ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్ ప్రారంభం | Escalator launched at Ongole Railway station | Sakshi
Sakshi News home page

ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్ ప్రారంభం

Published Sun, Mar 20 2016 2:11 PM | Last Updated on Sun, Sep 3 2017 8:12 PM

ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్ ప్రారంభం

ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఎస్కలేటర్ ప్రారంభం

ఒంగోలు : ప్రకాశం జిల్లా ఓంగోలు రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్‌ను వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, డివిజినల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు, సదుపాయాల గురించి ఎంపీ... డీఆర్‌ఎం దృష్టికి తీసుకెళ్లారు.

ప్రయాణికులు దిగేందుకు కూడా ఓ ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయాలని, స్టేషన్‌కు రెండో వైపున టికెట్ కౌంటర్ ఏర్పాటుతోపాటు, జిల్లాలో రాజస్థాన్ ప్రజలు ఎక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రానికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి డీఆర్‌ఎంను కోరారు. వీటి పట్ల డీఆర్‌ఎం సుముఖంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement