టోక్యో: పేరులో ఏముంది లెమ్మని అనుకోలేం. ఎందుకంటే పిల్లులు కూడా పేర్లను బాగా గుర్తు పడతాయని తాజా అధ్యయనంలో తేలింది. తమతో కలిసిమెలిసి ఉండే ఇతర పిల్లులు, యజమానుల పేర్లను పిల్లులు పసిగట్టేస్తాయని జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. పిల్లుల జ్ఞాపకశక్తిపై వారు రెండు వేర్వేరు అధ్యయనాలు చేశారు. ఒకదాంట్లో వాటితో కలిసిమెలిసి తిరిగే ఇతర పిల్లి ఫోటోను వాటి దగ్గరుంచారు. కొన్నిసార్లు ఫోటోలోని పిల్లి పేరును, మరికొన్ని సార్లు వేరే పేరును పిలిచారు. ఫోటోలోని పిల్లి పేరు పిలవగానే అవి ఫొటోవైపే కన్నారప్పకుండా చూశాయి. వేరే పేరుతో పిలిస్తే పట్టించుకోలేదు. అలాగే యజమానుల ఫోటోలను వాటి దగ్గరుంచి పేరు పెట్టి పిలిచినా గుర్తించగలిగాయని శాస్త్రవేత్తలు వివరించారు. 40 పిల్లులపై ఈ అధ్యయనం చేసినట్టు వాళ్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment