Japan scientists
-
ఒక తార పేలిన వేళ...
సూపర్ నోవా. అంతరిక్షంలో సంభవించే అతి పెద్ద పేలుడు. బహుశా బ్రహ్మాండంలో దీన్ని మించిన పేలుడు మరోటి ఉండదని చెబుతారు. నిజానికి సూపర్ నోవాలు సైంటిస్టులకు ఎప్పుడూ ఆసక్తికరమైన సబ్జెక్టే. నక్షత్రాల జీవిత కాలంలోని చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికంటే చాలా ఎక్కువ విశేషాలే జరుగుతాయని వారిప్పుడు చెబుతున్నారు. ఆ సమయంలో అవి భారీ పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోతాయట. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ సూపర్ నోవాపై జరిపిన అధ్యయనంలో ఈ విశేషం వెలుగులోకి వచి్చంది. ► అది దాని చివరి ఏడాదిలో ఏకంగా సూర్యునికి సమాన పరిమాణంలో ద్రవ్యరాశిని కోల్పోయిందట. ► నక్షత్రాలు తమ చివరి ఏడాదిలో మనకు ఇప్పటిదాకా తెలిసిన వాటికి మించి చాలా పరిణామాలకు లోనవుతాయని ఈ దృగ్విషయం తేటతెల్లం చేసింది. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ ను జపాన్ కు చెందిన ఔత్సాహిక అంతరిక్ష శాస్త్రవేత్త కోయిచీ ఇటగాకీ 2023లో కనిపెట్టాడు. ► ఇది పిన్ వీల్ గెలాక్సీలో భూమికి దాదాపు 2 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ► మిగతా సూపర్ నోవాలతో పోలిస్తే ఇది భూమికి అత్యంత సమీపంలో ఉంది. పైగా మనకు తెలిసిన వాటిలో అత్యంత నూతన నోవా కూడా ఇదే. ► ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ ను టైప్ 2, లేదా కోర్ కొలాప్స్ సూపర్ నోవా గా పిలుస్తారు. సూర్యుని కంటే 8 నుంచి 25 రెట్లు పెద్దవైన తారలు రెడ్ సూపర్ జెయింట్స్ గా మారి తమ బరువును తామే తాళలేక భారీ పేలుడుకు లోనవుతాయి. ► ఇలాంటి సూపర్ నోవాలు సంభవించగానే వాటి నుంచి అతి విస్తారమైన కాంతి పుంజాలు వెలువడతాయి. ► వాటి తాలూకు షాక్ వేవ్స్ సూపర్ నోవా ఆవలి అంచును చేరతాయి. ► కానీ ఎస్ఎన్2023ఐఎక్స్ఎఫ్ నుంచి వెలువడ్డ కాంతి పుంజాలు మాత్రం అలా దాని చివరి అంచును చేరలేదు. ► సదరు సూపర్ నోవా దాని చివరి సంవత్సరంలో తీవ్ర అస్థిరతకు లోనయిందని దీన్నిబట్టి తెలుస్తోందని సైంటిస్టులు వివరిస్తున్నారు. ► పేలుడుకు ముందు సదరు తార నిండా అతి దట్టమైన ద్రవ్యరాశి పరుచుకుని ఉందనేందుకు ఇది ప్రత్యక్ష ప్రమాణమని ఇటగాకీ వివరించారు. ► భారీ తారల ఆవిర్భావ, వికాసాలకు సంబంధించి ఇప్పటిదాకా విశ్వసిస్తున్న పలు కీలక సిద్ధాంతాలపై ఇది పలు ప్రశ్నలు లేవనెత్తిందని సైంటిస్టులు చెబుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Oxygen-28: కొత్త రకం ఆక్సిజన్‌ను గుర్తించిన శాస్త్రవేత్తలు
టోక్యో: భూగోళంపై ఉన్న కోట్లాది రకాల జీవులు బతకడానికి ప్రాణవాయువు(ఆక్సిజన్) అవసరం. అంతర్జాతీయ భౌతిక శాస్త్రవేత్తల బృందం ప్రకృతిలో కొత్త రకం ఆక్సిజన్‌ను గుర్తించింది. జపాన్‌లోని టోక్యో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన యొషుకే కొండో అనే అణు భౌతిక శాస్త్రవేత్త ఆధ్వర్యంలో భౌతిక శాస్త్రవేత్తల బృందం ‘ఆక్సిజన్–28’ అనే కొత్తరకం ప్రాణవాయువును గుర్తించింది. ఇది ఆక్సిజన్ పరమాణువుకు సంబంధించిన ఒక ఐసోటోప్ అని సైంటిస్టులు వెల్లడించారు. ఈ ఆక్సిజన్–28 ఐసోటోప్ 20 న్యూట్రాన్లు, ఎనిమిది ప్రోటాన్లను కలిగి ఉంటుందని సమాచారం. ఇప్పటిదాకా మనకు అందుబాటులో ఉన్న ఆక్సిజన్ రకాల్లో ఇది పరిమాణంలో భారీగా ఉన్నట్లు తేల్చారు. ఈ ఆక్సిజన్ ఐసోటోప్ కొంత తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉందని గమనించారు. ప్రకృతిలో ఇది అసాధారణమైన ఆక్సిజన్ అని శాస్త్రవేత్తలు అభివరి్ణస్తున్నారు. -
మీకు సైబోర్గ్ అంటే తెలుసా?
టోక్యో: రోబో అంటే ఆదేశాలకనుగుణంగా పనిచేసే యంత్ర పరికరమని మనందరికీ తెలిసిందే.. మరి మీకు సైబోర్గ్ అంటే తెలుసా? అంటే.. సగం కీటకం.. సగం యంత్రం అన్నమాట. టెక్నాలజీకి మారుపేరైన జపాన్ శాస్త్రవేత్తలు.. మనుషులు నేరుగా వెళ్లలేని ప్రమాదకర ప్రదేశాలను పరిశీలించేందుకు, భూకంపాల వంటి విపత్తుల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో సహాయపడేందుకు బొద్దింకలపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మడగాస్కర్కు చెందిన 6 సెం.మీ. పొడవైన కొన్ని బొద్దింకల వీపుపై సౌరశక్తితో పనిచేసే అతిపలుచని, రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే బ్యాక్‌ప్యాక్‌లను అమర్చారు. అలాగే ఆ బొద్దింకల ఉదర భాగం వద్ద ఉండే రెండు కొండేలకు కాళ్ల కదలికలను నియంత్రించే వైర్లను అమర్చారు. అవి బొద్దింకలు వెళ్లాల్సిన దిశను సూచిస్తూ విద్యుత్ ప్రేరకాలను పంపుతాయి. తద్వారా వాటిని లక్ష్యంవైపు నడిపించాలన్నది సైంటిస్టులు ఉద్దేశం. అనుకున్నట్లుగానే ఈ ప్రయోగం విజయవంతమైందని.. పరికరాలు అమర్చినప్పటికీ బొద్దింకలు ఎలాంటి ఇబ్బంది లేకుండా నడవగలిగాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అణుధార్మికతను సైతం తట్టుకొనే సామర్థ్యం మడగాస్కర్ బొద్దింకలకు ఉండటంతో వాటినే ఈ ప్రయోగాలకు ఎంపిక చేసుకున్నట్లు చెప్పారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలు ఎన్‌పీజే ఫ్లెక్సిబుల్ ఎలక్ట్రానిక్స్ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. చదవండి: మెలికల టవర్.. ఎత్తు 590 అడుగులు.. -
పిల్లులూ పేర్లు గుర్తిస్తాయ్
టోక్యో: పేరులో ఏముంది లెమ్మని అనుకోలేం. ఎందుకంటే పిల్లులు కూడా పేర్లను బాగా గుర్తు పడతాయని తాజా అధ్యయనంలో తేలింది. తమతో కలిసిమెలిసి ఉండే ఇతర పిల్లులు, యజమానుల పేర్లను పిల్లులు పసిగట్టేస్తాయని జపాన్‌లోని క్యోటో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తేల్చారు. పిల్లుల జ్ఞాపకశక్తిపై వారు రెండు వేర్వేరు అధ్యయనాలు చేశారు. ఒకదాంట్లో వాటితో కలిసిమెలిసి తిరిగే ఇతర పిల్లి ఫోటోను వాటి దగ్గరుంచారు. కొన్నిసార్లు ఫోటోలోని పిల్లి పేరును, మరికొన్ని సార్లు వేరే పేరును పిలిచారు. ఫోటోలోని పిల్లి పేరు పిలవగానే అవి ఫొటోవైపే కన్నారప్పకుండా చూశాయి. వేరే పేరుతో పిలిస్తే పట్టించుకోలేదు. అలాగే యజమానుల ఫోటోలను వాటి దగ్గరుంచి పేరు పెట్టి పిలిచినా గుర్తించగలిగాయని శాస్త్రవేత్తలు వివరించారు. 40 పిల్లులపై ఈ అధ్యయనం చేసినట్టు వాళ్లు చెప్పారు. -
కేన్సర్‌పై పోరాటానికి నోబెల్
స్టాక్‌హోం: ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ప్రాణాంతక వ్యాధి కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన ఇద్దరు శాస్త్రజ్ఞులను ఈ ఏడాది వైద్య నోబెల్ వరించింది. వ్యాధి నిరోధక శాస్త్రనిపుణులైన అమెరికా వైద్యుడు జేమ్స్ అలిసన్ (70), జపాన్‌కు చెందిన తసుకు హొంజో (76)లను నోబెల్ వైద్య బహుమతికి విజేతలుగా ఎంపిక చేసినట్లు జ్యూరీ సోమవారం ప్రకటించింది. కేన్సర్ రోగాన్ని నయం చేసేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న విధానాల్లో నేరుగా కేన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుని వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అలిసన్, హొంజోలు మాత్రం ఇమ్యునోథెరపీ అనే కొత్త విధానంలో మరింత వేగంగా కేన్సర్‌ను తగ్గించేందుకు రోగి శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి ఎలా సాయపడుతుందనే అంశంపై పరిశోధనలు చేసి విజయం సాధించారు. వ్యాధి నిరోధక వ్యవస్థలోని కణాలు ఉత్పత్తి చేసే ప్రొటీన్లను చికిత్సలో లక్ష్యంగా చేసుకోవడం ద్వారా కేన్సర్ కణాలను వేగంగా చంపేసే విధానాన్ని జేమ్స్ అలిసన్, తసుకు హొంజోలు అభివృద్ధి చేశారు. బహుమతులను ప్రకటించిన అనంతరం నోబెల్ అసెంబ్లీ సభ్యులు మాట్లాడుతూ ‘వీరి చికిత్సా విధానం కేన్సర్‌ను నయం చేయడంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. కేన్సర్ చికిత్స విషయంలో మన దృక్పథాన్ని సమూలంగా మార్చింది’ అని శ్లాఘించారు. ‘రోగ నిరోధక శక్తి కణాలకు కేన్సర్ కణాలపై పోరాడే సామర్థ్యం ఉందనే విషయాన్ని గుర్తించిన వ్యక్తి అలిసన్. అలాగే రోగ నిరోధక కణాలపై పీడీ–1 అనే ప్రొటీన్‌ను గుర్తించి అది కూడా కేన్సర్ కణాలపై పోరాటానికి బాగా ఉపయోగపడుతుందని తసుకు హొంజో తెలియజెప్పారు’ అని నోబెల్ జ్యూరీ ఓ ప్రకటనలో తెలిపింది. నోబెల్ బహుమతి విలువ 1.01 మిలియన్ డాలర్లు కాగా, ఆ మొత్తాన్ని అలిసన్, హొంజోలు చెరిసగం పంచుకుంటారు. అల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న స్టాక్‌హోంలో స్వీడన్ రాజు కార్ల్–16 వీరికి బహుమతిని అందజేస్తారు. గౌరవంగా ఉంది: అలిసన్ ‘ప్రఖ్యాత నోబెల్ బహుమతి గెలుచుకోవడం ఆనందంగా, గౌరవంగా ఉంది. నా పరిశోధన ఇంత గొప్పగా అవుతుందని కలలో కూడా ఊహించలేదు. రోగనిరోధక వ్యవస్థను ఉపయోగించి అందించిన చికిత్స ద్వారా కోలుకున్న రోగులను కలుసుకోవడం గొప్ప ఉద్విగ్నంగా ఉంటుంది. ప్రాథమిక విజ్ఞాన శాస్త్రానికి, కేన్సర్‌కు రోగ నిరోధక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనుకున్న మా జిజ్ఞాసకు ఆ రోగులే సజీవ సాక్ష్యాలు’ అని జేమ్స్ అలిసన్ వెల్లడించారు. శరీర వ్యాధి నిరోధక శక్తిలో అత్యంత కీలకమైన టీ–సెల్స్ (తెల్ల రక్త కణాల్లో ఒక రకం)పై నిరోధక గ్రాహంగా సీటీఎల్ఏ–4 అణువు పనిచేస్తుందని 1995లో గుర్తించిన ఇద్దరు శాస్త్రజ్ఞుల్లో అలిసన్ ఒకరు. మరింత మందిని కాపాడుతా: హొంజో తసుకు హొంజో జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. నోబెల్ బహుమతిని ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రోగ నిరోధక వ్యవస్థను ఉపయోగించి గతంలో కన్నా అత్యంత ఎక్కువ మంది కేన్సర్ రోగులను కాపాడేందుకు తన పరిశోధనను కొనసాగిస్తానని చెప్పారు. ‘నా కృషి వల్లే రోగం నయమైందని ఎవరైనా రోగులు చెప్పినప్పుడు నా ఆనందానికి అవధులుండవు. నా గోల్ఫ్ క్లబ్లో సభ్యుడైన ఓ వ్యక్తి ఓ రోజు నా దగ్గరికి వచ్చి.. మీ వైద్యం వల్లే నేను బతికున్నాను. ఊపిరితిత్తుల కేన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డానని చెప్పారు. అంతకన్నా ఆనందం ఏముంటుంది?’ అని చెప్పారు. ఏమిటీ ఇమ్యునోథెరపీ? కేన్సర్ చికిత్సకు అందుబాటులోకి వచ్చిన కొత్త పద్ధతే ఈ ఇమ్యునోథెరపీ. అడ్డూఅదుçపూ లేకుండా విభజితమయ్యే కేన్సర్ కణాలను నాశనం చేసేందుకు ప్రస్తుతం కీమోథెరపీ, లేజర్ సహా పలు రకాల చికిత్సలు వాడతున్నాం. ఇమ్యునోథెరపీలో శరీర రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలే (టీ–లింఫోసైట్స్–తెల్ల రక్తకణాల్లో ఓ రకం) కేన్సర్ కణాలను గుర్తించి నాశనం చేసేలా చేస్తారు. ఇమ్యునోథెరపీలో మూడు రకాలు ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థలోని టీ–కణాలు చెక్‌పాయింట్ ఇన్హిబిటర్స్ వీటిల్లో ఒకటి. ఆరోగ్యకరమైన కణాలు, కేన్సర్ కణాల మధ్య తేడాను టీ–కణాలు గుర్తించేందుకు కొన్ని ప్రత్యేకమైన ప్రొటీన్ రిసెప్టార్లను వాడతారు. వీటిని చెక్‌పాయింట్స్ అంటారు. సాధారణంగా కేన్సర్ కణాలు కూడా మామూలు కణాల్లాగే టీ–సెల్స్‌కు సంకేతాలు పంపుతుంటాయి. దీంతో కేన్సర్ కణాలేవో, ఆరోగ్యకరమైన కణాలేవో టీ–సెల్స్ గుర్తించలేవు. ఇమ్యునోథెరపీలో కొన్ని ప్రత్యేకమైన మందుల ద్వారా ఈ సంకేతాలను నిలిపివేసి టీ–కణాలు కేన్సర్ కణాలను గుర్తించేలా చేస్తారు. ఇక రెండో రకం ఇమ్యునోథెరపీలో సైటోకైన్స్‌ను వాడతారు. రోగ నిరోధక వ్యవస్థ తయారు చేసే ప్రత్యేక రసాయనాలే ఈ సైటోకైన్స్. ఈ ప్రత్యేక రసాయనాల ద్వారా టీ–సెల్స్ అధికమై అవి కేన్సర్ కణాలపై దాడి చేస్తాయని అంచనా. చివరగా మూడో పద్ధతి... వ్యాక్సిన్లు. కొన్ని కేన్సర్ల విషయంలో ముందు జాగ్రత్త చర్యగా వ్యాక్సిన్లను ఉపయోగిస్తారు. మిగిలిన వాటిల్లో వ్యాధి సోకిన తరువాత కూడా టీ–కణాల్లో కొత్త శక్తిని నింపి కేన్సర్ కణాలపై దాడి చేసేలా చేసేందుకు వ్యాక్సిన్లు ఉపయోగపడతాయి. ఈ పద్ధతిలో రోగ నిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేస్తారు కాబట్టి దాని ప్రభావం కొన్ని ఆరోగ్యకరమైన కణాలపై కూడా పడుతూంటుంది. ఫలితంగా విపరీతమైన నీరసం, వికారం, ఆకలి మందగించడం, దగ్గు వంటి సమస్యలు ఉంటాయి. -
పరి పరిశోధన
విటమిన్ – డి తో కేన్సర్ ముప్పు తక్కువ... శరీరంలో విటమిన్ – డి ఎక్కువగా ఉండేలా చూసుకుంటే కాలేయ కేన్సర్‌తోపాటు పలు ఇతర కేన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని జపాన్ శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనం ఒకటి స్పష్టం చేసింది. సూర్యరశ్మి ఆసరాతో శరీరంలో తయారయ్యే విటమిన్ – డి... క్యాల్షియం మోతాదులను నియంత్రించడం ద్వారా ఎముకలు, పళ్లను దృఢంగా ఉంచుతుందని ఇప్పటికే పలు పరిశోధనలు రుజువు చేశాయి. కేన్సర్ల విషయంలోనూ ఇది మేలు చేస్తుందని గతంలోనే కొన్ని వాదనలు ఉన్నప్పటికీ కచ్చితమైన రుజువులు లేకపోవడం వల్ల విస్తృత ప్రచారంలోకి రాలేదు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన పబ్లిక్ హెల్త్ సెంటర్ శాస్త్రవేత్తలు దాదాపు 33 వేల మందిపై అధ్యయనం చేశారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలి, రక్తంలో విటమిన్ – డి∙మోతాదులను నమోదు చేసుకున్న తరువాత వీరిపై దీర్ఘకాల పరిశోధనలు మొదలుపెట్టారు. ఋతువులకు అనుగుణంగా విటమిన్ – డి మోతాదులో వచ్చే మార్పులనూ పరిగణలోకి తీసుకున్న శాస్త్రవేత్తలు దాదాపు 16 ఏళ్లపాటు పరిశీలనలు కొనసాగించారు. ఈ కాలంలో వీరిలో దాదాపు 3301 మందికి కేన్సర్ సోకింది. వయసు, వ్యాయామం చేసే అలవాటు, ధూమపానం, మద్యపానం వంటి అన్ని ఇతర కారణాలను పరిగణనలోకి తీసుకుని విశ్లేషించినప్పుడు సాధారణ స్థాయి కంటే ఎక్కువ విటమిన్ – డి ఉన్న వారికి కేన్సర్ సోకే అవకాశాలు 20 శాతం తక్కువగా ఉన్నట్లు తెలిసింది. కాలేయ కేన్సర్ విషయంలో ఇది 30 – 50 శాతం వరకూ ఉన్నట్లు తెలిసింది. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్ కేన్సర్ల విషయంలో ప్రభావం పెద్దగా లేదు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ అంశాన్ని రూఢి చేసుకుంటే విటమిన్ –డి ని కేన్సర్ నిరోధక కార్యక్రమాల్లో వాడుకోవచ్చునని భావిస్తున్నారు. ప్రోటాన్ బ్యాటరీలు వస్తున్నాయి... అతితక్కువ స్థలంలో ఎక్కువ విద్యుత్తును నిల్వ చేసుకోగల బ్యాటరీలు అందుబాటులోకి వస్తే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లిథియం అయాన్ బ్యాటరీల సామర్థ్యం తక్కువైనా, ప్రత్యామ్నాయం లేకపోవడం వల్ల వీటినే వాడుతున్నారు. అయితే ఇకపై ఈ పరిస్థితి మారిపోనుంది. ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ప్రోటాన్లతో పనిచేసే సరికొత్త బ్యాటరీని అభివృద్ధి చేయడం దీనికి కారణం. సోలార్ ప్యానెల్స్ ఉత్పత్తి చేసే విద్యుత్తును అక్కడికక్కడే సమర్థంగా నిల్వ చేసుకుని వాడుకోవడంతోపాటు విద్యుత్తు వాహనాలు మరింత ఎక్కువ దూరం ప్రయాణించేందుకూ ఈ కొత్త బ్యాటరీలు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అన్నిటికీ మించి ప్రోటాన్ బ్యాటరీలు చాలా చౌకగా తయారుచేయవచ్చు. పర్యావరణానికి జరిగే నష్టం కూడా చాలా తక్కువ. బ్యాటరీలోకి విద్యుత్తు ప్రవహించినప్పుడు నీరు కాస్తా హైడ్రోజన్, ఆక్సిజన్‌గా విడిపోతుంది. కొన్ని ప్రోటాన్లూ విడుదలవుతాయి. ఇవి కాస్తా కార్బన్‌తో తయారైన ఎలక్ట్రోడ్‌కు అతుక్కుంటాయి. అవసరమైనప్పుడు ఇవే ప్రోటాన్లు విడిపోయి గాల్లోంచి ఆక్సిజన్‌ను తీసుకుని నీటిని తీసుకోవడం ద్వారా మళ్లీ ఎలక్ట్రాన్లను ( విద్యుత్తు) విడుదల చేస్తాయి. ప్రస్తుతం తాము తయారు చేసిన నమూనా ప్రోటాన్ బ్యాటరీ లిథియం అయాన్ బ్యాటరీ స్థాయిలో విద్యుత్తును నిల్వ చేసుకోగలదని.. కొన్ని మార్పులు, చేర్పులతో సామర్థ్యాన్ని పెంచవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ప్రొఫెసర్ జాన్ ఆండ్రూస్ తెలిపారు. రక్తపోటు పరీక్షలకు మెరుగైన స్మార్ట్‌ఫోన్ పద్ధతి! స్మార్ట్ఫోన్లతో చేయగలిగిన పనుల్లో రక్తపోటు పరీక్షలు ఇప్పటికే చేరినప్పటికీ ఇదే పనిని మరింత కచ్చితత్వంతో చేసేందుకు మిషిగన్ స్టేట్ యూనివర్శిటీకి చెందిన ముక్కామల రామకృష్ణ ఓ వినూత్నమైన పద్ధతిని ఆవిష్కరించారు. ఆధునిక త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ సాయంతో, కొన్ని ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగించి ప్రత్యేకమైన స్మార్ట్‌ఫోన్ కేస్‌ను తయారు చేశారు ఈయన. దీంతోపాటు ప్రత్యేకమైన ప్రదేశంలో ఉండే ఇంకో సెన్సర్‌ను వేలితో నొక్కితే చాలు.. రక్తపోటు వివరాలు స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతాయి. వేలి ఒత్తిడికి ఆప్టిక్ల సెన్సర్లు పనిచేయడం మొదలుపెడతాయని.. రక్తనాళాల్లో రక్తపోటు కారణంగా వచ్చే మార్పులను పరిశీలించడం ద్వారా రక్తపోటు ఎంత ఉందో నిర్ణయించి ఆ సమాచారాన్ని వైర్లెస్ పద్ధతిలో స్క్రీన్ పైకి పంపుతాయని రామకృష్ణ వివరించారు. ఇప్పటికే తాము ఈ స్మార్ట్ కేస్‌ను కొంతమందిపై పరీక్షించి మంచి ఫలితాలు సాధించామని చెప్పారు. అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సహకారంతో తయారైన ఈ కొత్త గాడ్జెట్ వైద్య రంగంలో మేలి మార్పులకు కారణమవుతుందని వైద్య నిపుణుల అంచనా. -
పంటల ఫలదీకరణకు డ్రోన్లు
టోక్యో: పంటల ఫలదీకరణకు సాయపడే కీటకాల పరిమాణంలో ఉండే డ్రోన్లు రానున్నాయి. జపాన్ కు చెందిన శాస్త్రవేత్తలు వీటిని అభివృద్ధి చేశారు. పుష్పాల నుంచి పుప్పొడి సేకరణలో కీటకాలు, తేనెటీగల పాత్ర ఎంతో కీలకం. అయితే ప్రపంచ వ్యాప్తంగా తేనెటీగలు క్షీణిస్తుండటంతో ప్రత్యామ్నాయ పద్ధతుల్ని ఆశ్రయించాల్సి వస్తోంది. చవకగా కృత్రిమ పద్ధతిలో ఫలదీకరణ పద్ధతులపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఈ క్రమంలోనే మియాకో, చెచెక్తాలు ఈ కీటక పరిమాణంలో ఉన్న డ్రోన్లను అభివృద్ధి చేశారు. పువ్వుల నుంచి పుప్పొడిని సేకరించేందుకు గాను ఈ డ్రోన్లకు గుర్రపు వెంట్రుకలను అమర్చారు. తిరిగి వీటిద్వారానే మరో పువ్వులోకి ఈ పుప్పొడిని పంపించడం ద్వారా ఫలదీకరణం చెందుతున్నట్లు వీరు రుజువు చేశారు. -
శరీరాన్నే డిస్ప్లే స్క్రీన్‌గా మార్చే ‘ఈ-స్కిన్’
టోక్యో: శరీరం పైనుంచే ఆరోగ్య సంబంధమైన అన్ని విషయాలను చూసుకునే ఎలక్ట్రానిక్ చర్మాన్ని జపాన్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. టాటూల మాదిరిగా ఉండే ఈ-స్కిన్ శరీరానికి అతుక్కుని ఉంటుంది. రక్తంలో ప్రాణవాయువు స్థాయులు, గుండె కొట్టుకునే వేగం వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అతి సన్నగా ఉండే ఈ ఎలక్ట్రానిక్ చర్మం, గాలిలోనూ అటూ ఇటూ కదలకుండా స్థిరంగా ఉంటుంది. ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్‌ను ఉపయోగించి శరీర సంబంధ విషయాలను ఇది ప్రదర్శిస్తుంది. -
కరువులోనూ అధిక దిగుబడినిచ్చే వరి!
ఫలించిన జపాన్ శాస్త్రవేత్తల కృషి డీఆర్ఓ1 జన్యువుతో కూడిన సరికొత్త వంగడానికి రూపకల్పన తీవ్ర కరువు పరిస్థితుల్లోనూ సాధారణ వరి కన్నా మూడున్నర రెట్ల దిగుబడి.. తీవ్రమైన కరువు పరిస్థితుల్లోనూ ధాన్యం దిగుబడి దారుణంగా తగ్గిపోతుందన్న భయం ఇక అక్కర్లేదు. కరువు పరిస్థితులతో నీటి కొరత నెలకొన్న సందర్భాల్లోనూ మూడున్నర రెట్ల వరకు దిగుబడిని అందించే అత్యాధునిక వరి వంగడం అందుబాటులోకి రానుంది. జపాన్ శాస్త్రవేత్తలు దీనిని రూపొందించారు. జన్యుమార్పిడి సాంకేతికత జోలికి పోకుండానే వీరు ఈ ఘనతను సాధించడం విశేషం. సాధారణంగా వరి మొక్కల వేళ్లు భూమిలోకి మరీ ఎక్కువ లోతుకు వెళ్లవు. తక్కువ లోతులోనే పక్కలకు పాకుతాయి. అందువల్లే ఏమాత్రం పూర్తిస్థాయిలో నీటి తడులు అందకపోయినా తట్టుకోలేవు. ఫలితంగా ఇది దిగుబడిపై ప్రభావం చూపుతుంది. ఈ సమస్యను అధిగమించడంపై జపాన్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆగ్రోబయోలాజికల్ సెన్సైస్‌కు చెందిన శాస్త్రవేత్తలు కృషి చేశారు. డీపర్ రూటింగ్ 1(డీఆర్ఓ1) అనే జన్యువును గుర్తించి ఈ సమస్యను అధిగమించారు. మామూలు వరి వంగడం వేళ్ల కన్నా.. ఈ జన్యువు కలిగి ఉన్న వరి వంగడాల వేళ్లు భూమిలోకి రెట్టింపు లోతు వరకూ చొచ్చుకెళతాయని ముఖ్య పరిశోధకుడు యుసకు యుగ తెలిపారు. లోతుకు వెళ్లిన ఈ వేళ్లు భూమి లోపలి పొరల్లో నుంచి నీటిని, పోషకాలను మొక్కకు అందిస్తాయని వివరించారు. ఒక మోస్తరు నీటికొరత ఉన్న పరిస్థితుల్లో సాధారణ వరితో పోల్చితే ఈ వరి వంగడం రెట్టింపు దిగుబడి ఇస్తోందని తెలిపారు. అదే తీవ్రమైన కరువు పరిస్థితుల్లో సాధారణ వరి దిగుబడి బాగా తగ్గిపోగా.. ఈ వంగడం దిగుబడి మాత్రం దానికంటే 3.6 రెట్లు ఎక్కువగా వచ్చిందని వెల్లడించారు. ‘‘డీఆర్ఓ1 జన్యువు 60కిపైగా వరి వంగడాల్లో ఉంది. అయితే ఇవన్నీ వేళ్లను లోతుగా చొప్పించగలిగే వంగడాలు కాదు. వేళ్లను లోతుగా చొప్పించలేని మేలు రకం వరితో డీఆర్ఓ1 జన్యువు ఉన్న వరి వంగడాన్ని సంకరం చేసి సరికొత్త వంగడాన్ని రూపొందించాం’’ అని ఆయన వివరించారు. భారత్‌కు ఉపయోగకరం.. అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ(ఇరి) అంచనాల ప్రకారం విశ్వవిపణిలో బియ్యం ధరలను అదుపులో ఉంచాలంటే ఏటా 80 లక్షల నుంచి కోటి టన్నులను అదనంగా పండించాల్సి ఉంటుంది. దీనిని బట్టి.. కరువును సమర్థంగా ఎదుర్కొనేలా అధిక దిగుబడినిచ్చే వరి వంగడాల ఆవశ్యకత ఎంత ఉందనేది వేరే చెప్పనక్కర్లేదు. భారత్‌లోని కొన్ని రాష్ట్రాల్లో కరువువస్తే వరి దిగుబడి 40 శాతం వరకు పడిపోతూ ఉంటుంది. వాతావరణ మార్పుల నేపథ్యంలో కరువు పరిస్థితులు ఎప్పుడు ఏర్పడతాయో చెప్పలేని స్థితి నెలకొంది. అందువల్ల భారత్‌కు ఇటువంటి వంగడాలు ఎంతో ఉపయోగకరమని ‘ఇరి’ ప్రతినిధి సోఫీ క్లేటన్ పేర్కొన్నారు. -సాక్షి స్పెషల్ డెస్క్