ఎస్కలేటర్ ప్రమాదంలో గాయపడ్డ బాలిక | Girl injured in escalator accident in China | Sakshi
Sakshi News home page

ఎస్కలేటర్ ప్రమాదంలో గాయపడ్డ బాలిక

Published Sun, May 22 2016 7:18 PM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

Girl injured in escalator accident in China

బీజింగ్: ఎస్కలేటర్ ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక గాయపడిన ఘటన చైనా రాజధాని బీజింగ్ లో చోటుచేసుకుంది. ఫుజింగ్ మెన్ ప్రాంతంలోని పార్క్ సన్ షాపింగ్ సెంటర్ లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్కలేటర్ ను నిర్వహించే వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎస్కలేటర్ ఫ్లోర్ ప్యానల్ తీసుకుని పోయి వార్నింగ్ సైన్స్, సేఫ్టీ బారియర్స్ పెట్టలేదు.

ఎస్కలేటర్ గ్యాప్ లో బాలిక కాలు ఇరుక్కుపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమెకు 25 సెంటీమీటర్ల మేర కాలిగాయమయిందని వైద్యులు తెలిపినట్టు బీజింగ్ టైమ్స్ వెల్లడించింది. రెండు గంటల పాటు సర్జరీ చేసి కుట్లువేసినట్టు చెప్పారు. ఈ ఘటనపై షాపింగ్ మాల్ వర్గాలు క్షమాపణ చెప్పాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని హామీయిచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement