
అశోక్ బాబు(పాత చిత్రం)
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం ఏపీ ఎన్జీవోల ఆధ్వర్యంలో బుధవారం ధర్నాచౌక్‌లో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పోరాటంలో పాల్గొనడానికి కొంత సమయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పుడిప్పుడే అభివృద్ధి జరుగుతున్న రాష్ట్రంలో దీక్షలతో అభివృద్ధి అగిపోతుందనే ఇంతకాలం వేచి చూశామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇకపై హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటించారు. రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు వారి ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. తాము ఏ పార్టీకి సపోర్ట్ కాదని చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏవిధంగా పాల్గొన్నామో అదేవిధంగా హోదాకోసం పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు. పూర్తి స్థాయి కార్యాచరణ మరికొన్ని రోజుల్లో ప్రకటిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment