ఆకాశంలో సెల్ టవర్లు... గూగుల్ బెలూన్లు.. | Google announces expansion of plans to deliver Internet by balloons | Sakshi
Sakshi News home page

ఆకాశంలో సెల్ టవర్లు... గూగుల్ బెలూన్లు..

Published Fri, Oct 30 2015 5:28 PM | Last Updated on Sun, Sep 3 2017 11:44 AM

ఆకాశంలో సెల్ టవర్లు... గూగుల్ బెలూన్లు..

ఆకాశంలో సెల్ టవర్లు... గూగుల్ బెలూన్లు..

గూగుల్... ఇంటర్నెట్ స్పీడును ఇక బెలూన్ల ద్వారా  విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్షన్ సౌకర్యాలను పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇండియాలో ఇంటర్నెట్ స్పీడ్ ఇప్పుడిప్పుడే పెరుగుతూ వస్తోంది. సింగపూర్ లాంటి చిన్న చిన్న దేశాల్లో కూడా ఇంటర్నెట్ అతి వేగంగా వస్తుంటే ఇండియాలో మాత్రం సరైన వసతుల్లేక, పాలకులకు ముందుచూపు లేక నత్తనడకన సాగుతోంది. ఒక్క ప్రధానమంత్రి కార్యాలయంలో తప్పించి ఇండియాలో ఎక్కువశాతం 2 ఎంబిపిఎస్ స్పీడ్ వరకే అందుబాటులో ఉంటోంది.

టెలికాం రంగం కుంభకోణాలమయంగా మారడంతో ఇండియాలో బ్రాడ్ బాండ్ విస్తరణ నత్తనడకగా మారింది. ఈ నేపథ్యంలో 10 ఎంబిపిఎస్ కంటే ఎక్కువ స్పీడ్ ఉన్న నెట్ ను వాడుతున్న వినియోగదారులు.. కేవలం 1.2 శాతం మాత్రమే ఉన్నట్లుగా లెక్కలు చెప్తున్నాయి. దీంతో ఇంటర్నెట్ స్పీడులో ఇండియా 52వ స్థానంలో ఉంది. కాగా అమెరికాలో గూగుల్ ఫైబర్ సెకనుకు 1జిబి డౌన్ లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. అలాగే మిన్నెసోటా రాష్ట్రంలో అత్యధికంగా  10 జీబీపీఎస్ డౌన్ లోడ్ సదుపాయం కూడా అందుబాటులో ఉండటం విశేషం.

ప్రస్తుతం గూగుల్ ఇండోనేషియాలో రెండేళ్ళ 'ప్రాజెక్ట్ లూన్' ను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. భూమిపై దాదాపు 60 వేల అడుగులు... అంటే సుమారు 18 వేల మీటర్ల దూరంలో బెలూన్ల సమూహాలతో  హై స్పీడ్ ఇంటర్నెట్ సిగ్నల్స్ విస్తరింపజేస్తోంది. ఈ హై స్పీడ్ సిగ్నల్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. మొత్తం ఇండోనేషియాలో సుమారు 250 మిలియన్ల ప్రజలు ఉంటే వారిలో కేవలం 42 మిలియన్ల మందికి మాత్రమే ఇంటర్నెట్ యాక్సెస్ అందుబాటులో ఉన్నట్లు సీఐఏ లెక్కలు చెప్తున్నాయి. ప్రాజెక్ట్ లూన్ ఇప్పటికే ఈ టెక్నాలజీని పరీక్షిస్తోంది. అయితే సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయన్నది మాత్రం ఇంకా చెప్పలేదు. 

 

గృహాలకు, వ్యాపారాలకు బెలూన్లపరిధిలోని నెట్ స్పీడును అందించేందుకు కృషి చేస్తోంది. ఈ నూతన విధానంలో యూజర్లకు ఇంటర్నెట్ ను వైర్ లెస్ ప్రొవైడర్ల ద్వారా అందిచనుంది. ఇండోనేషియాలో మొబైల్ ఫోన్లు వాడేవారు ఇప్పటికే  సుమారు 319 మిలియన్లకు మించి పోయారు. అయితే వీరిలో చాలామంది వినియోగదారులు ఇంటర్నెట్ డేటా ప్లాన్ ల ఖరీదును భరించే స్థోమతలేక, మారుమూల ప్రాంతాల్లో నివసించడం వల్ల,  హై స్పీడ్ ఇంటర్నెట్ సౌకర్యం  అందుబాటులోకి రాక.. ఇలా పలు కారణాలతో నెట్ లేకుండానే గడిపేస్తున్నారు.

అయితే గూగుల్... ముందుగా ఈ ప్రాజెక్టుకు డిజిటల్ ప్రకటనలద్వారా డబ్బును సేకరించి ఆ డబ్బుతో నిధులను సమకూర్చుకుంటుంది. న్యూజిల్యాండ్ లో పరీక్షల అనంతరం.. ఆస్ట్రేలియా, కాలిఫోర్నియా, బ్రెజిల్ లోని మారుమూల ప్రాంతాల్లో విస్తృతపరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. అనుకున్న ప్రకారం జరిగితే 'ప్రాజెక్ట్ లూన్' ఆకాశంలో సెల్ టవర్లుగా వ్యవహరించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement