గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా అన్నీ ఆ నిమిషంలోనే జరుగుతాయి. అందుకే ప్రతి నిమిషాన్ని ఒడిసిపట్టుకోవాలి. అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయాలి. అదే నిమిషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్‌లో 60 సెకన్ల(ఒకనిమిషం) లో చాలా పనులు జరుగుతున్నాయని, ఇటీవల వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం...
♦ ట్విట్టర్‌లో యూజర్లు నిమిషానికి 575,000 ట్వీట్‌లను పోస్ట్ చేస‍్తున్నారు.
♦ టిక్‌టాక్‌లో 67 మిలియన్ క్లిప్‌లను వీక్షిస్తున్నారు.
♦ ప్రతి నిమిషానికి గూగుల్‌లో 5.7 మిలియన్ల మంది ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తున్నారు.
♦ యాపిల్ గాడ్జెట్స్ (ఐఫోన్, ఐపాడ్)లో 12 మిలియన్ల మంది మెసేజ్‌లను సెండ్ చేస‍్తున్నారు.
♦ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 65,000 ఫోటోల్ని షేర్ చేస్తున్నారు.
♦ ఫేస్‌బుక్ లో ప్రతి నిమిషానికి 240,000 ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఫేస్‌బుక్ లైవ్‌ను ప్రతి నిమిషం 44 మిలియన్ల వీక్షిస్తున్నారు.
♦ కొనుగోలు దారులు ప్రతినిమిషానికి అమెజాన్‌లో $283,000 ఖర్చు చేస్తున్నారు.
♦ ఇంటర్నెట్‌లో ప్రతి నిమిషం 6 మిలియన్ల మంది ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తారు.
♦ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో నిమిషానికి 452.000 గంటల వీడియోల్ని వీక్షిస్తున్నారు.
♦ యూట్యూబ్‌లో ప్రతినిమిషానికి 694.000 గంటల వీడియోల్ని చూస్తున్నారు.
♦ స్నాప్ చాట్‌లో యూజర్లు ప్రతి నిమిషానికి 2 మిలియన్ స్నాప్‌లను పంపుతున్నారు.
♦ జూమ్ ప్రతి నిమిషానికి 856 నిమిషాల వెబ్‌నార్‌లను హోస్ట్ చేస్తుంది
♦ మైక్రోసాఫ్ట్ బృందాలు ప్రతి నిమిషం 100,000 మంది వినియోగదారులను కనెక్ట్ చేస్తుంది.
ఇంటర్నెట్ వినియోగం పెరిగింది
1990ల నుంచి ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఒక చిన్న ప్రయోగంగా ప్రారంభమైన ఇంటర్నెట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్ని ఏకం చేస్తుంది. డబ్ల్యూఎఫ్ అంచనాల ప్రకారం 2020లో ఇంటర్నెట్ వినియోగదారులు 4.5 బిలియన్ల నుండి 2021లో 11 శాతం పెరిగారు.
♦ ప్రతి నిమిషానికి 950 మంది కొత్త యూజర్లు ఇంటర్నెట్‌కు పరిచయం అవుతున్నారు.
♦ ప్రస్తుతం, ఇంటర్నెట్‌ను దాదాపు 5 బిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు.
చదవండి: ఎవడి డప్పు వాడు కొట్టుకున్నా.. వందల కోట్లు కట్టాల్సిందే...!
Comments
Please login to add a commentAdd a comment