ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : హోలి వేడుకల్లో భాగంగా దేశ రాజధానిలో ఇద్దరు విద్యార్థినులపై చోటు చేసుకున్న వికృత దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీర్యంతో నింపిన బెలూన్లను వారిపై విసిరిన ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు వివిధ కళాశాలల విద్యార్థినులు ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమీషన్ సైతం ఈ వ్యవహారంపై మండిపడటంతో పోలీసులు సీరియస్‌గా దర్యాప్తు చేపట్టారు.
అయితే ఇదసలు సాధ్యమయ్యే పనే కాదంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ దాడిని నీరసిస్తూ సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అంతే కాదు పలు టీవీఛానెళ్లలో ఆమె చర్చా కార్యక్రమాలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలో ఆమె తీరును ఖండిస్తూ సదరు వ్యక్తి ట్వీట్లు చేశారు. ‘అసలు అంత స్థాయిలో వీర్యాన్ని సేకరించటం సాధ్యమయ్యే పని కాదు. ఆరోగ్యవంతమైన మానవుడు 5 మిల్లిలీటర్ల కన్నా ఎక్కువ వీర్యాన్ని స్కలించలేడు. ఒకవేళ అంతస్థాయిలో సేకరించినా అది ఎంతో సేపు లిక్విడ్ స్టేజీలో ఉండలేదు....
...వాటిని నిల్వ చేయాలంటే ప్రత్యేక పరికరాల్లో నింపాల్సి ఉంటుంది. పోనీ దానికి నీటిని కలిపి నింపారనుకున్నా.. దాని తత్వాన్ని అది కోల్పోతుంది. పైగా అసలు దానిని బెలూన్లలో నింపటం కుదిరే పని కాదు. పోనీ.. ద్రవరూప నైట్రస్ ఆక్సైడ్‌తో దానిని నింపారనుకున్న అందుకు ఆస్కారమే లేదు’’ అంటూ పలు కారణాలను వివరిస్తూ ఆ వాదనను ఖండించారు.
కాలాతీథమ పేరుతో ‘ది గుడ్ డాక్టర్’ పేరిట ఆ ట్విట్టర్ అకౌంట్ ఉంది. పైగా అందులోని వ్యక్తి వైద్యుల మాస్కులు ధరించి ఉండటంతో బహుశా ఆతనో వైద్యుడయి ఉంటాడని భావిస్తున్నారు. అయితే అతని ట్వీట్లను కొందరు ఖండిస్తున్నప్పటికీ.. మద్ధతుగా కూడా ట్వీట్లు చేసే వాళ్లు లేకపోలేదు. ప్రస్తుతం ఆయన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment