
వైఎస్సార్‌సీపీ దళిత నాయకుడు అశోక్‌బాబుపై దాడి చేస్తున్న సీఐ గంగా వెంకటేశ్వర్లు
సాక్షి, ఒంగోలు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం చేపట్టిన రైల్ రోకో ఉద్రిక్తంగా మారింది. ఒంగోలులో రైలు రోకో చేపట్టిన వైఎస్సార్ సీపీ నేతలపై పోలీసులు దౌర్జన్యానికి దిగారు. నాందేడ్-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపేసి నిరసన తెలుపుతున్న ప్రకాశం జిల్లా వైఎస్సార్ సీపీ నేతలు బాలినేని శ్రీనివాస రెడ్డి, వరికుటి అశోక్‌బాబులను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు.
ఈ ఘటనలో సీఐ గంగా వెంకటేశ్వర్లు దళిత నేత అశోక్ బాబుపై దాడి చేశారు. ఆయన్ను కొట్టి లారీలో పడేశారు. దీంతో బాలినేని సహా కార్యకర్తలు పోలీసుల దౌర్జన్యంపై నిరసనకు దిగారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆమరణ దీక్షకు దిగిన వైఎస్సార్ సీపీ ఎంపీలకు మద్దతుగా రాష్ట్ర నేతలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైల్ రోకోకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment