
జైపూర్ : రాజస్తాన్‌లో దారుణం చోటుచేసుకుంది. వయసులో తన కంటే చిన్నవాడిని ప్రేమించిందన్న కోపంతో ఓ వ్యక్తి తన 20 ఏళ్ల కూతురిని నరికి చంపాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని శ్రీగంగానగర్‌లోని 27ఏ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం... 27ఏ గ్రామానికి చెందిన బల్వీర్ సింగ్ కుమార్తె, వయసులో తనకంటే చిన్నవాడిని ప్రేమించింది. ఇద్దరూ ఒకే కులానికి చెందిన వారైనప్పటికీ తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించలేదు. దీంతో ఇద్దరూ కలిసి ఇళ్ల నుంచి పారిపోయారు.
యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు ఈ జంటను వెతికిపట్టుకున్నారు. అనంతరం ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. దీంతో వీరి వివాహానికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. అయితే ఈ పెళ్లి ఇష్టంలేని యువతి తండ్రి ఆమెను హత్యచేయాలని నిర్ణయించుకున్నాడు. శనివారం ఇంట్లో తన గదిలో నిద్రపోతున్న కుమార్తెను గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment