
ప్రతీకాత్మక చిత్రం
జైపూర్: భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాజస్తాన్‌లోని ఓ ఇంటిపై ‘ఐ లవ్ పాకిస్తాన్’ అని రాసివున్న బెలూన్లు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. వీటిని గమనించిన స్థానికులు రాయ్‌సింగ్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన శ్రీ గంగానగర్ జిల్లాలోని 19బీబీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఉర్దూ, ఇంగ్లీషుల్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు రాసి ఉన్న రెండు బెలూన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్‌హెచ్‌ఓ మాజిద్ ఖాన్ వెల్లడించారు. 19బీబీ గ్రామం పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉండడం గమనార్హం. బెలూన్లపై ఉర్దూలో పాకిస్తాన్‌లోని బహవల్పూర్ చిరునామాతో పాటు..‘ఆజాదీ ముబారక్’అని కూడా రాసి ఉంది. నిఘా వర్గాల దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment