ఓవెన్ కొంటున్నారా? | are you buying Owen ..? | Sakshi
Sakshi News home page

ఓవెన్ కొంటున్నారా?

Published Fri, Jul 29 2016 10:52 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

are you buying Owen ..?

సాక్షి, హైదరాబాద్ : ఈరోజుల్లో ప్రతి ఇంట్లోనూ ఓవెన్ తప్పనిసరి అయింది. అయితే ఎలాంటి ఓవెన్ కొనాలో తెలుసుకోవాలంటే ముందుగా కొంత హోం వర్క్ చేయకతప్పదు.

బేసిక్ టైప్, గ్రిల్‌తో కూడిన ఓవెన్, కన్వెన్షన్ వంటి మూడు రకాల ఓవెన్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

రీ హీట్ కోసమైతే బేసిక్ ఓవెన్ ఉత్తమం. బేకింగ్, గ్రిల్లింగ్ పదార్థాలను ఎక్కువగా వండుతున్నట్లయితే మైక్రోవేవ్ విత్ గ్రిల్ కొనడం మంచిది.

మెకానికల్ కంట్రోల్‌గా పనిచేసేవైతే సాధారణ గృహిణులు వాడేందుకు వీలుగా ఉంటాయి. ఎక్కువగా వాడినా.. రఫ్‌గా వినియోగించినా ఇబ్బంది ఉండదు.

సింగిల్ టచ్ రోటరీ ప్యానల్ కూడా మెకానికల్ కంట్రోల్స్‌ని పోలి ఉంటుంది. కాకపోతే వాడుతున్నప్పుడు ఇది కాస్త సున్నితంగా అనిపిస్తుంది.

ఎలక్ట్రానిక్ ప్యానల్ ఉన్న ఓవెన్‌లో విద్యుత్ స్థాయిలను కూడా సూచిస్తుంటుంది.

అంధులు, కంటి చూపు సమస్య ఉన్నవారూ టాక్‌టైల్ కంట్రోల్ ఓవెన్‌లు ఎంతో సహాయపడతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement