sriganganagar
-
పెట్రో ధరలు: ఇవాళ ఎంత పెరిగిందంటే!
న్యూఢిల్లీ: చమురు కంపెనీలు వాహనదారులకు మళ్లీ షాక్ ఇచ్చాయి. మంగళవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఒకరోజు వ్యవధిలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఈ నెలలో వరుసగా పదిసార్లు పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశంలో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. తాజాగా చమురు కంపెనీలు లీటర్ పెట్రోల్‌పై 27 పైసలు, లీటర్ డీజిల్‌పై 31 పైసలు పెంచాయి. పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.92.58, డీజిల్ రూ.83.51కు చేరింది. మరో వైపు ఆర్థిక రాజధాని ముంబైలో వందకు చేరువైంది. ప్రస్తుతం పెట్రోల్ రూ.99.14, డీజిల్, రూ.90.71కు పెరిగింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో అత్యధికంగా రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ ధర రూ.103.80, డీజిల్ రూ.96.30కి చెరింది. ► కోల్‌కతాలో పెట్రోల్ రూ.92.92, డీజిల్ రూ.86.35 ► చెన్నైలో పెట్రోల్ రూ.94.54, డీజిల్ రూ.88.34 ► హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.96.50, డీజిల్ రూ.91.04 ► జైపూర్‌లో పెట్రోల్ రూ.99.30, డీజిల్ రూ.92.18 ► బెంగళూరులో పెట్రోల్ రూ.95.94, డీజిల్ రూ.88.53 (చదవండి:India WPI Inflation: టోకు ధరలు... గుభేల్!) -
కలకలం: బెలూన్లపై పాకిస్తాన్ నినాదం
జైపూర్: భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాజస్తాన్‌లోని ఓ ఇంటిపై ‘ఐ లవ్ పాకిస్తాన్’ అని రాసివున్న బెలూన్లు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. వీటిని గమనించిన స్థానికులు రాయ్‌సింగ్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన శ్రీ గంగానగర్ జిల్లాలోని 19బీబీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఉర్దూ, ఇంగ్లీషుల్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు రాసి ఉన్న రెండు బెలూన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్హెచ్ఓ మాజిద్ ఖాన్ వెల్లడించారు. 19బీబీ గ్రామం పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉండడం గమనార్హం. బెలూన్లపై ఉర్దూలో పాకిస్తాన్‌లోని బహవల్పూర్ చిరునామాతో పాటు..‘ఆజాదీ ముబారక్’అని కూడా రాసి ఉంది. నిఘా వర్గాల దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. -
చిన్నోడిని ప్రేమించిందని.. కూతుర్ని నరికేశాడు!
జైపూర్ : రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. వయసులో తన కంటే చిన్నవాడిని ప్రేమించిందన్న కోపంతో ఓ వ్యక్తి తన 20 ఏళ్ల కూతురిని నరికి చంపాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌లోని 27ఏ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... 27ఏ గ్రామానికి చెందిన బల్వీర్ సింగ్ కుమార్తె, వయసులో తనకంటే చిన్నవాడిని ప్రేమించింది. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారైనప్పటికీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ కలిసి ఇళ్ల నుంచి పారిపోయారు. యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఈ జంటను వెతికిపట్టుకున్నారు. అనంతరం ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. అయితే ఈ పెళ్లి ఇష్టంలేని యువతి తండ్రి ఆమెను హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం ఇంట్లో తన గదిలో నిద్రపోతున్న కుమార్తెను గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
షాకింగ్ వీడియో; సెల్ఫీలు దిగుతూ..
గంగా నగర్(రాజస్తాన్): సెల్ఫీ పోజులు ఆ దంపతులకు కోలుకోలేని విషాదాన్ని మిగిల్చాయి. రాజస్తాన్‌లోనే అత్యంత సుందర నగరంగా పేరుపొందిన గంగా నగర్ (శ్రీగంగా నగర్)లో చోటుచేసుకున్న ఈ ఘటన తాలూకు వీడియో వైరల్ అయింది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివసించే రాహుల్ వాల్మికి- మీరా దంపతులకు 10 నెలల కూతురుంది. నెలవారీ వైద్యపరీక్షల కోసం మే 10న పాపను ఆస్పత్రికి వెళ్లారు. అనంతరం ఆస్పత్రి పక్కనే ఉన్న సీజీఆర్ షాపింగ్ మాల్‌కు వెళ్లారు. సరదాగా సెల్ఫీలు దిగుతూ మాల్ మొత్తం కలియదిరిగారు. మూడో అంతస్తు నుంచి ఎస్కలేటర్‌పైకి వెళ్లే క్రమంలో మరో సెల్ఫీదిగబోయారు. కదులుతున్న ఎస్కలేటర్‌పైకి అడుగుపెట్టిన మరుక్షణమే.. తల్లి చేతుల్లో నుంచి పాప జారిపోయింది. ఎస్కలేటర్‌కు, ర్యాంప్‌కు మధ్యనున్న ఖాళీ భాగం గుండా జారిపడి నేలను ఢీకొట్టిందా చిట్టితల్లి. అంతే, శరీరం ఛిద్రమై విపరీతంగా రక్తస్త్రావం అయింది. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయింది. ప్రమాదవశాత్తూ జరిగింది కావడంతో ఈ ఘటనపై ఫిర్యాదుగానీ, కేసు నమోదుగానీ జరగలేదని పోలీసులు చెప్పారు. కొద్ది రోజుల కిందట ముంబైలోనూ ఇదే తరహాలో ఎస్కలేటర్‌పై నుంచి జారిపడి ఓ చిన్నారి మృతిచెందింది. -
చెప్పుల తిప్పలతో పెళ్లిలో భారీ విధ్వంసం
మగ పెళ్లి వారి చెప్పులు దాచి, డబ్బులు వసూలుచేయడం ఉత్తరాదిలో ఆడపెళ్లివారికి అలవాటు. ఇది చాలా సరదా కార్యక్రమం. కానీ రాజస్థాన్ లోని శ్రీగంగానగర్ జిల్లాలోని రాయ్ సింగ్ నగర్ లో ఒక పెళ్లిలో ఇదే తంతు బారీ ఘర్షణలకు, విధ్వంసానికి దారి తీసింది. ఆఖరికి పెళ్లే ఆగిపోయింది. పెళ్లి కూతురు వర్గానికి చెందిన వారు మగ పెళ్లి వారి చెప్పులు దాచేశారు. ముందు మగపెళ్లివారు అటూ ఇటూ వెతుక్కున్నారు. వ్యంగ్యాలు, వెటకారాలు అనుకున్నారు. అవి నెమ్మదిగా వెక్కిరింతలకు దారి తీసింది. కొద్ది సేపటికే మాటా మాటా పెరిగింది. ఆ తరువాత బాహాబాహీ, ముష్టాముష్టీ మొదలైంది. చివరికి రాళ్లు విసురుకుని, కర్రలతో దాడులు చేయడం దాకా వెళ్లింది. ఇదంతా రెండు రంగట పాటు సాగింది. ఈ సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. చివరికి ఎవరో ఒకరు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, పెళ్లంటే ఇదంతా మామూలే అని పోలీసులు కేసు కూడా నమోదు చేయలేదు. ఆఖరికి ఎక్కడి దాకా వెళ్లిందంటే అమ్మాయి నాకు ఈ పెళ్లే వద్దు అని చెప్పేసింది.