balloons
-
బెలూన్ బొమ్మలమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ
భారతీయ స్టాక్‌మార్కెట్ చరిత్రలో ఆటోమొబైల్ టైర్ మేజర్ ఎంఆర్ఎఫ్ స్టాక్ మరో సారి తన ప్రత్యేకతను చాటుకుంది, టైర్ పరిశ్రమలో అగ్రస్థానంలోఉన్న ఎంఆర్ఎఫ్ షేరు (జూన్ 13, 2023)న తొలిసారి లక్ష మార్క్‌ను టచ్ చేసింది. ఈ ఏడాది 45 శాతానికి పైగా ఎగిసి భారతదేశపు అత్యంత ఖరీదైన స్టాక్‌గా రికార్డు క్రియేట్ చేసింది. అసలు ఎంఆర్ఎఫ్ కంపెనీ ఫౌండర్ ఎవరు? ఈ కంపెనీ విజయ ప్రస్థానం ఏమిటి? ఒకసారి చూద్దాం. ఎంఆర్ఎఫ్ అంటే మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ. దేశంలోని అతిపెద్ద టైర్ కంపెని ఫౌండర్ కేఎం మామ్మెన్ మాప్పిళ్లై . ఆయన అంకితభావం, కృషి పట్టదలతో ఈ రోజు ఈ స్థాయికి ఎగిసింది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు, 1946 సంవత్సరంలో, కేఎం మమ్మెన్ మాప్పిళ్ళై మద్రాసు వీధుల్లో బెలూన్లు అమ్ముతూ కుటుంబానికి అండగా నిలిచారు.తొమ్మిది మంది తోబుట్టువులతో, కేరళలో సిరియన్ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన మమ్మన్‌కు ఈ బెలూన్ల వ్యాపారమే తన విజయానికి సోపానమని ఊహించి ఉండరు. (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) మామెన్ తండ్రి స్వాతంత్ర్య సమరయోధుడు. అయితే మామెన్ మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదువుతున్న సమయంలోస్వాతంత్ర్య పోరాటంలో తండ్రిని రెండేళ్లపాటు జైలులో ఉంచారు. 1946లో మామెన్ చిన్న తయారీ యూనిట్లో బొమ్మల బెలూన్లను తయారీతో పారిశ్రామిక జీవితాన్ని షురు చేశారు. ఇది సుమారు 6 సంవత్సరాల పాటు కొనసాగింది. 1952లో టైర్ రీట్రేడింగ్ ప్లాంట్‌కు ఒక విదేశీ కంపెనీ ట్రెడ్ రబ్బర్ సరఫరా చేస్తోందని గమనించడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. అలా రబ్బరు వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. (నెలకు లక్షన్నర జీతం: యాపిల్ ఫోనూ వద్దు, కారూ వద్దు, ఎందుకు? వైరల్ ట్వీట్) గ్లోబల్ కంపెనీలు అవుట్ తర్వాత మద్రాసులోని చీటా స్ట్రీట్‌లో తొలి కార్యాలయాన్ని ప్రారంభించారు. 1956 నాటికి రబ్బరు వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంది. నాలుగేళ్లలో మార్కెట్ వాటా 50 శాతానికి చేరుకుంది. పలితంగా అనేక అంతర్జాతీయ కంపెనీలు భారత మర్కెట్‌నుంచి తప్పుకున్నాయి. అయితే మామెన్ ఇక్కడితో ఆగలేదు టైర్ల తయారీ వ్యాపారంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రబ్బరు ఉత్పత్తులనుంచి టైర్ పరిశ్రమలోకి మారారు. 1960లో రబ్బర్, టైర్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని స్థాపించారు. అలా అమెరికాకు చెందిన మాన్స్ఫీల్డ్ టైర్, రబ్బర్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని మద్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ (ఎంఆర్ఎఫ్)గా ఆవిష్కరించింది. ట్రెడ్స్, ట్యూబ్‌లు, పెయింట్స్, బెల్ట్‌లు, బొమ్మలు వంటి అనేక ఇతర ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంది. 1961లో మద్రాస్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయింది. అమెరికాకు రబ్బరు ఉత్పత్తులను ఎగుమతి చేసిన ఘనత 1967లో కంపెనీ అమెరికాకు టైర్లను ఎగుమతి చేసిన భారతదేశంలో మొట్టమొదటి కంపెనీగా అవతరించింది. భారతదేశంలోని వివిధ ప్రదేశాలలో వివిధ ప్లాంట్లను ప్రారంభించింది. 1973 సంవత్సరంలో దేశంలో నైలాన్ ట్రావెల్ కారును వాణిజ్యపరంగా తయారు చేసి మార్కెట్ చేసిన తొలి కంపెనీగా అవతరించింది. అలా 1979 నాటికి కంపెనీ పేరు కంపెనీ పేరు విదేశాలకు ఎగబాకింది. ఆ తరువాత అమెరికన్ కంపెనీ మాన్స్ఫీల్డ్ సంస్థలో తన వాటాను విక్రయించడంతో ఎంఆర్ఎఫ్ లిమిటెడ్‌గా మారింది. ఇండియన్ రోడ్లకు సరిపోయే టైర్లు తయారు అంతా బాగానే ఉంది కానీ మాన్స్ఫీల్డ్ టెక్నాలజీ భారతీయ రహదారి పరిస్థితులకు తగినది కాదని మామెన్ గ్రహించాడు. మరోవైపు డన్లప్, ఫైర్‌స్టోన్,గుడ్ఇయర్ వంటి బహుళజాతి కంపెనీల ఆధిపత్యంతో నిలదొక్కుకోవడం ఎలా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. సొంతంగా,భారతీయ రోడ్లకు అనుగుణం టైర్ల ఉత్పత్తిపై దృష్టి పెట్టిన మామెన్ ప్రభుత్వ సాయంతో 1963లో తిరువొత్తియూర్‌లోని రబ్బరు పరిశోధనా కేంద్రం తిరువొత్తియూర్ ఫ్యాక్టరీని ప్రారంభించారు. మార్కెటింగ్‌పై దృష్టి, ఐకానిక్ మజిల్‌మేన్ ఆవిష్కారం అంతేకాదు మార్కెటింగ్‌పై దృష్టి పెట్టారు. అనేక పరిశోధనల తర్వాత, ధృఢమైన మన్నికైన టైర్లకు ప్రతిరూపంగా అలిక్ పదమ్సీ ఐకానిక్ పవర్ఫుల్ ఎంఆర్ఎఫ్ మజిల్ మేన్ చిత్రం వచ్చింది. భారతీయ ప్రకటనల ముఖచిత్రాన్ని మార్చివేసి 1964లో మజిల్‌మేన్ జనాన్ని విపరీతంగా ఆకర్షించింది. టీవీ వాణిజ్య ప్రకటనలు, బిల్‌బోర్డ్‌లలో ఇలా ఎక్కడ చూసినా ఈ పిక్ దర్శనమిచ్చింది. వివిధ ట్రక్ డ్రైవర్ల సర్వే చేసి మరీ పదంశీ దీన్ని రూపొందించారు. అందుఆయనను రాక్‌స్టార్ లేదా గాడ్ ఆఫ్ మార్కెటింగ్ అని పిలుస్తారు. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతినార్జించింది ఎంఆర్ఎఫ్. సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా మొదలు విరాట్ కోహ్లీ వరకు పలువురు సెలబ్రిటీలు బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు. 80 ఏళ్ల వయసులో 2003లో మాప్పిళ్ళై కన్నుమూశారు. అనంతరం అతని కుమారులు వ్యాపారాన్ని చేపట్టారు. 1992లో మాప్పిళ్లై పరిశ్రమకు చేసిన కృషికి గాను పద్మశ్రీ అవార్డును అందుకున్నారు . అతని సోదరులు, KM చెరియన్, KM ఫిలిప్ , KM మాథ్యూ మేనల్లుడు మామెన్ మాథ్యూ కూడా పద్మశ్రీ అవార్డు గ్రహీతలే. పెద్ద సోదరుడు కెఎమ్ చెరియన్ కూడా పద్మభూషణ్ గ్రహీతలు కావడం విశేషం. ఈ ఏడాది కంపెనీ ఆదాయం రూ. 23,261.17 కోట్లకు చేరింది. అంతకు ముందు సంవత్సరంలో ఇది రూ. 19,633.71 కోట్లుగా ఉంది. కంపెనీ నికర లాభం రూ.768.96 కోట్లు నమోదైంది. ఎంఆర్ఎఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ.42,000 కోట్లు. -
ఏ చర్యలకైనా సిద్ధం!
లండన్: తమ దేశాన్ని భద్రంగా ఉంచేందుకు ఎటువంటి చర్యకైనా వెనుకాడబోమని బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ అన్నారు. అట్లాంటిక్ మిత్ర దేశాలతో నిత్యం టచ్‌లో ఉంటూ, రక్షణపరంగా సన్నద్ధతతో ఉన్నట్లు ఆయన తెలిపారు. సోమవారం ఆయన ఉత్తర ఇంగ్లండ్‌లోని ఓ ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన ఎటువంటి చర్యలకైనా సిద్ధంగా ఉన్నామని ప్రజలు గ్రహించాలని కోరారు. తమ దేశ గగనతలాన్ని కాపాడుకునేందుకు టైఫూన్ యుద్ధ విమానాలను అప్రమత్తంగా ఉంచామన్నారు. అనుమానిత చైనా నిఘా బెలూన్లను అమెరికా సైన్యం కూల్చివేయడం, యూకేకు కూడా బెలూన్ల బెడద ఉందన్న వార్తలపై రిషి పై విధంగా స్పందించారు. -
గాలిబుడగల నిఘానేత్రాలు
గాలిబుడగలు సైతం గందరగోళం సృష్టించి, దేశాల మధ్య సంబంధాల్లో ఊహించని మార్పులు తీసుకువస్తాయని ఇటీవలి పరిణామాలు తేటతెల్లం చేశాయి. చైనా దేశపు నిఘా నేత్రంగా అనుమా నిస్తున్న భారీ బెలూన్ తన గగనతలంలో తిరగడం గమనించిన అమెరికా ఫిబ్రవరి 4న దాన్ని వివిధ యుద్ధ విమానాలతో చుట్టుముట్టి, క్షిపణి ప్రయోగంతో వ్యూహాత్మకంగా తన ప్రాదేశిక సముద్ర జలాలపై పేల్చివేసిన వైనం అంతర్జాతీయంగా ఒక సంచలనం. అంతకు మించి గత నవంబర్‌లో జీ–20 దేశాల బాలీ సదస్సు వేళ షీ జిన్‌పింగ్, బైడెన్ల భేటీతో ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాయని ఆశిస్తున్న చైనా – అమెరికా దౌత్య సంబంధాల్లో ఇది పెద్ద కుదుపు. డ్రాగన్ దొంగ ఎత్తులపై మిగతా ప్రపంచ దేశాలన్నిటికీ ఓ మేలుకొలుపు. చైనా సహా కట్టెదుటి ముప్పును గమనించిన ఏ సార్వభౌమ దేశమైనా చేసే పనినే అమెరికా చేసింది కాబట్టి తప్పు పట్టలేం. నిజానికి, చైనా గాలిబుడగ అనుమానాస్పదంగా కొద్ది రోజులుగా పయనిస్తోంది. కెనడా మీదుగా మోంటానా రాష్ట్రంలోకి ప్రవేశించింది. అమెరికా అణ్వస్త్ర క్షిపణి ప్రయోగ క్షేత్రాలు మూడింటిలో ఒకటి అక్కడే ఉంది. సైనిక, వ్యూహాత్మక స్థలాలను కనిపెట్టడానికి చైనా దీన్ని సాధనంగా వాడుతోందని భావించిన అమెరికా, అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశంతో అదను చూసి పేల్చేసింది. గతంలో అధ్యక్షుడు ట్రంప్ హయాంలోనూ ఈ గాలిబుడగల మూడో కన్ను పలుచోట్ల అగ్రరాజ్యపు వినువీధుల్లో విహరించింది. తెంపరిగా పేరున్న ట్రంప్ వాటిపై చర్యకు అప్పుడు తెగించలేదు. ఇప్పుడు దేశీయంగా అనేక ఒత్తిళ్ళలో ఉన్న బైడెన్ మటుకు 3 స్కూల్ బస్సుల పరిమాణంలోని ఆ గాలిబుడగను పేల్చేశారు. మొదట అనిష్టంగా ఉన్నా, ఆఖరికి అది తమ బెలూనే అని చైనా విదేశాంగ శాఖ ఒప్పుకుంది. కాకపోతే, దాన్ని గూఢచరానికి వాడుతున్నామన్న వాదనను మాత్రం తోసిపుచ్చింది. అది వాతా వరణ పరిశోధనకు వాడే పౌర వైమానిక నౌక అనీ, దారితప్పి పొరపాటున అటు వచ్చిందనీ బుకాయించింది. విచారం వ్యక్తం చేసింది. నమ్మలేని ఆ మాటలు అటుంచితే, డ్రాగన్ ఇలా నిఘా బెలూన్లను వాడినట్టు తైవాన్, 2020, 2021ల్లో జపాన్ లాంటి దేశాల నుంచి గతంలోనూ ఆరోపణ లొచ్చాయి. భారత్‌పైనా ఇలాంటి ప్రయోగాలే సాగాయి. అవి చైనావేనన్న అధికారిక సాక్ష్యాధారాలు దొరక్కపోతేనేం... గత ఏడాది జనవరిలో అండమాన్, నికోబార్ దీవులపై గాలిబుడగలు తిరిగాయి. నిఘా ఉపగ్రహాలతో పోలిస్తే ఇవి చౌకే కాదు, లక్షిత భూ ఉపరితలానికి దగ్గరగా వెళ్ళి మరింత స్పష్టమైన ఛాయాచిత్రాలు తీయగలవు. సాధారణంగా వాణిజ్య విమానాలు ప్రయాణించే మార్గం కన్నా రెట్టింపు ఎత్తు దాటి, 80 వేల నుంచి లక్షా 20 వేల అడుగుల ఎత్తున నిఘా సాధనాలతో ఈ నిఘా బెలూన్లు వెళుతుంటాయి. కీలక సమాచారాన్ని సేకరించడానికీ, ఇతర సైనిక కార్యకలాపాలు నిర్వహించడానికీ వీటిని వినియోగిస్తుంటారు. ఈ బెలూన్లలో సౌరవిద్యుత్‌తో నడిచే కెమెరా, రాడార్ లాంటివి ఉంటాయి. గాలి వీచే దిశ, వేగాన్ని బట్టి ఎంత ఎత్తులో ప్రయాణించాలనేది ఎప్పటికప్పుడు మారుస్తూ బెలూన్లను లక్షిత ప్రాంతానికి చేరేలా మార్గదర్శనం చేస్తారు. ప్రచ్ఛన్న యుద్ధకాలంలో చౌకగా గూఢచర్యం నిర్వహించే విధానంగా అమెరికా, సోవియట్ యూనియన్లు ఈ నిఘా గాలిబుడగల పద్ధతిని వాడాయి. ఇటీవల సైతం ఇలాంటి చైనా నిఘా బుడగలు అనేకం ప్రపంచపు పెద్దన్న వియత్తలంలో విహారం సాగించాయి. అయితే, తాజా బెలూన్ దీర్ఘకాలంగా అక్కడక్కడే తిరుగుతుండడంతో, పేల్చివేతకు గురైంది. తప్పు చేసినా సరే తననెందుకు తప్పుపడుతున్నారన్నట్టుంది చైనా వైఖరి. అమెరికా గగనతలంపైనే అయినా, తమ బెలూన్ను పేల్చినందుకు సదరు అగ్రరాజ్యం ఇంతకింత ఫలితం అనుభవిస్తుందని బెదిరిస్తోంది. ఈ ఘటనతో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ ఈ 6న జరగాల్సిన తన చైనా పర్యటనను రద్దు చేసుకున్నారు. గత కొన్నేళ్ళలో ఒక ఉన్నత స్థాయి అమెరికా దౌత్యవేత్త చైనాకు వెళ్ళడం ఇదే తొలిసారి. తీరా అదీ రద్దయింది. పర్యటనపై ఇరుపక్షాలూ ప్రణాళిక ఏదీ వేసుకోలేదని బీజింగ్ బింకంగా చెబుతోంది కానీ, జరగాల్సిన దౌత్యనష్టం జరిగిపోయింది. స్నేహానికి చేయి చాస్తూనే, చాటున చేయదలుచుకున్నది చేసేయడంలో చైనా జగత్ కిలాడీ అని మళ్ళీ ఋజువైంది. ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని తాము గౌరవిస్తామంటూ తాజా ఘటన అనంతరమూ చైనా ప్రకటించింది. కానీ, డ్రాగన్ గత చరిత్ర, నేటికీ మారని నైజం తెలిసినవారెవరూ ఆ మాటలను విశ్వసించలేరు. భారత్ సహా తన అగ్రరాజ్య హోదాకు అడ్డనుకున్న ప్రతి దేశంతో సున్నం పెట్టు కోవడం, తైవాన్ లాంటివి తనవేనంటూ దాడులకు దిగడం చైనాకు నిత్యం అలవాటే. అమెరికా లాగా తానూ ప్రపంచ పోలీసు పాత్ర పోషించాలనే తహతహ చైనాలో చిరకాలంగా కనపడుతున్నదే. ఆ దుగ్ధ లేకపోతే ఇలాంటి నిఘా నేత్రాల పనేమిటి? ఆర్థికంగా, సైనికంగా ప్రపంచంలో ఎంత బల మైన శక్తి రాజ్యమైనప్పటికీ, చైనా తన హద్దులు దాటి పరాయిగడ్డపై తన బెలూన్లను తిప్పాలనుకుంటే అది ఉపేక్షనీయం కాదు. ప్రపంచం అందుకు మౌనంగా అనుమతించాలనీ, అంగీకరించాలనీ బీజింగ్ కోరుకుంటే అంతకన్నా హాస్యాస్పదం లేదు. నిఘా సహా అనేక అంశాల్లో చైనా పాలకుల ఎలుక తోలు నైజం తెలిసిందే కాబట్టి, భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి నక్కజిత్తులను సహించేది లేదని మాటల్లోనూ, చేతల్లోనూ చూపాలి. ఎందుకంటే, సమ యానికి ముకుతాడు వేయకుంటే డ్రాగన్ దూకుడు ఆగదని అమెరికా సహా అందరికీ తెలిసిందే. -
గాల్లో గూఢచారులు: స్పై బెలూన్లు... కథా కమామిషు
ఓ బెలూన్ కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. అమెరికా గగనతలంపై 60 వేల అడుగుల ఎత్తున ఎగురుతూ కన్పించిన ఈ చైనా బెలూన్ కచ్చితంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను భారీగా పెంచేసింది. అది కచ్చితంగా నిఘా బాపతేనని అమెరికా, వాతావరణ పరిశోధనలు చేస్తూ దారి తప్పిందని చైనా వాదిస్తున్నాయి. సైనిక రంగంలో నిఘా బెలూన్ల వాడకం ఈ ఉదంతంతో మరోసారి తెరపైకి వచ్చింది... ఈ కాలంలోనూ అవసరముందా? సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ఉపగ్రహాలు, డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఈ నిఘా బెలూన్లతో పనేమిటన్న సందేహాలు సహజం. కానీ ఇప్పటికీ మిలటరీలో ఈ బెలూన్లకు ఎంతో ప్రాధాన్యముంది. ఉపగ్రహాలతో పోలిస్తే వీటిని చాలా చౌకలో తయారు చేయొచ్చు. నిర్ధిష్ట గగన తలాలకు పంపడమూ ఎంతో సులభం. గాలివాటానికి అనుగుణంగా బెలూన్ల దిశను మార్చవచ్చు. అత్యంత ఎత్తులో ప్రయాణించే ఈ బెలూన్లు సేకరించే సమాచారం, ఫొటోలు చాలా నాణ్యతతో ఉంటాయి. లక్షిత గగనతలాల్లో రోజుల తరబడి ప్రయాణించే సత్తా వీటికుంది. చైనా ప్రయోగం వెనక... అమెరికా, చైనా మధ్య తరచూ ఉద్రిక్తతలు నెలకొంటూనే ఉన్నాయి. తైవాన్ నుంచి దక్షిణ చైనా సముద్రం వరకు, చైనాలో మానవహక్కుల నుంచి హాంగ్‌కాంగ్‌లో ప్రజాస్వామ్యం నిర్వీర్యం చేసే చర్యల దాకా తరచూ ఘర్షణాత్మక వాతావరణం నెలకొంటూనే ఉంది. కొంతకాలం క్రితం అప్పటి అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ సందర్శన నాటి నుంచీ విభేదాలు మరింత ముదిరాయి. చైనా 34 యుద్ధ విమానాలను,, 9 యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో మోహరించింది. ప్రతిగా తైవాన్ కూడా యుద్ధ విమానాల్ని సన్నద్ధం చేయడం, తైవాన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడం ఉద్రిక్తతల్ని పెంచింది. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ చైనా పర్యటనకు కొద్ది రోజుల ముందే చైనా నిఘా బెలూన్ ఇలా అమెరికా గగనతలంలోకి ప్రవేశించి కలకలం రేపింది. తద్వారా అగ్రరాజ్యానికి చైనా ఓ రకంగా హెచ్చరికలు పంపిందని భావిస్తున్నారు. ఎప్పట్నుంచి వాడుకలో ఉన్నాయి? ► ఈ బెలూన్లను ఫ్రెంచి విప్లవం కాలం నుంచే వాడుతున్నారు. యుద్ధ భూమిలో ఆస్ట్రియా, డచ్ సైనిక దళాల కదలికలు తెలుసుకునేందుకు 1794లో ఫ్రాన్స్ వీటిని తొలిసారి వాడింది. ► గాల్లో చాలా ఎత్తున ఎగిరే ఈ బెలూన్ల ద్వారా సమాచార సేకరణ తేలిక కావడంతో అమెరికా అంతర్యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో వీటి వాడకం పెరిగింది. ► రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఒక అడుగు ముందుకేసి ప్రత్యర్థులపై ఈ బెలూన్లతో బాంబు దాడులకు దిగిన సందర్భాలూ ఉన్నాయి! జపాన్ సైన్యం ప్రయోగించిన బెలూన్ బాంబు అమెరికాలో ఒరెగాన్ వుడ్‌ల్యాండ్‌లో పడి ముగ్గురు పౌరులు మరణించారు. ► రెండో ప్రపంచ యుద్దం తర్వాత ప్రాజెక్ట్ జెనెట్రిక్స్ పేరుతో అమెరికా ఈ బెలూన్లపై విస్తృతంగా ప్రయోగాలు చేసింది. 1950లో వీటి సాయంతో సోవియట్ భూభాగాన్ని ఫొటోలు తీసింది. ► అమెరికా ఆర్మీ ప్రాజెక్టు మొగల్ పేరుతో బెలూన్లకు మైక్రోఫోన్లను అమర్చి సోవియట్ యూనియన్ అణు పరీక్షలకు సంబంధించిన శబ్దాలను రికార్డు చేసింది. ఏమిటీ నిఘా బెలూన్లు? నిఘా బెలూన్లను అత్యంత తేలికైన హీలియం వాయువుతో నింపుతారు. కెమెరాలు, రాడార్లు, సెన్సార్లు, కమ్యూనికేషన్ పరికరాలు అమర్చుతారు. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు సుదూర ప్రాంతాల్లోని సమాచారాన్ని కూడా అత్యంత స్పష్టతతో సేకరించగలవు. ప్రయాణికుల విమానాలు 40 వేల అడుగుల ఎత్తు దాటవు. ఈ స్పై బెలూన్లు భూమికి 60 వేల నుంచి, లక్షా 50 వేల అడుగుల ఎత్తులో రోజుల తరబడి ప్రయాణించే సామర్థ్యం కలిగినవి. స్పై బెలూన్లు... కథా కమామిషు ► ప్రచ్ఛన్న యుద్ధ తొలినాళ్లలో వీటిని విరివిగా వాడారు ► అత్యంత ఎత్తుల్లో రాడార్లకూ చిక్కకుండా వెళ్లగలవు ► సౌర పలకలు ► నిఘా పరికరాలు ► గాలివాటంగా కదులుతాయి ► కిందివైపు కెమెరా ఉంటుంది ► రాడార్ వ్యవస్థలను అనుసంధానించవచ్చు ► 24వేల నుంచి 37వేల మీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘అగ్ని దేవునికి కోపం వస్తే.. ఇలానే జరుగుతుంది’
బెంగళూరు : కర్ణాటకలో జరిగిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో చిన్న అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వివరాలు.. మైసూరులోని సుత్తూర్ మఠ్‌లో కొన్ని రోజుల క్రితం హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాలా మంది ప్రముఖులు కూడా హాజరయ్యారు. అంతవరకూ ప్రశాంతంగా జరుగుతున్న కార్యక్రమంలో అనుకోని అపశృతి చోటు చేసుకుంది. హోమగుండాన్ని వెలిగించిన వెంటనే.. ఆ మంటలు కాస్తా అక్కడే ఉన్న బెలూన్లను తాకడం.. మంటలు చెలరేగడం వెంటవెంటనే జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు స్వల్పంగా గాయపడ్డారు. ఏఎన్ఐ షేర్ చేసిన ఈ వీడయో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ‘అదేమైన పుట్టిన రోజు వేడుక అనుకున్నారా.. బెలూన్లు కట్టారు’.. ‘అగ్ని దేవునికి కోపం వచ్చింది.. అందుకే ఇలా జరిగింది’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. #WATCH Balloons catch fire at Suttur Mutt in Mysuru, Karnataka. Three people sustained minor injuries. pic.twitter.com/v50CDwMT3K — ANI (@ANI) February 5, 2019 -
కలకలం: బెలూన్లపై పాకిస్తాన్ నినాదం
జైపూర్: భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశంలో ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో రాజస్తాన్‌లోని ఓ ఇంటిపై ‘ఐ లవ్ పాకిస్తాన్’ అని రాసివున్న బెలూన్లు కనిపించడంతో స్థానికంగా కలకలం రేగింది. వీటిని గమనించిన స్థానికులు రాయ్‌సింగ్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ ఘటన శ్రీ గంగానగర్ జిల్లాలోని 19బీబీ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. ఉర్దూ, ఇంగ్లీషుల్లో పాకిస్తాన్ అనుకూల నినాదాలు రాసి ఉన్న రెండు బెలూన్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్హెచ్ఓ మాజిద్ ఖాన్ వెల్లడించారు. 19బీబీ గ్రామం పాకిస్తాన్ సరిహద్దును ఆనుకొని ఉండడం గమనార్హం. బెలూన్లపై ఉర్దూలో పాకిస్తాన్‌లోని బహవల్పూర్ చిరునామాతో పాటు..‘ఆజాదీ ముబారక్’అని కూడా రాసి ఉంది. నిఘా వర్గాల దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు. -
వీర్యంతో దాడులా?.. ఛాన్సే లేదు
సాక్షి, న్యూఢిల్లీ : హోలి వేడుకల్లో భాగంగా దేశ రాజధానిలో ఇద్దరు విద్యార్థినులపై చోటు చేసుకున్న వికృత దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీర్యంతో నింపిన బెలూన్లను వారిపై విసిరిన ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు వివిధ కళాశాలల విద్యార్థినులు ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమీషన్ సైతం ఈ వ్యవహారంపై మండిపడటంతో పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదసలు సాధ్యమయ్యే పనే కాదంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ దాడిని నీరసిస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తన ట్విట్టర్లో పోస్టు చేశారు. అంతే కాదు పలు టీవీఛానెళ్లలో ఆమె చర్చా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఆమె తీరును ఖండిస్తూ సదరు వ్యక్తి ట్వీట్లు చేశారు. ‘అసలు అంత స్థాయిలో వీర్యాన్ని సేకరించటం సాధ్యమయ్యే పని కాదు. ఆరోగ్యవంతమైన మానవుడు 5 మిల్లిలీటర్ల కన్నా ఎక్కువ వీర్యాన్ని స్కలించలేడు. ఒకవేళ అంతస్థాయిలో సేకరించినా అది ఎంతో సేపు లిక్విడ్ స్టేజీలో ఉండలేదు.... ...వాటిని నిల్వ చేయాలంటే ప్రత్యేక పరికరాల్లో నింపాల్సి ఉంటుంది. పోనీ దానికి నీటిని కలిపి నింపారనుకున్నా.. దాని తత్వాన్ని అది కోల్పోతుంది. పైగా అసలు దానిని బెలూన్లలో నింపటం కుదిరే పని కాదు. పోనీ.. ద్రవరూప నైట్రస్ ఆక్సైడ్తో దానిని నింపారనుకున్న అందుకు ఆస్కారమే లేదు’’ అంటూ పలు కారణాలను వివరిస్తూ ఆ వాదనను ఖండించారు. కాలాతీథమ పేరుతో ‘ది గుడ్ డాక్టర్’ పేరిట ఆ ట్విట్టర్ అకౌంట్ ఉంది. పైగా అందులోని వ్యక్తి వైద్యుల మాస్కులు ధరించి ఉండటంతో బహుశా ఆతనో వైద్యుడయి ఉంటాడని భావిస్తున్నారు. అయితే అతని ట్వీట్లను కొందరు ఖండిస్తున్నప్పటికీ.. మద్ధతుగా కూడా ట్వీట్లు చేసే వాళ్లు లేకపోలేదు. ప్రస్తుతం ఆయన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి. -
హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు
-
హోలీ పేరిట విద్యార్థినులపై వికృత చేష్టలు
సాక్షి, న్యూఢిల్లీ : హోలీ వేడుకల పేరుతో విద్యార్థినులపై వికృత చేష్టలకు పాల్పడిన ఘటనలు దేశ రాజధానిలో చోటు చేసుకున్నాయి. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు విద్యార్థినులపై కొందరు ఆగంతకులు వీర్యంతో నింపిన బెలూన్లను విసిరి పరారయ్యారు. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలి కథనం ప్రకారం... ఫిబ్రవరి 24వ తేదీన ఈశాన్య ప్రాంతానికి చెందిన ఓ యువతి అమర్ కాలేనీ మార్కెట్లోని ఓ కేఫ్‌కు వెళ్లింది. బైకులపై వచ్చిన ఐదుగురు యువకులు ఆమెపై బెలూన్లను విసిరారు. ఆపై హోలీ శుభాకాంక్షలు చెబుతూ అక్కడ నుంచి వేగంగా వెళ్లిపోయారు. హస్టల్‌కు వచ్చిన యువతి దుస్తులను పరిశీలించిన యువతికి అవి రంగులు కావని అర్థమైంది. ఈ వికృత చేష్టలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఇక ఢిల్లీ యూనివర్సిటీకే చెందిన మరో యువతికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. హస్టల్ బయట నడుచుకుంటూ వెళ్తున్న తనపై కొందరు వ్యక్తులు బెలూన్లు విసిరారని... ఆపై రంగులు పూస్తూ అసభ్యంగా తాకినట్లు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యూనివర్సిటీ వద్ద పోలీసులు నిఘాను పటిష్టం చేశారు. మరోవైపు హోలి వేడుకల నేపథ్యంలో ఢిల్లీలోని కాలేజీలు, హాస్టళ్ల వద్ద సెక్యూరిటీని అప్రమత్తంగా ఉండాలంటూ యూనివర్సిటీ అధికారులు సూచిస్తున్నారు. -
సరిహద్దుల్లో పాక్ గాలిబుడగల దుమారం!
-
సరిహద్దుల్లో పాక్ గాలిబుడగల దుమారం!
చండీగఢ్: పాకిస్థాన్ నుంచి పెద్దసంఖ్యలో గాలిబుడగలు (బెలూన్లు) భారత సరిహద్దులోకి వచ్చి వాలుతుండటం కలకలం రేపుతోంది. పంజాబ్‌లో సరిహద్దుల మీదుగా దాదాపు మూడు డజన్ల గాలిబుడగలను బీఎస్ఎఫ్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఫీరోజ్‌పూర్, పఠాన్‌కోట్, అమృతసర్ సైనిక ఔట్‌పోస్టుల వద్ద అత్యధిక సంఖ్యలో గాలిబుడగలు దొరికాయి. ఉర్దూలో భారత్ వ్యతిరేక సందేశాలున్న కాగితాల్ని గాలిబుడగలకు కట్టి భారత్ వైపు ఎగురవేస్తున్నట్టు తెలుస్తోంది. భారతీయ మహిళలను, సైనికులను దూషిస్తూ అసభ్య వ్యాఖ్యలతో కూడిన గాలిబుడగలే అధికసంఖ్యలో వస్తున్నాయి. కొన్ని గాలిబుడగలపై ప్రధాని నరేంద్రమోదీకి సవాళ్లు కూడా ఉన్నాయి. ‘మోదీ పాకిస్థాన్ సైన్యం సత్తా ఏమిటో తెలుసుకోవాలంటే.. నేరుగా తలపడి చూసుకో’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఉన్నాయి. గత జనవరిలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాకిస్థాన్ నుంచి రాజస్థాన్ మీదుగా ప్రయాణించిన ఓ భారీ హెలియం బెలూన్ను భారత వైమానిక దళం (ఐఏఎఫ్) కూల్చేసిన సంగతి తెలిసిందే. అమెరికాలో తయారైన ఈ బెలూన్ 25వేల అడుగుల ఎత్తులో ఉండగానే ఐఏఎఫ్ రాడర్లు గుర్తించాయి. తమ దేశం నుంచి బెలూన్లు వెళితే భారత్ స్పందన ఎలా ఉంటుంది? వాటిని ఎంతసేపటిలో గుర్తిస్తారు? అన్నది తెలుసుకోవడానికి పాక్ సైన్యం ఇలాంటి కన్నింగ్ పనులకు పాల్పడుతుందా? అని సైనికాధికారులు అనుమానిస్తున్నారు. -
ఆకాశంలో సెల్ టవర్లు... గూగుల్ బెలూన్లు..
గూగుల్... ఇంటర్నెట్ స్పీడును ఇక బెలూన్ల ద్వారా విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాలను పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇండియాలో ఇంటర్నెట్ స్పీడ్ ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తోంది. సింగపూర్ లాంటి చిన్న చిన్న దేశాల్లో కూడా ఇంటర్నెట్ అతి వేగంగా వస్తుంటే ఇండియాలో మాత్రం సరైన వసతుల్లేక, పాలకులకు ముందుచూపు లేక నత్తనడకన సాగుతోంది. ఒక్క ప్రధానమంత్రి కార్యాలయంలో తప్పించి ఇండియాలో ఎక్కువశాతం 2 ఎంబిపిఎస్ స్పీడ్ వరకే అందుబాటులో ఉంటోంది. టెలికాం రంగం కుంభకోణాలమయంగా మారడంతో ఇండియాలో బ్రాడ్ బాండ్ విస్తరణ నత్తనడకగా మారింది. ఈ నేపథ్యంలో 10 ఎంబిపిఎస్ కంటే ఎక్కువ స్పీడ్ ఉన్న నెట్ ను వాడుతున్న వినియోగదారులు.. కేవలం 1.2 శాతం మాత్రమే ఉన్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి. దీంతో ఇంటర్నెట్ స్పీడులో ఇండియా 52వ స్థానంలో ఉంది. కాగా అమెరికాలో గూగుల్ ఫైబర్ సెకనుకు 1జిబి డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. అలాగే మిన్నెసోటా రాష్ట్రంలో అత్యధికంగా 10 జీబీపీఎస్ డౌన్ లోడ్ సదుపాయం కూడా అందుబాటులో ఉండటం విశేషం. ప్రస్తుతం గూగుల్ ఇండోనేషియాలో రెండేళ్ళ 'ప్రాజెక్ట్ లూన్' ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. భూమిపై దాదాపు 60 వేల అడుగులు... అంటే సుమారు 18 వేల మీటర్ల దూరంలో బెలూన్ల సమూహాలతో హై స్పీడ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ విస్తరింపజేస్తోంది. ఈ హై స్పీడ్ సిగ్నల్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. మొత్తం ఇండోనేషియాలో సుమారు 250 మిలియన్ల ప్రజలు ఉంటే వారిలో కేవలం 42 మిలియన్ల మందికి మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ అందుబాటులో ఉన్నట్లు సీఐఏ లెక్కలు చెప్తున్నాయి. ప్రాజెక్ట్ లూన్ ఇప్పటికే ఈ టెక్నాలజీని పరీక్షిస్తోంది. అయితే సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్నది మాత్రం ఇంకా చెప్పలేదు. గృహాలకు, వ్యాపారాలకు బెలూన్లపరిధిలోని నెట్ స్పీడును అందించేందుకు కృషి చేస్తోంది. ఈ నూతన విధానంలో యూజర్లకు ఇంటర్నెట్ ను వైర్ లెస్ ప్రొవైడర్ల ద్వారా అందిచనుంది. ఇండోనేషియాలో మొబైల్ ఫోన్లు వాడేవారు ఇప్పటికే సుమారు 319 మిలియన్లకు మించి పోయారు. అయితే వీరిలో చాలామంది వినియోగదారులు ఇంటర్నెట్ డేటా ప్లాన్ ల ఖరీదును భరించే స్థోమతలేక, మారుమూల ప్రాంతాల్లో నివసించడం వల్ల, హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులోకి రాక.. ఇలా పలు కారణాలతో నెట్ లేకుండానే గడిపేస్తున్నారు. అయితే గూగుల్... ముందుగా ఈ ప్రాజెక్టుకు డిజిటల్ ప్రకటనలద్వారా డబ్బును సేకరించి ఆ డబ్బుతో నిధులను సమకూర్చుకుంటుంది. న్యూజిల్యాండ్ లో పరీక్షల అనంతరం.. ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా, బ్రెజిల్ లోని మారుమూల ప్రాంతాల్లో విస్తృతపరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. అనుకున్న ప్రకారం జరిగితే 'ప్రాజెక్ట్ లూన్' ఆకాశంలో సెల్ టవర్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. -
చైర్ లో కూర్చుని గాల్లో చక్కర్లు!
టొరొంటో: మనం రకరకాల విన్యాసాలను రోజూ చూస్తుంటాం. అయితే ఓ వ్యక్తి గాల్లో వినూత్న తరహాలో చక్కర్లు కొట్టి జనాన్ని ఆకర్షించాలనుకున్నాడు. కెనడాకు చెందిన డానియల్ బోరియా అనే అతను ఓ వ్యాపార ప్రకటన చేసే క్రమంలో గాల్లో విహరించే సాహస కార్యానికి పూనుకున్నాడు. ఆ క్రమంలో వందకు పైగా హీలియం బెలూన్లు తీసుకుని ప్యారాచూట్ మాదిరిగా తయారు చేశాడు. మరి వాటికి ఒక ఫోల్డింగ్ చైర్ ను అనుసంధానం చేసుకున్నాడు. ఇంకేముందు అందుకు జనసందోహం ఎక్కువగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకుని గాల్లో చక్కర్లు కొట్టడం ప్రారంభించాడు. కొన్ని గంటలు పాటు తనపనిని తాను పూర్తి చేసి దిగ్విజయంగా కిందికి దిగిపోయాడు. ఇటువంటి సాహసకృత్యాలు అత్యంత ప్రమాదకరం కావడంతో అతన్ని ఆదివారం కెనడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒకరోజు పాటు జైల్లో ఉంచి విడిచిపెట్టారు. ఇంతకీ ఆ సాహసం విలువ ఎంతో చెప్పలేదు కదూ ఇరవై వేల డాలర్లట. అయితే దీనిపై బొరియా ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. దీనికోసం ఎప్పట్నించో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఎట్టకేలకు ఆ పనిని పూర్తి చేసినట్లు పేర్కొన్నాడు.