క్లీన్ ఒవెన్
ఇంటిప్స్
ఒవెన్‌లోని జిడ్డు, మరకలు పోవాలంటే ఒవెన్ చల్లబడిన తరువాత మరకలపై ఉప్పు నీటిని చల్లి తుడవాలి ∙ఒవెన్‌లో మాడిన పదార్థాలు పోవాలంటే... ఉప్పునీటిలో ముంచిన స్పాంజ్‌తో తుడవాలి ∙ఒవెన్‌ని శుభ్రపరిచే స్పాంజ్ దుర్వాసన వస్తూ వుంటే స్పాంజ్‌ని శుభ్రంగా కడిగి కొద్దిసేపు ఎండలో పెట్టాలి లేదా ఒవెన్‌లో పెట్టి కొద్దిగా వేడయ్యాక తీయాలి. ఇలా చేస్తే స్పాంజ్‌లో వుండే బాక్టీరియా చనిపోయి స్పాంజ్ శుభ్రపడుతుంది.