Ongole railway station
-
ఒంగోలు రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత
-
వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసుల దౌర్జన్యం
సాక్షి, ఒంగోలు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చేపట్టిన రైల్ రోకో ఉద్రిక్తంగా మారింది. ఒంగోలులో రైలు రోకో చేపట్టిన వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నాందేడ్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసి నిరసన తెలుపుతున్న ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు బాలినేని శ్రీనివాస రెడ్డి, వరికుటి అశోక్‌బాబులను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఈ ఘటనలో సీఐ గంగా వెంకటేశ్వర్లు దళిత నేత అశోక్ బాబుపై దాడి చేశారు. ఆయన్ను కొట్టి లారీలో పడేశారు. దీంతో బాలినేని సహా కార్యకర్తలు పోలీసుల దౌర్జన్యంపై నిరసనకు దిగారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్ సీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర నేతలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైల్ రోకోకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. -
‘సింహపురి’లో నగల బ్యాగ్ మాయం
సాక్షి, ఒంగోలు: సికింద్రాబాద్ నుంచి గూడూరు వెళ్తున్న సింహపురి ఎక్స్‌ప్రెస్ రైలులోలో ప్రయాణికురాలి నగల బ్యాగ్ మాయం అయింది. రూ.35 లక్షల విలువ చేసే నగలు ఉన్న బ్యాగ్ పోయిందని రావిపాటి సుశీల అనే ప్రయాణికురాలు ఒంగోలు రైల్వేపోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు హైదరాబాద్ నుంచి ఇదే రైలులో ఒంగోలు వస్తుండగా ఈ సంఘటన జరిగింది. కేసు నమోదు చేసుకుని రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఒంగోలు రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్ ప్రారంభం
ఒంగోలు : ప్రకాశం జిల్లా ఓంగోలు రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసిన ఎస్కలేటర్‌ను వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, డివిజినల్ రైల్వే మేనేజర్ అశోక్‌కుమార్‌లు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు, సదుపాయాల గురించి ఎంపీ... డీఆర్ఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రయాణికులు దిగేందుకు కూడా ఓ ఎస్కలేటర్‌ను ఏర్పాటు చేయాలని, స్టేషన్‌కు రెండో వైపున టికెట్ కౌంటర్ ఏర్పాటుతోపాటు, జిల్లాలో రాజస్థాన్ ప్రజలు ఎక్కువగా ఉన్నందున ఆ రాష్ట్రానికి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలుకు హాల్టింగ్ సదుపాయం కల్పించాలని వైవీ సుబ్బారెడ్డి డీఆర్ఎంను కోరారు. వీటి పట్ల డీఆర్ఎం సుముఖంగా స్పందించారు. -
ఎస్కలేటర్లకు వారంలోగా టెండర్లు
రైల్వే జీఎంను ఆదేశించిన మంత్రి సురేష్‌ప్రభు రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రతిపాదనలపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం ఢిల్లీలో రైల్వే మంత్రి సురేష్ ప్రభును కలిశారు. ఒంగోలు రైల్వే స్టేషన్‌లోని ముఖ్య సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఎంపీ ప్రతిపాదించిన ప్రతిపాదనల పట్ల రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైల్వే మంత్రి తో చర్చించిన అంశాలు ఇలా... ► ఒంగోలు రైల్వే స్టేషన్లో ప్రయాణీకుల సంఖ్య పెరిగినందున రెండు లిఫ్ట్‌లు, రెండు ఎస్కలేటర్లను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే రెండు లిఫ్టులు, ఒక ఎస్కలేటర్ మంజూరై ఉందని, దీనికి నిధులు విడుదల కావాల్సి ఉందని ఎంపీ సుబ్బారెడ్డి రైల్వే మంత్రికి గుర్తు చేశారు. దీనిపై స్పందించిన రైల్వే మంత్రి సురేష్ ప్రభు వెంటనే దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాస్తవకు ఫోన్ చేసి వారం రోజుల్లోగా ఆయా పనులకు టెండర్లు పిలవాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా పనులు పారంభించాలని ఆదేశించారు. ► రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకుని ఏసీ వెయిటింగ్ హాల్‌ను ఏర్పాటు చేయాలని ప్రస్తుతం ఉన్న విశ్రాంతి గదులను ఏసీ చేయాలని కోరారు. ► సింగరాయకొండ రైల్వేస్టేషన్లో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉందని, ఇక్కడ నీటి కొరత కూడా ఉందని వివరించారు. ► ఒంగోలు రైల్వేస్టేషన్లో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు జాము 4.30 గంటల మధ్య ఒక్క రైలు కూడా లేదని, సికింద్రాబాద్- విజయవాడ వరకు వేసిన డబుల్ డెక్కర్ రైలును ఒంగోలు వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. ► జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ కోసం జిల్లాలో దాదాపు 45 వేలమంది రాజస్థానీలు స్టాపింగ్ కోసం ఎదురు చూస్తున్నారని, ఆ రైలుతోపాటు కేరళ ఎక్స్‌ప్రెస్, జైపూర్ ఎక్స్‌ప్రెస్, పాండిచ్చేరి ఎక్స్‌ప్రెస్‌లు కూడా ఒంగోలులో నిలపాలని పేర్కొన్నారు. ► కొండపి, కందుకూరుతోపాటు పలు పశ్చిమ ప్రాంతాలకు వెళ్లేందుకు కేంద్రంగా మారిన సింగరాయకొండలో కూడా పలు రైళ్లను ఆపాలని విజ్ఞప్తి చేశారు. -
రైల్వే స్టేషన్లో రూ. 43 లక్షలు స్వాధీనం
ప్రకాశం జిల్లా ఒంగోలు రైల్వే స్టేషన్లో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా నరేష్ అనే వ్యక్తి నుంచి రూ. 43 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ నగదును స్వాధీనం చేసుకుని... వ్యక్తిని పట్టణంలోని టూటౌన్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. పట్టుబడి నగదుపై పోలీసులు ఆ వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు. అయితే అతడు ఆ నగదుపై సమాధానం చెప్పేందుకు నిరాకరించడంతో పోలీసులు తమ దైన శైలిలో పోలీసులు నరేష్‌ను ప్రశ్నిస్తున్నారు.