాటు ఉడుకుతున్న నీటిలో ఉంచి తీసి చన్నీటి ధార కింద ఉంచిన తర్వాత నీళ్లు లేకుండా పిండేసి ఫ్రీజర్‌లో ఉంచితే రెండు వారాల పాటు నిలవ ఉంటుంది. ►పెద్ద గిన్నెలో సగానికి నీళ్లు పోసి మరిగే వరకు ఓవెన్లో వేడిచేయాలి. గిన్నెను బయటకు తీసి క్లాత్‌తో ఓవెన్ అంతా తుడవాలి. తర్వాత సబ్బు కలిపిన గోరువెచ్చని నీటిలో క్లాత్ ముంచి ఓవెన్ మొత్తం శుభ్రం చేయాలి. -
ఓవెన్ కొంటున్నారా?
సాక్షి, హైదరాబాద్ : ఈరోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఓవెన్ తప్పనిసరి అయింది. అయితే ఎలాంటి ఓవెన్ కొనాలో తెలుసుకోవాలంటే ముందుగా కొంత హోం వర్క్ చేయకతప్పదు. ♦ బేసిక్ టైప్, గ్రిల్‌తో కూడిన ఓవెన్, కన్వెన్షన్ వంటి మూడు రకాల ఓవెన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ♦ రీ హీట్ కోసమైతే బేసిక్ ఓవెన్ ఉత్తమం. బేకింగ్, గ్రిల్లింగ్ పదార్థాలను ఎక్కువగా వండుతున్నట్లయితే మైక్రోవేవ్ విత్ గ్రిల్ కొనడం మంచిది. ♦ మెకానికల్ కంట్రోల్‌గా పనిచేసేవైతే సాధారణ గృహిణులు వాడేందుకు వీలుగా ఉంటాయి. ఎక్కువగా వాడినా.. రఫ్‌గా వినియోగించినా ఇబ్బంది ఉండదు. ♦ సింగిల్ టచ్ రోటరీ ప్యానల్ కూడా మెకానికల్ కంట్రోల్స్‌ని పోలి ఉంటుంది. కాకపోతే వాడుతున్నప్పుడు ఇది కాస్త సున్నితంగా అనిపిస్తుంది. ♦ ఎలక్ట్రానిక్ ప్యానల్ ఉన్న ఓవెన్లో విద్యుత్ స్థాయిలను కూడా సూచిస్తుంటుంది. ♦ అంధులు, కంటి చూపు సమస్య ఉన్నవారూ టాక్టైల్ కంట్రోల్ ఓవెన్లు ఎంతో సహాయపడతాయి.